అన్వేషించండి

కొత్త బర్గ్‌మన్ స్ట్రీట్ 125 రివ్యూ - స్టైలిష్ లుక్‌, 56 కిలోమీటర్లకు పైగా మైలేజ్‌, కానీ ఈ లోపాలు కూడా ఉన్నాయి!

2026 సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ 125 కొత్త డిజైన్‌, TFT డిస్‌ప్లే, కీలెస్ ఇగ్నిషన్‌, 56.6 kmpl వరకు మైలేజ్‌తో ఆకట్టుకుంటోంది. ధర, ఫీచర్లు, పనితీరు, రైడ్ అనుభవం & లోపాలపై పూర్తి వివరాలు తెలుసుకోండి.

2026 Suzuki Burgman Street Price And Features: భారత మార్కెట్‌లో స్టైలిష్ మ్యాక్సీ స్కూటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ 125ను ఎనిమిదేళ్ల తర్వాత భారీ అప్‌డేట్‌తో ఇటీవల లాంచ్‌ చేశారు. కొత్త డిజైన్‌, మరిన్ని ఫీచర్లు, మెరుగైన ప్రాక్టికాలిటీతో 2026 బర్గ్‌మన్ స్ట్రీట్ ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా మారింది. నగర ప్రయాణాలకు స్టైల్‌తో పాటు మంచి మైలేజ్ కోరుకునే వారికి ఈ స్కూటర్ మరోసారి బలమైన ఎంపికగా నిలుస్తోంది.

అప్‌డేటెడ్‌ బర్గ్‌మన్ స్ట్రీట్‌లో మొదట కనిపించే మార్పు డిజైన్‌. గత మోడల్‌తో పోలిస్తే మరింత షార్ప్ లైన్స్‌తో ప్రీమియం లుక్‌ను అందించారు. కొత్త హెడ్‌ల్యాంప్ ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా నగర ప్రయాణాల్లో మంచి వెలుతురు ఇస్తుంది. వెనుక భాగంలో కొత్త టెయిల్ ల్యాంప్ డిజైన్‌ను అందించారు. బయట నుంచి ఇంధనం నింపుకునే ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్‌ను ఏర్పాటు చేయడంతో యూజర్లకు మరింత సౌకర్యంగా మారింది. అయితే ఇంధన ట్యాంక్ సామర్థ్యం మాత్రం 5.5 లీటర్లుగానే ఉంది.

ఫీచర్ల పరంగా కూడా బర్గ్‌మన్ స్ట్రీట్ మరింత మెరుగైంది. అన్ని వేరియంట్లలో ఇప్పుడు 12 అంగుళాల వెనుక చక్రం అందిస్తున్నారు. అండర్‌సీట్ స్టోరేజ్ సామర్థ్యాన్ని 24.6 లీటర్లకు పెంచారు. రెండు ఫుల్‌సైజ్ స్మార్ట్‌ఫోన్‌లను ఉంచేంత పెద్ద ఫ్రంట్ స్టోరేజ్ బాక్స్‌తో పాటు USB ఛార్జింగ్ పోర్ట్ కూడా అందుబాటులో ఉంది.

టాప్ వేరియంట్‌లో కీలెస్ ఇగ్నిషన్‌, కలర్ TFT డిస్‌ప్లే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇందులో Bluetooth కనెక్టివిటీ, నావిగేషన్‌, కాల్ & మెసేజ్ అలర్ట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే బేస్ వేరియంట్‌లో సాధారణ LCD డిస్‌ప్లే & మెకానికల్ కీ మాత్రమే ఉంటాయి. ఈ రెండు వేరియంట్ల మధ్య సుమారు రూ.12 వేల ధర తేడా ఉంది.

ఇది కూడా చదవండి: 10,000 డౌన్ పేమెంట్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350ని పొందవచ్చా? EMI లెక్కలు ఇవే!

నిరాశపరిచే విషయాలు
అయితే, కొన్ని అంశాల్లో సుజుకి నిరాశపరిచింది. సైలెంట్ స్టార్ట్‌, ఆటో స్టార్ట్/స్టాప్ వంటి ఫీచర్లు కొత్త మోడల్‌లో కాకుండా పాత ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఉన్న EX వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అలాగే ఒక్క వేరియంట్‌లో కూడా సింగిల్ ఛానల్ ABS ఇవ్వకపోవడం ప్రధాన లోపంగా చెప్పొచ్చు.

ఇంజిన్ విషయానికి వస్తే, 124సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌లో చిన్న మార్పులు చేసినప్పటికీ రైడింగ్ అనుభవం మరింత మెరుగైంది. గరిష్ఠ శక్తిని తక్కువ RPM వద్దే అందేలా ట్యూనింగ్ చేశారు. ఫ్రేమ్ బరువును అరకిలో వరకు తగ్గించడంతో పాటు దృఢత్వాన్ని కూడా పెంచారు.

పనితీరు పరంగా ఈ స్కూటర్ 0 నుంచి 40 kmph వేగాన్ని 3.76 సెకన్లలో, 0 నుంచి 60 kmphను 8.17 సెకన్లలో అందుకుంది. 0 నుంచి 80 kmph చేరుకోవడానికి 16.40 సెకన్లు పట్టింది. బ్రేకింగ్ పనితీరు కూడా సంతృప్తికరంగానే ఉంది.

ఇది కూడా చదవండి: ఆడవాళ్లు కాళ్లను సులభంగా నేలపై ఉంచగల టూవీలర్లు - తక్కువ సీట్ హైట్‌ ఉన్న 10 ఎలక్ట్రిక్ స్కూటర్లు

మైలేజ్ అంశం బర్గ్‌మన్ స్ట్రీట్‌కు ప్రధాన బలంగా చెప్పొచ్చు. రియల్‌ వరల్డ్‌ టెస్ట్‌లో, నగరంలో లీటర్‌కు 50.1 కిలోమీటర్లు, హైవేపై 56.6 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చింది. సాఫీగా నడిపితే 53 kmpl కంటే ఎక్కువ మైలేజ్ కూడా వచ్చే అవకాశం ఉందని పరీక్షల్లో తేలింది. తక్కువ థ్రాటిల్‌తోనే వేగంగా ముందుకు దూసుకెళ్లే సామర్థ్యం ఈ ఇంజిన్ ప్రత్యేకత.

రైడ్ నాణ్యత పరంగా ప్రారంభంలో సస్పెన్షన్ కొద్దిగా గట్టిగా అనిపించినా పెద్ద గుంతలు & ఎత్తుపల్లాలను చాలా సమర్థంగా అధిగమిస్తుంది. 12 అంగుళాల వెనుక చక్రం వల్ల హైవేపై కూడా మంచి స్థిరత్వం లభిస్తుంది. 775 మిల్లీమీటర్ల సీటు ఎత్తు కారణంగా చాలా మంది రైడర్లు సులభంగా రెండు కాళ్లను నేలపై ఉంచగలుగుతారు. అయితే పొడవైన రైడర్లకు ఎక్కువ దూరం ప్రయాణించే సమయంలో కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది.

ఆన్‌రోడ్‌ ధర
2026 సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.02 లక్షల నుంచి రూ.1.13 లక్షల వరకు ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌రోడ్ ధర సుమారు రూ.1.19 లక్షల నుంచి రూ.1.32 లక్షల వరకు ఉంది.

మొత్తంగా చూస్తే, గత మోడల్‌లో ఉన్న బలాలను కొనసాగిస్తూనే లేటెస్ట్‌ డిజైన్‌, ఫీచర్లు, ప్రాక్టికాలిటీలో 2026 సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ 125 మరింత మెరుగైంది. ABS లేకపోవడం & వేరియంట్‌ల మధ్య ఫీచర్ల పంపిణీ కొంత గందరగోళంగా ఉన్నప్పటికీ, స్టైలిష్ లుక్‌, అద్భుతమైన రిఫైన్‌మెంట్‌, మంచి మైలేజ్‌, నమ్మకమైన పనితీరుతో 125సీసీ స్కూటర్ కొనాలనుకునే వారికి ఇది ఇప్పటికీ అత్యుత్తమ ఎంపికల్లో ఒకటిగా నిలుస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tata Curvv EVలో ప్లస్‌ పాయింట్లతో పాటు కొన్ని మైనస్‌లు కూడా ఉన్నాయి! కొనే ముందు ఓసారి ఆలోచించండి
Tata Curvv EV కొనడం తెలివైన పనేనా? ఈ కారులో ప్లస్‌లు, మైనస్‌లు ఏంటి?
రికార్డు సృష్టించిన TVS - వెనుకబడిన Ola.. ఎలక్ట్రిక్‌ స్కూటర్ల అమ్మకాల్లో టాప్ 10 కంపెనీలు ఇవే!
గత నెల రోజుల్లో మిడిల్‌క్లాస్‌ వాళ్లు ఎక్కువగా కొన్న ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే
కొత్త ఎలక్ట్రిక్‌ కారు కొనబోతున్నారా? Tata EVల్లో చాలా మోడళ్లపై కచ్చితమైన బెనిఫిట్స్‌!, ఈ నెల మాత్రమే
గుడ్‌న్యూస్‌ బాసూ! టాటా EVలపై భారీ ఆఫర్లు.. కర్వ్‌ కొంటే ఏకంగా రూ.3.35 లక్షల బెనిఫిట్!
మీ కారు పక్కనున్న వాహనాలతో మాట్లాడుతుంది.. V2V టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్!
మీరు బ్రేక్ వేయకముందే మీ కారు అలర్ట్.. భారత్‌లోకి వస్తున్న V2V సేఫ్టీ సిస్టమ్ ఇదే!
Advertisement

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Embed widget