అన్వేషించండి

Best Cars for Daily Commute:రోజూ ఆఫీస్‌కు వెళ్లేవారికి ఈ 5 కార్లు బెస్ట్.. ఇందులో మీ కారు ఉందా ? లిస్ట్ చూశారా

Best Budget Cars for Daily Commute: రోజూ ఆఫీస్‌కు వెళ్లడానికి కార్ కోసం చూస్తున్నారా.. అయితే మైలేజ్, సేఫ్టీలో ముందుండే ఈ 5 బడ్జెట్ కార్ల వివరాలు తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సిటీ ట్రాఫిక్, మైలేజ్ కోసం సెలెరియో, ఆల్టో K10.
  • టాటా టియాగో 4-స్టార్ సేఫ్టీ, బలమైన బాడీ అందిస్తుంది.
  • వ్యాగన్ఆర్ విశాలమైన క్యాబిన్, CNG వేరియంట్ తక్కువ ఖర్చు.
  • గ్రాండ్ ఐ10 నియోస్ ప్రీమియం, 6 ఎయిర్‌బ్యాగ్‌లతో సురక్షితం.

Cars For Office Purpose | ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లేవారు సిటీ ట్రాఫిక్‌లో ఇరుక్కుని ఇబ్బంది పడుతుంటారు. అయితే ఉదయాన్నే నిద్రలేచి త్వరగా ఆఫీసుకు వెళ్లేవారు కార్లు కొనుగోలు చేస్తున్నారు. సిటీ రోడ్లపై జర్నీ సాఫీగా సాగాలన్నా, బెస్ట్ మైలేజీ కావాలన్నా ఈ కార్లలో మీకు ఏది సరిపోతుందో చెక్ చేసుకుని కొనుగోలు చేయడం మంచిది. మీ బడ్జెట్‌తో పాటు జర్నీని సాఫీగా చేసే మైలేజీ కార్లను కొనాలని చూస్తుంటారు. మీ రోజువారీ ఆఫీస్ ప్రయాణాన్ని సులభతరం చేసే 5 అద్భుతమైన కార్ల వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. 

సెలెరియో, ఆల్టో K10

ప్రతిరోజూ ఆఫీస్‌కు వెళ్లడంతో పాటు, పెట్రోల్ ఖర్చులు ఆదా చేయడంపై ఫోకస్ చేయాలి. మారుతి సుజుకికి ఈ విషయంలో సాటిలేదు. ఈ లిస్ట్‌లో మొదటి పేరు మారుతి సెలెరియో కారు, ఆల్టో కె10 కారు ఉంటాయి. ఈ రెండు కార్లు వాటి కాంపాక్ట్ సైజ్ కారణంగా భారీ ట్రాఫిక్‌లో, చిన్న సందులలో కూడా సులభంగా దూసుకుపోతాయి.

అన్నింటికంటే ముఖ్య విషయం ఏంటంటే, వీటి మైలేజ్ లీటరుకు 24 నుండి 25 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దాంతో మీ నెలవారీ ఇంధన ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. బడ్జెట్ పరంగా ఈ 2 కార్లు మిడిల్ క్లాస్ వారికి బెస్ట్ ఆప్షన్.

Also Read: యమహా నుంచి త్వరలో కొత్త స్పోర్ట్స్ బైక్.. KTM RC200కు పెరిగిన పోటీ- YZF-R2 ప్రత్యేకతలివే

టాటా టియాగో సైతం మంచి ఆప్షన్

మీరు మైలేజ్‌తో పాటు సేఫ్టీకి అధిక ప్రాధాన్యం ఇచ్చే కారు కోసం చూస్తున్నారా, టాటా టియాగో కంటే మెరుగైన ఛాయిస్ మరొకటి ఉండదు. గ్లోబల్ ఎన్‌క్యాప్ (Global NCAP) క్రాష్ టెస్ట్‌లో టాటా టియాగోకు 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. తక్కువ బడ్జెట్ కారుకు ఇది చాలా బెస్ట్ రేటింగ్. 

దీని స్ట్రాంగ్ బాడీ షెల్, సాలిడ్ బిల్డ్ క్వాలిటీ హైవేతోొ పాటు సిటీ రోడ్లపై మీకు, మీ కుటుంబానికి పూర్తి సేఫ్టీని అందిస్తాయి. ఫీచర్ల పరంగా కూడా ఇది చాలా మోడ్రన్‌గా ఉంటుంది. డ్రైవింగ్ చాలా సౌకర్యవంతంగా అనిపిస్తుంది. 

స్పేస్, కంఫర్ట్ పర్ఫెక్ట్ కాంబో కారు

మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మొదటి ఎంపికగా ఉంటోంది మారుతి వ్యాగన్ఆర్. ప్రతిరోజూ ఆఫీస్‌కు వెళ్లేవారికి ఒక అద్భుతమైన కారు. దీని టాల్ బాయ్ డిజైన్ కారణంగా బెస్ట్ హెడ్‌రూమ్, కేబిన్ స్పేస్ లభిస్తాయి. దీనివల్ల ట్రాఫిక్ జామ్‌లలో కూడా మీరు అలసట ఫీల్ అవ్వరు. ఈ కారు 1.0 లీటర్, 1.2 లీటర్ అనే 2 పవర్‌ఫుల్ ఇంజన్ ఆప్షన్లతో వస్తుంది. వ్యాగన్ఆర్ సిఎన్‌జి (CNG) వేరియంట్ మార్కెట్లో చాలా పాపులర్. మెయింటనెన్స్ ఖర్చులు చాలానే ఆదా చేస్తుంది.

స్టైల్, ఫీచర్లు ముఖ్యమే..

ప్రీమియంగా ఉండి క్యాబిన్ లోపల కూర్చోగానే లగ్జరీ ఫీల్ ఇచ్చే కారు కోసం చూస్తున్నట్లయితే.. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ సరిపోతుంది. దీని స్మూత్ ఇంజన్ సిటీలో డ్రైవ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

హ్యుందాయ్ కంపెనీ ఇప్పుడు ఇందులో స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్స్ ఇస్తోంది. దీనివల్ల సేఫ్టీ పరంగా కూడా బెస్ట్ అనిపించుకుంటోంది. టచ్‌స్క్రీన్, ఇన్ఫోటైన్‌మెంట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు మీ ఆఫీస్ జర్నీని తేలిక చేస్తాయి.

Also Read:  Honda కార్‌ కొనాలనుకునేవారికి గుడ్‌ న్యూస్ - Elevate, Amazeపై రూ.2.15 లక్షల వరకు డిస్కౌంట్లు

Frequently Asked Questions

ఆఫీసుకు వెళ్లే ఉద్యోగులకు కారు కొనేటప్పుడు ఏ అంశాలను పరిగణించాలి?

సిటీ ట్రాఫిక్‌లో సాఫీగా ప్రయాణించడానికి, మంచి మైలేజీతో పాటు మీ బడ్జెట్‌కు సరిపోయే కారును ఎంచుకోవడం ముఖ్యం. ఇది మీ రోజువారీ ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది.

సిటీ ట్రాఫిక్‌లో సులభంగా ప్రయాణించడానికి, మంచి మైలేజ్ ఇచ్చే కార్లు ఏవి?

మారుతి సెలెరియో మరియు ఆల్టో K10 కార్లు వాటి కాంపాక్ట్ సైజు కారణంగా ట్రాఫిక్‌లో సులభంగా దూసుకుపోతాయి. ఇవి లీటరుకు 24-25 కి.మీ మైలేజ్ అందించి ఇంధన ఖర్చులను ఆదా చేస్తాయి.

ఆఫీసు ప్రయాణాలకు మైలేజ్‌తో పాటు సేఫ్టీకి ప్రాధాన్యత ఇచ్చే కారు ఏది?

టాటా టియాగో మైలేజ్‌తో పాటు అత్యుత్తమ సేఫ్టీని అందిస్తుంది. గ్లోబల్ ఎన్‌క్యాప్‌లో 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొంది, బలమైన బాడీతో సురక్షితమైన ప్రయాణాన్ని నిర్ధారిస్తుంది.

కుటుంబంతో పాటు ఆఫీసు ప్రయాణాలకు ఎక్కువ స్థలం, సౌకర్యం అందించే కారు ఏది?

మారుతి వ్యాగన్ఆర్ దాని టాల్ బాయ్ డిజైన్ కారణంగా బెస్ట్ హెడ్‌రూమ్, విశాలమైన క్యాబిన్ స్పేస్ అందిస్తుంది. ట్రాఫిక్‌లో కూడా అలసట లేకుండా ప్రయాణించడానికి ఇది అనుకూలం.

ప్రీమియం ఫీచర్లు, స్టైల్‌తో కూడిన కారు కోసం చూస్తున్న వారికి ఏది సరైనది?

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ప్రీమియం ఫీచర్లు, లగ్జరీ ఫీల్ అందిస్తుంది. స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, టచ్‌స్క్రీన్ వంటివి మీ ఆఫీస్ జర్నీని మరింత సులభతరం చేస్తాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

33 కి.మీ మైలేజ్ ఇచ్చే Alto K10 కారు ఎక్స్‌షోరూమ్ ధర రూ. 3.70 లక్షలు.. దీని ఫీచర్లు చూశారా
33 కి.మీ మైలేజ్ ఇచ్చే Alto K10 కారు ఎక్స్‌షోరూమ్ ధర రూ. 3.70 లక్షలు.. దీని ఫీచర్లు చూశారా
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
కొత్త ఎలక్ట్రిక్‌ బైకులు తీసుకురాబోతున్న హీరో - డైలీ యూజ్‌ కోసం, అడ్వెంచర్ల కోసం కూడా!
హీరో ఎలక్ట్రిక్‌ బైకులు త్వరలో రాబోతున్నాయి.. డబ్బులతో రెడీగా ఉండండి
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget