అన్వేషించండి

33 కి.మీ మైలేజ్ ఇచ్చే Alto K10 కారు ఎక్స్‌షోరూమ్ ధర రూ. 3.70 లక్షలు.. దీని ఫీచర్లు చూశారా

Alto K10 Price: మారుతి సుజుకీ ఆల్టో కే10 కారులో దాదాపు 998cc కలిగిన 1.0-లీటర్ ఇంజన్ వస్తుంది. అధిక మైలేజీ, తక్కువ ధరతో తొలిసారి కారు కొనాలనుకునే వినియోగదారులను ఆకర్షిస్తోంది.

మొదటిసారి కారు కొనాలని ప్లాన్ చేస్తున్న, ఎక్కువ బడ్జెట్ లేని వారికి చాలా పాపులర్ మారుతి ఆల్టో K10. భారత మార్కెట్‌లో తక్కువ ధరతో పాటు ఈ కారులో మంచి మైలేజ్, కాంపాక్ట్ డిజైన్, ఈజీ డ్రైవింగ్, తక్కువ మెయింటెనెన్స్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. అందుకే ఈ కారు చాలా కాలం నుంచి ఎంట్రీ-లెవల్ కారు కొనుగోలు చేసే వినియోగదారులకు ఫస్ట్ ప్రియారిటీగా  నిలుస్తోంది.

మీరు చిన్న కుటుంబం కోసం కారు కొనడంతో పాటు పెట్రోల్‌పై తక్కువ ఖర్చు కావాలని కోరుకుంటే, Alto K10 నుంచి S-CNG వేరియంట్‌ను కొనుగోలు చేయవచ్చు. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ CNG మోడల్ దాదాపు 33.85 km/ kg వరకు మైలేజ్ ఇస్తుంది. రియల్ మైలేజ్ రోడ్డు, ట్రాఫిక్, ఏసీ వాడకం, డ్రైవింగ్ విధానాన్ని బట్టి మారవచ్చు.

కారు ధర ఎంత?

Alto K10 అతిపెద్ద ప్రత్యేకత దీని తక్కువ ధర. హైదరాబాద్‌లో దీని పెట్రోల్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ. 3.69 లక్షల నుండి ప్రారంభమవుతుంది. హైదరాబాద్‌లో ఆన్ రోడ్ ధర రూ.4,58,448 గా ఉంది. ఇక దీని టాప్ పెట్రోల్ AGS వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ. 5.45 లక్షలు ఉంటుంది. కారు CNG మోడల్ ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ. 4.95 లక్షలకు ప్రారంభమవుతుంది. ఈ ఎక్స్-షోరూమ్ ధరలపై RTO, ఇన్సూరెన్స్, ఇతర ఛార్జీలతో కలిపితే ఆన్-రోడ్ ధర మరింత పెరుగుతుంది.

Also Read: Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి

ఈ ప్రైస్ రేంజ్ కారణంగా Alto K10 మొదటిసారి కారు కొనుగోలు చేయడంతో పాటు ఎక్కువ డబ్బు ఖర్చు చేయకూడదనుకునే వారికి సరిపోతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కారు కొనేటప్పుడు కేవలం కారు ధర మాత్రమే కాకుండా పెట్రోల్/CNG ఖర్చు, సర్వీసింగ్, స్పేర్ పార్ట్స్ ఖర్చు కూడా చెక్ చేసుకోవాలి. Alto K10 ఈ అన్ని విషయాలలోనూ ఒక పొదుపైన ఆప్షన్‌గా నిలుస్తుంది.

కారు పవర్‌ట్రెయిన్, పెర్ఫార్మెన్స్

Maruti Alto K10 లో దాదాపు 998cc కలిగిన 1.0 లీటర్ ఇంజన్ ఇచ్చారు. పెట్రోల్ మోడల్‌లో మ్యాన్యువల్‌తో పాటు AGS అంటే ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు. మరోవైపు CNG వేరియంట్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో ఉంది. మోడల్ లిస్టింగ్‌లో పెట్రోల్, S-CNG రెండు ఆప్షన్లు ఇచ్చారు.

CNG కారు కొనుగోలు చేసేటప్పుడు CNG మోడ్‌లో ఇంజన్ అవుట్‌పుట్ పెట్రోల్‌తో పోలిస్తే కొద్దిగా తక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. అందువల్ల మీరు పెట్రోల్ కారు నుండి CNG మోడల్‌కు మారినట్లయితే పెర్ఫార్మెన్స్‌లో తేడాను గమనించవచ్చు. ఒకవేళ మీ రోజువారీ డ్రైవింగ్ ఎక్కువగా ఉండి, ఆఫీస్‌కు వెళ్లడం, క్యాబ్ వంటి కమర్షియల్ వాడకం, సిటీలో ప్రయాణాల వల్ల నెలలో ఎక్కువ కిలోమీటర్లు కారు తిరుగుతుంటే, CNG మోడల్ మరింత లాభదాయకం.

Alto K10 CNG ఆప్షన్‌లో ప్రస్తుతం LXi (O) CNG, VXi (O) CNG వంటి వేరియంట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటి ఎక్స్-షోరూమ్ ధర వరుసగా దాదాపు రూ. 4.81 లక్షలు, రూ. 5.31 లక్షలుగా ఉంది.

Also Read: Maruti Victoris S-CNG.. రూ.1 లక్ష ఎక్కువైనా ఎందుకు కొనాలి? మైలేజీతో లెక్క మారిపోతుంది!

కారు ఫీచర్లు ఇవే

Alto K10 కారుని బడ్జెట్ కారుగా భావించినప్పటికీ, ఇందులో అవసరమైన అనేక ఫీచర్లు లభిస్తాయి. వేర్వేరు వేరియంట్లను బట్టి ఇందులో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇతర సదుపాయాలు ఉంటాయి. టాప్ వేరియంట్‌లో 17.78 cm SmartPlay Studio ఫీచర్లు లభిస్తాయి. దీనివల్ల కారు కేబిన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్, యు కనెక్టివిటీ అనుభవం మెరుగ్గా ఉంటుంది. దీని ఇంటీరియర్ అంత ప్రీమియం లేదా లగ్జరీ కారులా ఉండదు.

కొత్త Alto K10 లో భద్రత కోసం ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి. కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS తో కూడిన EBD, రివర్స్ పార్కింగ్ సెన్సార్ల వంటి ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా మొదటిసారి కారు కొనుగోలు చేసే వారికి బాగా ఉపయోగపడతాయి. కారులో రివర్స్ పార్కింగ్ సెన్సార్లు ఉండటంతో  ఇరుకైన ప్రాంతాల్లో పార్కింగ్ చేసేటప్పుడు హెల్ప్ అవుతుంది. అలాగే ABS, EBD వంటి టెక్నాలజీ బ్రేకింగ్ సమయంలో కారును నియంత్రించడానికి తోడ్పడతాయి.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

33 కి.మీ మైలేజ్ ఇచ్చే Alto K10 కారు ఎక్స్‌షోరూమ్ ధర రూ. 3.70 లక్షలు.. దీని ఫీచర్లు చూశారా
33 కి.మీ మైలేజ్ ఇచ్చే Alto K10 కారు ఎక్స్‌షోరూమ్ ధర రూ. 3.70 లక్షలు.. దీని ఫీచర్లు చూశారా
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
కొత్త ఎలక్ట్రిక్‌ బైకులు తీసుకురాబోతున్న హీరో - డైలీ యూజ్‌ కోసం, అడ్వెంచర్ల కోసం కూడా!
హీరో ఎలక్ట్రిక్‌ బైకులు త్వరలో రాబోతున్నాయి.. డబ్బులతో రెడీగా ఉండండి
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget