అన్వేషించండి

Maruti Suzuki Dzire Hyderabad Price: మారుతి సుజుకి డిజైర్ హైదరాబాద్‌లో ఆన్-రోడ్ ప్రైస్! ఈఎమ్‌ఐ, డౌన్‌పేమెంట్ లెక్కలు ఇవే!

హైదరాబాద్‌లో మారుతి సుజుకి డిజైర్ ఆన్-రోడ్ ధరలు రూ. 7.56 లక్షల నుంచి ప్రారంభమై రూ. 11.24 లక్షల వరకు ఉన్నాయి. మీ బడ్జెట్‌కు సరిపోయే వేరియంట్ డౌన్‌పేమెంట్, లోన్ వివరాలు ఇక్కడ చూద్దాం.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మారుతి డిజైర్ అద్భుత మైలేజీ, భద్రత, సన్‌రూఫ్‌తో ప్రాచుర్యం పొందింది.
  • హైదరాబాద్‌లో డిజైర్ ఆన్-రోడ్ ధరలు రూ.7.56 లక్షల నుంచి ప్రారంభం.
  • వివిధ డౌన్‌పేమెంట్‌లపై LXI, VXI మోడళ్లకు EMI వివరాలు అందించబడ్డాయి.

Maruti Suzuki Dzire Hyderabad Price: భారతీయ మిడ్-సైజ్ సెడాన్ మార్కెట్లో తిరుగులేని మోడల్‌గా దూసుకుపోతోంది మారుతి సుజుకి డిజైర్. అద్భుతమైన మైలేజీ, తక్కువ మెయింటెనెన్స్, 5స్టార్ గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్, సెగ్మెంట్-ఫస్ట్ సన్‌రూఫ్ ఫీచర్లతో మధ్యతరగతి కుటుంబాలకు ఫేవరెట్ ఛాయిస్‌గా మారింది. హైదరాబాద్ నగరంలో కొత్త మారుతి సుజుకి డిజైర్ కొనుగోలు చేయాలనే ప్లాన్ ఉంటే ఆన్-రోడ్ ధర ఎంత? డౌన్‌పేమెంట్ ఎంత చెల్లించాలి? బ్యాంకు ఇచ్చే మొత్తంపై ఈఎమ్‌ఐ ఎంత అవుతుందో చూద్దాం.  

హైదరాబాద్‌లో మారుతి సుజుకి డిజైర్ వేరియంట్ల వారీగా ఆన్-రోడ్ ధరలు  

హైదరాబాద్‌లో మారుతి డిజైర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6,25,600 నుంచి ప్రారంభమై, టాప్ వేరియంట్ రూ. 9,36,300 వరకు ఉంది. తెలంగాణ ఆర్టీవో ,లైఫ్ టాక్స్ , ఇన్సూరెన్స్, ఇతర చార్జీలను కలిపిన తర్వాత ఆన్-రోడ్ ధరలు నిర్ణయిస్తారు. 

వేరియంట్   ఇంధనం టైపు   ఎక్స్-షోరూమ్ ధర   హైదరాబాద్ ఆన్-రోడ్ ధర  
Dzire LXI   పెట్రోల్ (Manual)  రూ.6,25,600  రూ.7,56,200 
Dzire VXI  పెట్రోల్ (Manual)  రూ.7,22,100  రూ.8,69,300 
Dzire VXI AMT   పెట్రోల్ (Automatic)  రూ.7,67,100  రూ.9,22,250
Dzire VXI CNG  సిఎన్‌జి (Manual)  రూ.8,10,600   రూ.9,76,440 
Dzire ZXI  పెట్రోల్ (Manual)  రూ.8,22,700  రూ.9,91,000 
Dzire ZXI AMT  పెట్రోల్ (Automatic)  రూ.8,67,700   రూ.10,44,000 
Dzire ZXI Plus  పెట్రోల్ (Manual)   రూ.8,91,300   రూ.10,71,000 
Dzire ZXI CNG  సిఎన్‌జి (Manual)   రూ.9,11,200   రూ.10,95,000 
Dzire ZXI Plus AMT  పెట్రోల్ (Automatic)  రూ.9,36,300  రూ.11,24,000 

బేస్ మోడల్ మారుతి డిజైర్ LXI లోన్ వివరాలు 

చాలా తక్కువ బడ్జెట్‌లో సొంత కారు కల నెరవేర్చుకోవాలనుకునే వారికి LXI వేరియంట్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. దీని ఆన్-రోడ్ ధర సుమారు రూ. 7,56,200గా ఉంది. దీన్ని సులభంగా చెల్లించేందుకు 3 విభిన్న డౌన్‌పేమెంట్ ఆప్షన్ల ప్రకారం ఈఎమ్‌ఐ లెక్కలు ఉన్నాయి. దీనికి వడ్డీ సుమారుగా 9.8%గా ఉంది.  

లక్ష రూపాయల డౌన్‌పేమెంట్‌ చేస్తే ఈఎంఐ

మారుతి డిజైర్ బేసిక్ మోడల్ LXI కొనుగోలు చేయాలనే ఆలోచన చేస్తే లక్ష రూపాయలు డౌన్‌పేమెంట్ మీ చేతిలో ఉంటే ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు. మిగతా మొత్తం రూ. 6,56,200లను లోన్ రూపంలో తీసుకోవచ్చు. దీనికి 9.8శాతం వడ్డీ రేటుత ఐదేళ్ల కాలపరిమితికి లోన్ తీసుకుంటే నెలకు రూ. 13,890  ఈఎంఐ చెల్లించాలి. అదే మొత్తాన్ని 7 సంవత్సరాల కాలపరిమితిి తీసుకుంటే రూ. 10,810 నెల నెల కట్టాలి.  

రెండు లక్షల డౌన్‌పేమెంట్ చేస్తే ఈఎంఐ

ఇదే కారును రెండు లక్షలు డౌన్‌పేమెంట్ చేస్తే మీరు రూ. 5,56,200లను లోన్‌గా తీసుకోవచ్చు. దీనికి నెలకు రూ. 11,770 చెల్లిస్తే ఐదేళ్లలో మీ లోన్ క్లియర్ చేసుకోవచ్చు. అదే 7 సంవత్సరాల కాలపరిమితికి పెట్టుకుంటే నెలకు రూ. 9,160 EMI చెల్లించాలి. 

మోస్ట్ పాపులర్ మోడల్ మారుతి డిజైర్ VXI ఈఎమ్‌ఐ లెక్కలేంటి? 

డిజైర్ మోడల్స్ అన్నింటిలోనూ అత్యధికంగా అమ్ముడయ్యే వేరియంట్ VXI. ఇందులో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, రియర్ ఏసీ వెంట్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి లేటెస్ట్‌ ఫీచర్లు ఉన్నాయి. ఈ మోడల్ హైదరాబాద్ ఆన్-రోడ్ ధర సుమారు రూ.8,69,300. దీన్ని 1,20,000 డౌన్‌పేమెంట్ చేసి కొనుగోలు చేస్తే రూ. 7,49,300 మొత్తాన్ని నెలకు 15,860 రూపాయలు చెల్లిస్తే ఐదేళ్లలో క్లియర్ చేయవచ్చు. అదే ఏడేళ్లలో చెల్లించాలి అంటే రూ. 12,340 రూపాయలు బ్యాంకుకు కట్టాలి. 

రూ. 2,50,000 డౌన్‌పేమెంట్ చేస్తే రూ. 6,19,300ను బ్యాంకు లోన్‌గా తీసుకోవచ్చు. దీని కోసం 5 సంవత్సరాలలో నెలకు రూ. 13,110 కట్టాలి. 7 సంవత్సరాల కాలపరిమితితో తీసుకుంటే రూ. 10,200  తిరిగి చెల్లించాలి.  

సరికొత్త డిజైన్, అప్గ్రేడెడ్ ఫీచర్లు, తిరుగులేని భద్రతా ప్రమాణాలతో వచ్చిన సరికొత్త మారుతి డిజైర్ మీ కుటుంబానికి ఒక సురక్షితమైన, నమ్మకమైన ప్రయాణాన్ని అందిస్తుంది. మీ బడ్జెట్ పరిమితులను బట్టి సరైన డౌన్‌పేమెంట్, రీపేమెంట్ ప్లాన్ ఎంచుకోవచ్చు.  

Frequently Asked Questions

మారుతి సుజుకి డిజైర్ యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి?

అద్భుతమైన మైలేజీ, తక్కువ మెయింటెనెన్స్, 5-స్టార్ గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్, మరియు సెగ్మెంట్-ఫస్ట్ సన్‌రూఫ్ దీని ప్రత్యేకతలు. మధ్యతరగతి కుటుంబాలకు ఇది మంచి ఎంపిక.

హైదరాబాద్‌లో మారుతి సుజుకి డిజైర్ ఆన్-రోడ్ ధర ఎంత నుండి ప్రారంభమవుతుంది?

హైదరాబాద్‌లో మారుతి సుజుకి డిజైర్ ఆన్-రోడ్ ధర Dzire LXI వేరియంట్‌కు రూ. 7,56,200 నుండి ప్రారంభమవుతుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 6,25,600.

మారుతి డిజైర్ ఆన్-రోడ్ ధరను హైదరాబాద్‌లో ఎలా నిర్ణయిస్తారు?

హైదరాబాద్‌లో డిజైర్ ఆన్-రోడ్ ధర ఎక్స్-షోరూమ్ ధరతో పాటు తెలంగాణ ఆర్టీవో, లైఫ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ మరియు ఇతర ఛార్జీలను కలిపి నిర్ణయిస్తారు.

మారుతి డిజైర్ మోడల్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన వేరియంట్ ఏది మరియు దాని ఫీచర్లు ఏమిటి?

డిజైర్ మోడల్స్‌లో VXI అత్యంత ప్రజాదరణ పొందిన వేరియంట్. దీనిలో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, రియర్ ఏసీ వెంట్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Wagon R CNGతో కిలో గ్యాస్‌తో ఎన్ని కిలోమీటర్లు జర్నీ చేయవచ్చు? సిటీ, హైవే మైలేజ్ వివరాలు ఇవిగో
Maruti Wagon R CNG నిజంగా ఎంత మైలేజ్ ఇస్తుంది? రియల్ వరల్డ్ టెస్ట్‌లో వచ్చిన ఫలితం ఇదే!
5,600 కి.మీ. నడిచిన Hero Xpulse 210.. డైలీ జర్నీలో ఈ బండిలో బయటపడిన మైనస్‌లు ఏంటి?
Hero Xpulse 210 రియల్‌ రివ్యూ - 5,600km తిరిగిన ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది?
Bikes Under 10000 Down Payment: పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget