అన్వేషించండి

Maruti S-Presso Price in Hyderabad: హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!

Maruti S-Presso Price in Hyderabad: మారుతి సుజుకి ఎస్‌ప్రెస్సో బడ్జెట్ ధరలో మైక్రో ఎస్‌యూవీ లుక్‌తో వస్తోంది. హైదరాబాద్‌ని దీని ప్రారంభ ఆన్‌రోడ్ ధర 4.21 లక్షల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట‌ 6.31 లక్షల వరకు ఉంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మారుతి ఎస్-ప్రెస్సో బడ్జెట్ కార్లలో ప్రజాదరణ పొందిన మోడల్.
  • హైదరాబాద్‌లో వివిధ వేరియంట్ల ఆన్-రోడ్ ధరలు వివరంగా ఇవ్వబడ్డాయి.
  • శక్తివంతమైన ఇంజిన్, మంచి మైలేజీ, కీలక స్పెసిఫికేషన్లు ఉన్నాయి.
  • సీఎన్జీ మోడల్ రోజువారీ ప్రయాణాలకు చాలా పొదుపు.

Maruti S-Presso Price in Hyderabad: మారుతి సుజుకి ఎస్‌ప్రెస్సో దే ఆటోమొబైల్ రంగంలో బడ్జెట్‌ కార్ల విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఒకటి. మధ్యతరగి కుటుంబాలను టార్గెట్ చేస్తూ తీసుకొచ్చిన మోడల్‌ వారికి మంచి ఎంపికగా మారింది. నగరాల్లో విపరీతంగా పెరుగుతున్న ట్రాఫిక్‌, పార్కింగ్ సమస్యలకు చెక్‌ పెడుతూ ఎస్‌యూవీ తరహా లుక్‌తో విశేషంగా ఆకట్టుకుంటోంది. 

ఆల్టో కంటే తక్కువ ధరకే ఎస్‌ప్రెస్సో లభిస్తుండంతో మోస్ట్ అఫార్డబుల్‌ మేజర్ కార్‌ మోడల్‌గా మారింది. హైదరాబాద్ మార్కెట్‌లో ఈ కారుకు ఉన్న డిమాండ్ , ఇక్కడి ఆన్‌రోడ్ ధరల పూర్తి వివరాలు తెలుసుకుందా. 

కారు కొనుగోలు చేసేటప్పుడు ఎక్స్‌రూమ్‌ ధరతోపాటు రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్‌, ఇతర ఫీజుల కలిసి ఆన్‌రోడ్‌ ధర నిర్ణయమవుతుంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం మారుతి ఎస్‌ప్రెస్సో వేరియంట్ల వారీగా అందాబుటులో ఉన్న ఆన్‌రోడ్ ధర వివరాలు ఇవే. 

వేరియంట్ పేరు   ఇంధన రకం   ట్రాన్స్‌మిషన్   ఆన్-రోడ్ ధర 
S-Presso STD  పెట్రోల్   మాన్యువల్   ₹ 4,21,000 - ₹ 4,25,000
S-Presso LXi  పెట్రోల్   మాన్యువల్   ₹ 4,56,000 - ₹ 4,60,000
S-Presso VXi  పెట్రోల్   మాన్యువల్   ₹ 5,14,000 - ₹ 5,17,000
S-Presso LXi S   సిఎన్‌జి   మాన్యువల్   ₹ 5,51,000 - ₹ 5,54,000
S-Presso VXi (O)AMT  పెట్రోల్  ఆటోమేటిక్   ₹ 5,66,000 - ₹ 5,69,000
S-Presso VXi Plus పెట్రోల్   మాన్యువల్    ₹ 5,72,000 - ₹ 5,74,000
S-Presso VXi S-CNG  సిఎన్‌జి  మాన్యువల్    ₹ 6,15,000 - ₹ 6,16,000
S-Presso VXi Plus (O) AMT పెట్రోల్  ఆటోమేటిక్  ₹ 6,31,000 - ₹ 6,43,000

మారుతి ఎస్‌ప్రెస్సోలోని స్పెసిఫికేన్స్‌ 

ఈ మైక్రో ఎస్‌యూవీ పరిమాణంలో చిన్నదైనప్పటికీ రోడ్లపై దూసుపోవానికి అవసరమైన అన్ని సాంకేతిక హంగులను కలిగి ఉంది. దీని ప్రధాన ఇంజన్, పవర్‌, డైమెన్షన్ వివరాలు ఆకట్టుకునే ఉన్నాయి. 998 cc, 3-సిలిండర్ K10C ఇంజన్‌తో వస్తున్న ఈ కారు గరిష్ట పవర్ పెట్రోల్ మోడ్‌లో 5500 rpm వద్ద 68 bhp,  CNG మోడ్‌లో 56 bhp ఇస్తుంది. గరిష్ట టార్క్ గురించి చూస్తే 3500 rpm వద్ద 91.1 Nm ఇస్తుంది. భారతీయ రోడ్లపై ఉండే స్పీడ్ బ్రేకర్లను సులభంగా అధిగమించేలా గ్రౌండ్ క్లియరెన్స్ 180 mm కలిగి ఉంది. 270 లీటర్ల విశాలమైన లగేజ్ స్పేస్ కలిగి ఉంటుంది. కేవలం 4.5 మీటర్ల టర్నింగ్ రేడియస్  ఉండటం వల్ల చిన్న సందుల్లో కూడా సులువుగా యూ-టర్న్ తీసుకోవచ్చు.

మైలేజ్‌, రన్నింగ్ కాస్ట్‌ 

మారుతి సుజుకి కార్లకు ఉన్న ఇతి పెద్ద బలం వాటి మైలేజ్‌ సామర్థ్యం. ఎస్‌ప్రెస్సో కూడా ఇందుకు మినహాయింపు కాదు. పెట్రోల్, సీఎన్జీ రెండు ఆప్షన్‌లలనూ ఈ కారు మంచి మైలేజీ ఇస్తుంది. పెట్రోల్ ఎఁీ వేరియంట్‌లో లీటరకు సుమారు 24.12 నుంచి  24.76 కిలోమీటర్ల మైలేజ్‌ ఇస్తుందని చెబుతున్నారు. ఇదే ఆటోమేటిక్‌లో లీటర్‌కు 25.3 కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా ఉంది. ఫ్యాక్టరీ ఫిట్టెడ్‌ సీఎన్జీ కిలోకు 32.73 కిలోమీటర్ల మైలేజ్‌ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. 

హైదరాబాద్ లాంటి మెట్రో నగరంలో రోజువారీ ఆఫీస్‌ ప్రయాణాలకు సీఎన్జీ వేరియంట్‌ చాలా పొదుపుగా ఉంటుంది. రోజుకు 50 కిలోమీటర్లు ప్రయాణించే వారికి ఈ కారు తీసుకుంటే రోజుకు 2.20 రూపాయలే ఖర్చు అవుతుంది. ఇది బైక్‌ కాస్ట్‌తో సమానంగా చెబుతున్నారు. 

హైదరాబాద్‌లో ఈఎంఐలో కొనుగోలు చేయాలంటే?

మీరు హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సోను లోన్ ద్వారా కొనుగోలు చేయాలంటే బ్యాంకులు, ఫైనాన్స్‌ క కంపెనీలు మంచి ఆఫర్స్ ఇస్తున్నాయి. అయితే దీన్ని నెలవారీ ఈఎంఐపై కొనుగోలు చేయాలి అంటే దాదాపు 50 వేల వరకు డౌన్‌పేమెంట్‌ చెల్లించి, మిగిలిన మొత్తాన్ని ఐదేళ్ల కాలపరిమితితో 10 శాతం వడ్డీ రేటుకు లోన్ తీసుకుంటే నెలకు 8 నుంచి 10 వేల వరకు ఈఎంఐ చెల్లించాలి. 

 

Frequently Asked Questions

మారుతి ఎస్‌ప్రెస్సో దేనికి ప్రసిద్ధి చెందింది?

ఇది బడ్జెట్ కార్ల విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. మధ్యతరగతి కుటుంబాలకు మంచి ఎంపికగా, SUV తరహా లుక్‌తో ఆకట్టుకుంటుంది.

మారుతి ఎస్‌ప్రెస్సో మైలేజ్ ఎంత?

పెట్రోల్ మోడల్ లీటరుకు 24.12 నుండి 25.3 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. సీఎన్జీ మోడల్ కిలోకు 32.73 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

మారుతి ఎస్‌ప్రెస్సో ఇంజన్ స్పెసిఫికేషన్లు ఏమిటి?

ఈ కారు 998 cc, 3-సిలిండర్ K10C ఇంజన్‌తో వస్తుంది. పెట్రోల్ మోడ్‌లో 68 bhp, CNG మోడ్‌లో 56 bhp గరిష్ట పవర్ ఇస్తుంది.

హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఈఎంఐలో కొనుగోలు చేయవచ్చా?

అవును, సుమారు ₹50,000 డౌన్‌పేమెంట్ చెల్లించి, ఐదేళ్ల కాలపరిమితితో లోన్ తీసుకుంటే నెలకు ₹8,000 నుండి ₹10,000 వరకు ఈఎంఐ చెల్లించాలి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
కొత్త ఎలక్ట్రిక్‌ బైకులు తీసుకురాబోతున్న హీరో - డైలీ యూజ్‌ కోసం, అడ్వెంచర్ల కోసం కూడా!
హీరో ఎలక్ట్రిక్‌ బైకులు త్వరలో రాబోతున్నాయి.. డబ్బులతో రెడీగా ఉండండి
Maruti Victoris S-CNG.. రూ.1 లక్ష ఎక్కువైనా ఎందుకు కొనాలి? మైలేజీతో లెక్క మారిపోతుంది!
మారుతి విక్టోరిస్‌ S-CNG రియల్‌ వరల్డ్‌ రివ్యూ.. మైలేజీ అదిరిపోయింది, మీ డబ్బు ఆదా!
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget