అన్వేషించండి

Electric Vehicles: భారత EV మార్కెట్లో తగ్గుతున్న వృద్ధి.. ఆసక్తి ఉన్నా కొనుగోళ్లకు అడ్డంకి ఇదేనా!

EV charging Stations | భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల జోరు ఎందుకు తగ్గుతోంది? షోరూమ్‌ల గురించి, టెక్నికల్ సమస్యలే కాకుండా, కొనుగోలుదారులను ఇబ్బంది పెడుతున్న ప్రధాన కారణాన్ని కొత్త నివేదిక వెల్లడించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పెట్రోల్ ధరలు పెరిగినా, ఈవీ అమ్మకాల వృద్ధి ఆశించినంతగా లేదు.
  • ఇంటి వద్ద ఛార్జింగ్ సౌకర్యం లేకపోవడం ప్రధాన అడ్డంకిగా మారింది.
  • అపార్ట్‌మెంట్లలో ఛార్జర్ అనుమతులు, సరికాని ఛార్జింగ్ భద్రతా ప్రమాదాలు సమస్యలు.

నిరంతరం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా భారత్‌లోనూ కొన్నేళ్ల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ పెరిగింది. ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనడానికి ఆస్తి చూపుతున్నప్పటికీ.. మార్కెట్లో దీని వేగం కొద్దిగా మందగిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇష్టపడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలలో వృద్ధి కనిపించింది. ప్రస్తుతం వృద్ధి రేటు ఆశించినంత లేవని మార్కెట్ లెక్కలు చెబుతున్నాయి. 

ఇటీవల వచ్చిన ఒక నివేదిక ప్రకారం భారత మార్కెట్లో ఈవీ (EV) అమ్మకాల వేగం తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. దీనికి కారణం సాంకేతిక లోపం ఏమీ కాదు, కానీ ఇళ్లలోని బలహీనమైన ఎలక్ట్రికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హోమ్ ఛార్జింగ్‌కు స్థలం లేకపోవడంతో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు ఆశించినంతగా లేవు. ఈ సౌకర్యం మెరుగైతే, ఎక్కడ పడితే అక్కడ బ్యాటరీ మార్చుకునే అవకాశం ఉంటే విక్రయాల్లో ఊహించని మార్పులు సాధ్యమే.

ఇంట్లో ఛార్జింగ్ సదుపాయం లేదు
 భారత్‌లో జరిగే ఈవీ విక్రయాలలో దాదాపు 91 శాతం వాటా టూవీలర్, త్రీ వీలర్ వాహనాలదే ఉంది. వీటికి ఇంట్లోనే హోమ్ ఛార్జింగ్ చేసుకోవడం చాలా అవసరం. కానీ, దేశంలో ఈవీ కొనాలనుకునే కస్టమర్లలో కేవలం 55 శాతం మందికి మాత్రమే ఇంట్లో వాహనాన్ని ఛార్జ్ చేసుకునే సదుపాయం అందుబాటులో ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది.

Also Read: జులై 2026 కార్ లాంచ్‌లు ఇవే - మారుతి, హోండా, స్కోడా, MG కొత్త కార్లపై భారీ అంచనాలు

మిగిలిన వారు తమ వాహనాన్ని ఛార్జ్ చేసుకోవడానికి పబ్లిక్ స్టేషన్లపై ఆధారపడుతూ అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. హోమ్ ఛార్జింగ్‌కు సంబంధించిన ఈ పెద్ద లోపం కారణంగా మరింత మందికి ఈవీ చేరువ కాలేకపోతోంది. 

అడ్డంకిగా మారిన ఎన్ఓసీ
ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నప్పటికీ.. అపార్ట్‌మెంట్లు, సొసైటీలు, అద్దె ఇళ్లలో నివసించే 70 నుండి 75 శాతం పట్టణ కుటుంబాలకు ఇబ్బందులు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. ఈ ప్రదేశాల్లో కామన్ పార్కింగ్ స్థలం ఉంటుంది. అక్కడ సొంత పర్సనల్ ఛార్జర్‌ను ఏర్పాటు చేసుకోవడం చాలా కష్టం. ఛార్జర్ ఇన్‌స్టాల్ చేయడానికి యజమానులు,  రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల (RWA) నుండి అనుమతి లేదా ఎన్‌ఓసి తీసుకోవలసి ఉంటుంది. దాంతో దరఖాస్తులు చేసుకుని పర్మిషన్ కోసం ఎదురుచూడక తప్పదు. విద్యుత్ కంపెనీల నుండి మీటర్ లోడ్ పెంచడం కూడా సామాన్యులకు తలనొప్పి లాంటిదే. దీనివల్ల ప్రజలు విసిగిపోయి ఈవీ కొనే ప్లాన్‌ను వదిలేసుకుంటున్నారు.

బ్యాటరీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం
ఎలక్ట్రిక్ వాహనం కోసం ఇంట్లో సరైన సెటప్ లేకపోతే చాలా మంది విధిలేక ప్రత్యామ్నాయ మార్గాల సహాయం తీసుకుంటున్నారు. ప్రజలు తమ బాల్కనీ లేదా కిటికీ నుండి పొడవైన ఎక్స్‌టెన్షన్ బోర్డులను వేలాడదీసి లేదా ఏదైనా సాకెట్ల నుంచి ఈవీలను కనెక్ట్ చేస్తున్నారు. సాధారణ సాకెట్లు నిరంతరం చాలా గంటల పాటు ఈవీ భారీ లోడ్‌ను తట్టుకోలేవు. 

ఈ కారణంగా వైర్లు కరిగిపోవడం, మంటలు చెలరేగడం, వోల్టేజ్ హెచ్చుతగ్గుల ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ నిర్లక్ష్యం వాహనంలోని ఖరీదైన బ్యాటరీని డ్యామేజ్ చేయడంతో పాటు ఇంటి భద్రతను ప్రమాదంలో పడేసే అవకాశాలున్నాయి. ఈ కారణాల వల్ల ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు పెరుగుతున్నా, ఆశించిన వృద్ధి కనిపించడం లేదు.

Also Read: ఏ కాంపాక్ట్ SUVకి లేని శక్తితో వచ్చిన టాటా సియరా EV!బేసిక్‌, టాప్‌ వేరియంట్‌ ధరలు ఎలా ఉన్నాయి?

Frequently Asked Questions

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల వేగం ఎందుకు మందగిస్తోంది?

ఇళ్లలో బలహీనమైన ఎలక్ట్రికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హోమ్ ఛార్జింగ్‌కు స్థలం లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ సమస్యలు ఈవీ అమ్మకాల వృద్ధిని ఆశించినంతగా లేకుండా చేస్తున్నాయి.

ఎంత శాతం ఈవీ కస్టమర్లకు ఇంట్లో ఛార్జింగ్ సౌకర్యం ఉంది?

దేశంలో ఈవీలు కొనే కస్టమర్లలో కేవలం 55 శాతం మందికి మాత్రమే తమ ఇళ్లలో వాహనాన్ని ఛార్జ్ చేసుకునే సదుపాయం అందుబాటులో ఉంది. మిగిలిన వారు పబ్లిక్ స్టేషన్లపై ఆధారపడుతున్నారు.

పట్టణ ప్రాంతాల్లో నివసించే ఈవీ యజమానులు ఛార్జింగ్ కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు?

అపార్ట్‌మెంట్లు లేదా సొసైటీల్లో నివసించే వారు పర్సనల్ ఛార్జర్ ఏర్పాటు చేసుకోవడానికి RWA అనుమతి తీసుకోవాలి. విద్యుత్ కంపెనీల నుండి మీటర్ లోడ్ పెంచడం కూడా కష్టంగా ఉంటుంది.

ఇంట్లో సరైన పద్ధతిలో ఛార్జ్ చేయకపోతే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి?

సాధారణ సాకెట్లు లేదా ఎక్స్‌టెన్షన్ బోర్డులతో ఛార్జ్ చేస్తే వైర్లు కరిగిపోవడం, మంటలు చెలరేగడం, బ్యాటరీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఇది ఇంటి భద్రతకు కూడా ముప్పు కలిగిస్తుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

పెట్రోల్ ధరల టెన్షన్‌కు Toyota Innova చెక్.. లీటర్ రూ. 25 రన్నింగ్ కాస్ట్‌తో వస్తున్న ఇథనాల్ కారు
పెట్రోల్ ధరల టెన్షన్‌కు Toyota Innova చెక్.. లీటర్ రూ. 25 రన్నింగ్ కాస్ట్‌తో వస్తున్న ఇథనాల్ కారు
అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి
అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి
5 నిమిషాల్లోనే 70 శాతం ఛార్జ్.. EV Charging లో సంచలనం సృష్టిస్తున్న కొత్త టెక్నాలజీ
5 నిమిషాల్లోనే 70 శాతం ఛార్జ్.. EV Charging లో సంచలనం సృష్టిస్తున్న కొత్త టెక్నాలజీ
350cc బైక్‌ Triumph Tracker 400 రియల్‌ మైలేజ్‌ గురించి తెలుసా? లీటర్ పెట్రోల్‌తో ఎన్ని కిలోమీటర్లు తిరిగిందంటే?
Triumph Tracker 400 నిజమైన మైలేజ్ ఎంత? సిటీ ట్రాఫిక్‌లో, హైవేపై అసలు లెక్క ఇదే!
Advertisement

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bank Employees Strike: బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా, నేటి నుంచి సేవలు యథాతథం
బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా, నేటి నుంచి సేవలు యథాతథం
Ward Secretariat Employees: స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Urban Land Ceiling: యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
ABP Desam Top 10, 28 September 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 28 September 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ
సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Medaram Jatara Dates: మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
World Tourism Day Arrangements: ఏపీ పర్యాటకానికి సోషల్ మీడియా బూస్ట్.. పర్యాటక ప్రాంతాలకు గ్లోబల్ ప్రచారం.. ఇన్‌ఫ్లూయెన్సర్లతో మంత్రి దుర్గేష్ బంతి భోజనాలు
ఏపీ పర్యాటకానికి సోషల్ మీడియా బూస్ట్.. పర్యాటక ప్రాంతాలకు గ్లోబల్ ప్రచారం
Storing Beer in the Fridge : బీరును ఫ్రిడ్జ్​లో పెడుతున్నారా? అయితే ఈ విషయాలు కూడా దృష్టిలో పెట్టుకోండి
బీరును ఫ్రిడ్జ్​లో పెడుతున్నారా? అయితే ఈ విషయాలు కూడా దృష్టిలో పెట్టుకోండి
Embed widget