అన్వేషించండి

Car Insurance: నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు

Flood Car Repair Tips: వర్షపు నీటిలో కారు మునిగిపోయినప్పుడు పొరపాటున కూడా ఇంజిన్ స్టార్ట్ చేయవద్దు. హైడ్రోస్టాటిక్ లాక్, ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ కాకుండా ఉండటానికి ఈ నిబంధనలను తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మునిగిన కారు ఇంజిన్ స్టార్ట్ చేస్తే, బీమా క్లెయిమ్ తిరస్కరణ.
  • వాహనాన్ని నెట్టి, టో చేసి మాత్రమే నీటి నుండి బయటకు తీయాలి.
  • నీరు తగ్గాక, కారు ఫోటోలు, వీడియోలు వెంటనే తీయండి.
  • బీమాకు తెలియజేసి, అనుమతి లేకుండా మరమ్మతులు చేయవద్దు.

వర్ష కాలంలో పలు నగరాల్లో నీరు నిలిచిపోవడం తరచూ చూస్తుంటాం. దీనివల్ల రోడ్డుపై కారు నడపడం మీకు కష్టంగా మారుతుంది. కొన్ని చోట్ల ఎంతలా వర్షం పడుతుందంటే, ఆ ప్రాంతం మొత్తం వరద లాంటి పరిస్థితులు నెలకొంటాయి. దీని కారణంగా చాలా మందికి వాహనాన్ని పార్క్ చేయడంలో ఇబ్బంది సడతానే. కొన్నిసార్లు పార్క్ చేసిన వాహనమే నీటిలో మునిగిపోయే పరిస్థితులు సైతం ఉంటాయి. 

దీనివల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఒకవేళ మీ వాహనం వర్షపు నీటిలో మునిగిపోతే, కంపెనీ నుండి మీకు ఇన్సూరెన్స్ లభిస్తుందా లేదా అనేది తెలుసుకుందాం. అయితే, ఈ సమయంలో మీరు కూడా కొన్ని విషయాలను మీరు గుర్తుంచుకోవాలి, లేదంటే మీ ఇన్సూరెన్స్ రిజెక్ట్ కావచ్చు.

పొరపాటున కూడా కారు ఇంజిన్ స్టార్ట్ చేయవద్దు

వరద లేదా వర్షపు నీటిలో మునిగిన కారును చూడగానే చాలా మంది మొదటగా బండి ఆన్ చేసి ఇంజిన్ స్టార్ట్ చేస్తారు. కానీ కారు వెంటనే స్టార్ట్ అవ్వదు. అయినా ప్రజలు కారును స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. కారు నీటిలో మునిగి ఉన్నప్పుడు ఇంజిన్ స్టార్ట్ చేస్తే, నీరు నేరుగా సిలిండర్ లోపలికి వెళ్లిపోతుందని తెలుసుకోండి. 

Also Read: ఇప్పటివరకు భారత్ NCAP క్రాష్ టెస్ట్‌కు వెళ్లిన 31 కార్లు - ఏవి 5 స్టార్, ఏవి 4 స్టార్ సాధించాయి?

దీనివల్ల ఇంజిన్ హైడ్రోస్టాటిక్ లాక్ (Hydrostatic lock) పడుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీలు దీనిని డ్రైవర్ నిర్లక్ష్యంగా భావిస్తాయి. దీనివల్ల జరిగే భారీ నష్టానికి సంబంధించిన క్లెయిమ్‌ను వెంటనే రిజెక్ట్ చేస్తాయి. అందువల్ల ఎల్లప్పుడూ కారును నీటి నుండి బయటకు నెట్టడం ద్వారా లేదా టో (Tow) చేయడం ద్వారా మాత్రమే బయటకు తీయాలి. 

వెంటనే కారు ఫోటో తీయండి

నీరు తగ్గగానే, మొదటగా మొబైల్‌తో కారు కండీషన్ స్పష్టంగా చూపించే ఫోటోలు, వీడియోలు తీసుకోండి. నష్టం ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిందనడానికి ఇది మీ వద్ద ఉన్న బలమైన సాక్ష్యం.

ఆ తర్వాత వెంటనే మీ ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం అందించాలి. ఆ కంపెనీ సర్వేయర్ వచ్చి వాహనాన్ని పరిశీలించే వరకు కారును ఏదైనా లోకల్ గ్యారేజ్‌లో విప్పి రిపేర్ చేయించడం లాంటి తప్పు మాత్రం చేయకండి. అధికారిక అనుమతి లేకుండా మీ అంతట మీరే పని ప్రారంభించడం వల్ల కంపెనీ మీ కారు ఇన్సూరెన్స్ క్లెయిమ్ పాస్‌ను రిజెక్ట్ చేయవచ్చు.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో టాటా సియెర్రా EV ఫైనల్‌గా ఎంతకు వస్తుంది? ఆన్‌రోడ్‌ ధరలు, EMI వివరాలు ఇవిగో

Frequently Asked Questions

వర్షపు నీటిలో మునిగిన కారుకు ఇన్సూరెన్స్ వస్తుందా?

అవును, వస్తుంది. కానీ ఇంజిన్ స్టార్ట్ చేయకపోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తేనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. లేదంటే క్లెయిమ్ తిరస్కరించబడవచ్చు.

కారు వర్షపు నీటిలో మునిగితే ఇంజిన్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు?

ఇంజిన్ స్టార్ట్ చేస్తే నీరు లోపలికి వెళ్లి హైడ్రోస్టాటిక్ లాక్ అవుతుంది. కంపెనీలు దీనిని డ్రైవర్ నిర్లక్ష్యంగా భావించి క్లెయిమ్‌ను రిజెక్ట్ చేస్తాయి.

వర్షపు నీటిలో కారు మునిగినప్పుడు ముందుగా ఏమి చేయాలి?

మొదటగా, నీటిలో మునిగిన కారు పరిస్థితిని ఫోటోలు, వీడియోలు తీయాలి. ఇవి నష్టానికి బలమైన సాక్ష్యంగా ఉపయోగపడతాయి.

ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం ఎవరికి సమాచారం ఇవ్వాలి?

కారు ఫోటోలు తీసిన వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయాలి. సర్వేయర్ పరిశీలించే వరకు స్థానిక గ్యారేజీలో రిపేర్లు చేయకూడదు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
గత ఆరు నెలల్లో జనం ఎగబడి కొన్న కార్లు ఇవే - బాలెనో, డిజైర్, విండ్సర్‌కు జేజేలు
పెట్రోల్‌కు బలెనో.. CNGకి డిజైర్.. EVల్లో విండ్సర్ - 2026లో టాప్ సెల్లింగ్‌ కార్లు ఇవే!
టాటా నెక్సాన్ కామో ఎడిషన్‌లో ఆశ్చర్యపరిచే మార్పులు.. కొత్త రంగులు, 12.3 అంగుళాల స్క్రీన్, మరెన్నో!
టాటా నెక్సాన్‌ కామో ఎడిషన్ లాంచ్ - రూ.9.99 లక్షలే! ఏంటి దీని స్పెషాలిటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget