అన్వేషించండి

టీవీఎస్‌ X కు గట్టి పోటీగా వచ్చిన యమహా ఏరోక్స్-E - ధరకు తగ్గ విలువ, రేంజ్, ఫీచర్లలో ఏ స్కూటర్‌ బెస్ట్?

Yamaha Aerox-E & TVS X ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ల మధ్య పూర్తి పోలిక. ధర, బ్యాటరీ, రేంజ్, పనితీరు, ఫీచర్లు, టాప్ స్పీడ్ వంటి అన్ని అంశాల్లో ఏ స్కూటర్ బెటర్‌గా ఉందో తెలుసుకోండి.

Yamaha Aerox-E vs TVS X: భారత ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. యమహా, ఇటీవల, Aerox-E ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ.2.82 లక్షల (ఎక్స్ షోరూమ్) ధరతో లాంచ్‌ చేసింది. ప్రస్తుతం భారత మార్కెట్లో యమహా విక్రయిస్తున్న అత్యంత ఖరీదైన మోడల్ ఇదే. మరోవైపు, 2023లో విడుదలైన TVS X ఇప్పటికే ఈ విభాగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ధర, పనితీరు, రేంజ్ & ఫీచర్ల పరంగా ఈ రెండు ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ల మధ్య ఉన్న ప్రధాన తేడాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పనితీరు విషయానికి వస్తే... TVS X స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఇందులో 11.7kW గరిష్ట పవర్‌ను ఉత్పత్తి చేసే మోటార్‌ను అందించగా, Yamaha Aerox-Eలో 9.4kW మోటార్‌ను అందించారు. అయితే టార్క్ పరంగా Aerox-E ముందుంది. ఇది 48 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయగా, TVS Xలో 40 ఎన్ఎం టార్క్ లభిస్తుంది.

బ్యాటరీ సామర్థ్యంలో కూడా TVS X ఆధిక్యం కొనసాగుతోంది. ఇందులో 4.4kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. మరోవైపు Aerox-Eలో రెండు 1.5kWh రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌లు ఉండి మొత్తం సామర్థ్యం 3kWhగా ఉంటుంది. Yamaha ప్రత్యేక ఛార్జింగ్ డాక్ సాయంతో ఈ బ్యాటరీలను విడిగా ఛార్జ్ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే ఒక్కో బ్యాటరీ బరువు సుమారు 13 కిలోలు కావడంతో తరచూ వాటిని తీసి అమర్చడం కొంత అసౌకర్యంగా ఉండొచ్చు.

ఇది కూడా చదవండి: భారత్‌లోకి Volkswagen Tayron కొత్త వేరియంట్‌ రాక ఖరారు - తక్కువ ధరతో అదిరే ఫీచర్లు!

రేంజ్ పరంగా కూడా TVS X ముందంజలో ఉంది. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే IDC ప్రమాణాల ప్రకారం 159 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. Aerox-E మాత్రం 117 కిలోమీటర్ల IDC రేంజ్‌ను ప్రకటించింది. అలాగే TVS X గరిష్ట వేగం గంటకు 110 కిలోమీటర్లు కాగా, Aerox-E గంటకు 95.5 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌ను అందిస్తుంది.

బరువులో.. TVS X 134 కిలోలతో కొద్దిగా తేలికగా ఉంటుంది. Aerox-E బరువు 139 కిలోలు. సస్పెన్షన్ పరంగా రెండు స్కూటర్ల ముందు టెలిస్కోపిక్ ఫోర్క్‌ను ఉపయోగించాయి. అయితే వెనుక భాగంలో Aerox-Eకు ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉండగా, TVS Xలో మోనోషాక్‌ను అందించారు.

వీల్స్ పరంగా Yamaha Aerox-Eలో 14 అంగుళాల వీల్స్ ఉండటం వల్ల అధిక స్థిరత్వం లభించే అవకాశం ఉంది. TVS Xలో 12 అంగుళాల వీల్స్ ఉండటంతో నగర రోడ్లపై మరింత చురుకైన రైడింగ్ అనుభవం లభించవచ్చు.

ఇది కూడా చదవండి: బైక్ చైన్ మరీ వదులుగా లేదా బిగుతుగా ఉండటం వల్ల కూడా మైలేజ్ తగ్గుతుందా?

ఫీచర్లలో TVS X మరింత ఆధునికంగా కనిపిస్తుంది. ఇందులో 10.25 అంగుళాల TFT టచ్‌స్క్రీన్‌, Bluetooth కనెక్టివిటీ, Android Auto, నావిగేషన్‌, మ్యూజిక్ ప్లేబ్యాక్‌, స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్‌, హిల్ హోల్డ్‌, రివర్స్ అసిస్ట్‌, మూడు రైడింగ్ మోడ్‌లు & RAM ఎయిర్ కూలింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Yamaha Aerox-Eలో TFT డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, Eco, Standard, Power రైడింగ్ మోడ్‌లు & అదనంగా Boost మోడ్‌ అందించారు. అయితే ఫీచర్ల పరంగా TVS Xతో పోలిస్తే ఇది కొంత వెనుకబడినట్లు కనిపిస్తుంది.

ధర విషయంలో కూడా TVS Xకు ప్రయోజనం ఉంది. TVS X ధర రూ.2.66 లక్షలు (ఎక్స్ షోరూమ్) కాగా, Yamaha Aerox-E ధర రూ.2.82 లక్షలు. అంటే TVS X సుమారు రూ.16 వేల వరకు తక్కువ ధరకే లభిస్తోంది.

మొత్తం మీద పనితీరు, రేంజ్, ఫీచర్లు & ధర పరంగా చూస్తే TVS X మరింత విలువైన ఎంపికగా కనిపిస్తోంది. అయితే రిమూవబుల్ బ్యాటరీలు, 14 అంగుళాల వీల్స్ & Yamaha బ్రాండ్‌ను కోరుకునే వారికి Aerox-E కూడా మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. ప్రస్తుతం ఈ రెండు స్కూటర్లు కూడా పరిమిత నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండటం గమనించాల్సిన అంశం.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget