అన్వేషించండి

టెక్టాన్ వర్సెస్ డస్టర్ - ఒకే రూపంతో ఉన్న కవల SUVలు; డిజైన్‌ నుంచి ధర వరకు పూర్తి కంపారిజన్

నిస్సాన్ టెక్టాన్ & రెనాల్ట్ డస్టర్ మధ్య డిజైన్, ఇంటీరియర్, ఫీచర్లు, ఇంజిన్, ధరల్లో ఉన్న తేడాలు ఏంటి? ఏ ఎస్‌యూవీ ఏ విషయంలో మెరుగ్గా ఉందో పూర్తి వివరాలు తెలుసుకోండి.

Nissan Tekton vs Renault Duster: భారత మార్కెట్‌లో నిస్సాన్ టెక్టాన్ అధికారికంగా అడుగుపెట్టడంతో మిడ్‌సైజ్ ఎస్‌యూవీ విభాగంలో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. రెనాల్ట్ డస్టర్ ఆధారంగా రూపొందిన ఈ కొత్త మోడల్ యాంత్రికంగా దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ... డిజైన్, ఇంటీరియర్ స్టైలింగ్ & కొన్ని చిన్న మార్పులతో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. గతంలో డస్టర్ ఆధారంగానే టెరానోను విక్రయించిన నిస్సాన్, ఇప్పుడు టెక్టాన్ రూపంలో మరోసారి అదే ఫార్ములాతో మార్కెట్‌లోకి వచ్చింది.

డిజైన్‌
బయటి డిజైన్ పరంగా చూస్తే, టెక్టాన్‌కు నిస్సాన్ పెట్రోల్ నుంచి స్ఫూర్తి పొందిన బాక్సీ లుక్‌ను అందించారు. రెండు ఎస్‌యూవీల సిల్హౌట్ ఒకేలా ఉన్నప్పటికీ, ముందు భాగంలో టెక్టాన్ కొంత భిన్నంగా కనిపిస్తుంది. సన్నని LED హెడ్‌ల్యాంప్స్, వాటిని కలుపుతూ ఉన్న LED లైట్ బార్, C ఆకారంలోని DRLs దీనికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. డస్టర్‌లో ఐబ్రో స్టైల్ DRLs ఉండగా, టెక్టాన్‌లో కొత్త డిజైన్‌ను ఉపయోగించారు.

గ్రిల్ విషయంలో కూడా రెండు మోడళ్ల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తుంది. టెక్టాన్‌లో మధ్యలో నిస్సాన్ లోగోతో సంప్రదాయ గ్రిల్ ఉండగా, బోనెట్‌పై 'TEKTON' అక్షరాలు ఉన్నాయి. గ్రిల్‌పై ఎరుపు రంగు స్ట్రిప్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మరోవైపు డస్టర్‌లో గ్రిల్‌పైనే 'DUSTER' అక్షరాలు ఉంటాయి. ముందు బంపర్ డిజైన్‌లో కూడా టెక్టాన్‌లో సిల్వర్ ఫినిష్ తక్కువగా ఉపయోగించారు.

ఇది కూడా చదవండి: టీవీఎస్‌ X కు గట్టి పోటీగా వచ్చిన యమహా ఏరోక్స్-E - ధరకు తగ్గ విలువ, రేంజ్, ఫీచర్లలో ఏ స్కూటర్‌ బెస్ట్?

సైడ్ ప్రొఫైల్‌లో 18 అంగుళాల కొత్త మల్టీ స్పోక్ అలాయ్ వీల్స్, ముందు ఫెండర్‌పై ప్రత్యేక బ్యాడ్జింగ్, సిల్వర్ రూఫ్ రైల్స్ టెక్టాన్‌కు ప్రత్యేక రూపాన్ని ఇస్తాయి. అయితే వీల్ ఆర్చ్ క్లాడింగ్, ముందు సాధారణ డోర్ హ్యాండిల్స్, వెనుక C పిల్లర్‌లో డోర్ హ్యాండిల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా వంటి అంశాలు రెండు ఎస్‌యూవీల్లో ఒకే విధంగా ఉన్నాయి.

వెనుక భాగంలో కూడా టెక్టాన్ తన ప్రత్యేకతను చాటుకుంది. డస్టర్‌లో త్రిభుజాకార టెయిల్‌ల్యాంప్స్ ఉండగా, టెక్టాన్‌లో పెట్రోల్‌ను గుర్తు చేసే C ఆకార LED టెయిల్‌ల్యాంప్స్ ఉన్నాయి. వెనుక బంపర్‌పై కూడా అదే తరహా సిల్వర్ డిజైన్‌ను కొనసాగించారు.

క్యాబిన్‌లో టాప్ వేరియంట్ టెక్టాన్‌కు రోజ్ గోల్డ్ & బర్గండీ డ్యూయల్ టోన్ థీమ్‌ను అందించారు. డస్టర్‌లో మాత్రం బ్లాక్ & గ్రీన్ థీమ్ ఉంటుంది. స్టీరింగ్ వీల్, డ్యాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్ & డోర్ హ్యాండిల్స్‌పై గోల్డ్ ఫినిష్ ఇన్‌సర్ట్స్ టెక్టాన్‌కు మరింత ప్రీమియం లుక్‌ను తీసుకొచ్చాయి.

ఇది కూడా చదవండి: బైక్ చైన్ మరీ వదులుగా లేదా బిగుతుగా ఉండటం వల్ల కూడా మైలేజ్ తగ్గుతుందా?

ఫీచర్లు
ఫీచర్ల పరంగా రెండు మోడళ్లు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, 6 విధాలుగా అడ్జస్ట్ అయ్యే వెంటిలేటెడ్ ముందు సీట్లు అందుబాటులో ఉన్నాయి. భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్, లెవల్ 2 ADAS, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ముందు & వెనుక పార్కింగ్ సెన్సర్లు ఉన్నాయి. రెండు ఎస్‌యూవీలకూ భారత్ NCAP నుంచి 5 స్టార్ క్రాష్ సేఫ్టీ రేటింగ్ లభించింది.

ఇంజిన్ ఎంపికల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. 100 హెచ్‌పీ శక్తి ఉత్పత్తి చేసే 1.0 లీటర్ టర్బో పెట్రోల్ & 163 హెచ్‌పీ శక్తి అందించే 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లు అందుబాటులో ఉన్నాయి. రెండు ఇంజిన్లకూ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లభిస్తుంది. శక్తివంతమైన 1.3 లీటర్ ఇంజిన్‌కు మాత్రమే 7 స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపిక ఉంది. అయితే డస్టర్‌లో దీపావళి నాటికి రానున్న 1.8 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌ను టెక్టాన్‌లో అందించబోమని నిస్సాన్ ఇప్పటికే స్పష్టం చేసింది.

ధరలు 
రెండు ఎస్‌యూవీల ప్రారంభ ధర రూ.10.49 లక్షలుగానే ఉంది. అయితే, టాప్ వేరియంట్‌లో టెక్టాన్ ధర డస్టర్ కంటే రూ.10,000 తక్కువగా ఉండటం విశేషం. మార్కెట్‌లో ఈ రెండు ఎస్‌యూవీలు Maruti Grand Vitara and Victoris, Hyundai Creta, Kia Seltos, Tata Sierra, Honda Elevate, Skoda Kushaq, Volkswagen Taigun వంటి మోడళ్లతో పోటీ పడనున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate Facelift గ్రాండ్ ఎంట్రీ... ఫైనాన్స్‌లో కొనాలంటే ముందుగా ఎంత డౌన్‌పేమెంట్ చేయాలి, EMI ఎంతవుతుందో పూర్తి వివరాలు
రాయల్ లుక్ & అడ్వాన్డ్స్‌ టెక్నాలజీతో Honda Elevate Facelift లాంచ్‌.. నెలకు రూ.16,000 EMIతో కొనేయవచ్చు!
Pulsar Bikes Discount Sale: యూత్ ఇష్టపడే పల్సర్ బైకులపై భారీ డిస్కౌంట్.. డౌన్‌పేమెంట్, నెలవారీ EMI వివరాలు
యూత్ ఇష్టపడే Pulsar Bikes పై భారీ డిస్కౌంట్.. డౌన్‌పేమెంట్, నెలవారీ EMI వివరాలు
Triumph Bonneville T40 vs పోటీ బైక్‌లు: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, హోండా, జావా.. ధర, ఫీచర్లలో ఏది బెటర్‌ ఆప్షన్‌?
ట్రయంఫ్ బొన్నెవిల్ T40 vs రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350, హోండా CB350C, జావా 350 - ఏది బెటర్‌?
Bonneville T40 తో పాటు ట్రయంఫ్ నుంచి 3 కొత్త బైక్‌లు.. 798cc భారీ ఇంజిన్‌తో స్ట్రీట్ ట్రిపుల్ బైక్‌
798cc ఇంజిన్‌తో కొత్త Triumph Street Triple 798 బైక్‌.. Tiger 900, Tiger 1200 బైకుల్లో రాడార్‌ టెక్నాలజీ!
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Embed widget