భారత్‌లో ఫేమస్ అయిన హోండా యాక్టివా, యాక్టివా ఎలక్ట్రిక్ ధరలు, రేంజ్ మధ్య వ్యత్యాసం వివరాలు

Published by: Shankar Dukanam

హోండా యాక్టివా ఒక లీటరు పెట్రోలుతో 45 నుంచి 50 కిలోమీటర్ల దూరం వెళ్తుంది

హైదరాబాద్‌లో హోండా యాక్టివా ఎక్స్ షోరూమ్ ధర రూ. 77,967 కాగా, ఆన్‌రోడ్ ధర రూ.99,556 నుంచి ప్రారంభమవుతుంది.

హైదరాబాద్‌లో హోండా యాక్టివా ఎలక్ట్రిక్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1,19,912 కాగా, ఆన్‌రోడ్ ధర రూ.1,22,852గా ఉంది.

హైదరాబాద్‌లో హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ ఛార్జింగ్ తో 102 కి.మీ వరకు వెళ్తుంది.

పెట్రోల్‌తో వెళ్లే యాక్టివాతో పోల్చితే హోండా యాక్టివా ఎలక్ట్రిక్ ధర 23 వేలు ఎక్కువగా ఉంటుంది.

కానీ మెయింటనెన్స్ ఖర్చులు తక్కువ. ఎలక్ట్రిక్ స్కూటీ కొన్నప్పుడు మాత్రమే ఎక్కువ ఖర్చు అవుతుంది

యాక్టివా నెలకు పెట్రోల్ ఖర్చు 3 నుంచి 5 వేలు అవుతుంది. ఎలక్ట్రిక్ యాక్టివాతో నెలకు రూ.300 -500 వరకు అవుతుంది.

పర్యావరణానికి మేలు చేస్తుంది కనుక హోండా ఎలక్ట్రిక్ స్కూటీలు అధికంగా కొనుగోలు చేస్తున్నారు.