అన్వేషించండి

ట్రాఫిక్ చలాన్ పేరుతో కొత్త సైబర్ మోసం - కేంద్రం హెచ్చరిక, ఇలా జాగ్రత్తపడండి

వాట్సాప్‌ & SMS ద్వారా వస్తున్న ఫేక్ ట్రాఫిక్ చలాన్ మెసేజ్‌లపై PIB హెచ్చరించింది. అసలు చలాన్‌ను ఎలా చెక్ చేయాలో ఈ కథనంలో తెలుసుకోండి.

Fake Traffic Challan: ట్రాఫిక్ చలాన్ పేరుతో వాట్సాప్‌, SMS ద్వారా వస్తున్న నకిలీ మెసేజ్‌లపై కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. ఫేక్ ట్రాఫిక్ చలాన్ లింక్‌లపై క్లిక్ చేస్తే మొబైల్‌లో మాల్వేర్ ఇన్‌స్టాల్ కావడమే కాకుండా వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉందని 'ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో' (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం వెల్లడించింది.

ట్రాఫిక్ చలాన్ బకాయి ఉందని, వెంటనే చెల్లించాలని ఒత్తిడి చేసే నకిలీ మెసేజ్‌లు ఇటీవల భారీగా పెరుగుతున్నాయని PIB తెలిపింది. ఇవి అధికారిక ఈ చలాన్ నోటిఫికేషన్‌ల మాదిరిగానే కనిపిస్తుండటంతో చాలామంది నిజమని భావించి మోసపోతున్నారని హెచ్చరించింది.

సైబర్ నేరగాళ్లు పంపుతున్న ఈ మెసేజ్‌లలో ట్రాఫిక్ జరిమానా పెండింగ్‌లో ఉందని పేర్కొంటూ, వెంటనే చెల్లించాలని సూచిస్తారు. ఇందుకోసం లింక్‌లు, APK ఫైళ్లు లేదా PDF అటాచ్‌మెంట్‌లు పంపిస్తారు. ఇవి అధికారిక ఫైళ్ల మాదిరిగానే కనిపించినప్పటికీ వాస్తవానికి హానికరమైన ఫైళ్లు.

ఇది కూడా చదవండి: సెకండ్‌హ్యాండ్ మహీంద్రా XUV 3XO కొనవచ్చా? కారులో ఈ లోపాలు కనిపిస్తున్నాయేమో ముందు చెక్‌ చేయండి

ప్రజలు ఆ లింక్‌లపై క్లిక్ చేయడం లేదా APK ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేయడం, PDFను ఓపెన్ చేయడం వంటివి చేయగానే సైబర్ నేరగాళ్లు ఆ మొబైల్‌పై నియంత్రణ సాధించే ప్రమాదం ఉంటుంది. దీంతో వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లు & ఇతర సున్నితమైన డేటా మొత్తం కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఫైనల్‌గా, బ్యాంక్‌ ఖాతాల్లో డబ్బు ఖాళీ అవుతుంది.

అధికారిక ప్రభుత్వ సందేశాల మాదిరిగానే ఈ నకిలీ మెసేజ్‌లు పంపుతుండేసరికి, నిజమైన ట్రాఫిక్ చలాన్ & నకిలీ మెసేజ్ మధ్య తేడాను గుర్తించడం చాలామందికి కష్టమవుతోందని PIB పేర్కొంది. 

ట్రాఫిక్ చలాన్ నిజంగా పెండింగ్‌లో ఉందో లేదో తెలుసుకోవాలంటే WhatsApp లేదా SMSలో వచ్చిన లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని సూచించింది. అధికారిక ఈ చలాన్ పోర్టల్ ద్వారా మాత్రమే వివరాలను ధృవీకరించుకోవాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ సేవలకు సంబంధించిన సమాచారం కోసం ఎప్పుడూ అధికారిక వెబ్‌సైట్‌లనే ఉపయోగించాలని సూచించింది.

ఇది కూడా చదవండి: కొత్త బర్గ్‌మన్ స్ట్రీట్ 125 రివ్యూ - స్టైలిష్ లుక్‌, 56 కిలోమీటర్లకు పైగా మైలేజ్‌, కానీ ఈ లోపాలు కూడా ఉన్నాయి!

ప్రజలు సైబర్ మోసాల బారిన పడకుండా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. 
మీకు తెలియని లేదా అనుమానాస్పద నంబర్ల నుంచి వచ్చిన లింక్‌లను క్లిక్ చేయకూడదు. 
అనుమానాస్పద మెసేజ్‌లలో వచ్చే APK ఫైళ్లు లేదా PDFలను డౌన్‌లోడ్ చేయకూడదు. 
ట్రాఫిక్ చలాన్ వివరాలను అధికారిక ఈ చలాన్ పోర్టల్‌లో మాత్రమే పరిశీలించాలి. 
మొబైల్ యాప్‌లను కేవలం అధికారిక App Store లేదా Play Store నుంచే డౌన్‌లోడ్ చేయాలి. 
వెంటనే చెల్లించాలంటూ ఒత్తిడి చేసే మెసేజ్‌లను కచ్చితంగా అనుమానించాల్సిందే.

ఒకవేళ ఇప్పటికే నకిలీ లింక్‌పై క్లిక్ చేసి ఉంటే లేదా వ్యక్తిగత సమాచారం పంచుకుని ఉంటే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని కేంద్రం తెలిపింది. అలాగే 1930 జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు వెంటనే కాల్ చేయాలని సూచించింది. త్వరగా ఫిర్యాదు చేస్తే ఆర్థిక నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని పేర్కొంది.

ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకూ కొత్త రూపాల్లో పెరుగుతున్న నేపథ్యంలో, ఎలాంటి సందేశమైనా వెంటనే నమ్మకుండా, ముందుగా అధికారిక ప్రభుత్వ వేదికల ద్వారా ధృవీకరించుకోవాలి. తద్వారా వ్యక్తిగత సమాచారం & బ్యాంకింగ్ వివరాలను సురక్షితంగా కాపాడుకోవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ ODI Series: కివీస్ టీమ్‌లో బిగ్ సర్ప్రైజ్... ఇండియాతో వ‌న్డే సిరీస్ కు జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌.. ప్రతీకారానికి గిల్ సేన రెడీ!
కివీస్ టీమ్‌లో బిగ్ సర్ప్రైజ్... ఇండియాతో వ‌న్డే సిరీస్ కు జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌.. ప్రతీకారానికి గిల్ సేన రెడీ!
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
CJP Protests: ఢిల్లీలో నిరసనకారుల నిర్బంధాలపై ఐరాస ఆందోళన.. జోక్యం అనవసరం అంటూ భారత్ కౌంటర్!
ఢిల్లీలో నిరసనకారుల నిర్బంధాలపై ఐరాస ఆందోళన.. జోక్యం అనవసరం అంటూ భారత్ కౌంటర్!
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Court Room Drama OTT : గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
Sweets With Alcohol : మందు తాగేటప్పుడు స్వీట్లు తినకూడదా? అసలు కారణాలు ఇవే
మందు తాగేటప్పుడు స్వీట్లు తినకూడదా? అసలు కారణాలు ఇవే
Solar Storm: నేడు భూమిని తాకనున్న పవర్‌ఫుల్ సౌర తుఫాను.. G2 హెచ్చరిక జారీ చేసిన నోవా
నేడు భూమిని తాకనున్న పవర్‌ఫుల్ సౌర తుఫాను.. G2 హెచ్చరిక జారీ చేసిన నోవా
Embed widget