అన్వేషించండి

Hero Surge S32: 3 నిమిషాల్లో ఆటో నుంచి స్కూటర్‌గా మారే హీరో సర్జ్‌ఎస్‌ 32! చంద్రబాబు పరిశీలించిన వెహికల్‌  పూర్తి వివరాలు ఇవే!

Hero Surge S32: హీరో మోటోకార్ప్‌ ఇన్క్యుబేషన్ స్టార్టప్‌ సర్జ్‌. ప్రపంచంలోనే మొట్టమొదటి 2 ఇన్‌1 కన్వర్టబుల్ ఈవీ వాహనం సర్జ్‌ ఎస్‌ 32. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సర్జ్ S32 వాహనాన్ని పరిశీలించారు.
  • ప్రపంచంలోనే తొలి 2-ఇన్-1 ఎలక్ట్రిక్ కన్వర్టబుల్, ఆటో స్కూటీగా మారుతుంది.
  • చిన్న వ్యాపారులు, డెలివరీ ఏజెంట్లకు ఇది చాలా ఉపయోగకరం.

Hero Surge S32: సత్యవేడులోని శ్రీ సిటీలో ఉన్న హీరో ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు సందర్శించారు. హీరో మోటార్స్ ఉత్పత్తి చేస్తున్న వివిధ రకాల మోడళ్లు పరిశీలించారు. ఈ సందర్భంగానే హీరో సంస్థ రూపొందించిన స్కూటీ కం ఆటో వాహనాన్ని సీఎం పరిశీలించారు. ఆటో నుంచి స్కూటీని వేరు చేసే విధానాన్ని ఆసక్తిగా పరిశీలించారు. అదే హీరో సర్జ్‌ఎస్‌ 32. దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం. 

భారతీయ రవాణా రంగం సరికొత్త మలుపు తిరుగుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ఊహించని ఆవిష్కరలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే హీరో మోటోకార్ప్‌ స్టార్టప్‌ సంస్థ సర్జ్‌, శ్రీసిటీ కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న అద్భుత వాహనం హీరో సర్జ్‌ ఎస్‌ 32.  ఇది కేవలం ఒక ఎలక్ట్రిక్ వాహనం మాత్రమే కాదు. అవసరాన్ని బట్టి తన రూపాన్ని మార్చుకునే ఒక ట్రాన్స్‌ఫార్మర్‌. 

ఏంటీ ఈ హీరో సర్జ్‌ఎస్‌ 32?

హీరో సర్జ్‌ఎస్‌ 32 అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి మాడ్యులర్‌ 2- ఇన్‌-1 కన్వర్టబుల్‌ ఎలక్ట్రిక్‌ వాహనం. సాధారణంగా మనం రోడ్లపై ఆటో రిక్షాలను లేదా స్కూటర్లను విడివిడిగా చూసుకుంటాం. కానీ హీరో సర్జ్‌ఎస్‌ 32 ఈ రెండింటి కలయిక. ఇది ఒకే సమయంలో త్రీ వీలర్‌గాను టూ వీలర్‌గానూ పని చేస్తుంది. 

Also Read: భారత EV మార్కెట్లో తగ్గుతున్న వృద్ధి.. ఆసక్తి ఉన్నా కొనుగోళ్లకు అడ్డంకి ఇదేనా!

కేంద్ర రవాణా శాఖ ఈ వినూత్న సాంకేతికతను గుర్తించి, దీని కోసం ప్రత్యేకంగా ఎల్‌2-5కేటగిరిని ఆమోదించింది. అంటే ఇది చట్టబద్ధంగా రెండు రకాల వాహనాల ప్రయోజనాలను ఒకే రిజిస్ట్రేషన్‌తో అందించబోతోంది. 

ఇది ఎలా సాధ్యం?

ఈ వాహనం వెనక ఉన్న ఇంజినీరింగ్‌ అత్యంత చాకచక్యంగా రూపొందించారు. ఆటో లోపల  ఒక స్కూటర్‌ అంతర్భాగంగా అమర్చి ఉంటుంది. దీనిని మార్చుకునే విధానం చాలా సులభం. ఒక బటన్ నొక్కడం ద్వారా ఆటో ముందు విండ్‌షీల్డ్‌ భాగం పైకి లేస్తుంది. లోపల ఉన్న స్కూటర్‌ విడిగా బయటకు వస్తుంది. ఈ మొత్తం ప్రక్రియకు కేవలం 3 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఆటో మోడ్‌లో ఉన్నప్పుడు స్కూటర్‌ సురక్షితంగా ఉండటానికి ఎలక్ట్రో-మెకానికల్‌ లాకింగ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. దీని వల్ల ప్రయాణ సమయంలో స్కూటర్‌ విడిపోయే ప్రమాదం ఉండదు. 

ఈ వాహనం ఎవరికి యూజ్ అవుతుంది?

మధ్యతరగతి ప్రజలు, చిన్న వ్యాపారస్తులు, డెలివరీ ఏజెంట్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని దీనిని రూపొందించారు. పగటిపూట సరకుల రవాణా లేదా ప్రయాణికులను చేరవేయడానికి ఆటోగా వాడుకోవచ్చు. అదే వాహనాన్ని సాయంత్రం వేళల్లో కుటుంబంతో కలిసి బయటకు వెళ్లడానికి స్కూటర్‌గా మార్చుకోవచ్చు. ఒకే ధరకు రెండు వాహనాల ప్రయోజనం లభిస్తుంది. దీని వల్ల అదనపు వాహనం కొనాల్సిన అవసరం, పార్కింగ్‌ సమస్యలు తప్పుతాయి. లాస్ట్‌-మైల్‌ డెలివరీ, ప్యాసింజర్‌ సర్వీసుల్లో ఉండే వారికి ఇది ఒక గొప్ప వరం. 

టెక్నికల్‌ స్పెసిఫికేషన్

ఫీచర్లు    ఆటోమోడ్‌  స్కూటర్‌ మోడ్‌ 
బ్యాటరీ సామర్థ్యం  11 kWh (కార్గో) / 9.67 kWh (ప్యాసింజర్)  3.5 kWh
మోటార్ పవర్   10 kW / 8 kW   3 kW
గరిష్ట వేగం    50 కి.మీ/గంట    60 కి.మీ/గంట

లోడ్ సామర్థ్యం / రేంజ్ 

500 కేజీలు    60 - 80 కి.మీ

ఏ రకమైన రోడ్డు పైనైనా వాహనాన్ని సులభంగా సపరేట్ చేసేందుకు వీలుగా అడ్వాన్స్‌డ్ మాడ్యులర్  ప్లాట్‌ఫారమ్‌ను డిజైన్ చేశారు. ఇందులో రివర్స్ గేర్ సదుపాయం, డిజిటల్ కన్సోల్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి. సర్జ్ ఎస్32ను వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రెండు ప్రధాన విభాగాలుగా విభజించారు. 

1. కార్గో వేరియంట్ (S32 Cargo - L2-5N): ఇది పూర్తిగా సరకు రవాణా కోసం ఉద్దేశించంది. ఇందులో మూడు రకాల డిజైన్లు ఉన్నాయి. లో డెక్ (LD) & హై డెక్ (HD) ఇవి ఈ-కామర్స్ పార్సిళ్లు, గ్యాస్ సిలిండర్ల రవాణాకు అనుకూలంగా ఉంటాయి. మూడోది ఫ్లాట్ బెడ్ (FB) పెద్ద పెట్టెలు లేదా కస్టమైజ్డ్ లోడ్స్ కోసం వెనుక భాగం ఫ్లాట్‌గా ఉంటుంది. దీనికి 500 కేజీల బరువు మోసే సామర్థ్యం కోసం 11.61 kWh పెద్ద బ్యాటరీని అమర్చారు. 

2. ప్యాసింజర్ వేరియంట్ (S32 PV - L2-5M): ఇది సాధారణ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా మాదిరిగా పనిచేస్తుంది. ఇందులో డ్రైవర్ + 3 ప్యాసింజర్లు కూర్చోవచ్చు. ప్రయాణికుల సౌకర్యం కోసం కుషన్ సీట్లు, ఎండ వానల నుంచి రక్షణ కోసం సాఫ్ట్-డోర్స్, పక్కా రూఫ్ స్ట్రక్చర్‌ను ఏర్పాటు చేశారు. దీనికి 9.67 kWh బ్యాటరీ సరిపోతుంది.

ఎప్పుడు మార్కెట్‌లోకి వస్తుంది? ధర ఎంత?

ఈ వాహనం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై సర్జ్ బృందం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు ఉండే ఛాన్స్ ఉంది.

Also Read: వాహనదారులకు షాక్.. కార్ల ధరలు పెంచిన టాటా మోటార్స్, కియా ఇండియా, ఎంజీ మోటార్స్

Frequently Asked Questions

హీరో సర్జ్ ఎస్32 అంటే ఏమిటి?

హీరో మోటోకార్ప్ స్టార్టప్ సర్జ్ రూపొందించిన వినూత్న ఎలక్ట్రిక్ వాహనం ఇది. అవసరాన్ని బట్టి ఆటో రిక్షా నుండి స్కూటర్‌గా మారగల ప్రపంచంలోనే మొదటి మాడ్యులర్ 2-ఇన్-1 వాహనం.

హీరో సర్జ్ ఎస్32 ఆటో నుండి స్కూటర్‌గా ఎలా మారుతుంది?

ఒక బటన్ నొక్కడం ద్వారా ఆటో ముందు భాగం పైకి లేచి, లోపల ఉన్న స్కూటర్ విడిగా బయటకు వస్తుంది. ఈ మొత్తం ప్రక్రియకు కేవలం 3 నిమిషాలు మాత్రమే పడుతుంది.

హీరో సర్జ్ ఎస్32 ఏ వినియోగదారులకు ఉపయోగపడుతుంది?

మధ్యతరగతి ప్రజలు, చిన్న వ్యాపారస్తులు, డెలివరీ ఏజెంట్లు, మరియు లాస్ట్-మైల్ డెలివరీ, ప్యాసింజర్ సర్వీసుల్లో ఉండే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒకే ధరకు రెండు వాహనాల ప్రయోజనం అందిస్తుంది.

హీరో సర్జ్ ఎస్32 ఎన్ని రకాల వేరియంట్లలో లభిస్తుంది?

ఇది రెండు ప్రధాన వేరియంట్లలో అందుబాటులో ఉంది: సరకు రవాణా కోసం కార్గో వేరియంట్ (S32 Cargo) మరియు ప్రయాణీకులను చేరవేయడానికి ప్యాసింజర్ వేరియంట్ (S32 PV).

హీరో సర్జ్ ఎస్32 ఎప్పుడు మార్కెట్‌లోకి వస్తుంది మరియు దాని ధర ఎంత ఉండవచ్చు?

ఈ వాహనం ఎప్పుడు మార్కెట్‌లోకి వస్తుందో ఇంకా ప్రకటించలేదు. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget