అన్వేషించండి

Kadambari Jethwani Case Facts: ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?

Kadambari Jethwani Kukkala Vidyasagar Case: సినీ నటి కాదంబరి జెత్వానీ కేసు విషయంలో దాఖలు చేసిన చార్జిషీటుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అసలు విషయాలు ఇవి.

AP Politics Jethwani Social Media Allegations: నటి కాదంబరి జెత్వానీ వ్యవహారం మళ్లీ సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. గతంలో బాధితురాలిగా ప్రచారంలోకి వచ్చిన మహిళను, ఇప్పుడు నిందితురాలిగా చిత్రీకరిస్తున్నారంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్‌లు పెడుతున్నారు. అయితే, జరుగుతున్న పరిణామాలను పక్కదారి పట్టించేందుకు, ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకే ఈ తరహా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ప్రభుత్వం, టీడీపీ వివరాలు వెల్లడించాయి. వాస్తవానికి ఈ కాదంబరి జెత్వానీ ఎపిసోడ్‌ను ఒకే సమస్యగా కాకుండా, చట్టబద్ధంగా రెండు వేర్వేరు కేసులు అని టీడీపీ వివరణ విడుదల చేసింది.

మొదటి కేసు జెత్వానీపై నమోదైన కేసు - రెండో కేసు జెత్వానీ ఫిర్యాదుతో నమోదైంది!    

ఈ రెంటిలో మొదటి కేసు—జెత్వానీకి, వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌కు మధ్య ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు ,  ఆమె బ్లాక్‌మెయిల్ చేసిందనే ఆరోపణలకు సంబంధించింది. ఈ వ్యవహారంలో జెత్వానీ నిందితురాలిగా ఉన్నారు. ఇక రెండో కేసు నకిలీ పత్రాలతో విద్యాసాగర్ అనుచరులతో జెత్వానీ భూ ఒప్పందం చేసుకున్నట్లు నాడు సీఎంఓ  ఆదేశాలతో ఒక అసత్య కథనాన్ని అల్లి, ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా నిర్బంధించి వేధించడం. ఈ రెండో కేసులోనే ఎన్టీఆర్ జిల్లాలో కేసు నమోదైంది. నాటి డీజీపీ ర్యాంక్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు, ఐజీ కాంతిరాణా తాతా, ఎస్పీ విశాల్ గున్ని వంటి ఐపీఎస్ అధికారులపై చట్టపరమైన దర్యాప్తు జరిగింది. ఈ రెండో కేసే దేశవ్యాప్తంగా పోలీసు వ్యవస్థ జవాబుదారీతనంపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

ఓ కేసులో బాధితురాలు..మరో కేసులో నిందితురాలు

ఈ రెండు కేసుల్లోనూ ప్రాథమిక తేడా ఏంటంటే.. మొదటి కేసులో జెత్వానీ నిందితురాలు కాగా, రెండో కేసులో ఆమె స్పష్టమైన బాధితురాలు. మొదటి కేసులో ఉన్న తెరవెనుక వ్యవహారాలను, రాజకీయ స్వార్థాన్ని దాచిపెట్టడానికి గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. నాటి ఉన్నతాధికారులు స్వామిభక్తి ప్రదర్శిస్తూ సీఎంఓ ఒత్తిళ్లకు తలొగ్గి కథ అల్లడమే కాకుండా, ఆమెను గెస్ట్ హౌస్‌లు, హోటళ్లలో అక్రమంగా నిర్బంధించి తీవ్ర వేధింపులకు గురిచేశారు. పోలీసుల ఆనాటి అత్యుత్సాహం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌ను ఉల్లంఘించడం వల్లే మొదటి కేసులో నిందితురాలిగా ఉన్న జెత్వానీ, రెండో కేసులో తీవ్రంగా నష్టపోయిన బాధితురాలిగా మారాల్సి వచ్చింది.

రెండు వేర్వేరు కేసులుగా విచారణ

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ రెండు కేసులను వేర్వేరుగానే పరిగణిస్తూ చట్టప్రకారం, రాజ్యాంగ నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్తోంది. జెత్వానీ తప్పు ఉందన్న మొదటి కేసులో పోలీసులు విచారణ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్‌షీట్ ఫైల్ చేశారు. అదే సమయంలో, అధికారాన్ని దుర్వినియోగం చేసి ఆమెను అక్రమంగా నిర్బంధించిన ఐపీఎస్ అధికారుల పాత్ర నిర్ధారణ కావడంతో వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఒక కేసులో నిందితురాలిగా ఉన్నప్పటికీ, మరొక కేసులో ఆమె హక్కులకు భంగం వాటిల్లినందున ప్రభుత్వం రెండు అంశాలనూ న్యాయబద్ధంగానే డీల్ చేస్తోంది.

 జెత్వానీ నిందితురాలిగా ఉన్న మొదటి కేసులోని ఛార్జ్‌షీట్ అంశాలను మాత్రమే ఆధారంగా చేసుకుని, రెండవ కేసుతో దాన్ని కలగలిపేసి ప్రజలను తప్పుదోవ పట్టించేలా సోషల్ మీడియాలో కుట్రపూరిత కథనాలు అల్లుతున్నారు. ప్రొసీజర్ ప్రకారం ఛార్జ్‌షీట్ వేయడం వేరు, ఆ పేరుతో గతంలో జరిగిన అక్రమ నిర్బంధాలను సమర్థించుకోవడం వేరు అనే నిజాన్ని గ్రహించాలని తెలుగుదేశం పార్టీ చెబుతోంది. రెండు కేసులను నిష్పాక్షికంగా విచారిస్తూ, తప్పు చేసిన వారు ఎవరైనా సరే చట్టం ముందు సమానులే అనే దిశగా ప్రస్తుత యంత్రాంగం పారదర్శకంగా వ్యవహరిస్తోందని అంటున్నారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Vijayawada Woman Arrest: ప్రేమ మత్తుతో దారి తప్పిన యువతి.. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికింది!
ప్రేమ మత్తుతో దారి తప్పిన యువతి.. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికింది!
Unique Mercantile Fraud: అధిక వడ్డీ, భూములు ఆశ చూపి వందల కోట్ల వసూలు.. ప్రజల సొమ్ముతో విలాసాలు.. 'యూనిక్' కంపెనీ ఎండీ రాజ్ కుమార్ అరెస్ట్
అధిక వడ్డీ, భూములు ఆశ చూపి వందల కోట్ల వసూలు.. ప్రజల సొమ్ముతో విలాసాలు
Aurora Venkateswara Swamy Temple Mass Shooting Plot: అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మారణకాండకు కుట్ర - 19 ఏళ్ల శ్వేతజాతి ఉన్మాది అరెస్ట్!
అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మారణకాండకు కుట్ర - 19 ఏళ్ల శ్వేతజాతి ఉన్మాది అరెస్ట్!
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Keerthy Suresh : లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
కొత్త బైక్ కొనేవాళ్లకు అదిరిపోయే అప్‌డేట్.. క్విక్‌షిఫ్టర్, క్రూయిజ్ కంట్రోల్‌తో వచ్చిన Xtreme 250R Carbon
దసరా కానుకగా Hero Xtreme 250R Carbon.. TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో కొత్త బైక్ లాంచ్‌
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Ranabaali Day 1 Collections : రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
Embed widget