అన్వేషించండి

Best Hybrid Cars India 2026: భారతీయ మార్కెట్‌ను షేక్ చేస్తున్న టాప్ హైబ్రిడ్ కార్లు! లీటరుకు మైలేజ్ ఎంతో తెలిస్తే షాకవుతారు!

Best Hybrid Cars India 2026: పెట్రోల్, ఎలక్ట్రిక్ పవర్ కలయికతో నడిచే స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు లీటరుకు గరిష్టంగా 27.97 km మైలేజ్ ఇస్తూ మార్కెట్లో దూసుకుపోతున్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పెట్రోల్ ధరల భారం తగ్గించడానికి హైబ్రిడ్ కార్లు ప్రత్యామ్నాయం.
  • మైల్డ్ హైబ్రిడ్‌ల కన్నా స్ట్రాంగ్ హైబ్రిడ్‌లు ఎక్కువ మైలేజ్ ఇస్తాయి.
  • ఈవీ, పెట్రోల్ మోడ్‌లతో ఎక్కువ మైలేజీ, సుదీర్ఘ ప్రయాణ భరోసా.
  • గ్రాండ్ విటారా, సిటీ హైబ్రిడ్ వంటివి అధిక మైలేజ్ అందిస్తున్నాయి.

Best Hybrid Cars India 2026: ప్రస్తుత రోజుల్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి బిజినెస్ మేగ్నెట్స్ వరకు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న ఒకే ఒక్క పెద్ద మండిపోతున్న పెట్రోల్ డీజిల్ ధరలు. ఆఫీసుకో, లాంగ్ ట్రిప్‌కో వెళ్లాలంటే బండి ఫ్యూయల్ ట్యాంక్‌వైపు, తర్వాత జేబు వైపు చూడాల్సి వస్తోంది. ఇలా పెట్రోల్ ఖర్చులు భరించ లేక అలాగని ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనలేక నలిగిపోతున్న వారు లక్షల్లో ఉన్నారు. ఇలాంటి వారి సమస్యకు పరిష్కారంగానే అందుబాటులోకి వచ్చింది హైబ్రిడ్‌ కార్లు. 

హైబ్రిడ్ కార్లు ప్యూర్ ఎలక్ట్రిక్ మోడ్‌లోనూ నడుస్తాయి, అవసరమైనప్పుడు పెట్రోల్‌ను వాడుకుంటాయి. ఒకే కార్‌లో అటు ఈవీ సైలెంట్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్, ఇటు పెట్రోల్ కార్ లాంగ్ రేంజ్ భరోసా ఇస్తాయి. అలాగని మైలేజీ తగ్గుతుందనే ఆలోచన కూడా వద్దు. రెగ్యులర్‌ పెట్రోల్ కార్లు ఇచ్చే మైలేజీ ఇస్తున్నాయి. పూర్తి వివరాలు తెలిస్తే మాత్రం కచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. అలాంటి మంచి మైలేజీ ఇచ్చి సామాన్యుడి ఆలోచనల్లో ఉండే టాప్ మోడల్స్‌ గురించి తెలుసుకుందాం. 

హైబ్రిడ్ టెక్నాలజీలో రకాలు ఉన్నాయా?

ఈ మధ్య కాలంలో కార్ల ప్రస్తావన వచ్చింది అంటే చాలు చాలా మంది నోటు నుంచి హైబ్రిడ్ అనే మాట గట్టిగా వినిపిస్తుంది. దీనికి పెరుగుతున్న ప్రాధాన్యతను గుర్తించిన కంపెనీలు కూడా తక్కువ ధరల్లోనే సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలకు హైబ్రిడ్ కార్లను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా రెండు రకాల టెక్నాలజీలు ఉన్నాయి. ఒకటి మైల్డ్‌హైబ్రిడ్. ఎక్కువ మంది దీన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇందులో ఒక చిన్న ఇంటిగ్రేటె్‌ స్టార్టర్‌ జనరేటర్ మోటర్ ఉంటుంది. ఇది కేవలం ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే పని చేస్తుంది. ఈ మోడల్‌ను పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్‌లో రన్ చేయలేరు. మైలేజీలో కూడా పెద్ద తేడా కనిపించదు. పేరుకే ఇవి హైబ్రిడ్ అయినప్పటికీ వినియోగదారునికి పెద్దగా ప్రయోజనం లేదని నిపుణులు చెబుతున్నారు. 

రెండో రకం స్ట్రాంగ్ హైబ్రిడ్‌ టెక్నాలజీ. ఇందులో పెద్ద కెపాసిటీ ఉన్న లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తోపాటు పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది ట్రాఫిక్‌లో వెళ్తున్నప్పుడు పెట్రోల్‌ సేవ్ చేయడానికి పూర్తిగా ఈవీ మోడ్‌లోనే ఉంటుంది. అదే స్పీడ్‌గా వెళ్తున్నప్పుడు ఎలక్ట్రిక్‌, పెట్రోల్ ఇంజిన్ రెండూ బ్యాలెన్స్‌డ్‌గా వర్క్ చేస్తాయి. దీని వల్ల మైలేజీ వస్తుంది. బ్రేక్ వేసినప్పుడు వచ్చే ఎనర్జీతో బ్యాటరీ ఆటోమేటిక్‌గా చార్చ్ అవుతుంది. అంటే ప్రత్యేకంగా ఛార్జ్ చేయాల్సిన పని లేకుండా చేస్తుంది. 

మారుతి సుజుకి గ్రాండ్ విటారా

దేశంలో మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీని సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చిన క్రెడిట్ మారుతీ సుజుకి కంపెనీకే దక్కుతుంది. గ్రాండ్ విటారాతో మార్కెట్‌ లెక్కల్నే మార్చేశారు. టొయోటా భాగస్వామ్యంతో డెవలప్ చేసిన ఈ కార్‌లోని 1.5 లీటర్‌ ఇంటెలిజెంట్‌ ఎలక్ట్రిక్‌ హైబ్రిడ్‌ ఇంజిన్ అద్భుతాలు చేస్తోంది. ఇది సిటీ ట్రాఫిక్‌ 60 శాతం ఈవీ మోడ్‌లో రన్ అవుతుంది. అందుకే ఈ కారు మైలేజీ 27.97కిలోమీటర్లుగా చెబుతున్నారు. రోజువారి ప్రయాణాలకు, ఫ్యామిలీతో కలిసి లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడానికి మంచి ఎంపికా నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఈ-సీవీటీ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్ ఉంది. దీని వల్ల డ్రైవింగ్ మరింత సులభమవుతుంది. 

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ 

మారుతి గ్రాండ్ విటారాకు ట్విన్ బ్రదర్ లాంటిదే ఈ టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ జపాన్ టెక్నాలజీ దిగ్గజం టొయోటా స్వయంగా తయారు చేసిన స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్ ఇందులో అమర్చారు. దీనిలోని 1490 cc త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్‌తో కంబైన్ అయి 115 bhp పవర్‌ను జనరేట్ చేస్తుంది. మైలేజ్ పరంగా ఇది కూడా లీటరుకు 27.97 km ఇస్తోంది. 

హోండా సిటీ హైబ్రిడ్ e:HEV

సెడాన్ కార్ల లవర్స్ కోసం హోండా కంపెనీ తీసుకొచ్చిన మాస్టర్ పీస్ హోండా సిటీ హైబ్రిడ్ e:HEV. దేశంలో సెడాన్ సెగ్మెంట్‌లో మొట్టమొదటి ప్యూర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్ ఇదే. ఇందులో మల్టీ మోడ్ డ్రైవింగ్ సిస్టమ్ ఉంటుంది. హోండా సిటీ హైబ్రిడ్‌లో 1.5-లీటర్ అట్కిన్‌సన్ సైకిల్‌ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. దీనికి రెండు ఎలక్ట్రిక్ మోటార్లు జతచేశారు. ఇది లీటరుకు 27.13 km మైలేజ్ ఇస్తుంది. మైలేజ్ మాత్రమే కాదు, ఇందులో సేఫ్టీ కోసం హోండా సెన్సింగ్ టెక్నాలజీని కూడా అందించారు. లగ్జరీ లుక్, ప్రీమియం కంఫర్ట్,  అదిరిపోయే మైలేజ్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

మారుతి సుజుకి ఇన్విక్టో 

పెద్ద ఫ్యామిలీస్ కోసం, 7-సీటర్‌ లగ్జరీ ప్రీమియం MPV సెగ్మెంట్‌లో మైలేజ్ కింగ్ అనిపించుకుంటోంది ఈ మారుతి సుజుకి ఇన్విక్టో. టొయోటా ఇన్నోవా హైక్రాస్ ఆధారంగా మారుతి సుజుకి రీబ్యాడ్జ్ చేసి లాంచ్ చేసిన ఫ్లాగ్‌షిప్ మోడల్ ఇది. ఇంత పెద్ద సైజ్ ఉన్నప్పటికీ, ఇందులోని 2.0లీటర్‌ పవర్‌ఫుల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ వల్ల లీటరుకు ఏకంగా  23.24 km మైలేజ్ ఇస్తుంది. నార్మల్ పెట్రోల్ ఆటోమేటిక్ 7-సీటర్ కార్లు లీటరుకు కనీసం 10 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వడమే కష్టంగా ఉన్న తరుణంలో, ఇన్విక్టో డబుల్ మైలేజ్ ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇందులో కెప్టెన్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఎన్నో లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి.

Frequently Asked Questions

హైబ్రిడ్ కార్లు అంటే ఏమిటి, వాటి ప్రయోజనం ఏమిటి?

హైబ్రిడ్ కార్లు ప్యూర్ ఎలక్ట్రిక్ మోడ్‌లోనూ, అవసరమైనప్పుడు పెట్రోల్ మోడ్‌లోనూ నడుస్తాయి. ఇవి ఈవీ సైలెంట్ డ్రైవింగ్, పెట్రోల్ కార్ లాంగ్ రేంజ్ భరోసాను, మంచి మైలేజీని అందిస్తాయి.

హైబ్రిడ్ టెక్నాలజీలో ప్రధానంగా ఎన్ని రకాలు ఉన్నాయి?

హైబ్రిడ్ టెక్నాలజీలో ముఖ్యంగా రెండు రకాలు ఉన్నాయి: మైల్డ్‌హైబ్రిడ్ మరియు స్ట్రాంగ్ హైబ్రిడ్. స్ట్రాంగ్ హైబ్రిడ్ మెరుగైన మైలేజీని, పూర్తి ఈవీ మోడ్‌ను అందిస్తుంది.

స్ట్రాంగ్ హైబ్రిడ్ కారు మైల్డ్ హైబ్రిడ్ కంటే ఎలా భిన్నంగా ఉంటుంది?

స్ట్రాంగ్ హైబ్రిడ్ పెద్ద కెపాసిటీ ఉన్న లిథియం అయాన్ బ్యాటరీ, పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్ కలిగి ఉంటుంది. ఇది ట్రాఫిక్‌లో పూర్తి ఈవీ మోడ్‌లో నడవగలదు. మైల్డ్ హైబ్రిడ్ చిన్న మోటార్ కలిగి ఇంజిన్ స్టార్ట్ అయినప్పుడు మాత్రమే పని చేస్తుంది, పూర్తి ఈవీ మోడ్‌లో రన్ చేయదు.

పెద్ద కుటుంబాల కోసం మంచి మైలేజీ ఇచ్చే హైబ్రిడ్ కారు ఏది?

మారుతి సుజుకి ఇన్విక్టో 7-సీటర్ లగ్జరీ ప్రీమియం MPV సెగ్మెంట్‌లో మంచి ఎంపిక. ఇది 2.0లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌తో లీటరుకు 23.24 km మైలేజీని ఇస్తుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

డ్యూక్‌ నుంచి RC వరకు ధరల బాదుడు.. KTM బైక్‌ కొంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ చెల్లించాల్సిందే
మైగాడ్‌, KTM బైక్‌ కొనేవాళ్లకు షాకింగ్‌ న్యూస్‌! 7 మోడళ్ల రేట్లు అమాంతం పెరిగాయి
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
కారు నుంచి లారీ వరకు.. ఫిట్‌నెస్‌ను ఇక యంత్రాలే పరీక్షిస్తాయి! తెలంగాణలో 15 చోట్ల కొత్త వ్యవస్థ
మీ కారు ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఇక కొత్త రూట్‌లో.. మాన్యువల్‌ పరీక్షలకు చెక్‌!
నిస్సాన్ గ్రావైట్ CNG రియల్‌ మైలేజ్‌ టెస్ట్‌.. కేజీకి ఎంత దూరం వెళ్లిందంటే?
కేవలం రూ.83,000 కే CNG కిట్.. నిస్సాన్ గ్రావైట్ నిజమైన మైలేజీ ఎంతో తెలుసా?
Advertisement

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Embed widget