అన్వేషించండి

E20 ఇంధనంపై మరో కొత్త చర్చ - పాత బైక్‌లు, కార్ల రబ్బర్‌ భాగాలు పాడయ్యే ఛాన్స్‌!

E20 పెట్రోల్‌పై ARAI అధ్యయనం మరోసారి చర్చకు వచ్చింది. పాత వాహనాల్లో రబ్బర్ & ప్లాస్టిక్ ఫ్యూయల్ సిస్టమ్ భాగాలు దెబ్బతినే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.

E20 petrol could damage rubber parts: దేశంలో E20 పెట్రోల్‌పై అనుమానాల పరంపరకు అడ్డుకట్ట పడడం లేదు. E20 ఇంధనం వల్ల ఇంజిన్‌లు దెబ్బతింటున్నాయంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న వేళ, 2021లో ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) నిర్వహించిన అధ్యయనం మరోసారి చర్చనీయాంశంగా మారింది. E20 పెట్రోల్‌ వినియోగం వల్ల లోహ భాగాలపై పెద్దగా ప్రభావం లేకపోయినా, కొన్ని రబ్బర్ & ప్లాస్టిక్ భాగాలపై దీర్ఘకాలంలో ప్రభావం ఉండే అవకాశం ఉందని ఈ అధ్యయనంలో వెల్లడైంది.

పరిశోధన ఇలా సాగింది...

ఈ పరిశోధనలో ఫ్యూయల్ సిస్టమ్‌లో ఉపయోగించే 8 రకాల లోహాలు, 6 రకాల ఎలాస్టోమర్లు, 4 రకాల ప్లాస్టిక్ పదార్థాలను పరీక్షించారు. నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద నిర్ణీత కాలం పాటు E20 ఇంధనంలో ముంచి వాటి పనితీరును పరిశీలించారు. పోలిక కోసం E10 పెట్రోల్‌ను ప్రామాణికంగా తీసుకుని రెండు ఇంధనాల ప్రభావాన్ని విశ్లేషించారు.

లోహాలపై తుప్పు పట్టే స్థాయిని బరువు మార్పుల ఆధారంగా అంచనా వేశారు. అదే సమయంలో రబ్బర్ & ప్లాస్టిక్ భాగాల్లో బరువు, పరిమాణం, బలం, సాగుదల, గట్టితనం వంటి లక్షణాల్లో వచ్చిన మార్పులను పరిశీలించారు.

ఇది కూడా చదవండి: రూ.6 లక్షలకే కొత్త SUV తీసుకొస్తున్న మారుతి! టాటా పంచ్‌కి షాక్ తప్పదా?

ARAI నివేదిక ప్రకారం, E20 ఇంధనం వల్ల లోహ భాగాలపై గణనీయమైన ప్రభావం కనిపించలేదు. అయితే NBR-PVC, ఎపిక్లోరోహైడ్రిన్ వంటి రబ్బర్ పదార్థాలు & PA66 అనే ప్లాస్టిక్ పదార్థంపై సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఎక్కువ ప్రభావం కనిపించినట్లు పేర్కొంది. ఈ పదార్థాలను సాధారణంగా గ్యాస్కెట్లు, సీల్స్, O-రింగ్స్, పైపులు, హోస్‌లు వంటి ఫ్యూయల్ సిస్టమ్ భాగాల తయారీలో ఉపయోగిస్తారు. దీర్ఘకాలం E20 వినియోగిస్తే ఈ భాగాలు వేగంగా అరిగిపోయే అవకాశం ఉందని అధ్యయనం సూచించింది.

అదే ఏడాది విడుదలైన నీతి ఆయోగ్ నివేదిక కూడా ఈ అంశాన్ని ప్రస్తావించింది. వాహనం రకాన్ని బట్టి సగటున 6 శాతం వరకు ఫ్యూయల్ ఎఫిషియెన్సీ తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. అయినప్పటికీ ఇంజిన్ పనితీరు, స్టార్ట్ సామర్థ్యం, డ్రైవబిలిటీ వంటి అంశాల్లో ఎలాంటి తీవ్రమైన లోపాలు కనిపించలేదని స్పష్టం చేసింది. ఇంజిన్‌లో అసాధారణ అరుగుదల, కార్బన్ డిపాజిట్లు లేదా ఇంజిన్ ఆయిల్ నాణ్యత తగ్గిన ఆనవాళ్లు కూడా గుర్తించలేదని నివేదిక వెల్లడించింది.

ఇటీవల సోషల్ మీడియాలో E20 పెట్రోల్ వల్ల ఇంజిన్‌లు దెబ్బతింటున్నాయంటూ అనేక పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే ఇప్పటివరకు వాటిని నిర్ధారించే స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇటీవల ఒక ఇన్నోవా హైక్రాస్ యజమాని చేసిన ఆరోపణలను టయోటా కూడా ఖండించింది. ఆ వాహనంలో తలెత్తిన సమస్య E20 వల్ల కాదని, కలుషితమైన ఇంధనం కారణమని కంపెనీ స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: E20పై కేంద్రమంత్రి కీలక ప్రకటన! హర్దీప్ సింగ్ ఏం చెప్పారంటే?

2023 ఏప్రిల్ తర్వాత తయారైన కొత్త కార్లు & ద్విచక్ర వాహనాలు ఇప్పటికే E20 ప్రమాణాలకు అనుగుణంగా తయారవుతున్నాయి. కాబట్టి అలాంటి వాహనాల యజమానులు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ E20 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించని పాత వాహనాల విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అవసరం. ఫ్యూయల్ సిస్టమ్‌లోని రబ్బర్ & ప్లాస్టిక్ భాగాలను ప్రత్యేక అప్‌గ్రేడ్ కిట్లతో మార్చుకోవచ్చు. అయితే ఇప్పటివరకు ఏ వాహన తయారీ సంస్థ కూడా అధికారికంగా అలాంటి కిట్లను అందుబాటులోకి తీసుకురాలేదు. ప్రస్తుతం కొన్ని థర్డ్ పార్టీ సంస్థల వద్ద మాత్రమే ఇవి లభిస్తున్నాయి. వాటి ఖర్చును పూర్తిగా వాహన యజమానే భరించాల్సి ఉంటుంది.

ఇదిలా ఉంటే, E20కే పరిమితం కాకుండా  భవిష్యత్తులో E22, E25, E27 & E30 వంటి అధిక ఎథనాల్ మిశ్రమ ఇంధనాలను కూడా ప్రవేశపెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న E10 & E20 వాహనాలపై E25 ప్రభావాన్ని అధ్యయనం చేయాలని ARAIకి బాధ్యతలు అప్పగించారు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
Royal Enfield Guerrilla 450 - Triumph Tracker 400 మధ్య పోటీ.. ఏ బండి ముందుగా 100 కి.మీ. వేగాన్ని అందుకుంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 vs ట్రయంఫ్ ట్రాకర్ 400.. వేగంలో ఏది కింగ్? రియల్‌ టెస్ట్‌లో తేలిన నిజాలివే!
పెట్రోల్, డీజిల్‌కు ఇక CNG తోడు.. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XOలో సన్‌రూఫ్‌తో కొత్త లుక్‌
Mahindra XUV 3XO తో మరింత మైలేజ్‌.. CNG వేరియంట్‌ వచ్చేస్తోంది.. అక్టోబర్ 15న!
పెద్ద చక్రాలు, కొత్త ఇంజిన్‌.. Aprilia SXR GT 125లో ఇంకా ఏం ఉన్నాయో కొనే ముందే తెలుసుకోండి
సూపర్‌ స్టైలిష్‌ స్కూటర్‌ Aprilia SXR GT 125 మీద ఇంట్రెస్ట్‌ ఉందా?, ఈ 5 విషయాలు మీకు తెలుసా?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget