అన్వేషించండి

Honda Activa e vs Ampere Magnus Grand: హోండా యాక్టివా ఇ vs యాంపియర్‌ మాగ్నస్‌ గ్రాండ్‌! భారత్ ఈవీ మార్కెట్‌లో ఏది బెస్ట్?

Honda Activa e vs Ampere Magnus Grand: భారతీయ ఈవీ టూవీలర్‌ వాహన రంగంలో సరికొత్త సంచలనంగా మారిన హోండా యాక్టివా ఇ, బడ్జెట్‌ ఫ్రెండ్లీ మోడల్‌ యాంపియర్ మాగ్నస్‌ గ్రాండ్‌ల మధ్య గట్ట పోటీ నెలకొంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆంపియర్ మాగ్నస్ బడ్జెట్ ధరలో లభిస్తుంది, ఇంట్లోనే ఛార్జ్ చేయవచ్చు.

Honda Activa e vs Ampere Magnus Grand: భారత్‌లో ఇంధన ధరల పెరుగుతున్న వేళ, పర్యావరణ పరిరక్షణపై  అవగాహన  పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనే వారి సంఖ్య పెరుగుతోంది. ఈవీలకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. నిన్న మొన్నటి వరకు స్టార్టప్ కంపెనీలే ఈవీలు విడుదల చేసే వారు. ఇప్పుడు దశాబ్దాలుగా ప్రజల మనసులు గెలుచుకున్న కంపెనీలు కూడా ఈవీలు మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారు. దీంతో పోటీ రసవత్తరంగా మారింది. అలాంటి పోటీలో హోండా గ్రూప్‌కు చెందిన యాక్టివా , యాంపియర్‌ మాగ్నస్‌ గ్రాండ్‌ నిలబడ్డాయి. వీటిలో ఏది ఎవరికి బెస్ట్ ఛాయిస్‌ అనేది పూర్తి వివరాలతో తెలుసుకుందాం. 

హోండా యాక్టివా చాలా ఏళ్లుగా భారతీయ కుటుంబాల్లో భాగమైపోయింది. అందుకే అదే నమ్మకంతో ఈవీ మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అయితే ఇప్పటికే మార్కెట్‌లో యాంపియర్‌ మాగ్నస్‌ గ్రాండ్‌ తనకంటూ ప్రత్యేక  స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. తక్కువ ఖర్చుతో ఈవీ కొనుగోలు చేయాలని ఆలోచించే వారిని ఈ బ్రాండ్ టార్గెట్ చేసుకుంది. టెక్నాలజీ, బ్రాండ్ వాల్యూ, ప్రాక్టికల్ యుటిలీటీ విషయంలో ఈ రెండు బ్రాండ్స్‌లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. 

బ్యాటరీ స్వాపింగ్‌తో వస్తున్న హోండా యాక్టివా ఇ

హోండా యాక్టివా ఇ 1.5kWh సామర్థ్యంతో మార్కెట్‌లోకి వచ్చింది. తొలిసారిగా స్వాపబుల్‌ బ్యాటరీలను ఉపయోగించింది. అంటే మొత్తం బ్యాటరీ సామర్థ్యం 3kWhగా ఉంటుంది. ఈ బ్యాటరీలను ఇళ్ల వద్ద ఛార్జ్ చేసుకునే సదుపాయం ప్రస్తుతానికి లేదు. హోండా ఏర్పాటు చేసిన బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్లలో మాత్రమే ఖాళీ బ్యాటరీలను ఇచ్చి , పూర్తి ఛార్జ్‌ అయిన బ్యాటరీలను కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే మార్చుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు రోజువారీ ప్రయాణాల సమయాన్ని ఆదా చేస్తుంది. 

సంప్రదాయ హోం ఛార్జింగ్‌ భరోసాతో యాంపియర్‌ మాగ్నస్‌ గ్రాండ్‌    

హోండాయాక్టివా ఇ కి భిన్నంగా ఉంది యాంపియర్‌ మాగ్నస్ గ్రాండ్‌. ఇందులో .23kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఈ ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీలు ఎక్కువ లైఫ్‌ సైకిల్స్‌ కలిగి ఉండటమే కాకుండా, భారతీయ వాతావరణ పరిస్థితుల్లో అత్యంత సురక్షితమైనవిగా భావిస్తారు. దీనిని సాధారణంగా ఇంటీ సాకేట్‌ ద్వారానే సుమారు ఐదు నుంచి 6 గంటల్లో పూర్తి ఛార్జ్ చేసుకోవచ్చు. ఎటువంటి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ లేకుండానే సొంతంగా ఛార్జ్ చేసుకోవచ్చు. 

ధరల్లో వ్యత్యాసం!

హోండా యాక్టివా ఇ రెండు వేరియంట్లలో వస్తుంది. బేస్ వేరియంట్ స్టాండర్డ్‌ ధర 1.18 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ వేరియంట్‌ రోడ్ సింగ్‌ డ్యుయో ర 1.52 లక్షల వరకు ఉంటుంది. హైదరాబాద్‌లో దీని ఆన్‌రోడ్ ధర  వేరియంట్‌ను బట్టి 1.24 లక్షల నుంచి 1.58 లక్షల వరకు ఉంటుంది. దీంతోపాటు బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్ల కోసం అదనంగా నెలవారీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

యాంపియర్ మాగ్నస్ గ్రాండ్ కే ఒక స్టాండర్డ్‌ వేరియంట్‌లో లభిస్తుంది. దీని సగటు ఎక్స్‌ షోరూమ్‌ ధర 89,999 రూపాయిగా ఉంది. హైదరాబాద్‌లో అన్ని పన్నులు , ఇన్సూరెన్స్‌ కలుపుకొని సుమారు 94,041లకే ఆన్‌రోడ్ లభిస్తుంది. బడ్జెట్ పరంగా చూస్తే యాంపియర్ మెరుగ్గా ఉంది. 

పెర్ఫార్మెన్స్‌, స్పీడ్‌ 

హోండా యాక్టివా ఇలో 6kW గరిష్ట అవుట్‌పుట్‌ ఇచ్చే  పీఎంఎస్‌ఎమ్‌ మోటార్‌ అమర్చారు. ఇది గరిష్టంగా 22Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కేవలం 7.3సెకన్లలోనే 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్ల. ఇందులో ఎకో, స్టాండర్డ్‌, స్పోర్ట్‌ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. 

యాంపియర్‌ మాగ్నస్‌ గ్రాండ్‌లో 1.5kW రేటెడ్‌ పవర్‌, 2.4kW పీక్ అవుట్‌పుట్‌ ఇచ్చే బీఎల్‌డీసీ హబ్‌ మోటార్ ఉంది. ఇది 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని 6.5 సెకన్లలో అందుకుటుంది. దీని గరిష్ట వేగం గంటకు 65కిలోమీటర్లుగా ఉంది. ఇందులో ఎకో, సిటీ అనే రెండు మోడ్స్ మాత్రమే ఉన్నాయి. 

నిజమైన రేంజ్‌, రన్నింగ్ కాస్ట్‌ మధ్య వ్యత్యాసం

హోండా యాక్టివా ఇ క్లెయిమ్ చేసినట్టు దీని రేంజ్‌ 102 కిలోమీటర్లు. రోజువారి నగర ప్రయాణాలకు  సరిపోతుంది. అయితే దీని రన్నింగ్ కాస్ట్ బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్‌పై ఆధారపడి ఉంటుంది. యాంపియర్‌ మాగ్నస్ గ్రాండ్ 118 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని చెబుతోంది. నిజంగా ఇ వంద కిలోమీటర్ల వరకు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవడం వల్ల కిలోమీటర్‌కు 13 నుంచి 15 పైసలు మాత్రమే ఖర్చు అవుతుంది. 

Frequently Asked Questions

హోండా యాక్టివా ఇ, యాంపియర్ మాగ్నస్ గ్రాండ్‌ల రేంజ్, రన్నింగ్ ఖర్చులు ఎంత?

యాక్టివా ఇ క్లెయిమ్డ్ రేంజ్ 102 కి.మీ., రన్నింగ్ ఖర్చు సబ్‌స్క్రిప్షన్‌పై ఆధారపడి ఉంటుంది. మాగ్నస్ గ్రాండ్ 100 కి.మీ. వరకు ఇవ్వగలదు, ఇంట్లో ఛార్జ్ చేస్తే కి.మీ.కి 13-15 పైసలు ఖర్చవుతుంది.

టాప్ హెడ్ లైన్స్

కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Honda Elevate Facelift.. హ్యుందాయ్ క్రెటాను ఢీకొట్టే సత్తా ఉందా? ఏ SUVని కొనడం లాభదాయకం?
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ vs హ్యుందాయ్ క్రెటా.. ఫీచర్లు, భద్రతలో తేడాలేంటి? ఏది కొనడం బెటర్‌?
కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!
కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ ధర చూసి మురిసిపోకండి.. మీ జేబుకు చిల్లు పెట్టే 5 అదనపు ఖర్చులివి!
Maruti Brezza CNG కారు 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే EMI ఎంత కట్టాలి? మైలేజీ, పూర్తి వివరాలు
Maruti Brezza CNG కారు 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే EMI ఎంత కట్టాలి? మైలేజీ, పూర్తి వివరాలు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila House Arrest: ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
Telangana Politics Personal Attacks: తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
ACB Raids Civil Supplies DM: సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Samson Storm Reply: వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!
కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ ధర చూసి మురిసిపోకండి.. మీ జేబుకు చిల్లు పెట్టే 5 అదనపు ఖర్చులివి!
Black Coffee for Weight Loss : బ్లాక్ కాఫీ తాగితే కొవ్వు తగ్గుతుందా? రోజుకు ఎన్ని కప్పులు తాగాలో తెలుసా?
బ్లాక్ కాఫీ తాగితే కొవ్వు తగ్గుతుందా? రోజుకు ఎన్ని కప్పులు తాగాలో తెలుసా?
Embed widget