అన్వేషించండి

పవర్, ప్రీమియం ఫీచర్లు, ఫుల్‌ సేఫ్టీతో వచ్చిన Skoda Kodiaq RS - ఫ్యామిలీ SUVలో కొత్త బెంచ్‌మార్క్

Skoda Kodiaq RS భారత్‌లో పెర్ఫార్మెన్స్ SUVగా ఆకట్టుకుంటోంది. 265 hp టర్బో పెట్రోల్ ఇంజిన్, AWD, ADAS, DCC, ప్రీమియం క్యాబిన్ & 7-సీటర్ సౌకర్యాలతో ఈ SUV ప్రత్యేక గుర్తింపు పొందుతోంది.

Skoda Kodiaq RS Road Test: పెర్ఫార్మెన్స్ కార్లంటే ఇష్టపడే వారికి స్కోడా నుంచి మరో ప్రత్యేక SUV అందుబాటులోకి వచ్చింది. "స్కోడా కొడియాక్ ఆర్ఎస్" పేరుకు తగ్గట్టుగానే పవర్, హ్యాండ్లింగ్, లగ్జరీ & ఫ్యామిలీ ప్రాక్టికాలిటీని ఒకే వాహనంలో అందించే ప్రయత్నం చేసింది. సాధారణ కొడియాక్‌తో పోలిస్తే ఈ RS వెర్షన్‌లో ఇంజిన్ నుంచి సస్పెన్షన్ వరకు అనేక మార్పులు చేసింది. దీంతో పెద్ద 7-సీటర్ SUV అయినప్పటికీ స్పోర్ట్స్ కారు తరహా డ్రైవింగ్ అనుభూతిని అందిస్తోందని ఆటో నిపుణులు చెబుతున్నారు.

కొడియాక్ RSలో 2.0 లీటర్ EA888 టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దారు. సాధారణ మోడల్‌లో 204 hp పవర్ ఉండగా, ఆర్ఎస్‌లో అది 265 hpకు పెరిగింది. టార్క్ కూడా 320 Nm నుంచి 400 Nmకు చేరింది. దీంతో లాంచ్ కంట్రోల్ ఉపయోగించినప్పుడు ఈ SUV కేవలం 6.83 సెకన్లలోనే 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకుంటుంది. పెద్ద 7-సీటర్ SUVకు ఇది ఆకట్టుకునే పనితీరు అని చెప్పాలి.

ఈ ఇంజిన్‌కు 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. గేర్ మార్పులు చాలా వేగంగా జరుగుతాయి. డ్రైవర్ యాక్సిలేటర్ ఇచ్చిన వెంటనే స్పందించే విధంగా ట్యూనింగ్ చేశారు. ప్యాడిల్ షిఫ్టర్లు కూడా అందుబాటులో ఉండటంతో స్పోర్టీ డ్రైవింగ్‌ను మరింత ఆస్వాదించవచ్చు. ఇంజిన్ 6,500 rpm వరకు ఎంతో సాఫీగా పనిచేస్తూ శక్తివంతమైన పెర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది. డ్యూయల్ ఎగ్జాస్ట్ నుంచి వచ్చే స్పోర్టీ ఇంజిన్ సౌండ్ డ్రైవింగ్ అనుభూతిని మరింత ప్రత్యేకంగా మారుస్తుంది.

ఇది కూడా చదవండి: రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్ 2026 - న్యూ డిజైన్, పెద్ద టచ్‌స్క్రీన్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ధర తక్కువ!

హ్యాండ్లింగ్‌, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ
RS వెర్షన్‌లో కేవలం ఇంజిన్ మాత్రమే కాదు, హ్యాండ్లింగ్‌పై కూడా స్కోడా ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. 20 అంగుళాల అలాయ్ వీల్స్, ప్రోగ్రెసివ్ స్టీరింగ్, DCC అడాప్టివ్ సస్పెన్షన్ వంటి ఫీచర్లను అందించింది. DCCలో మొత్తం 15 స్థాయిల సస్పెన్షన్ సెట్టింగ్స్ ఉండటంతో డ్రైవర్ తనకు నచ్చిన విధంగా కంఫర్ట్ లేదా స్పోర్ట్ మోడ్‌ను ఎంచుకోవచ్చు. వేగంగా మలుపులు తిరిగే సమయంలో కూడా SUV చాలా స్థిరంగా ఉంటుంది. AWD వ్యవస్థ రోడ్డుపై అద్భుతమైన గ్రిప్‌ను అందిస్తూ డ్రైవర్‌కు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.

భద్రత విషయంలో కూడా కొడియాక్ ఆర్ఎస్ అత్యాధునిక ఫీచర్లతో వచ్చింది. ఇందులో ADAS సూట్ అందుబాటులో ఉంది. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ వార్నింగ్ వంటి ఆధునిక భద్రత సాంకేతికతలు ఉన్నాయి. అదనంగా 9 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. మ్యాట్రిక్స్ LED హెడ్‌ల్యాంప్స్ రాత్రి సమయంలో అద్భుతమైన వెలుతురు అందిస్తాయి.

ఇది కూడా చదవండి: స్పీడ్ మీటర్ 200 కిలోమీటర్లు చూపిస్తున్నా, కారు మాత్రం 120- 140 ఎందుకు వెళ్తుంది ?

ఎక్స్‌టీరియర్‌ & ఇంటీరియర్‌
బయటి డిజైన్‌లో RS ప్రత్యేకత స్పష్టంగా కనిపిస్తుంది. కొత్త స్పోర్టీ బంపర్లు, 20 అంగుళాల అలాయ్ వీల్స్, బ్లాక్ ఫినిష్ ఎలిమెంట్స్, డ్యూయల్ ఎగ్జాస్ట్ & ఆర్ఎస్ బ్యాడ్జింగ్ ఈ SUVకు ప్రత్యేకమైన లుక్‌ను ఇస్తాయి. వెల్వెట్ రెడ్ కలర్‌లో ఈ SUV మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

ఇంటీరియర్ కూడా లగ్జరీ & స్పోర్టీనెస్ కలయికగా ఉంటుంది. బ్లాక్ థీమ్‌తో పాటు ఎరుపు రంగు స్టిచింగ్, ఆర్ఎస్ ఎంబాసింగ్ ఉన్న స్పోర్ట్ సీట్లు, మెటల్ ఫినిష్ డ్యాష్‌బోర్డ్ ఈ SUVకి ప్రీమియం ఫీలింగ్‌ను ఇస్తాయి. ముందు సీట్లకు వెంటిలేషన్, అడ్జస్టబుల్ థై సపోర్ట్ కూడా ఉన్నాయి. 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.9 అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. క్లైమేట్ కంట్రోల్ కోసం ప్రత్యేక రొటరీ కంట్రోలర్లు ఇవ్వడం వినియోగదారులకు మరింత సౌకర్యంగా ఉంటుంది.

సీటింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌
రెండో వరుసలో ముగ్గురు పెద్దలు కూడా సౌకర్యంగా కూర్చునేంత స్థలం ఉంది. రిక్లైనింగ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, ప్రత్యేక క్లైమేట్ కంట్రోల్ జోన్, ట్యాబ్లెట్ హోల్డర్లు వంటి సౌకర్యాలు ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయి. మూడో వరుస పెద్దలకు కొంత ఇరుకుగా ఉన్నప్పటికీ అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు. మూడో వరుసను మడిచేస్తే 786 లీటర్ల భారీ బూట్ స్పేస్ లభిస్తుంది.

ధర
స్కోడా కొడియాక్ RS పూర్తిగా దిగుమతి చేసుకున్న మోడల్ కావడంతో దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.60 లక్షల నుంచి రూ.65 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఇది సాధారణ కొడియాక్ ఎల్ అండ్ కే కంటే రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అధికంగా ఉండొచ్చు. అయినప్పటికీ భారత్‌కు కేటాయించిన 50 యూనిట్లు ఇప్పటికే పూర్తిగా బుక్ అయిపోయాయని స్కోడా తెలిపింది. పెర్ఫార్మెన్స్, లగ్జరీ & ప్రాక్టికాలిటీని ఒకే SUVలో కోరుకునే వారికి కొడియాక్ ఆర్ఎస్ అత్యుత్తమ ఎంపికగా నిలుస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
డ్రైవర్‌ సహా వాహనంలో ఉన్న ప్రతి ఒక్కరికీ బీమా - సుప్రీంకోర్టు సంచలన తీర్పు, కొత్త నిబంధనలు!
కొత్త కార్లకు 4 ఏళ్లు, బైక్‌లకు 6 ఏళ్లు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ తప్పనిసరి? సుప్రీంకోర్టు సూచన
మలైకా అరోరా కొత్త కారు Mahindra Thar Roxx.. స్పెషల్ SUV ధర, ఫీచర్ల పూర్తి వివరాలు
మలైకా అరోరా కొత్త కారు Mahindra Thar Roxx.. స్పెషల్ SUV ధర, ఫీచర్ల పూర్తి వివరాలు
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Advertisement

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YCP Vs TDP: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Vishnu Priya Bhimeneni: శారీలో విష్ణుప్రియ... ట్రెడిషనల్ ఫోటోషూట్ చేసిన వైరల్ బోల్డ్ లేడీ
శారీలో విష్ణుప్రియ... ట్రెడిషనల్ ఫోటోషూట్ చేసిన వైరల్ బోల్డ్ లేడీ
Embed widget