అన్వేషించండి

Bike Chain Effect On Mileage: బైక్ చైన్ మరీ వదులుగా లేదా బిగుతుగా ఉండటం వల్ల కూడా మైలేజ్ తగ్గుతుందా?

Bike Chain Effect On Mileage: బైక్ డ్రైవ్ చైన్ ఇంజిన్ నుంచి వెనుక చక్రానికి  పవర్‌ను ప్రసారం చేస్తుంది. చైన్ సరైన బిగువుతో ఉండి, తగినంత లూబ్రికెంట్‌  కలిగి ఉంటే, బండి సజావుగా ముందుకెళ్తుంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అతి బిగుతు చైన్, ఇతర అలవాట్లు బైక్ మైలేజ్ తగ్గిస్తాయి.

Bike Chain Effect On Mileage: భారత్‌లో లక్షలాది మంది ప్రజలు ప్రతిరోజూ ఆఫీసు, కళాశాల లేదా ఇతర ప్రయోజనాల కోసం బైక్‌లను ఉపయోగిస్తారు. అటువంటి పరిస్థితులలో, ప్రతి రైడర్ తమ బైక్ మంచి మైలేజ్ ఇవ్వాలని, ఎటువంటి సమస్యలు లేకుండా చాలా కాలం పాటు నడవాలని కోరుకుంటారు. కానీ చాలాసార్లు ప్రజలు ఇంజిన్ ఆయిల్, పెట్రోల్ లేదా టైర్లపై శ్రద్ధ చూపుతూ, బైక్ చైన్ సంరక్షణను నిర్లక్ష్యం చేస్తారు. ఈ చిన్న నిర్లక్ష్యం క్రమంగా బైక్ మైలేజ్ పనితీరును,  ఇంజిన్‌ను ప్రభావితం చేస్తుంది. కాబట్టి, బైక్ చైన్ మరీ వదులుగా లేదా మరీ బిగుతుగా ఉండటం వల్ల కూడా మైలేజ్‌పై ప్రభావం పడుతుందా అనే విషయాన్ని చూద్దాం. 

మైలేజీతో బైక్ చైన్ సంబంధం 

బైక్ డ్రైవ్ చైన్ ఇంజిన్ నుంచి వెనుక చక్రానికి శక్తిని ప్రసారం చేస్తుంది. చైన్ సరైన బిగువుతో ఉండి, తగినంతగా లూబ్రికేట్ చేస్తే, శక్తి బదిలీ సజావుగా జరుగుతుంది. అయితే, చైన్ వదులుగా ఉన్నా లేదా మరీ బిగుతుగా ఉన్నా, ఘర్షణ పెరిగి, బైక్‌ను ముందుకు నడపడానికి ఇంజిన్ మరింత కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల ఇంధన వినియోగం పెరిగి, మైలేజ్ తగ్గుతుంది. అంతేకాకుండా, పొడిగా ఉన్న, తుప్పు పట్టినా, లేదా మురికిగా ఉన్న చైన్ కూడా డ్రైవింగ్‌కు ఆటంకం కలిగిస్తుంది, ఇది బైక్ పనితీరును ప్రభావితం చేస్తుంది. 

బైక్ చైన్ వదులుగా ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? 

మీరు బండి నడుపుతున్నప్పుడు వెనుక భాగం నుంచి శబ్దం వినపడితే, గేర్లు మార్చేటప్పుడు షేక్ అవుతున్నట్టు అనిపిస్తే, లేదా వేగంగా వెళ్తున్నా కూడా బండి సజావుగా వెళ్లకపోతే, ఇది చైన్ వదులుగా ఉందనడానికి సంకేతం కావచ్చు. దీనిని ఇంట్లోనే సులభంగా తనిఖీ చేయవచ్చు. బండి చైన్‌ను తనిఖీ చేయడానికి, దానిని డబుల్ స్టాండ్‌పై ఉంచి, చేతితో చైన్‌ను పైకి కిందికి కదపండి. చైన్ చాలా కిందకు వేలాడుతున్నా లేదా చైన్ కవర్‌కు తగులుతున్నా, దానికి సర్దుబాటు అవసరం కావచ్చు. సాధారణంగా, ఒక బండి చైన్‌కు సుమారు 20 నుంచి 30 మిల్లీమీటర్ల  కదలిక మాత్రమే ఉండాలి. 

గొలుసు మరీ బిగుతుగా ఉండటం కూడా సమస్యే 

చైన్ ఎంత బిగుతుగా ఉంటే అంత మంచిదని చాలా మంది అనుకుంటారు. అయితే, ఇది నిజం కాదు. మరీ బిగుతుగా ఉన్న చైన్ ఇంజిన్, గేర్‌బాక్స్, బేరింగ్‌లపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల చైన్ అరిగిపోవచ్చు. దీర్ఘకాలంలో, అది తెగిపోయే ప్రమాదం కూడా పెరుగుతుంది. అందువల్ల, చైన్ టెన్షన్‌ను ఎల్లప్పుడూ తయారీదారు నిర్దేశించిన ప్రమాణాల ప్రకారమే నిర్వహించాలి. 

ఈ పొరపాట్లు మైలేజీని కూడా తగ్గిస్తాయి. 

బైక్ మైలేజ్ కేవలం చైన్‌పై మాత్రమే ఆధారపడి ఉండదు; అనేక ఇతర అలవాట్లు కూడా ఇంధన సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి. తరచుగా వేగాన్ని పెంచడం, అకస్మాత్తుగా బ్రేకులు వేయడం, రాం్‌ గేర్‌లో నడపడం, అధిక బరువును మోయడం వంటివన్నీ ఇంజిన్‌పై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి. అదేవిధంగా, టైర్లలో గాలి తక్కువగా ఉండటం, మురికిగా ఉన్న ఎయిర్ ఫిల్టర్, లోపభూయిష్టమైన స్పార్క్ ప్లగ్‌లు, సకాలంలో ఇంజిన్ ఆయిల్ మార్చకపోవడం, సరైన టైంలో సర్వీసింగ్‌ చేయకుండా నిర్లక్ష్యం చేస్తే మైలేజ్ తగ్గడానికి దోహదం చేస్తాయి.

Frequently Asked Questions

చైన్ కాకుండా, బైక్ మైలేజ్ తగ్గించడానికి ఇతర కారణాలు ఏమిటి?

తరచుగా వేగం పెంచడం, అకస్మాత్తుగా బ్రేకులు వేయడం, తక్కువ టైర్ ప్రెషర్, మురికి ఎయిర్ ఫిల్టర్, ఇంజిన్ ఆయిల్ సకాలంలో మార్చకపోవడం మైలేజ్ తగ్గిస్తాయి. సర్వీసింగ్ నిర్లక్ష్యం చేయడం కూడా ఒక కారణం.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
RE క్లాసిక్ 350కి ఆర్మీ టచ్.. కొత్త గోర్ఖా ఎడిషన్ కొనేముందు తెలుసుకోవాల్సిన 7 సంగతులు
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి అట్రాక్టివ్‌ లుక్.. గోర్ఖా ఎడిషన్‌లో ఉన్న 7 ప్రత్యేకతలు ఇవే
రూ.50,000 డౌన్‌పేమెంట్‌తో Maruti Alto K10 మీ ఇంటికి.. నెలకు ఎంత EMI కట్టాలి?
చేతిలో రూ.50 వేలే ఉందా? అయినా పర్లేదు, కొత్త మారుతి ఆల్టో K10 మీ సొంతం!
KTM 390 Duke ఒకటే.. కానీ ఇంజిన్‌ వేరు, ధర వేరు - మీకు సరిపోయే వేరియంట్ ఏది?
KTM 390 Dukeలో రెండు వేరియంట్లు, రెండు ఇంజిన్లు - ధరలో భారీ తేడా ఎందుకో తెలుసా?
Advertisement

వీడియోలు

Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget