అన్వేషించండి

Top 7 Electric Scooters in India with Largest Boot Space: ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా?  భారీ బూట్ స్పేస్ అందించే టాప్ 7 ఈవీ స్కూటర్లు ఇవే!

నిత్యం వాడే హెల్మెట్లు, బ్యాగులు పెట్టుకోవడానికి వీలుగా ఎక్కువ స్టోరేజ్ సామర్థ్యం గల బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాను ఇప్పుడు చూద్దాం. కింద ఇచ్చిన 7 మోడ‌ళ్ల‌లో రివర్ ఇండీ అగ్రస్థానంలో నిలిచింది.

Top 7 Electric Scooters in India with Largest Boot Space: భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకం వేగంగా పెరుగుతోంది. కేవలం రేంజ్, స్పీడ్ మాత్రమే కాకుండా నిత్యం వాడుకోవడానికి వీలుగా ఉండే 'ప్రాక్టికాలిటీ' కి ఇప్పుడు జనం ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా సీటు కింద ఉండే స్టోరేజ్ స్పేస్ (బూట్ కెపాసిటీ) అనేది హెల్మెట్లు, కిరాణా సామాగ్రి, ఛార్జర్ వంటివి దాచుకోవడానికి చాలా ముఖ్యం. పెట్రోల్ ఇంజిన్ భాగాలు లేకపోవడం వల్ల ఎలక్ట్రిక్ స్కూటర్లలో తయారీదారులు ఎక్కువ స్థలాన్ని కేటాయించగలుగుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో భారీ డిక్కీ సౌకర్యం కలిగిన టాప్ 7 ఈవీ స్కూటర్లు గురించి పరిశీలిద్దాం.

టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) - 32 లీటర్లు..

 టీవీఎస్ ఐక్యూబ్ తన లేటెస్ట్ వేరియంట్లలో 30 నుండి 32 లీటర్ల స్టోరేజ్ అందిస్తోంది. ఇందులో హెల్మెట్‌తో పాటు రెయిన్ కోట్, గ్లోవ్స్ వంటివి సులభంగా ఉంచవచ్చు. పాత మోడళ్లతో పోలిస్తే టీవీఎస్ ఇప్పుడు ఇంటర్నల్ లేఅవుట్ మార్చి స్పేస్ పెంచింది.

ఏథర్ రిజ్టా (Ather Rizta) - 34 లీటర్లు..
 
ఫ్యామిలీ స్కూటర్‌గా పేరు తెచ్చుకున్న ఏథర్ రిజ్టాలో 34 లీటర్ల డీప్ స్టోరేజ్ లభిస్తుంది. దీని డిక్కీ లోతుగా ఉండటం వల్ల బల్కీ ఐటమ్స్ (పెద్ద వస్తువులు) సర్దుకోవడం చాలా ఈజీ.

టీవీఎస్ ఆర్బిటర్ (TVS Orbiter) - 34 లీటర్లు

సిటీ కమ్యూటర్లను దృష్టిలో పెట్టుకుని తెచ్చిన టీవీఎస్ ఆర్బిటర్ కూడా 34 లీటర్ల బూట్ స్పేస్‌తో వస్తోంది. రోజువారీ ఆఫీస్ బ్యాగులు లేదా చిన్న పర్సనల్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇది పక్కాగా సరిపోతుంది.

సింపుల్ వన్ (Simple One) - 35 లీటర్లు

సింపుల్ వన్ తన అప్‌డేటెడ్ వెర్షన్లలో 35 లీటర్ల సీట్ స్టోరేజ్ ఇస్తోంది. రైడింగ్ గేర్ మొత్తం డిక్కీలోనే సర్దేయొచ్చు.

బజాజ్ చేతక్ (Bajaj Chetak) - 35 లీటర్లు

క్లాసిక్ లుక్ తో వచ్చే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 35 లీటర్ల స్టోరేజ్ కలిగి ఉండటం విశేషం. కొన్ని వేరియంట్లలో అదనంగా 5 లీటర్ల గ్లోవ్ బాక్స్ సదుపాయం కూడా ఉంది.

కైనెటిక్ డిఎక్స్ (Kinetic DX) - 37 లీటర్లు

కైనెటిక్ డిఎక్స్ 37 లీటర్ల భారీ స్పేస్‌తో టాప్ 2లో నిలిచింది. దీని ప్రధాన స్టోరేజ్ కింద మరొక రహస్య కంపార్ట్‌మెంట్ ఉండటం వల్ల డాక్యుమెంట్లు, చిన్న ఛార్జర్లు భద్రంగా దాచుకోవచ్చు.

రివర్ ఇండీ (River Indie) - 43 లీటర్లు

ప్రస్తుతానికి ఇండియాలోనే అత్యధికంగా 43 లీటర్ల బూట్ స్పేస్ కలిగిన స్కూటర్ 'రివర్ ఇండీ గా ఘనత సాధించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీన్ని కేవలం యుటిలిటీ కోసమే డిజైన్ చేశారు. ఇందులో 12 లీటర్ల గ్లోవ్ బాక్స్‌తో పాటు అదనపు పానియర్లు (Panniers) తగిలించుకునే ఆప్షన్ కూడా ఉంది. ఎక్కువ సామాగ్రి మోసుకెళ్లే వారికి ఇది ఒక మినీ ఎస్‌యూవీ లాంటిదని విశ్లేష‌కులు అంటున్నారు. ఏదేమైనా ఎక్కువ బూట్ స్పేస్ ఉండే వాహానాలను తీసుకుంటే దీర్ఘకాలికంగా అనేక రకాలుగా ఉపయోగముంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా స్కూటీల విషయంలో ఇది ఇంపార్టెంట్ విషయమని అంటున్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

17 వేల EMIపై Hyundai Creta కొనాలంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి
17 వేల EMIపై Hyundai Creta కొనాలంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి
Maruti Dzireకు ప్రత్యామ్నాయంగా Honda Amaze కొనబోతున్నారా? ముందు ఈ నిజాలు కచ్చితంగా తెలుసుకోండి
కొత్త Honda Amaze కొనేవాళ్లకు అలెర్ట్‌! ఈ సెడాన్‌లో మీకు తెలియాల్సిన 3 ప్లస్‌లు, 3 మైనస్‌లు!
Ethanol: పెట్రోల్ తర్వాత డీజిల్‌పైనా ప్రయోగం.. ఇథనాల్‌పై కేంద్రం ఎందుకు వెనక్కి తగ్గింది?
డీజిల్‌లో ఇథనాల్ కలపడం కుదరదు.. అసలు కారణం ఇదే!
బాబర్ బైక్ సెగ్మెంట్‌లో కొత్త పోరు.. గోవాన్ క్లాసిక్ 350తో హోండా రెబెల్ 300 పోటీ!
హోండా రెబెల్ 300 vs రాయల్ ఎన్‌ఫీల్డ్‌ గోవాన్ క్లాసిక్ 350 - ఏది స్పెషల్‌ బైక్‌?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget