అన్వేషించండి

TVS Orbiter V1 EMI: టీవీఎస్ ఆర్బిటర్ V1 ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలంటే EMI ఎంత చెల్లించాలి? ఈ బండికి ఎవరికి పోటీ? 

TVS Orbiter V1 EMI: టీవీఎస్ ఆర్బిటర్ V1 ఎలక్ట్రిక్ స్కూటర్ భారత్‌ సరసమైన ధరకు విడుదలైంది. ఈ బండి ఫీచర్లు, EMI ప్లాన్‌లు గురించి చూద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • TVS Orbiter V1 భారత మార్కెట్లో చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా విడుదలైంది.
  • BaaS మోడల్‌తో బ్యాటరీని నెలవారీ EMIల‌లో కొనుగోలు చేయవచ్చు.
  • V1 మోడల్ 86 కిలోమీటర్ల‌ రేంజ్‌, 290mm లెగ్‌రూమ్‌ అందిస్తుంది.
  • జియో-ఫెన్సింగ్, యాంటీ-థెఫ్ట్ వంటి స్మార్ట్ భద్రతా లక్షణాలు ‌ఉన్నాయి.

TVS Orbiter V1 EMI: టీవీఎస్ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, టీవీఎస్ ఆర్బిటర్ V1ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది ఇప్పటివరకు కంపెనీకి చెందిన చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్‌. ఇది 1.8kWh బ్యాటరీని కలిగి ఉంది. రోజువారీ ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. కంపెనీ తన ఎలక్ట్రిక్ వాహనాల కోసం బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) మోడల్‌ను కూడా ప్రారంభించింది. దీని వలన వినియోగదారులు తక్కువ ప్రారంభ ధరకు స్కూటర్‌ను కొనుగోలు చేయవచ్చు. బ్యాటరీకి ప్రత్యేక నెలవారీ చెల్లింపులు చేసి తీసుకోవచ్చు.  

టీవీఎస్ ఆర్బిటర్ V1 ధర

TVS ఆర్బిటర్ V1 ధర ₹49,999 (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్‌) నుంచి ప్రారంభమవుతుంది. ఈ ధరలో BaaS మోడల్ కూడా ఉంది, ఇక్కడ బ్యాటరీ ఖర్చు విడిగా చెల్లించాల్సి ఉంటుంది. మీరు BaaS మోడల్ లేకుండా ఈ స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, దీని ధర దాదాపు ₹92,250 (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్) అవుతుంది. ఈ మోడల్‌తో కస్టమర్‌లు పొడిగించిన బ్యాటరీ వారంటీని కూడా పొందుతారని కంపెనీ చెబుతోంది.

బ్యాటరీ, రేంజ్‌-ఛార్జింగ్

TVS ఆర్బిటర్ సిరీస్ రెండు బ్యాటరీ ఆప్షన్స్‌లో వస్తుంది - V1 (1.8kWh), V2 (3.1kWh). V1 మోడల్, కంపెనీ ప్రకారం, ఒకసారి ఛార్జ్ చేస్తే 86 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. ఛార్జింగ్ సమయం కూడా చాలా వేగంగా ఉంటుంది, దాదాపు 2 గంటల 20 నిమిషాల 0-80 శాతం ఛార్జ్ సమయం ఉంటుంది. ఇది మొబైల్ యాప్ కనెక్టివిటీ, LED హెడ్‌లైట్, LCD డిస్ప్లే క్లస్టర్ వంటి లక్షణాలను కూడా కలిగి ఉంది.

సౌకర్యవంతమైన సీటు -ప్లెంటీ స్టోరేజ్‌ 

TVS ఆర్బిటర్ V1 రోజువారీ వాడుక కోసం సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించారు. దీని 845mm పొడవు గల సీటు ఇద్దరు వ్యక్తులకు సౌకర్యవంతంగా సరిపోతుంది. 290mm స్ట్రెయిట్ ఫుట్‌బోర్డ్ తగినంత లెగ్‌రూమ్‌ను అందిస్తుంది. ఈ స్కూటర్ 34 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్‌ను కూడా అందిస్తుంది, ఇది గరిష్టంగా రెండు హెల్మెట్‌లను కలిగి ఉంటుంది. 

స్మార్ట్ ఫీచర్లు, టెక్నాలజీ

టీవీఎస్ ఆర్బిటర్ అనేక స్మార్ట్ ఫీచర్లతో కూడా వస్తుంది. ఇది జియో-ఫెన్సింగ్, యాంటీ-థెఫ్ట్ అలర్ట్, క్రాష్, ఫాల్ అలర్ట్ వంటి భద్రతా లక్షణాలను అందిస్తుంది. మొబైల్ యాప్ స్కూటర్  బ్యాటరీ స్టాటస్‌, ఓడోమీటర్‌ను కూడా తనిఖీ చేయడానికి అవకాశం ఉంటుంది. అదనంగా, ఇది హిల్ హోల్డ్, క్రూయిజ్ కంట్రోల్, పార్కింగ్ అసిస్ట్ వంటి లక్షణాలను అందిస్తుంది. స్కూటర్ రెండు రైడింగ్ మోడ్‌లను కూడా అందిస్తుంది: ఎకో, పవర్.

EMI -బ్యాటరీ సర్వీస్ ప్లాన్‌లు

TVSకు చెందిన BaaS మోడల్ కస్టమర్లు తక్కువ ధరకు స్కూటర్‌ను కొనుగోలు చేయడానికి అనుమతిస్తుంది. బ్యాటరీని నెలవారీ EMIలలో చెల్లించవచ్చు, నెలకు సుమారు ₹2,824 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్లాన్‌తో కంపెనీ 5 సంవత్సరాలు లేదా 70,000 కిలోమీటర్ల వారంటీని కూడా అందిస్తుంది.

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో టీవీఎస్ ఆర్బిటర్ V1, ఓలా S1 X, బజాజ్ చేతక్ 3001, హీరో విడా VX2, అథర్ రిజ్టా వంటి ప్రముఖ మోడళ్లతో పోటీ పడనుంది.

Frequently Asked Questions

TVS Orbiter V1 EMI ఎలా ఉంటుంది?

BaaS మోడల్ తో, టీవీఎస్ ఆర్బిటర్ V1 బ్యాటరీని నెలవారీ EMIలలో చెల్లించవచ్చు. EMI నెలకి సుమారు ₹2,824 నుంచి ప్రారంభమవుతుంది.

TVS Orbiter V1 ధర ఎంత?

TVS Orbiter V1 ధర ₹49,999 (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్) నుంచి ప్రారంభమవుతుంది. BaaS మోడల్ లేకుండా దీని ధర దాదాపు ₹92,250 (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్) ఉంటుంది.

TVS Orbiter V1 బ్యాటరీ ఎంత సమయం ఛార్జ్ అవుతుంది?

TVS Orbiter V1 0-80 శాతం ఛార్జ్ అవ్వడానికి దాదాపు 2 గంటల 20 నిమిషాల సమయం పడుతుంది.

TVS Orbiter V1 ఎంత దూరం ప్రయాణించగలదు?

V1 మోడల్, కంపెనీ ప్రకారం, ఒకసారి ఛార్జ్ చేస్తే 86 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది.

TVS Orbiter V1 లో ఏయే స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి?

జియో-ఫెన్సింగ్, యాంటీ-థెఫ్ట్ అలర్ట్, క్రాష్, ఫాల్ అలర్ట్, హిల్ హోల్డ్, క్రూయిజ్ కంట్రోల్, పార్కింగ్ అసిస్ట్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Vehicle Insurance: ఇన్సూరెన్స్ లేకుండా టోల్ గేట్‌ దాటుతున్నారా? మీ వాహనం వివరాలు ఈజీగా తెలిసిపోతాయి.. రూ.10 వేల వరకు జరిమానా!
వాహన బీమా లేకుండా టోల్ ప్లాజా దాటితే SMS అలర్ట్.. రూ.10,000 వరకు జరిమానా!
హై-వోల్టేజ్‌తో తిరిగొచ్చిన Ultraviolette X-47 Venom.. పాత X-47 మోడల్‌తో పోలిస్తే కొత్తగా ఏం మారింది?
హై-వోల్టేజ్ బైక్‌ 'అల్ట్రావయొలెట్ X-47 వెనమ్‌' vs 'X-47'.. ధర, ఫీచర్లలో తేడాలేంటి?
మార్కెట్‌లోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు.. Bajaj Pulsar 180కి మళ్లీ బ్రేక్‌!
యూత్‌ఫుల్‌ బైక్‌ బజాజ్ పల్సర్ 180 ఇక కనిపించదా? ఐదేళ్లలో రెండోసారీ అదే పరిస్థితి
Second-hand Car: రూ.7 లక్షల నుంచి Kia Sonet facelift.. సెకండ్‌హ్యాండ్‌లో కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి!
సెకండ్ హ్యాండ్ కియా సోనెట్ కొనాలనుకుంటున్నారా? ఈ రెండు సమస్యలను ముందే చెక్ చేయండి!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Akvan: అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
Bellampalli Police Private Party: ఆన్‌డ్యూటీలో ఫాంహౌస్‌ పార్టీకి వెళ్లి చిందులు.. 14 మంది బెల్లంపల్లి పోలీసులపై సీపీ చర్యలు
ఆన్‌డ్యూటీలో ఫాంహౌస్‌ పార్టీకి వెళ్లి చిందులు.. 14 మంది బెల్లంపల్లి పోలీసులపై సీపీ చర్యలు
IPL 2027 Retention Full List: ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
హై-వోల్టేజ్‌తో తిరిగొచ్చిన Ultraviolette X-47 Venom.. పాత X-47 మోడల్‌తో పోలిస్తే కొత్తగా ఏం మారింది?
హై-వోల్టేజ్ బైక్‌ 'అల్ట్రావయొలెట్ X-47 వెనమ్‌' vs 'X-47'.. ధర, ఫీచర్లలో తేడాలేంటి?
Bigg Boss Season 10 Today November 17th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
Mitchell Santner Injury: టీమిండియాతో టెస్ట్ సిరీస్ కు ముందు కివీస్ కు ఎదురుదెబ్బ‌.. గాయంతో శాంట్నర్ దూరం, జట్టులోకి డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ ఎంట్రీ
టీమిండియాతో టెస్ట్ సిరీస్ కు ముందు కివీస్ కు ఎదురుదెబ్బ‌.. గాయంతో శాంట్నర్ దూరం, జట్టులోకి డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ ఎంట్రీ
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Embed widget