అన్వేషించండి

Maruti Baleno మీకు సరైన కారేనా? కొనే ముందు తెలుసుకోవాల్సిన 2 ప్లస్‌లు & 2 మైనస్‌లు

మారుతి సుజుకి బలెనో కొనాలనుకుంటున్నారా? విశాలమైన క్యాబిన్, సౌకర్యవంతమైన రైడ్ వంటి ప్లస్‌లతో పాటు పరిమిత ఇంజిన్ ఆప్షన్లు, AMT పనితీరు వంటి మైనస్‌లను తెలుసుకుని సరైన నిర్ణయం తీసుకోండి.

Maruti Suzuki Baleno Pros & Cons: దేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లలో మారుతి సుజుకి బలెనో ఒకటి. ఏ నెలలో చూసినా ఇది టాప్‌-10లో చోటు కోల్పోదు. ప్రస్తుతం ఈ కారు రూ.5.99 లక్షల నుంచి రూ.9.17 లక్షల వరకు (ఎక్స్ షోరూమ్ ధర) అందుబాటులో ఉంది. హ్యుందాయ్ ఐ20, టాటా ఆల్ట్రోజ్ & టయోటా గ్లాంజాతో పోటీ పడుతున్న బలెనో నిజంగా మీకు సరిపోతుందా? కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన 2 ప్రధాన ప్లస్ పాయింట్లు & 2 మైనస్ పాయింట్లు ఇవే.

మొదటి ప్లస్ పాయింట్.. బలెనోలోని విశాలమైన క్యాబిన్ పెద్ద ప్లస్‌గా చెప్పుకోవచ్చు. ముందు సీట్లతో పాటు వెనుక సీట్లలో కూడా మంచి స్థలం లభిస్తుంది. కాస్త పొడవైన ప్రయాణికులు కూర్చున్నా ఇబ్బంది అనిపించదు. వెనుక సీట్లలో అండర్ థై సపోర్ట్ & సైడ్ సపోర్ట్ బాగా ఉండటంతో ఎక్కువసేపు ప్రయాణించినా అలసట తక్కువగా ఉంటుంది. ముందు సీట్లు కూడా భుజాలకు మంచి సపోర్ట్ అందిస్తాయి. అలాగే పెద్ద డోర్ పాకెట్లు, మంచి పరిమాణంలో గ్లోవ్‌బాక్స్, సెంటర్ కన్సోల్‌లో కప్ హోల్డర్లు వంటి ఉపయోగకరమైన స్టోరేజ్ స్పేస్‌లు ఉండటం రోజువారీ వినియోగంలో మరింత సౌకర్యాన్ని అందిస్తుంది.

బూట్ స్పేస్ పరంగా కూడా బలెనో నిరాశపరచదు. 318 లీటర్ల బూట్ సామర్థ్యం ఉండటంతో కుటుంబ అవసరాలకు సరిపడా సామాను తీసుకెళ్లవచ్చు. అయితే బూట్ లోడింగ్ లిప్ ఎత్తుగా ఉండటం వల్ల భారీ లగేజ్‌ను లోపల పెట్టడానికి కొంత ఎక్కువ శ్రమ పడాల్సిరావచ్చు.

ఇది కూడా చదవండి: రూ.73,850 నుంచే హీరో విడా VX2 - ఏ వేరియంట్ కొనాలి? ఫీచర్లు, ధరల పూర్తి వివరాలు

రెండో ప్రధాన ప్లస్ పాయింట్.. రైడ్ కంఫర్ట్. నగర రహదారులపై కనిపించే గుంతలు, ఎగుడుదిగుడు రోడ్లను బలెనో సస్పెన్షన్ సమర్థంగా ఎదుర్కొంటుంది. తక్కువ & మధ్యస్థ వేగాల్లో సాఫ్ట్ సస్పెన్షన్ మంచి సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందిస్తుంది. తక్కువ వేగాల్లో స్టీరింగ్ తేలికగా ఉండటంతో ట్రాఫిక్‌లో & ఇరుకైన వీధుల్లో కారును సులభంగా నడపవచ్చు. వేగం పెరిగే కొద్దీ స్టీరింగ్ బరువు పెరిగి మంచి నియంత్రణను అందిస్తుంది. అయితే హైవేపై వెనుక సీట్లో ప్రయాణించే వారికి కొంత పిచ్ & బౌన్స్ అనిపించే అవకాశం ఉంది.

ఇక బలెనోలో ఉన్న ప్రధాన మైనస్‌లలో మొదటిది పరిమిత పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు. ఇందులో 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్ 90 హెచ్‌పీ పవర్ & 113 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఫ్యాక్టరీ ఫిటెడ్ CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. నగరంలో సాధారణ డ్రైవింగ్‌కు ఈ ఇంజిన్ సరిపోతుంది. అయితే మిడ్ రేంజ్‌లో పనితీరు కొంత బలహీనంగా అనిపిస్తుంది. 4,000 ఆర్‌పీఎం తర్వాత మళ్లీ వేగం అందుకుంటుంది. హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్‌లో టర్బో పెట్రోల్ ఇంజిన్ & టాటా ఆల్ట్రోజ్‌లో డీజిల్ ఆప్షన్ లభిస్తుండటంతో బలెనోకు ఇంజిన్ ఎంపికల విషయంలో కొంత వెనుకబాటు కనిపిస్తుంది.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!

రెండో మైనస్... AMT గేర్‌బాక్స్ పనితీరు. 5 స్పీడ్ AMT రెండు పెడల్‌లతో డ్రైవింగ్ సౌకర్యాన్ని అందించినా, గేర్ మార్పులు అంత స్మూత్‌గా ఉండవు. ముఖ్యంగా మొదటి మూడు గేర్‌లను మారుస్తున్నప్పుడు, గేర్‌ మారడంలో స్వల్ప ఆలస్యం కనిపిస్తుంది. దీంతో ఏఎంటీ కార్లకు సాధారణంగా ఉండే హెడ్ నాడ్ ప్రభావం కూడా అనిపిస్తుంది. మాన్యువల్ మోడ్ ఉన్నప్పటికీ గేర్ మార్పుల్లో స్వల్ప ఆలస్యం ఉంటుంది. సిటీలో డైలీ డ్రైవింగ్‌కు ఇది సరిపోతుంది. అయితే స్మూత్ ఆటోమేటిక్ డ్రైవింగ్ కోరుకునే వారికి ఈ గేర్‌బాక్స్ పూర్తిగా సంతృప్తిని ఇవ్వకపోవచ్చు.

మొత్తంగా చూస్తే, విశాలమైన క్యాబిన్, మంచి రైడ్ కంఫర్ట్ కోరుకునే వారికి మారుతి సుజుకి బలెనో మంచి ఎంపికగా నిలుస్తుంది. అయితే ఎక్కువ ఇంజిన్ ఎంపికలు లేదా మరింత మెరుగైన ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పనితీరు ఆశించేవాళ్లు ఇతర ప్రత్యర్థి మోడళ్లను కూడా పరిశీలించడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Supreme Court On Vehicle Insurance:బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
Ethanol EV Charger: ఈవీ ఛార్జింగ్‌లో కొత్త విప్లవం.. తెలంగాణలో ఇథనాల్ ఆధారిత ఛార్జర్ ప్రారంభం!
ఈవీ ఛార్జింగ్‌లో కొత్త విప్లవం.. తెలంగాణలో ఇథనాల్ ఆధారిత ఛార్జర్ ప్రారంభం!
ఫుల్ ఛార్జ్‌పై 421 కి.మీ రేంజ్.. Tata Punch EVపై రూ.1.45 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్
ఫుల్ ఛార్జ్‌పై 421 కి.మీ రేంజ్.. Tata Punch EVపై రూ.1.45 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్
Tata Curvv EVలో ప్లస్‌ పాయింట్లతో పాటు కొన్ని మైనస్‌లు కూడా ఉన్నాయి! కొనే ముందు ఓసారి ఆలోచించండి
Tata Curvv EV కొనడం తెలివైన పనేనా? ఈ కారులో ప్లస్‌లు, మైనస్‌లు ఏంటి?
Advertisement

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
The Story of Vizag Old Airport : విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ -
విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ - "INS డేగ" ఇక జ్ఞాపకమేనా !!
Supreme Court On Vehicle Insurance:బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
Embed widget