అన్వేషించండి

సీరియస్‌ రైడర్లకు బెస్ట్ బడ్జెట్ ఆప్షన్‌! రైడా రోవర్ రైడింగ్ ప్యాంట్స్ పూర్తి రివ్యూ

Raida Rover Riding Pants మంచి రక్షణ, సౌకర్యం, థర్మల్ & రెయిన్ లైనర్లతో ఆకట్టుకుంటున్నాయి. రోజువారీ ప్రయాణాలు, టూరింగ్ & ఆఫ్ రోడ్ రైడింగ్‌కు ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయో తెలుసుకోండి.

Raida Rover Riding Pants Review: భారత్‌లో బైక్ టూరింగ్ సంస్కృతి వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో నాణ్యమైన రైడింగ్ గేర్‌కు డిమాండ్ కూడా పెరుగుతోంది. భద్రతతో పాటు సౌకర్యం, ఎక్కువ స్టోరేజ్, అన్ని వాతావరణ పరిస్థితులకు సరిపోయే ఫీచర్లు ఉండే రైడింగ్ ప్యాంట్స్ కోసం చూస్తున్న వారికి Raida Rover Riding Pants ఆకర్షణీయమైన ఎంపికగా కనిపిస్తున్నాయి. 

9 సైజులు

Raida Rover Riding Pants మొత్తం తొమ్మిది సైజుల్లో, XS నుంచి 5XL వరకు అందుబాటులో ఉన్నాయి. రిలాక్స్‌డ్ ఫిట్‌తో రూపొందించిన ఈ ప్యాంట్స్ ఎక్కువసేపు ప్రయాణించినా సౌకర్యవంతంగా ఉంటాయి. నడుము భాగం, కాలి కండరాల పైన & చీలమండల వద్ద ఉన్న వెల్క్రో అడ్జస్ట్‌మెంట్ స్ట్రాప్‌ల ద్వారా అవసరానికి అనుగుణంగా ఫిట్‌ను సులభంగా మార్చుకోవచ్చు.

భద్రత విషయంలో కూడా Raida మంచి శ్రద్ధ తీసుకుంది. మోకాళ్లు & నడుము భాగానికి CE Level 2 ప్రొటెక్టర్లు అందించింది. అదనంగా టెయిల్‌బోన్ భాగానికి సాఫ్ట్ ఫోమ్ ప్యాడ్‌ను కూడా ఇచ్చింది. ఇది పూర్తి స్థాయి CE ప్రొటెక్టర్ కాకపోయినా, ఈ ధరలో అదనపు రక్షణ లభించడం ప్లస్ పాయింట్‌గా చెప్పొచ్చు.

ఇది కూడా చదవండి: పాత వాహనాల ఓనర్లకు షాక్‌ - ప్యూర్ పెట్రోల్‌, E10 ఆప్షన్లు లేవు, E20 మాత్రమే ఉంటుందన్న కేంద్రం

ఈ ప్యాంట్స్‌తో పాటు అదనపు ఛార్జీ లేకుండా థర్మల్ లైనర్ & రెయిన్ లైనర్ కూడా లభిస్తాయి. చలికాలంలో థర్మల్ లైనర్, వర్షాకాలంలో రెయిన్ లైనర్ ఉపయోగపడతాయి. 600D పాలియురేతేన్ కోటెడ్ పాలిస్టర్ ఫ్యాబ్రిక్‌తో తయారు చేసిన ఈ ప్యాంట్స్‌లో తొడలు & కాలి ముందు భాగంలో మెష్ ప్యానెల్స్ ఉండటం వల్ల గాలి ప్రసరణ బాగా జరుగుతుంది. వేడి & తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా ఇవి సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తాయి.

డైలీ యూజ్‌కు కూడా...

రోజువారీ వినియోగంలో కూడా ఈ ప్యాంట్స్ మంచి ప్రయోజనం అందిస్తాయి. మోకాళ్ల పైన & నడుము వెనుక భాగంలో ఇచ్చిన అకార్డియన్ స్ట్రెచ్ ప్యానెల్స్ వల్ల కూర్చోవడం, నిలబడడం & ఎక్కువసేపు రైడ్ చేయడం సులభంగా ఉంటుంది. స్పోర్ట్స్ బైక్స్, అడ్వెంచర్ బైక్స్, క్రూయిజర్స్ మాత్రమే కాకుండా స్కూటర్లపై ప్రయాణించినా ఇవి సౌకర్యంగా ఉంటాయి.

ఇది కూడా చదవండి: బైక్ నడిపేవారు హెల్మెట్‌ పెట్టుకునేటప్పుడ్డు జాగ్రత్త! ఈ పొరపాట్లు చేస్తే చలాన్ ఖాయం!

స్టోరేజ్ విషయంలో కూడా Raida Rover ఆకట్టుకుంటుంది. వాటర్‌ప్రూఫ్ జిప్ పాకెట్లతో పాటు తొడల వద్ద పెద్ద కార్గో పాకెట్లు ఉన్నాయి. మొబైల్ ఫోన్, పర్స్, వాలెట్, తాళాలు వంటి వస్తువులను సురక్షితంగా ఉంచుకోవచ్చు. నగర ప్రయాణాలు, హైవే టూర్స్ & ఆఫ్ రోడ్ రైడింగ్‌లో కూడా ఈ పాకెట్లు ఎంతో ఉపయోగపడతాయి. జిప్పర్ల నాణ్యత కూడా బలంగా ఉండటం మరో ప్రత్యేకత.

అయితే కొన్ని చిన్న లోపాలు కూడా ఉన్నాయి. మోకాళ్లకు ఇచ్చిన ప్రొటెక్టర్ల కవరేజ్ కొంత తక్కువగా ఉండటం వల్ల ఖరీదైన మోడళ్లతో పోలిస్తే రక్షణ పరిధి తగ్గినట్లు అనిపించవచ్చు. అలాగే రిలాక్స్‌డ్ ఫిట్ కారణంగా వెల్క్రో స్ట్రాప్‌లను సరిగా బిగించకపోతే మోకాళ్ల ప్రొటెక్టర్లు స్థానాన్ని మార్చే అవకాశం ఉంటుంది. మరోవైపు 600D టెక్స్‌టైల్ ఫ్యాబ్రిక్ సాధారణ టూరింగ్‌కు సరిపోతున్నా, ఇంకా ఎక్కువ అబ్రేషన్ రెసిస్టెన్స్ కలిగిన ప్రీమియం మెటీరియల్‌ను ఆశించే రైడర్లకు ఇది చిన్న లోపంగా అనిపించవచ్చు.

ధర

Raida Rover Riding Pants ప్రస్తుతం రూ.7,450 ధరతో మార్కెట్‌లో అందుబాటులో ఉంది.

మొత్తం మీద ధరకు తగ్గ ఫీచర్లు, మంచి భద్రత, అన్ని సీజన్‌లకు ఉపయోగపడే థర్మల్ & రెయిన్ లైనర్లు, సౌకర్యవంతమైన ఫిట్ & ప్రయోజనకరమైన స్టోరేజ్‌తో Raida Rover Riding Pants బడ్జెట్ టూరింగ్ గేర్ విభాగంలో మంచి ఎంపికగా నిలుస్తున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Regenerative Braking In EVs: ఫుల్ ఛార్జింగ్‌తో కొండ ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నారా? ఎలక్ట్రిక్‌ కారు డ్రైవర్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయం!
ఎలక్ట్రిక్‌ కారును 100 శాతం ఛార్జ్ చేస్తే రీజెనరేటివ్ బ్రేకింగ్ ఎందుకు ఆగిపోతుంది? కారణమిదే!
LFP vs NMC Batteries: ఎలక్ట్రిక్‌ కారు బ్యాటరీ విషయంలో ఈ తప్పు చేయకండి! 100% ఛార్జింగ్ దేనికి అవసరం? దేనిని 80% దగ్గర ఆపాలి?
ఎలక్ట్రిక్ కారులో LFP లేదా NMC బ్యాటరీల్లో ఏది బెస్ట్? తెలుగు రాష్ట్రాల వాతావరణానికి ఏది సరిపోతుంది?
Car Insurance: కారు ఇన్సూరెన్స్‌లో ఏ యాడ్‌-ఆన్‌ ఎంచుకోవాలి? ఇంజిన్‌ ప్రొటెక్షన్‌ vs జీరో డిప్రిసియేషన్‌ పూర్తి వివరాలు
ఇంజిన్‌ ప్రొటెక్షన్‌ vs జీరో డిప్రిసియేషన్‌: కార్ ఇన్సూరెన్స్‌లో ఈ రెండింటి మధ్య తేడా ఏంటి?
పెద్ద ఫ్యామిలీల కోసం 6 సీటర్, 7 సీటర్ SUVలు.. పెట్రోల్, డీజిల్‌తో పాటు ఎలక్ట్రిక్ ఆప్షన్లు కూడా!
ఫ్యామిలీతో పిక్నిక్‌కు వెళ్లడానికి బెస్ట్ SUVలు.. రూ.8.57 లక్షల నుంచే 7 సీటర్ కార్లు!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
Vizag CII Summit: రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
AP Panchayat Elections: ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
Matt Henry Sixer: కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
Ravi Babu Scary Picture : బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
Telangana Congress: భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
KFC and Dominos Outlets: ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
Bigg Boss Season 10 Today Nov 13th Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: యూకీ మా.. వచ్చేసిందోచ్.. త్రిగుణ్‌ ఆనందం.. నీతూ మాస్టర్ కన్నీరు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: యూకీ మా.. వచ్చేసిందోచ్.. త్రిగుణ్‌ ఆనందం.. నీతూ మాస్టర్ కన్నీరు!
Embed widget