అన్వేషించండి

వైభవ్ సూర్యవంశీ Tata Sierra గెలుచుకున్నా ఇప్పుడే అతడు నడపలేడు.. కారు ధర, ఫీచర్లు ఇవే

Vaibhav Suryavanshi | ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీకి టాటా సియెరా కారు లభించింది. కానీ అతనికి డ్రైవింగ్ లైసెన్స్ లేనందున ఇప్పుడు నడపలేడు. లైసెన్స్ రావడానికి ఇంకెంత టైమ్ పడుతుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • డ్రైవింగ్ లైసెన్స్ 18 ఏళ్లకు వచ్చాక 2029లో నడుపుతాడు.

ఐపీఎల్ 2026 (IPL 2026)లో అద్భుత ప్రదర్శన చేసిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)  తన అద్భుతమైన ఆటతో క్రికెట్ ప్రేమికుల మనసుల్ని గెలుచుకున్నాడు. వైభవ్‌కు ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌ అనంతరం 'స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్' టైటిల్ లభించింది. ఆ తర్వాత టాటా మోటార్స్ అతడికి కొత్త టాటా సియెరా SUV బహుమతిగా ఇచ్చింది.

'స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్' అవార్డు టోర్నమెంట్ మొత్తంలో అత్యంత ప్రభావవంతమైన స్ట్రైక్ రేట్ కలిగిన బ్యాటర్‌కు దక్కుతుంది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి టాటా సియెరా లభించినప్పటికీ, అతను ప్రస్తుతం ఈ కారును నడిపేందుకు అర్హుడు కాదని తెలిసిందే. అందుకు అతడి వయసు అడ్డంకిగా మారింది.

టాటా సియెరాను వైభవ్ ఎప్పటి వరకు నడపలేడు?

టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ వయసు ప్రస్తుతం కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. భారత్‌లో డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి వయోపరిమితి 18 సంవత్సరాలు. కనుక వైభవ్ దాదాపు 3 సంవత్సరాల వరకు కారు డ్రైవింగ్ చేయడం కుదరదు. అతనికి అధికారికంగా డ్రైవింగ్ లైసెన్స్ 2029లో లభిస్తుంది. 

టాటా సియెరా డిజైన్, ఫీచర్లు

టాటా సియెరా ఎస్‌యూవీని మోడ్రన్ డిజైన్, అధునాతన సాంకేతికత, అద్భుతమైన ఫీచర్లతో తీసుకొచ్చారు. టాటా గత సంవత్సరమే ఓల్డ్ జనరేషన్ ఫేమస్ సియెరాను కొత్త లుక్‌లో ప్రవేశపెట్టింది. టాటా సియెరా డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో క్లాసిక్ సియెరా షేడ్స్ కనిపిస్తాయి. కానీ దీనికి పూర్తిగా మోడ్రన్ లుక్ ఇచ్చారు.

దీని ముందు భాగంలో ఎల్‌ఈడీ లైట్ బార్, స్టైలిష్ హెడ్‌ల్యాంప్స్, స్ట్రాంగ్ రోడ్ ప్రెజెన్స్ రోడ్డుపై టాటా సియోరాకు ప్రత్యేక గుర్తింపును ఇస్తాయి. ఎస్‌యూవీ క్యాబిన్ కూడా ప్రీమియంగా ఇచ్చారు. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ప్రీమియం సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ కనెక్టివిటీ, పలు మోడ్రన్ ఫీచర్లు ఉన్నాయి.

కారు సేఫ్టీ, పవర్ 

కారు సేఫ్టీ విషయంలో టాటా సియెరా చాలా స్ట్రాంగ్ అని భావిస్తున్నారు. ఇందులో పలు ఎయిర్‌బ్యాగ్‌లు, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), 360 డిగ్రీ కెమెరా, ఇతర భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఇవి డ్రైవింగ్‌ను మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా చేస్తాయి.

టాటా సియెరా అద్భుతమైన పవర్‌ట్రైన్ కారణంగా బాగా ఫేమస్ అయింది. కంపెనీ ఈ కారులో 1.5 లీటర్ సామర్థ్యం గల TGDi ఇంజిన్‌ను ఇచ్చింది. ఈ ఇంజిన్ కారుకు 158 బీహెచ్‌పీ శక్తితో పాటు 255 న్యూటన్ మీటర్ల టార్క్‌ను జనరేట్ చేస్తుంది.  కారులో 6 గేర్ల ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ ఉంది.

టాటా సియెరా కారు ధర ఎంత?

హైదరాబాద్‌లో సియెరా కారు ఎక్స్-షోరూమ్ ధర 11.49 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ మోడల్ విషయానికి వస్తే, సుమారు రూ. 21.29 లక్షలు. హైదరాబాద్‌లో బేస్ మోడల్ కొనుగోలు చేస్తే ఆన్ రోడ్ ధర రూ. 14,33,361 గా ఉంది. మోడల్, వేరియంట్ బట్టి ధరలు మారుతుంటాయి. ఒక్కో రాష్ట్రంలో పన్నులు రిజిస్ట్రేషన్ ఛార్జీల కారణంగా కార్ల ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.

 

Frequently Asked Questions

కొత్త టాటా సియెరా ఎస్‌యూవీ ముఖ్యమైన ఫీచర్లు ఏమిటి?

టాటా సియెరాకు ఎల్‌ఈడీ లైట్ బార్, పెద్ద టచ్‌స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 1.5 లీటర్ TGDi ఇంజిన్, ADAS, బహుళ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
రూ.10 వేలు చెల్లించి Hero Splendor Plus కొంటే ప్రతినెలా EMI ఎంత
రూ.10 వేలు చెల్లించి Hero Splendor Plus కొంటే ప్రతినెలా EMI ఎంత
రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
టోల్‌గేట్‌ టెన్షన్‌కు చెక్.. NHAI రూ.350 టోల్ పాస్‌తో నెల మొత్తం అన్‌లిమిటెడ్‌ ట్రావెల్స్‌!
కేవలం రూ.350 మంత్లీ పాస్‌.. ఒక నెలలో టోల్ ప్లాజా నుంచి ఎన్నిసార్లయినా ప్రయాణం!
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Embed widget