అన్వేషించండి

Maruti Suzuki Ertiga EMI Calculator 2026: మారుతి ఎర్టిగా EMI లెక్కలు ఏంటీ? ఎంత శాలరీ ఉంటే కొనుక్కోవచ్చు? హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ప్రైస్ ఎంత?

మధ్యతరగతి కుటుంబాలకు అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి ఎర్టిగా హైదరాబాద్ ఆన్‌రోడ్ ప్రారంభ ధర సుమారు 10.83 లక్షలుగా ఉంది. పది శాతం కనీస డౌన్‌పేమెంట్‌ 1.08 లక్షలు చెల్లించి ఇంటికి తెచ్చుకోవచ్చు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మారుతి ఎర్టిగా 7-సీటర్ MPV కుటుంబాలకు, లాంగ్ డ్రైవ్‌లకు మంచిది.
  • హైదరాబాద్‌లో ఆన్-రోడ్ ధర రూ.10.83 లక్షల నుండి ప్రారంభమవుతుంది.
  • కనీసం 10-20% డౌన్ పేమెంట్ చెల్లించడం ద్వారా కారు కొనవచ్చు.
  • నెలవారీ EMI మీ ఆదాయంలో 15-20% మించకూడదు.

Maruti Suzuki Ertiga EMI Calculator 2026: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో 7 సీటర్‌ MPV సెగ్మెంట్‌లో టాప్‌లో ఉన్న ఏకైక మోడల్ మారుతి సుజుకి ఎర్టిగా. అందుకే ఎక్కువ మంది పెద్ద ఫ్యామిలీలు కలిగి ఉన్న వారంతా దీన్ని ఎంచుకుంటున్నారు. లాంగ్ డ్రైవ్‌లకు, కమర్షియల్, పర్సనల్ వినియోగానికి కూడా వాడుకుంటున్నారు. మంచి స్పేస్‌, మైలేజీ, రీసేల్‌ వ్యాల్యూ ఉండటమే దీనికి కారణం. అయితే హైదరాబాద్‌తోపాటు తెలంగాణలో దీన్ని కొనుగోలు చేయాలి అంటే డౌన్‌పేమెంట్‌ ఎంత చెల్లించాలి? ఏ శాలరీలు ఉన్న వారు కొనుక్కోవచ్చో చూద్దాం. 

హైదరాబాద్‌లో మారుతి ఎర్టిగా ఆన్‌రోడ్‌ ధర ఎంత?

కారు ధర అనగానే చాలా మంది కేవలం ఎక్స్‌షోరూమ్ ధర మాత్రమే చూసి అంచనా వేసుకుంటారు. కానీ కారు రోడ్డుపైకి రావడానికి ఆర్టీవో రోడ్‌ టాక్స్‌, ఇన్సూరెన్స్‌, ఫాస్ట్‌టాగ్‌, టీడీఎస్‌, టీసీఎస్‌ వంటి అదనపు ఛార్జీలు తోడవుతాయి. తెలంగాణలో రోడ్డు పన్నుల నిర్మాణం కారణంగా ఆన్‌రోడ్‌ ధరలలో వ్యత్యాసం ఉంటుంది. 

ప్రస్తుతం హైదరాబాద్‌లో మారుతి ఎర్టిగా ఆన్‌రోడ్‌ ధర సుమారు 10.83 లక్షల నుంచి ప్రారంభమై టాప్ ఎండ్‌ మోడల్‌కు 16.29 లక్షల వరకు ఉంది. 

LXi(O)పెట్రోల్‌ బేస్ వేరియంట్‌ ఎక్స్ షోరూమ్‌ ధర 8,85,000 కాగా ఆర్టీవో ఛార్జీలు 1.52 లక్షలు. ఇన్సూరెన్స్‌ 45,300 కలిపి హైదరాబాద్‌లో ఆన్‌రోడ్‌ ధర సుమారు 10,83,025గా ఉంది. 

మిడ్‌ వేరియంట్‌ VXi(O) పెట్రోల్‌ కారు ఎక్స్‌ షోరూమ్‌ ధర 9,90,300 హైదరాబాద్‌ ఆన్‌ రోడ్‌ ధ సుమారు 12,06,943 రూపాయలు. VXi(O)సీఎన్జీ వేరియంట్‌ ఎక్స్‌ షోరూమ్ ధర 10,86,300 ఉంటే ఇది హైదరాబాద్‌లో ఆన్ రోడ్‌ ప్రైస్‌ 13,68,368 రూపాయలుగా ఉంది. ZXi ప్లస్‌ ఏటీ ఎక్స్‌ షోరూమ్ ర 12,99,100 రూపాయలు అయితే ఇది హైదరాబాద్‌లో ఆన్‌రోడ్‌ ప్రైస్‌ 16,28,703 రూపాయలుగా ఉంది.

ఎంత చేతిలో ఉంటే షోరూమ్‌కు వెళ్లొచ్చు?

సాధారణంగా బ్యాంకులు వాహనం ఆన్‌రోడ్ ప్రైస్ మొత్తానికి లోన్ ఇవ్వరు. వాహనం ధరలో 80 శాతం వరకు మాత్రమే లోన్ ఇస్తారు. మీ సిబిల్ స్కోరు బాగుంటే 90 శాతం వరకు ఇస్తాయి. అందుకే మీరు కనీసం పది శాతం డౌన్‌పేమెంట్ ఉంటే షోరూమ్‌కు వెళ్లి వాహనం కొనుగోలు చేయవచ్చు. మీరు బేసి వేరియంట్‌ ఎర్టిగా LXi(O) తీసుకుంటే 10.83 లక్షలకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇందులో పది శాతం అంటే 1.08,300 రూపాయలు డౌన్‌పేమెంట్‌గా చెల్లించాలి. ప్రాసెసింగ్ ఫీజు, ఎక్స్‌టెండ్‌ వారంటీ, యాక్సెసరీస్‌ కలిపి దాదాపు 1.25 లక్షల నుంచి 1.35 లక్షలు చేతిలో ఉంటే మీరు కారు కొనుక్కోవచ్చు. 

అయితే పది శాతం మీరు చెల్లించినా కారు కొనుక్కోవచ్చు. కానీ ఫైనాన్షియల్‌ ప్లానర్లు మాత్రం 20 శాతం డౌన్‌పేమెంట్‌ చెల్లించాలని సూచిస్తున్నారు. అంటే ఎర్టిగా బేస్ వేరియంట్ కొనుగోలు చేయాలంటే 2,16,000 లేదా మిడ్ వేరియంట్‌ కోసం 2,40,000 రూపాయలు డౌన్‌పేమెంట్ చేల్లించాల్సి ఉంటుంది. 

ఈఎంఐ క్యాలిక్యులేషన్స్‌

ప్రస్తుతం జాతీయ, ప్రైవేటు బ్యాంకులు ఆటో లోన్‌లపై సగటగున 8.5 నుంచి 9.5 శాతం వడ్డీ రేటును వసూలు వస్తున్నాయి. మంచి సిబిల్ స్కోరు ఉన్న వారికి తక్కువ వడ్డీకే లోన్ లభిస్తుంది. పది శాతం డౌన్‌పేమెంట్ చెల్లిస్తే 90 శాతం మొత్తాన్ని 8.5 శాతం వడ్డీ రేటుతో వివిధ కాలపరిమితులకు ఈఎంఐ లెక్కలు ఇలా ఉంటాయి. 

బేస్ వేరియంట్‌ LXi(O) పెట్రోల్‌ వేరియంట్‌ కోసం 9,74,700 అమోంట్‌ను లోన్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఐదేళ్ల టెన్యూర్‌ కోసం తీసుకుంటే ప్రతి నెల 20,030 చెల్లించాల్సి ఉంటుంది. 
ఏడేళ్ల టెన్యూర్‌ కోసం లోన్ తీసుకుంటే నెలకు 15, 450 రూపాయలు చెల్లించాలి. 

ఎర్టిగాలో ఎక్కువగా అమ్ముడుపోయే VXi(O) పెట్రోల్‌ వేరియంట్‌ను కొనుగోలు చేయాలి అంటే 10, 85, 200 రూపాయలు లోన్ ద్వారా లభిస్తుంది. దీన్ని ఐదేళ్ల టెన్యూర్‌కు తీసుకుంటే నెలకు 22,320 రూపాయలు చెల్లించాలి. 7 ఏళ్ల టెన్యూర్‌కు తీసుకుంటే 17, 220 రూపాయలు EMI చెల్లించాలి. 

మంచి డిమాండ్‌ ఉన్న VXi(O)సీఎన్జీ కారు తీసుకుంటే మీకు 12,31,500 రూపాయలు లోన్ వస్తుంది. దీన్ని ఐదేళ్ల టెన్యూర్‌కు తీసుకుంటే నెలకు 25, 300 ఈఎంఐ కట్టాలి. ఏడేళ్లకు తీసుకుంటే ప్రతి నెల 19, 510 రూపాయలు చెల్లించాలి. 

ఎంత శాలరీ వస్తే ఎర్టిగాను కొనుగోలు చేయగలరు?

వ్యక్తిగత ఆర్థిక సూత్రాల ప్రకారం మీ కారు నెలవారీ ఈఎంఐ అనేది మీ నికర నెలవారీ ఆదాయంలో 15 శాతం నుంచి 20 శాతం మించకూడదు. దీని కంటే ఎక్కువైతే నెలవారీ ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, సేవింగ్స్‌ పై తీవ్ర ప్రభావం పడుతుంది. ఐదేళ్ల ప్లాన్ ఎంచుకుంటే  మీరు నెలకు వరకు ఈఎంఐ చెల్లించాలి. అలాంటి సమయంలో మీ నెలవారీ శాలరీ లక్షకు పైబడి ఉండాలి. ఏడేళ్ల టెన్యూర్ ప్లాన్‌లో తీసుకుంటే మీరు నెలకు 15వేలకుపైగా ఈఎంఐ చెల్లించాలి. అప్పుడు మీ దాయం 75వేల కంటే ఎక్కువ ఉండాలి. అప్పుడే మీ సేఫ్ జోన్‌లో ఉంటారు. 
టాప్ మోడల్‌ను తీసుకుంటే నెలకు మీరు పాతిక వేలకుపైగా ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అందుకే మీ ఆదాయం లక్షా 50 వేల వరకు ఉంటేనే మీకు మంచిది. 

కేవలం ఈఎంఐను మాత్రమే మీరు శాలరీలో భాగం చేసుకుంటే దెబ్బతింటారు. దాన్ని రోడ్డుపై తిప్పడానికి అయ్యే ఖర్చు, నిర్వహణ ఖర్చులను కూడా చూసుకోవాలి. ఎర్టిగాలోని 1.5 లీటర్ కే15సీ స్మార్ట్‌ హైబ్రిడ్‌ పెట్రోల్‌ ఇంజిన్ లీటరుకు 20.51 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఇక సీఎన్జీ వేరియంట్ 26 కిలోమీటర్లకు పైగా ఇస్తుంది. రోజుకు 40 కిలోమీటర్లు ప్రయాణించే వారికి పెట్రోల్ వెర్షన్ నెలకు సుమారు ఆరు వేల నుంచి ఏడు వేలు ఖర్చు అవుతుంది. అదే సీఎన్జీ అయితే మూడు వేల నుంచి నాలుగు వేలు ఖర్చు అవుతుంది. 

కొత్త కారు కొనేటప్పుడు కేవలం షోరూమ్ ధరలు, డిస్కౌంట్‌లు చూసి తొందరపడొద్దు. మీ నెలవారీ టేక్‌హోమ్ శాలరీలో 15 శాతం కంటే ఎక్కువ అమౌంట్‌ కార్ ఈఎంఐ రూపంలో వెళ్లకుండా చూసుకోవాలి. 

Frequently Asked Questions

హైదరాబాద్‌లో మారుతి ఎర్టిగా ఆన్‌రోడ్ ధర ఎంత?

హైదరాబాద్‌లో మారుతి ఎర్టిగా ఆన్‌రోడ్ ధర సుమారు 10.83 లక్షల నుంచి 16.29 లక్షల వరకు ఉంటుంది. ఇందులో ఎక్స్‌షోరూమ్ ధరతో పాటు ఆర్టీవో, ఇన్సూరెన్స్ వంటి అదనపు ఛార్జీలు కలుస్తాయి.

ఎర్టిగా కొనుగోలు చేయడానికి కనీసం ఎంత డౌన్‌పేమెంట్ చెల్లించాలి?

బేస్ వేరియంట్ LXi(O) కోసం ఆన్‌రోడ్ ధరలో 10% అనగా 1.08 లక్షలు డౌన్‌పేమెంట్‌గా చెల్లించాలి. అదనపు ఖర్చులతో కలిపి సుమారు 1.25 లక్షల నుంచి 1.35 లక్షలు చేతిలో ఉండాలి.

మారుతి ఎర్టిగా కోసం ఆర్థిక నిపుణులు ఎంత డౌన్‌పేమెంట్ సిఫార్సు చేస్తారు?

ఆర్థిక నిపుణులు కారు ఆన్‌రోడ్ ధరలో కనీసం 20 శాతం డౌన్‌పేమెంట్‌ చెల్లించాలని సూచిస్తున్నారు. బేస్ వేరియంట్‌కు సుమారు 2.16 లక్షలు లేదా మిడ్ వేరియంట్‌కు 2.40 లక్షలు అవసరం.

మారుతి ఎర్టిగా కొనుగోలు చేయడానికి ఎంత నెలవారీ ఆదాయం ఉండాలి?

మీ కారు EMI మీ నికర నెలవారీ ఆదాయంలో 15-20% మించకూడదు. ఐదేళ్ల EMI ప్లాన్‌కు నెలకు 20,030 చెల్లిస్తే, మీ నెలవారీ ఆదాయం లక్షకు పైగా ఉండాలి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

కొత్త కారు కొనాలని చూస్తున్నారా? MG Hectorపై రూ.60,000 వరకు తగ్గింపు, 100 శాతం ఫైనాన్స్ కూడా!
యానివర్సరీ గిఫ్ట్‌ ఇస్తున్న కార్ల కంపెనీ - రూ.60,000 వరకు ఆదా, పూర్తి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా!
మూడు స్క్రీన్ల సెటప్‌తో కొత్త మహీంద్రా BE 07.. త్వరలో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ SUV ఎలా ఉంది?
మహీంద్రా కొత్త కారు BE 07 ఇంటీరియర్‌ ఎలా ఉంటుందో తెలిసిపోయింది - ఫోటోలు లీక్!
E20లో క్లోరైడ్, తేమ నిజంగానే పెరిగాయా? దేశవ్యాప్త తనిఖీల తర్వాత OMCలు ఏం చెప్పాయి?
E20 పెట్రోల్‌ కలుషిత ఇంధనమేనా? దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో ఏం తేలింది?
Ducati Monster V2 vs Triumph Street Triple 765 RS - 111hp vs 130hp.. ధర, పవర్, టార్క్‌లో ఏది బెస్ట్?
ట్రయంఫ్‌ స్ట్రీట్‌ ట్రిపుల్‌ 765 RS vs డుకాటి మాన్‌స్టర్‌ V2 - రేటు రూ.1 లక్ష తక్కువైనా 'పవర్‌'లో అదరగొడుతోంది!
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Embed widget