అన్వేషించండి

Car Speedometer: స్పీడ్ మీటర్ 200 కిలోమీటర్లు చూపిస్తున్నా, కారు మాత్రం 120- 140 ఎందుకు వెళ్తుంది ?

Speedmeter In Car | మీరు సాధారణ హ్యాచ్‌బ్యాక్, సెడాన్ లేదా SUV కార్ల స్పీడోమీటర్‌లపై 180, 200 లేదా 220 కిలోమీటర్ల స్పీడ్ మార్క్ ఉంటుంది. వాస్తవానికి కారు అంత వేగంగా వెళ్లలేదు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కార్ల స్పీడోమీటర్లలో ఎక్కువ వేగం చూపించడానికి పలు కారణాలున్నాయి.
  • తయారీ ఖర్చు తగ్గించి, ప్రపంచ మార్కెట్లకు అనువుగా రూపొందిస్తారు.
  • పవర్‌ఫుల్ కారు భావన, భద్రతా నిబంధనల కోసం అలా చేస్తారు.

కొత్త కారు కొనేటప్పుడు చాలామంది దాని ఇంజన్, మైలేజ్, ఫీచర్ల గురించే ఆలోచిస్తారు. కానీ దాదాపు ప్రతి కారులో కనిపించే ఒక విషయం వెనుక ఉన్న అసలు కారణం మాత్రం చాలామందికి తెలియదు. సాధారణ కార్లలో కూడా స్పీడోమీటర్‌పై 180 నుండి 220 కిలోమీటర్ల వరకు స్పీడ్ రాసి ఉంటుంది, కానీ నిజానికి ఆ కారు అంత స్పీడ్‌ను అందుకోలేదు.

దాదాపు అన్ని కార్ల గరిష్ట వేగం (Car Maximum Speed) గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల లోపే ఉంటుంది. అయితే కంపెనీలు స్పీడోమీటర్‌పై స్పీడ్ అంత ఎక్కువ ఎందుకు చూపిస్తాయి? దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటి? అని ఎప్పుడైనా ఆలోచించారా ? కారు స్పీడ్ మీటర్‌లో 200 కిలోమీటర్లు చూపించినప్పటికీ, కారు మాత్రం 120- 140 కిలోమీటర్ల వేగంతోనే వెళ్తుంది. లేకపోతే 160 వరకు స్పీడ్‌తోనే ఎందుకు వెళ్తుందో వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 

ప్రతి కారుకి వేర్వేరు స్పీడోమీటర్ కుదరదు
ఆటోమొబైల్ కంపెనీలు మార్కెట్లోకి తెచ్చే ప్రతి కారు మోడల్‌కు విడివిడిగా స్పీడోమీటర్లను తయారు చేయవు. అలా చేస్తే కార్ల తయారీ ఖర్చు మరింత పెరిగిపోతుంది. అందుకే కార్ల కంపెనీలు ఒకే రకమైన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లేదా స్పీడోమీటర్ డిజైన్‌ను వేర్వేరు కారు మోడల్స్, వేరియంట్లలో వాడుతుంటాయి. ఈ కారణంగానే తక్కువ పవర్ ఉన్న బేసిక్ కార్లలోనూ,  ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉన్న స్పోర్ట్స్ కార్లలో వాడే స్పీడ్ మీటర్ స్కేలే కనిపిస్తుంది.

గ్లోబల్ మార్కెట్ అవసరాలు
చాలా కంపెనీలు తమ కార్లను కేవలం ఒక్క దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విక్రయాలు చేస్తుంటాయి. ఉదాహరణకు జర్మనీ లాంటి దేశాల్లో కొన్ని హైవేలపై స్పీడ్ లిమిట్ అంటూ ఉండదు. దాంతో అక్కడ చాలా ఎక్కువ వేగంతో కార్లు డ్రైవ్ చేస్తారు. అందువల్ల ప్రపంచంలోని వివిధ దేశాల మార్కెట్లకు, అక్కడి రూల్స్‌కు సరిపోయేలా కంపెనీలు ఒకే రకమైన స్పీడోమీటర్లను డిజైన్ చేస్తాయి.

ఎక్కువ స్పీడ్ కనిపిస్తే కారు పవర్‌ఫుల్‌
కారు స్పీడోమీటర్‌పై పెద్ద నంబర్లు చూపించడం అనేది ఒక రకమైన మార్కెటింగ్ స్ట్రాటజీ మీటర్‌పై 200 లేదా 220 కిలోమీటర్ల స్పీడ్ మీటర్ చూడగానే కస్టమర్లకు ఆ కారు చాలా పవర్‌ఫుల్ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఆ కారు జీవితంలో ఎప్పుడూ అంత స్పీడ్‌తో వెళ్లకపోయినా.. కారు పర్ఫార్మెన్స్ గురించి కస్టమర్లలో ఒక పాజిటివ్ అభిప్రాయాన్ని క్రియేట్ చేయడానికి ఈ డిజైన్ హెల్ప్ అవుతుంది.

కావాలనే ఎక్కువ స్పీడ్
మీరు కారు నడుపుతున్నప్పుడు స్పీడ్‌ను జీపీఎస్ (GPS) లేదా గూగుల్ మ్యాప్స్ యాప్‌తో పోల్చి చూశారా? రెండింటికీ కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది. సాధారణంగా కారు స్పీడోమీటర్, వెళ్తున్న అసలు వేగం కంటే కొంచెం ఎక్కువ స్పీడ్‌నే చూపిస్తుంది. ఇది కారులో లోపం వల్ల జరగదు, కంపెనీలు కావాలనే అలా డిజైన్ చేస్తాయి. యూరప్‌లో కొన్ని దేశాల్లో ఒక రూల్ ఉంది.. స్పీడోమీటర్ ఎప్పుడూ కూడా కారు వెళ్తున్న నిజమైన వేగం కంటే తక్కువ స్పీడ్‌ చూపించకూడదు. కాస్త ఎక్కువ చూపించినా పర్లేదు కానీ తక్కువ మాత్రం చూపించరాదు. కారు నిజానికి 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంటే, మీటర్ 103 లేదా 104 చూపించవచ్చు కానీ 100 కంటే తక్కువ చూపించరాదు.

కారు స్పీడోమీటర్‌లో ఇలా ఎందుకు చేస్తారు?
డ్రైవర్లు తెలియకుండానే స్పీడ్ లిమిట్‌ను దాటిపోకుండా ఉండాలని ఆటోమేకర్స్ స్పీడోమీటర్‌ను కొంచెం ఎక్కువ స్పీడ్ చూపించేలా క్యాలిబ్రేట్ చేస్తారు. దీనివల్ల ఓవర్ స్పీడింగ్ సమస్య తగ్గుతుంది. ఫలితంగా ట్రాఫిక్ చలాన్లు, ప్రమాదాల నుండి సైతం తప్పించుకోవచ్చు. ఒకవేళ స్పీడోమీటర్ కారు వెళ్తున్న అసలు స్పీడ్ కంటే తక్కువ చూపించి, కారు అంతకంటే వేగంగా వెళ్తుంటే రోడ్ సేఫ్టీ ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

Frequently Asked Questions

కార్ల స్పీడోమీటర్లలో 180-220 కిలోమీటర్ల వేగం ఎందుకు చూపిస్తుంది, నిజంగా అంత వేగంగా వెళ్లకపోయినా?

కంపెనీలు ఉత్పత్తి ఖర్చులు తగ్గించడానికి అన్ని మోడళ్లకు ఒకే స్పీడోమీటర్ డిజైన్‌ను ఉపయోగిస్తాయి. ఇది అంతర్జాతీయ మార్కెట్ అవసరాలను, కారు పవర్‌ఫుల్ అనే భావనను కస్టమర్లలో కలిగించడానికి కూడా సహాయపడుతుంది.

కారు స్పీడోమీటర్ అసలు వేగం కంటే కొంచెం ఎక్కువ వేగాన్ని ఎందుకు చూపిస్తుంది?

డ్రైవర్లు స్పీడ్ లిమిట్‌ను దాటకుండా ఉండటానికి, ట్రాఫిక్ చలాన్లు, ప్రమాదాలను నివారించడానికి కంపెనీలు స్పీడోమీటర్‌ను కొంచెం ఎక్కువ వేగం చూపించేలా క్యాలిబ్రేట్ చేస్తాయి. యూరప్ వంటి కొన్ని దేశాల్లో ఇది తప్పనిసరి నియమం.

అన్ని కార్లలో ఒకే రకమైన స్పీడోమీటర్ డిజైన్ వాడటానికి కారణం ఏమిటి?

ఆటోమొబైల్ కంపెనీలు ప్రతి కారు మోడల్‌కు విడివిడిగా స్పీడోమీటర్లను తయారు చేయవు. అలా చేస్తే కార్ల తయారీ ఖర్చు మరింత పెరుగుతుంది కాబట్టి, ఒకే డిజైన్‌ను వివిధ మోడల్స్‌లో వాడుతుంటాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
Royal Enfield Guerrilla 450 - Triumph Tracker 400 మధ్య పోటీ.. ఏ బండి ముందుగా 100 కి.మీ. వేగాన్ని అందుకుంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 vs ట్రయంఫ్ ట్రాకర్ 400.. వేగంలో ఏది కింగ్? రియల్‌ టెస్ట్‌లో తేలిన నిజాలివే!
పెట్రోల్, డీజిల్‌కు ఇక CNG తోడు.. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XOలో సన్‌రూఫ్‌తో కొత్త లుక్‌
Mahindra XUV 3XO తో మరింత మైలేజ్‌.. CNG వేరియంట్‌ వచ్చేస్తోంది.. అక్టోబర్ 15న!
పెద్ద చక్రాలు, కొత్త ఇంజిన్‌.. Aprilia SXR GT 125లో ఇంకా ఏం ఉన్నాయో కొనే ముందే తెలుసుకోండి
సూపర్‌ స్టైలిష్‌ స్కూటర్‌ Aprilia SXR GT 125 మీద ఇంట్రెస్ట్‌ ఉందా?, ఈ 5 విషయాలు మీకు తెలుసా?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget