అన్వేషించండి

Maruti Suzuki Eeco: దేశంలోనే అత్యంత చౌకైన 7 సీటర్ కారు, 2026లో బెస్ట్ సెల్లింగ్ కార్‌ ధర, ఫీచర్లు

Best Selling 7 Seater Car: మారుతి సుజుకి ఈకో భారత మార్కెట్‌లో 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు Maruti Suzuki Eeco 12 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయని కంపెనీ పేర్కొంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మారుతి సుజుకి ఈకో అత్యంత చౌకైన, బెస్ట్ సెల్లింగ్ 7 సీటర్.
  • గత 15 ఏళ్లలో 12 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడై సత్తా చాటింది.
  • ఈకో ₹5.23 లక్షల నుండి పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్‌లలో లభ్యం.

Best Selling 7 Seater Car: భారత మార్కెట్‌లో గత కొన్నేళ్ల నుంచి కార్ల విక్రయాలు పెరిగాయి. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి టైం నుంచి ఫ్యామిలీ జర్నీ కోసం కార్లకు ప్రియారిటీ ఇస్తున్నారు. ఈ క్రమంలో మారుతి సుజుకి ఈకోను దేశంలోనే అత్యంత చౌకైన, బెస్ట్ సెల్లింగ్ 7 సీటర్ కారుగా భావిస్తారు. అత్యుత్తమ మైలేజ్, ఎక్కువ క్యాబిన్ స్పేస్, తక్కువ ధర కారణంగా ఈ కారు ఫ్యామిలీ జర్నీకి సరిగ్గా సరిపోతుంది. ధర కారణంగా కమర్షియల్ కస్టమర్లు సైతం ఈ కారును విపరీతంగా కొంటున్నారు. జూలై 2026లో మారుతి సుజుకి ఈకో కారుపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది.  7 సీటర్ విభాగంలో మరోసారి కంపెనీ పేరును  మారుతి సుజుకి ఈకో నిలబెట్టింది. అమ్మకాల్లో ఇతర కార్లను కూడా వెనక్కి నెట్టిన ఈ కారు BS-6 ఇంజిన్‌తో వస్తుంది.  ఓసారి ఈ కారు ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు చూశాక.. నచ్చితే మీరు కూడా కొనేయండి. 

మీది పెద్ద కుటుంబం అయితే, తక్కువగా బడ్జెట్లో 7 సీటర్ కారు కొనడం కోసం చూస్తున్నారా.. మీకు మారుతి సుజుకి ఈకో సరిగ్గా సరిపోతుంది. తక్కువ ధర, సులువైన మెయింటెనెన్స్, ఎక్కువ మంది సీటింగ్ సామర్థ్యం కారణంగా లక్షలాది భారత కుటుంబాలు ఈ కారు వైపు మొగ్గు చూపుతున్నాయి. అందుకే మారుతి సుజుకి ఈకో 2026 మొదటి అర్ధభాగంలో భారీ అమ్మకాలను నమోదు చేసింది. దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే వ్యాన్ విభాగంలో తన  స్థానాన్ని నిలబెట్టుకుంది. 2026 తొలి 6 నెలల్లో అత్యధికంగా అమ్ముడైన వ్యాన్ కేటగిరీ కార్లలో ఒకటిగా మారుతి సుజుకి ఈకో  నిలిచింది. మారుతి సుజుకి ఈకో భారత్‌లో 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు 12 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడై మార్కెట్లో సత్తా చాటుతోంది. 

తక్కువ ధరలోనే 7 సీటర్ కారు 

దేశంలోనే అత్యంత తక్కువ ధరలో లభించే 7 సీటర్ కార్లలో మారుతి సుజుకి ఈకో ఒకటని చెప్పవచ్చు. ఇది 5 సీటర్, 7 సీటర్ రెండు ఆప్షన్లలోనూ మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ ఏడాది జూన్ వరకు మారుతి సుజుకి ఈకో కారును 71,424 మంది కొనుగోలు చేశారు. ఈ కారు ప్రారంభ ధర ₹5.23 లక్షల నుండి ₹6.41 లక్షల వరకు ఉండటంతో పాటు తక్కువ మెయింటెనెన్స్ కారణంగా రోజువారీ ప్రయాణాలకు సైతం ఈ కారు ఉపయోగిస్తున్నారు. 

Also Read: టాటా నెక్సాన్‌ను హైదరాబాద్‌లో 2 లక్షల డౌన్‌పేమెంట్‌తో కొనుగోలు చేస్తే EMI ఎంత చెల్లించాలి?

ఫ్యామిలీ జర్నీకే కాదు.. కమర్షియల్ పనులకు సైతం ఇదే కారు
మారుతి ఈకోను కేవలం ఫ్యామిలీ కారుగానే కాకుండా, చిన్న వ్యాపారాలు, కమర్షియల్ అవసరాల కోసం సైతం అధికంగానే ఉపయోగిస్తారు. అందుకే ఈ కారుకు అన్ని వర్గాల నుంచి డిమాండ్ నిరంతరం ఉంటుంది. దాంతో ప్రతినెలా వేల యూనిట్లు అమ్మకాలతో దూసుకెళ్తోంది.

మారుతి సుజుకీ ఈకో మైలేజ్, ఇంజిన్ పవర్ 
మారుతి ఈకోలో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ వస్తుంది. పెట్రోల్‌లో ఇది 80.76 PS పవర్ అవుట్‌పుట్, 104.5 Nm టార్క్‌ జనరేట్ చేస్తుంది. CNG ఇంజిన్‌లో అయితే 71.65 PS పవర్ అవుట్‌పుట్, 95 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ కారు టూర్ వేరియంట్ పెట్రోల్ వర్షన్‌ లీటర్‌కు 20 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. CNG ఇంజిన్‌ అయితే ఒక కేజీకి 27.05 కి. మీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేసింది. అయితే రోడ్లు, ట్రాఫిక్ బట్టి మైలేజీ మారుతుందని తెలిసిందే. సాధారణ మోడల్స్ పెట్రోల్ ఇంజిన్‌లో 19.7 కి.మీ, CNGతో 26.78 కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది. రెండు ఆప్షన్లలో లభించే ఈ కారు తక్కువ ధరతో పాటు తక్కువ ఇంధన ఖర్చు వల్ల బడ్జెట్ కొనుగోలుదారులకు బెస్ట్ ఆప్షన్‌గా మారింది. 

Also Read: మోటార్ ఇన్సూరెన్స్ గడువు దాటనివ్వొద్దు - నో క్లెయిమ్‌ బోనస్‌తో పాటు చాలా కోల్పోతారు!

Frequently Asked Questions

మారుతి సుజుకి ఈకో ఎందుకు బెస్ట్ సెల్లింగ్ 7 సీటర్ కారుగా ఉంది?

తక్కువ ధర, మెరుగైన మైలేజ్, ఎక్కువ క్యాబిన్ స్పేస్ మరియు తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుల కారణంగా మారుతి సుజుకి ఈకో భారతదేశంలో బెస్ట్ సెల్లింగ్ 7 సీటర్ కారుగా నిలిచింది. ఇది ఫ్యామిలీ మరియు కమర్షియల్ అవసరాలకు సరిపోతుంది.

మారుతి సుజుకి ఈకో ధర ఎంత?

మారుతి సుజుకి ఈకో ప్రారంభ ధర ₹5.23 లక్షల నుండి ₹6.41 లక్షల వరకు ఉంటుంది. ఇది 5 సీటర్ మరియు 7 సీటర్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

మారుతి సుజుకి ఈకో మైలేజ్ ఎంత?

మారుతి ఈకో పెట్రోల్ వెర్షన్‌లో లీటరుకు 20 కి.మీ. మైలేజీని అందిస్తుంది. సీఎన్‌జీ వెర్షన్‌ అయితే కిలోకు 27.05 కి.మీ. మైలేజీని ఇస్తుంది.

మారుతి సుజుకి ఈకో ఏ రకాల వినియోగదారులకు అనుకూలం?

మారుతి సుజుకి ఈకో పెద్ద కుటుంబాలకు, తక్కువ బడ్జెట్‌లో 7 సీటర్ కారు కోరుకునే వారికి అనుకూలం. ఇది ఫ్యామిలీ జర్నీలతో పాటు చిన్న వ్యాపారాలు మరియు వాణిజ్య అవసరాలకు కూడా ఉపయోగపడుతుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
కొత్త ఎలక్ట్రిక్‌ బైకులు తీసుకురాబోతున్న హీరో - డైలీ యూజ్‌ కోసం, అడ్వెంచర్ల కోసం కూడా!
హీరో ఎలక్ట్రిక్‌ బైకులు త్వరలో రాబోతున్నాయి.. డబ్బులతో రెడీగా ఉండండి
Maruti Victoris S-CNG.. రూ.1 లక్ష ఎక్కువైనా ఎందుకు కొనాలి? మైలేజీతో లెక్క మారిపోతుంది!
మారుతి విక్టోరిస్‌ S-CNG రియల్‌ వరల్డ్‌ రివ్యూ.. మైలేజీ అదిరిపోయింది, మీ డబ్బు ఆదా!
BMW F 450 GS బైక్‌ రియల్‌ వరల్డ్‌ టెస్ట్.. 100km వేగం కేవలం 5.72 సెకన్లలో!
BMW కారే కాదు, బైక్‌ కూడా మామూలుగా లేదుగా.. లైఫ్‌లో ఒక్కసారైనా నడపాల్సిందే
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Embed widget