అన్వేషించండి

187km రేంజ్‌తో కొత్త Vida VX2 Plus లాంచ్‌ - ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో ఆన్‌రోడ్ ధర వివరాలు ఇవే!

హీరో Vida VX2 Plus కొత్త 4.4kWh బ్యాటరీ వేరియంట్‌ను రూ.1.44 లక్షల ఎక్స్‌షోరూమ్ ధరకు విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అంచనా ఆన్‌రోడ్ ధర వివరాలు తెలుసుకోండి.

Vida VX2 Plus 4.4 kWh Price And Features: దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో హీరో విడా మరో కొత్త వేరియంట్‌ను పరిచయం చేసింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న VX2 Plus 3.4kWh వేరియంట్‌కు తోడుగా ఇప్పుడు 4.4kWh బ్యాటరీతో కొత్త Vida VX2 Plusను విడుదల చేసింది. ఎక్కువ రేంజ్ కోరుకునేవాళ్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ స్కూటర్ ఎక్స్‌షోరూమ్ ధరను రూ.1.44 లక్షలుగా నిర్ణయించింది.

కొత్త Vida VX2 Plusలో రెండు తొలగించగలిగే 2.2kWh బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. మొత్తం బ్యాటరీ సామర్థ్యం 4.4kWh. ఇదే మోడల్‌లో ఇప్పటికే విక్రయిస్తున్న 3.4kWh వేరియంట్ 146 కిలోమీటర్ల IDC రేంజ్ అందిస్తుండగా, కొత్త వేరియంట్ 187 కిలోమీటర్ల IDC రేంజ్ అందిస్తుందని కంపెనీ ప్రకటించింది. అంటే వాస్తవ వినియోగంలో కూడా దాదాపు 190 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశముంది. ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

65 నిమిషాల్లో ఛార్జింగ్‌
ఛార్జింగ్ విషయంలో కూడా హీరో అప్‌డేట్స్‌ చేసింది. కొత్త మోడల్‌తో 1kW పోర్టబుల్ ఛార్జర్‌ను అందిస్తోంది. దీని ద్వారా బ్యాటరీని 0 నుంచి 80 శాతం వరకు 3 గంటల 17 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. పూర్తి ఛార్జ్ కావడానికి 5 గంటల 8 నిమిషాలు పడుతుంది. DC ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉపయోగిస్తే 0 నుంచి 80 శాతం వరకు కేవలం 65 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. పూర్తి ఛార్జ్ కావడానికి సుమారు 2 గంటల 30 నిమిషాలు మాత్రమే అవసరం. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 6,000కు పైగా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయని హీరో విడా తెలిపింది.

ఇది కూడా చదవండి: రాయల్ ఎన్‌ఫీల్డ్ లైట్‌వింగ్ హెల్మెట్ రివ్యూ - స్టైల్, సేఫ్టీ, కంఫర్ట్ ఎలా ఉన్నాయి?

కొత్త బ్యాటరీ వేరియంట్‌లో కూడా 6kW ఎలక్ట్రిక్ మోటార్ కొనసాగుతోంది. ఇది 26Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గరిష్ఠ వేగం గంటకు 90 కిలోమీటర్లుగా కంపెనీ వెల్లడించింది. Eco, Ride & Sport అనే మూడు రైడింగ్ మోడ్‌లతో పాటు అవసరమైన సమయంలో అదనపు శక్తిని అందించే Boost ఫంక్షన్ కూడా ఇందులో ఉంది. 4.3 అంగుళాల TFT డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ & టర్న్ బై టర్న్ నావిగేషన్ వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఇందులో లభిస్తాయి.

ఆన్‌రోడ్ ధర
కొత్త Vida VX2 Plus 4.4kWh వేరియంట్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.44 లక్షలు. అన్ని అవసరమైన ఖర్చులు కలిపి ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో ఈ స్కూటర్ ఆన్‌రోడ్ ధర రూ.1.58 లక్షల నుంచి రూ.1.66 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. నగరం, స్థానిక పన్నులు & డీలర్ ఛార్జీల ఆధారంగా ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు.

ఇది కూడా చదవండి: సీరియస్‌ రైడర్లకు బెస్ట్ బడ్జెట్ ఆప్షన్‌! రైడా రోవర్ రైడింగ్ ప్యాంట్స్ పూర్తి రివ్యూ

హీరో విడా తెలిపిన వివరాల ప్రకారం కొత్త Vida VX2 Plus 4.4kWh వేరియంట్ ఈ నెల (2026 జులై) చివరి నాటికి దేశవ్యాప్తంగా అధికారిక డీలర్‌షిప్‌లలో విక్రయాలకు అందుబాటులోకి వస్తుంది. ఇదే వేరియంట్‌తో దేశవ్యాప్తంగా 52 రోజుల్లో నిరంతరంగా 12,111 కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేసి "ఎలక్ట్రిక్ స్కూటర్‌తో అత్యంత సుదీర్ఘ ప్రయాణం" విభాగంలో Asia Book of Recordsలో స్థానం సంపాదించినట్లు కంపెనీ ప్రకటించింది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

2026 Toyota Glanza Faceliftలో అదిరిపోయే ఫీచర్లు.. కానీ ఈ 3 విషయాల్లో నిరాశ తప్పదు!
కొత్త టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌లో 4 ప్లస్ పాయింట్లు, 3 మైనస్‌లు
2026 Toyota Glanza Facelift లుక్‌ అదిరిపోయింది.. కొత్త ఇంజిన్, ADAS ఫీచర్లు, CNG ఆటోమేటిక్ కూడా!
2026 టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌ లాంచ్‌.. ధర రూ.6.99 లక్షలే! కేవలం రూ.11,000తో బుక్‌ చేసుకోవచ్చు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
Royal Enfield Guerrilla 450 - Triumph Tracker 400 మధ్య పోటీ.. ఏ బండి ముందుగా 100 కి.మీ. వేగాన్ని అందుకుంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 vs ట్రయంఫ్ ట్రాకర్ 400.. వేగంలో ఏది కింగ్? రియల్‌ టెస్ట్‌లో తేలిన నిజాలివే!

వీడియోలు

Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
1000-Year History of Bathukamma | వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ.. ఎప్పుడు, ఎలా మొదలైంది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
High Court On Tuni Missing Case: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
Polavaram Project: పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణులు సంతృప్తి.. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణంపై ఆరా!
పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణులు సంతృప్తి.. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణంపై ఆరా!
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
IND VS WI Series Alive Drama: విండీస్ విశ్వరూపం.. పోరాడి ఓడిన భారత్, ఆక‌ట్టుకున్న సంజూ, తిల‌క్, నితీశ్, హోప్ మెరుపు శతకం, పాల్ పాంచ్ ప‌టాకా,  సిరీస్ సమం
విండీస్ విశ్వరూపం.. పోరాడి ఓడిన భారత్, ఆక‌ట్టుకున్న సంజూ, తిల‌క్, నితీశ్, హోప్ మెరుపు శతకం, పాల్ పాంచ్ ప‌టాకా,  సిరీస్ సమం
Modi Cabinet Expansion: కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ హఠాత్ రాజీనామా - మోదీ కేబినెట్ విస్తరణకు వేళాయెనా?
కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ హఠాత్ రాజీనామా - మోదీ కేబినెట్ విస్తరణకు వేళాయెనా?
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
Embed widget