ఇప్పటివరకు భారత్ NCAP క్రాష్ టెస్ట్‌కు వెళ్లిన 31 కార్లు - ఏవి 5 స్టార్, ఏవి 4 స్టార్ సాధించాయి?
భారత్ NCAP ఇప్పటివరకు పరీక్షించిన 31 కార్లలో ఏ మోడళ్లకు 5 స్టార్ & 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించిందో తెలుసుకోండి. క్రాష్ టెస్ట్ ఫలితాలు, భద్రతా వివరాలు & పూర్తి జాబితా ఇక్కడ ఉంది.

Bharat NCAP 5 Star Safety Cars: కొత్త కారులో ఫీచర్లే కాదు, భద్రత కూడా ముఖ్యమే. కార్ల భద్రతకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో, భారత ప్రభుత్వం 2023లో భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (Bharat NCAP లేదా భారత్ ఎన్‌క్యాప్)ను ప్రారంభించింది. దేశంలో విక్రయించే కార్లకు క్రాష్ టెస్టులు నిర్వహించి భద్రత రేటింగ్ ఇవ్వడం ఈ సంస్థ ప్రధాన బాధ్యత. ఈ రేటింగ్ వచ్చాక కొత్త కారు కొనుగోలు చేసే సమయంలో సేఫ్టీ పరంగా సరైన నిర్ణయం తీసుకునే అవకాశం కలుగుతోంది. ఇప్పటివరకు భారత్ NCAP మొత్తం 31 వాహనాలను పరీక్షించగా, వాటిలో అత్యధికంగా ఎస్‌యూవీలే ఉన్నాయి.
జులై 09, 2026న లాంచ్ అయిన నిస్సాన్ టెక్టాన్ పూర్తి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 32కి 30.49 పాయింట్లు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 49కి 45 పాయింట్లు సాధించింది. ఈ రేటింగ్ టెక్టాన్ అన్ని వేరియంట్లకు వర్తిస్తుంది.
రెనాల్ట్ డస్టర్ కూడా ఇదే స్థాయి 5 స్టార్ రేటింగ్ అందుకుంది.
2026లో పరీక్షించిన హ్యుందాయ్ వెన్యూ, కియా సెల్టోస్, టాటా సియెర్రా, విన్‌ఫాస్ట్ VF7, విన్‌ఫాస్ట్ VF6 & టాటా పంచ్ కూడా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించాయి. ఈ మోడళ్లలో 6 లేదా 7 ఎయిర్‌బ్యాగ్స్, ESC, TPMS, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, ADAS వంటి ఆధునిక భద్రత ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: టెక్టాన్ వర్సెస్ డస్టర్ - ఒకే రూపంతో ఉన్న కవల SUVలు; డిజైన్ నుంచి ధర వరకు పూర్తి కంపారిజన్
2025లో... మారుతి సుజుకి ఈ విటారా, హోండా అమేజ్, సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్, మారుతి ఇన్విక్టో, టాటా ఆల్ట్రోజ్, మారుతి విక్టోరిస్, టయోటా ఇన్నోవా హైక్రాస్, టాటా హారియర్ EV, మారుతి డిజైర్, టాటా నెక్సాన్ EV, కియా సైరోస్, స్కోడా కైలాక్, మహీంద్రా XEV 9e & మహీంద్రా BE 6 కూడా 5 స్టార్ రేటింగ్ సాధించాయి. వీటిలో టాటా హారియర్ EV & మహీంద్రా XEV 9e అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో అత్యుత్తమ స్కోర్లు నమోదు చేయడం విశేషం.
2024లో... మహీంద్రా థార్ రాక్స్, మహీంద్రా XUV 3XO, టాటా నెక్సాన్, టాటా కర్వ్, టాటా కర్వ్ EV కూడా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకున్నాయి. సిట్రోయెన్ బసాల్ట్ మాత్రం అడల్ట్ & చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 4 స్టార్ రేటింగ్‌తో సరిపెట్టుకుంది.
ఇది కూడా చదవండి: భారత్‌లోకి నిస్సాన్ టెక్టాన్ ఎంట్రీ - 6 వేరియంట్లు, టర్బో పెట్రోల్ ఇంజిన్లు & ప్రీమియం ఫీచర్లతో లాంచ్
భారత్ NCAP ప్రారంభ దశలోనే టాటా హారియర్ & టాటా సఫారి మోడళ్లను పరీక్షించి రెండింటికీ 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది. ఇవి భద్రత ప్రమాణాల్లో అత్యుత్తమ ఫలితాలు నమోదు చేశాయి.
Bharat NCAP ఇప్పటివరకు పరీక్షించిన 31 వాహనాల్లో కేవలం రెండు మోడళ్లకు మాత్రమే 4 స్టార్ రేటింగ్‌తో సరిపెట్టుకున్నాయి, అవి మారుతి సుజుకి బలెనో & సిట్రోయెన్ బసాల్ట్. మిగిలిన అన్ని కార్లు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించడం భారత్‌లో కార్ల భద్రత ప్రమాణాలు వేగంగా మెరుగుపడుతున్నాయని సూచిస్తోంది. కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి భారత్ NCAP రేటింగ్ ఒక ముఖ్యమైన ప్రమాణంగా మారుతోంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















