అన్వేషించండి

Tata Nexon EV EMI Calculator:టాటా నెక్సాన్‌ను హైదరాబాద్‌లో 2 లక్షల డౌన్‌పేమెంట్‌తో కొనుగోలు చేస్తే EMI ఎంత చెల్లించాలి?

Tata Nexon EV EMI Calculator:టాటా నెక్సాన్ ఈవీ ప్రారంభ ఎక్స్‌షోరూమ్‌ ధర 12.49 లక్షలుగా ఉంది. ఇందులో బేస్ మోడల్‌ను రెండు లక్షల డౌన్‌పేమెంట్‌ చెల్లిస్తే ఎంత ఈఎంఐ చెల్లించాలో చూడండి

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఈవీ కొనుగోలుతో నెలకు ₹7,000 ఆదా, పెట్టుబడి త్వరగా రికవరీ.

Tata Nexon EV EMI Calculator: భారత్ మార్కెట్‌లో ఈవీల జోరు పెరుగుతోంది. ఈ జోరును అందుకున్న టాటా సంస్థ నెక్సాన్‌ ఈవీని తీసుకొచ్చి మధ్యతరగతి, ప్రీమియం బయ్యర్లను ఆకట్టుకుంది. అందుకే నెక్సాన్ విడుదలైన ఎడాదిలోనే లక్షకుపైగా విక్రయాలతో సరికొత్త రికార్డు సృష్టించింది. ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్న టాటా నెక్సాన్‌ ఈవీని ఈఎంఐ ద్వారా కొనుగోలు చేయాలంటే ఎంత డౌన్‌పేమెంట్ చెల్లించాలి. నెలకు ఈఎంఐ ఎంత చెల్లించాలో చూద్దాం. 

కారు కొనాలనే కల చాల మందికి ఉంటుంది. అయితే ఒకేసారి అంత మొత్తం చెల్లించలేక ఇబ్బంది పడుతుంటారు. అయితే అలాంటి వారు ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేక, నెలవారీగా చెల్లించుకుంటే మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్ పడదు. టాటా నెక్సాన్‌ ఈవీ బేస్ వేరియంట్‌ ఎక్స్ షోరూమ్‌ ధర 12.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ ఎండ్ వేరియంట్‌ 117.69లక్షల వరకు ఉంది. హైదరాబాద్‌ లాంటి ప్రధాన నగరాల్లో దీని ఆన్‌రోడ్ ధరలు ఆ రాష్ట్ర పన్నలపై ఆధారపడి ఉంటాయి. 

టాటా మోటార్స్ తన నెక్సాన్‌ ఈవీని రెండు ప్రధాన బ్యాటరీ ఆప్షన్స్‌లో ఇస్తుంది. ఒకటి 30kWh, రెండోది 45kWh. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా క్రియేటివ్‌ ప్లస్‌, ఫియర్‌లెస్‌, ఎంపవర్డ్‌ వేరియంట్స్‌లలో లభిస్తుంది. 

హైదరాబాద్‌లో కారు కొనాలి అంటే ఆన్‌రోడ్‌ ధర 13.22 లక్షల నుంచి 18.77లక్ష వరక ఉంటుంది. ప్రభుత్వ సబ్సిడీలు, స్థానిక రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇన్సూరెన్స్‌ ఆధారంగా ఈ ఆన్‌రోడ్ ధరలలో మార్పులు ఉంటాయి. బేస్ మోడ్ అయిన క్రియేటివ్‌ ప్లస్‌ 30kWh కారు ఎక్స్‌ షోరూమ్‌ ప్రైస్‌‌ 12.49 లక్షలు ఉంటే, అన్ని పన్నులు కలిపి ఆన్‌రోడ్‌ ధర 13.22 లక్షలు వరకు ఉంటుంది.  

బేస్ వేరియంట్ ఈఎంఐ నెలకు 24, 410 రూపాయలు

టాటా నెక్సాన్ ఈవీ బేస్ వేరియంట్‌ అయిన క్రియేటివ్ ప్లస్‌ 30kWh మోడల్‌ను ఫైనాన్స్‌‌ ద్వారా కొనాలనుకుంటే కనీసం డౌన్‌పేమెంట్‌ 2 లక్షల రూపాయలు చెల్లించాలి. మిగతా 11,21,847 రూపాయలను బ్యాంకు లోన్ ద్వారా పొందవచ్చు. దీనికి 8.5 బ్యాంకు వడ్డీ వసూలు చేస్తే ఐదేళ్ల కాలపరిమితి తీసుకుంటే నెలకు ఈఎంఐ 23,016 చెల్లించాల్సి ఉంటుంది. ఐదేళ్లలో 2,59,113 రూపాయలు వడ్డీ రూపంలో చెల్లించాల్సి ఉంటాయి. 

  • ఇదే అమౌంట్‌ను తొమ్మిది శాతం వడ్డీకి తీసుకుంటే నెలకు 23,287 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 
  • ఇదే అమౌంట్‌ను తొమ్మిది శాతం వడ్డీకి నాలుగేళ్ల కాలపరిమితికి బ్యాంకు లోన్‌ తీసుకుంటే నెలకు 27,917 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 
  • ఇదే అమౌంట్‌ను తొమ్మిది శాతం వడ్డీకి మూడేళ్ల కాలపరిమితికి బ్యాంకు లోన్‌ తీసుకుంటే నెలకు 35,674 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 
  • ఇదే అమౌంట్‌ను తొమ్మిది శాతం వడ్డీకి రెండేళ్ల కాలపరిమితికి బ్యాంకు లోన్‌ తీసుకుంటే నెలకు 51,251 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 

టాప్‌ వేరియంట్ ఈఎంఐ ఎంత?

లేటెస్ట్‌ టెక్నాలజీ, గరిష్ట రేంజ్‌ కావాలనుకునే వారి కోసం ఎంపవర్డ్‌ ప్లస్‌  ఏ 45kWh డార్క్ ఎడిషన్ ఎక్స్‌షోరూమ్‌ ధర 17.69లక్షలు. ఇది హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ప్రైస్‌ సుమారు 18.77లక్షలు. దీన్ని 9శాతం వడ్డీతో ఐదేళ్ల కాలపరిమితికి  రెండు లక్ష రూపాయల డౌన్‌పేమెంట్ చెల్లించి 16,55,693 రూపాయలను ఐదేళ్ల కాలపరిమితికి లోన్ తీసుకుంటే నెలకు 34,369 రూపాయలుగా ఉంటుంది. నాలుగేళ్ల కాలపరిమితికి లోన్ తీసుకుంటే నెలకు 41,201 రూపాయలుగా ఉంటుంది. మూడేళ్ల కాలపరిమితికి లోన్ తీసుకుంటే నెలకు 52,650 రూపాయలుగా ఉంటుంది.

ఎంత సేవ్ అవుతుంది?

మీరు నెల నెల ఈఎంఐ చెల్లిస్తున్నప్పటికీ సాధారణమైన పెట్రోల్‌, డీజిల్‌ కార్లతో పోలిస్తే నెక్సాన్ ఈవీ ఈ ఖర్చును భారీగా తగ్గిస్తుంది. రోజుకు యాభై కిలోమీటర్లు ప్రయాణించే వ్యక్తి పెట్రోల్ కారులో వెళ్తే నెలకు ఎనిమిది నుంచి పది వేల వరకు ఖర్చు అవుతుంది. అదే నెక్సాన్‌ ఈవీలో హోమ్ ఛార్జింగ్ వాడుకుంటే కరెంటు బిల్లు పదిహేను వందల వరకు వచ్చినా,  నెలకు ఏడు వేల రూపాయలు సేవ్ అవుతాయి.

టాటా నెక్సాన్‌ ఏ వేరియంట్‌ ఎంత ప్రైస్ ఉంది?

హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ధర ఉన్న ఈ కింది వేరియంట్స్‌ను ఐదేళ్ల కాలపరిమితికి 9 శాతం వడ్డీతో రెండు లక్ష డౌన్‌పేమెంట్‌ చేసి తీసుకుంటే నెలకు ఎంత ఈఎంఐ పడుతుందూ ఈ పట్టికలో చూడవచ్చు.  

వేరియంట్ పేరు ఎక్స్‌షోరూమ్‌ ధర ఆన్‌రోడ్‌ ప్రైస్‌ నెలవారీగా ఈఎంఐ(ఐదేళ్ల కాలపరిమితికి)
క్రియేటివ్ ప్లస్‌ 30.0kWh ₹12,49,000  ₹13,21,847   ₹23,287
ఫియర్‌లెస్‌30.0kWh  ₹13,29,000  ₹14,16,000  ₹25,023
క్రియేటివ్ 45.0kWh   ₹14,14,000  ₹15,15,000  ₹ 27,006
 ఫియర్‌లెస్‌ 45.0kWh  ₹15,14,000  ₹16,20,000  ₹29,262
ఎంపవర్డ్‌ 45.0kWh   ₹16,14,000  ₹17,25,000  ₹31,435
ఎంపవర్డ్‌ ప్లస్‌ A 45.0kWh ₹17,49,000  ₹18,67,000  ₹34,369
ఎంపవర్డ్‌ ప్లస్‌ A 45.0kWh Dark  ₹17,69,000  ₹18,77,000  ₹34,804

ఈవీ  చేసేటప్పుడు కేవలం నెలవారీ ఈఎంఐ మాత్రమే కాకుండా మీ రోజువారీ ప్రయాణాన్ని కూడా పరిగణలోకి తీసుకోండి. మీరు రోజూ నలభై కిలోమీటర్ల దూరం ప్రయాణించే వినియోగదారులు పెట్రోల్ వాహనం కంటే ఈవీ తీసుకోవడం మంచిది. మీరు కారు కొన్న మూడు నాలుగేళ్ల కాలంలోనే మీరు పెట్టిన ఖర్చు రికవరీ చేసుకోవచ్చు. బ్యాంకు లోన్‌ మీ సిబిల్ స్కోరుపై ఆధారపడి ఉంటుంది. సిబిల్ స్కోరు ఎక్కువ ఉంటే మీకు తక్కువ వడ్డీకే లోన్ లభిస్తుంది. 

Frequently Asked Questions

టాటా నెక్సాన్ ఈవీ కొనుగోలుతో ఎంత డబ్బు ఆదా చేసుకోవచ్చు?

పెట్రోల్ కార్లతో పోలిస్తే నెక్సాన్ ఈవీ ఖర్చును తగ్గిస్తుంది. హోమ్ ఛార్జింగ్ వాడుకుంటే నెలకు సుమారు ₹7,000 వరకు ఆదా చేసుకోవచ్చు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
కొత్త ఎలక్ట్రిక్‌ బైకులు తీసుకురాబోతున్న హీరో - డైలీ యూజ్‌ కోసం, అడ్వెంచర్ల కోసం కూడా!
హీరో ఎలక్ట్రిక్‌ బైకులు త్వరలో రాబోతున్నాయి.. డబ్బులతో రెడీగా ఉండండి
Maruti Victoris S-CNG.. రూ.1 లక్ష ఎక్కువైనా ఎందుకు కొనాలి? మైలేజీతో లెక్క మారిపోతుంది!
మారుతి విక్టోరిస్‌ S-CNG రియల్‌ వరల్డ్‌ రివ్యూ.. మైలేజీ అదిరిపోయింది, మీ డబ్బు ఆదా!
BMW F 450 GS బైక్‌ రియల్‌ వరల్డ్‌ టెస్ట్.. 100km వేగం కేవలం 5.72 సెకన్లలో!
BMW కారే కాదు, బైక్‌ కూడా మామూలుగా లేదుగా.. లైఫ్‌లో ఒక్కసారైనా నడపాల్సిందే
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Embed widget