అన్వేషించండి

Best High Ground Clearance Cars: 10 లక్షల రూపాయల లోపు బెస్ట్ కార్లు!  భారీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో గుంతల రోడ్డను సైతం లెక్క చేయని టాప్ ఎస్‌యూవీలు ఇవే!

భారత్‌ రోడ్లై గుంతలు, స్పీడ్‌ బ్రేకర్లను తట్టుకొని సాఫీగా ప్రయాణించాలంటే కార్లకు గ్రౌండ్ క్లియరెన్స్‌ ఉండటం తప్పనిసరి. పది లక్షల బడ్జెట్‌లో మంచి గ్రౌండ్‌క్లియరెన్స్‌తో వచ్చే కార్లు గురించి చూద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భారత రోడ్ల పరిస్థితులతో అధిక గ్రౌండ్ క్లియరెన్స్ కార్ల డిమాండ్ పెరిగింది.
  • 10 లక్షల లోపు టాటా, కియా వంటి ఎస్‌యూవీలు అందుబాటులో.
  • టాటా నెక్సాన్, కర్వ్ అత్యధిక 208mm గ్రౌండ్ క్లియరెన్స్ అందిస్తాయి.
  • అధిక గ్రౌండ్ క్లియరెన్స్ వాహనానికి, ప్రయాణికులకు రక్షణ కల్పిస్తుంది.

Best Cars With High Ground Clearance Under 10 Lakhs in India 2026:భారత్‌లో ఒకప్పుడు మధ్యతరగతి కుటుంబం కారు కొనాలనుకుంటే అందరి చూపు హ్యాచ్‌బ్యాక్‌ కార్లవైపే ఉండేది. కానీ మారుతున్న కాలంతోపాటు వినియోగదారుల ఆలోచనలు, ప్రాధాన్యతలు మారుతున్నాయి. ప్రస్తుతం ఆటోమొబైల్‌ మార్కెట్‌లో ఎక్కడ చూసినా ఎస్‌యూవీల హవానే నడుస్తోంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే భారతీయ రోడ్ల పరిస్థితి. 

నగరాల్లో ట్రాఫిక్ జామ‌లు, అస్తవ్యస్తంగా ఉండే డ్రైనేజీ వ్యవస్థల, వర్షాకాలంలో మోకాళ్లతో మునిగిపోయే రోడ్డు, గ్రామీణ ప్రాంతాల్లోని కచ్చా రోడ్లు, వీటన్నింటికీ తోడు భారీ పరిమాణంలో ఉండే స్పీడ్‌ బ్రేకర్లు. ఇలాంటి రోడ్లపై కారు అడుగు భాగం దెబ్బతినకుండా ప్రయాణించాలంటే సదరు వాహనానికి గరిష్ట స్థాయిలో గ్రౌండ్ క్లియరెన్స్‌ ఉండటం చాలా కీలకం. గ్రౌండ్ క్లియరెన్స్ అంటే కారు కింది భాగానికి, రోడ్డుకు మధ్య ఉండే ఖాళీ స్థలం. 

వినియోగదారుల అవసాలను గుర్తించిన ఆటోమొబైల్‌ తయారీ సంస్థలు ప్రస్తుతం 10 లక్షల లోపే లగ్జరీ ఫీచర్లు, అద్భుతమైన మైలేజ్, కొండు, గుట్టలను సైతం సులువుగా దాటగలిగే భారీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న సబ్‌4మీటర్ కాంపాక్ట్‌ ఎస్‌యూవీలను, మైక్రో ఎస్‌యూవీలను మార్కెట్‌లోకి తీసుకువచ్చాయి. 

ఎక్కువ గ్రౌండ్ క్రియరెన్స్ ఉన్న టాప్ 7 కార్ల ధరలు ఇవే 

కార్ల గురించి పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు, ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్ మోడల్స్, వాటి గ్రౌండ్ క్లియరెన్స్‌, ప్రైస్ వివరాలు ఇక్కడ చూడొచ్చు. 

కారు మోడల్‌ గ్రౌండ్ క్లియరెన్స్‌ ఎక్స్‌షోరూమ్ ధర      కీలక ప్లస్ పాయింట్
టాటా నెక్సాన్‌   208 mm    ₹ 7.99లక్షల నుంచి ప్రారంభం  5-స్టార్ సేఫ్టీ రేటింగ్, ప్రీమియం లుక్స్
టాటా కర్వ్‌     208 mm   ₹ 9.99 లక్షల నుంచి ప్రారంభం  కూపే స్టైలింగ్, భారీ రోడ్ ప్రెజెన్స్
కియా సోనెట్‌    205 mm     ₹ 7.99 లక్షల నుంచి ప్రారంభం   ఫీచర్ రిచ్ క్యాబిన్, స్మూత్ డ్రైవింగ్
నిస్సాన్‌  మాగ్నిట్‌  205 mm   ₹ 6.12 లక్షల నుంచి ప్రారంభం   మోస్ట్ ఎఫోర్డబుల్ టర్బో ఎస్‌యూవీ, 360 కెమెరా
రెనాల్ట్‌ కైగర్‌  205 mm   ₹ 6.09 లక్షల నుంచి ప్రారంభం  మస్కులర్ డిజైన్, పెద్ద బూట్ స్పేస్
మహీంద్ర XUV 3XO 201 mm  ₹ 7.99 లక్షల నుంచి ప్రారంభం   పవర్‌ఫుల్ టర్బో ఇంజన్, విశాలమైన క్యాబిన్ 
మారుతి సుజుకి బ్రెజ్జా  198 mm  ₹ 8.54 లక్షల నుంచి ప్రారంభం  నమ్మకమైన సర్వీస్, బెస్ట్ రీసేల్ వాల్యూ

టాటా నెక్సాన్స్‌

భారతీయ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో టాప్‌లో ఉంది టాటా నెక్సాన్‌. ఈ సెగ్మెంట్‌లోనే అత్యధికంగా 208mm గ్రౌండ్‌ క్లియరెన్స్‌ అందించే కార్లలో నెక్సాన్‌ మొదటి స్థానంలో ఉంది. టాటా నెక్సాన్ కేవలం గ్రౌండ్‌ క్లియరెన్స్‌ పరంగానే కాకుండా, భద్రత పరంగానూ దేశంలోనే అత్యంత సురక్షితమై కార్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌/ భారత్ ఎన్‌క్యాప్‌ క్రాష్ టెస్టులో దీనికి లభించిన 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కొనుగోలుదారులకు  నమ్మకాన్ని ఇస్తుంది. పది లక్షల లోపు బడ్జెట్‌లో నెక్సాన్‌ స్మార్ట్‌, స్మార్ట్‌ ప్లస్‌, ప్యూర్ వేరియంట్లు అందుబాటులోకి వస్తాయి. బేస్‌, మిడ్‌ వేరియంట్లలోనే ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ ప్రోగ్రామ‌ ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్‌హోల్డ్‌ కంట్రోల్‌, ఎల్‌ఈడీ డిజైన్‌ లైటింగ్‌, మల్టీ డ్రైవ్ మోడ్స్‌, వంటి అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. 

టాటా కర్వ్‌ 

టాటా మోటార్స్‌ నుంచి సరికొత్తా మార్కెట్‌లోకి వచ్చి విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న మోడ్‌ టాటా కర్వ్‌. ఇది భారత్‌లో మొదటి సరసమైన కూపే ఎస్‌యూవీ డిజైన్. నెక్సాన్ ప్లాట్‌ఫామ్‌పైనే ఆధారపడి రూపొందించినప్పటికీ, దీనికి వెనుక భాగం ఏటవాలుగా ఉండే కూపే స్టై్‌ో ఉండి, ప్రీమియం కార్లను తలపిస్తుంది. ఇందులో కూడా నెక్సాన్‌లాగే 208ఎంఎం భారీ గ్రౌడ్‌ క్లియరెన్స్ లభిస్తుంది.

టాటా కర్వ్‌ బేస్ వేరియంట్ అయిన స్మార్ట్‌ టర్బో పెట్రోల్ మోడల్ ధర సరిగ్గా 9.99 లక్షల నుంచి ప్రారంమవుతుంది. అంటే పది లక్షల పరిమితిలో ప్రీమియం, భవిష్యత్‌ తరానికి చెందిన లుక్స్ ఉన్న పెద్ద ఎస్‌యూవీని సొంత చేసుకోవాలనుకునే వారికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ ఇందులో 3 సిలిండర్ల టర్బో పెట్రోల్‌ ఇంజన్‌, 6- స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్ లభిస్తాయి. 

కియా సోనెట్‌ 

దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా మోటార్స్‌ నుంచి వచ్చిన సోనెట్‌, ప్రీమియం ఫీచ్లు, స్పోర్టీ లుక్స్‌కు కేరాఫ్ అడ్రెస్‌. కియా సోనెట్‌ 205ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్‌ కలిగి ఉండి, అధునాతన అర్బన్ డ్రైవింగ్‌కు సరిపోతుంది. పది లక్షల బడ్జెట్‌ పరిధిలో దీని హెచ్‌టీఈ, హెచ్‌టీకే, హెచ్‌టీకే  ప్లస్‌‌ వేరియంట్లు లభిస్తాయి. కియా కార్ల ఇంటీరియర్ డిజైన్ చాలా రిచ్‌గా ఉంటుంది. బేస్ మోడల్స్‌ లోనే మంచి టచ్‌స్క్రీన‌ ఇన్ఫోటైన్‌మెంట్‌, రేర్‌ సీ వెంట్స్‌, ఫ్రంట్ అండే రేర్‌, పార్కింగ్‌ సెన్సార్‌, 6 ఎయిర్‌బ్యాగ్‌లు వస్తున్నాయి. దీని రైడ్ క్వాలిటీ చాలా స్టేబుల్‌గా ఉంటుంది. హైవేలపై వేగంగా వెళ్లేటప్పుడు కూడా కారు రోడ్డుకు అతుక్కుపోయినట్టు ఉంటుంది. 

నిస్సాన్ మాగ్నైట్‌ 

తక్కువ బడ్జెట్‌లో లభించే నిజమైన కాంపా్ట్ ఎస్‌యూవీ నిస్సాన్ మాగ్నైట్‌. జపాన్ టెక్నాలజీతో రూపొందించిన ఈ కారు మిడిల్‌ క్లాస్‌ బైయర్స్‌ను ఆకట్టుకుటుంది. ఇది 6.12 లక్ష నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో లభించే గ్రౌండ్ క్లియరెన్స్‌ 205ఎంఎం. అంటే హ్యాచ్‌ బ్యా్ ధరలోనే పూర్తి స్థాయి ఎస్‌యూవీ గ్రౌండ్ క్లియరెన్స్‌ లభిస్తుంది. 

రెనాల్ట్‌ కైగర్‌ 

నిస్సాన్ మాగ్నైట్‌ ప్లాట్‌ఫామ్‌ నిర్మితమైన మరో ఫ్రెం్‌ కారు రెనాల్ట్‌ కైగర్‌, ఫ్రెంచ్‌ డిజైన్ ఫిలాసఫీతో ఈ కారు ఎంతో మస్కులర్‌ , రగ్గడ్‌గా కనిపిస్తుంది. కైగర్‌లో కూడా 205ఎంఎం గ్రౌండ్‌ క్లియరెన్స్ లభిస్తుంది. ఇందులో 405 లీటర్ల బూట్‌ స్పేస్‌ ఉంటుంది. లగేజీ ఎక్కువగా పెట్టుకునే లాంగ్ ట్రిప్స్‌ వెళ్లే కుటుంబాలకు ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. పది లక్షల లోపు దీని ఆర్‌ఎస్‌ఈ, ఆర్‌ఎస్‌ఎల్, ఆర్‌ఎక్స్‌టీ వేరియంట్లు లభిస్తాయి. 

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ ఓ 

మహీంద్రా సంస్థ పాత ఎక్స్‌యూవీ 300 మోడల్స్‌ను పూర్తిగా ఆధునీకరించి సరికొత్త డిజైన్, ఫీచర్లతో ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓగా మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. ఈ కారులో 201MM గ్రౌండ్‌ క్లియరెన్స్ లభిస్తుంది. సెగ్మెంట్‌లోనే అత్యంత పవర్‌ఫుల్‌ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, ఎంస్టేలియన్ టీజీటీఐ ఆప్షన్లు ఉన్నాయి. గుంతల రోడ్డు దీని సస్పెన్ష్ సెటప్‌ అత్యంత అద్భుతంగా పని చేస్తుంది. కారు లోపల ఉన్న ప్రయాణికులకు పెద్దగా షాక్స్ తెలియకుండా స్మూత్‌గా రైడ్‌ను అందిస్తుంది. బేస్‌ ఎంఎక్స్‌1, ఎంఎక్స్ 2 వేరియంట్లు పది లక్షల లోపు లభిస్తాయి. వీటిలో ఆల్‌ ఫోర్‌ డిస్క్‌ బ్రేక్స్‌, 6 ఎయిర్‌ బ్యాగ్స్‌ వంటి అద్భుతమైన భద్రతా ఫీచర్లు బేస్ మోడల్‌ నుంచి లభిస్తున్నాయి. 

మారుతి సుజుకి బ్రెజ్జా 

దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న నమ్మకమైన ఫ్యామిలీ ఎస్‌యూవీ మారుతి బ్రెజ్జా. నమ్మకానికి, తక్కువ మెయింటెనెన్స్‌కు ఫేమస్‌. బ్రెజ్జాలో 198mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఇది 200mmకు కేవలం 2 మిల్లీమీటర్లు మాత్రమే తక్కువ అయినప్పటికీ, ఎలాంటి టఫ్‌ రోడ్లనైనా సునాయాసంగా దాటగలదు. ఇందులో పెద్ద 1.5-లీటర్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది లాంగ్ లైఫ్, అద్భుతమైన రిఫైన్‌మెంట్‌కు ప్రసిద్ధి.

గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల కలిగే ప్రయోజనాలివే!

చాలా మంది కారు కొనేటప్పుడు కేవలం లుక్స్, మైలేజ్ మాత్రమే చూస్తారు, కానీ ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వల్ల కలిగే లాభాలు కూడా ఉన్నాయి. రోడ్డుపై ఉండే పెద్ద పెద్ద రాళ్లు లేదా స్పీడ్ బ్రేకర్ల వల్ల కారు కింది భాగంలో ఉండే ఇంజన్ ఆయిల్ చాంబర్,  సైలెన్సర్ దెబ్బతినకుండా ఉంటాయి. వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలిచినప్పుడు, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న కార్ల సైలెన్సర్‌లోకి నీరు అంత సులభంగా వెళ్లదు. ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న కార్ల సీటింగ్ ఎత్తుగా ఉంటుంది. దీనివల్ల డ్రైవర్‌కు రోడ్డు స్పష్టంగా కనిపిస్తుంది.

Frequently Asked Questions

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎస్‌యూవీల ప్రాబల్యం పెరగడానికి ప్రధాన కారణం ఏమిటి?

భారతీయ రోడ్ల పరిస్థితి (ట్రాఫిక్ జామ్‌లు, కచ్చా రోడ్లు, స్పీడ్‌ బ్రేకర్లు) కారణంగా కారు అడుగు భాగం దెబ్బతినకుండా ఉండేందుకు అధిక గ్రౌండ్ క్లియరెన్స్‌ ఉన్న ఎస్‌యూవీలు ప్రాచుర్యం పొందాయి.

కారులో గ్రౌండ్ క్లియరెన్స్ అంటే ఏమిటి?

గ్రౌండ్ క్లియరెన్స్ అంటే కారు కింది భాగానికి, రోడ్డుకు మధ్య ఉండే ఖాళీ స్థలం. ఇది కారు అడుగు భాగాన్ని గుంతలు, స్పీడ్ బ్రేకర్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది.

అధిక గ్రౌండ్ క్లియరెన్స్‌ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఇది కారు కింది భాగాన్ని (ఇంజిన్ ఆయిల్ చాంబర్, సైలెన్సర్) దెబ్బతినకుండా కాపాడుతుంది. వర్షాకాలంలో నీరు లోపలికి వెళ్లకుండా చేస్తుంది, డ్రైవర్‌కు స్పష్టమైన రోడ్డు దృశ్యాన్ని అందిస్తుంది.

పది లక్షల లోపు లభించే కార్లలో అత్యధిక గ్రౌండ్ క్లియరెన్స్‌ ఏ కారుకు ఉంది?

టాటా నెక్సాన్ మరియు టాటా కర్వ్ కార్లకు 208 mm గ్రౌండ్ క్లియరెన్స్‌ ఉంది. ఈ సెగ్మెంట్‌లోనే ఇది అత్యధికంగా అందించబడుతుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hero Electric Bike: హీరో నుంచి రెడీ అవుతున్న ఈవీ బైక్.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
హీరో నుంచి రెడీ అవుతున్న EV Bike.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
కొత్త కారు కొనాలని చూస్తున్నారా? MG Hectorపై రూ.60,000 వరకు తగ్గింపు, 100 శాతం ఫైనాన్స్ కూడా!
యానివర్సరీ గిఫ్ట్‌ ఇస్తున్న కార్ల కంపెనీ - రూ.60,000 వరకు ఆదా, పూర్తి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా!
మూడు స్క్రీన్ల సెటప్‌తో కొత్త మహీంద్రా BE 07.. త్వరలో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ SUV ఎలా ఉంది?
మహీంద్రా కొత్త కారు BE 07 ఇంటీరియర్‌ ఎలా ఉంటుందో తెలిసిపోయింది - ఫోటోలు లీక్!
E20లో క్లోరైడ్, తేమ నిజంగానే పెరిగాయా? దేశవ్యాప్త తనిఖీల తర్వాత OMCలు ఏం చెప్పాయి?
E20 పెట్రోల్‌ కలుషిత ఇంధనమేనా? దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో ఏం తేలింది?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget