అన్వేషించండి

EV కొనాలనుకుంటున్నారా? BaaS స్కీమ్‌తో లక్షల రూపాయలు ఆదా - పూర్తి జాబితా ఇదే

భారత్‌లో Battery as a Service (BaaS) స్కీమ్‌తో Hyundai, Tata, MG, Maruti, Kia, Toyota & Citroen కంపెనీలు EVలను తక్కువ ప్రారంభ ధరతో అందిస్తున్నాయి.

Electric cars available with BaaS scheme: భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు క్రమంగా పెరుగుతున్నప్పటికీ, పెట్రోల్ & డీజిల్ కార్లతో పోలిస్తే అధిక ధరలు ఇప్పటికీ కొనుగోలుదారులకు ప్రధాన అడ్డంకిగా ఉన్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థలు Battery as a Service (BaaS) స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ విధానంలో వాహనం ధర నుంచి బ్యాటరీ ధరను వేరు చేసి, బ్యాటరీ కోసం కిలోమీటర్‌కు లేదా నెలవారీ అద్దె చెల్లించే అవకాశం కల్పిస్తున్నాయి. దీంతో ప్రారంభంలో చెల్లించాల్సిన మొత్తం భారీగా తగ్గుతుంది.

ప్రస్తుతం భారత్‌లో Hyundai, Citroen, JSW MG, Maruti Suzuki, Kia, Tata Motors & Toyota కంపెనీలు తమ ఎలక్ట్రిక్ కార్లకు BaaS స్కీమ్‌ను అందిస్తున్నాయి. ఈ పథకం ద్వారా లక్షల రూపాయల వరకు ప్రారంభ ఖర్చు తగ్గించుకోవచ్చు.

Citroen eC3X ప్రస్తుతం BaaS స్కీమ్‌లో అత్యంత తక్కువ బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ఛార్జీ అందిస్తున్న మోడల్‌గా నిలిచింది. BaaS లేకుండా దీని ప్రారంభ ధర రూ.11.99 లక్షలు కాగా, BaaS స్కీమ్‌తో ప్రారంభ ధర రూ.6.89 లక్షలకు తగ్గుతుంది, రూ.5.10 లక్షలు ఆదా అవుతుంది. BaaS తీసుకుంటే బ్యాటరీ కోసం కిలోమీటర్‌కు రూ.2.26 చెల్లించాలి. కనీసంగా నెలకు 2,000 కిలోమీటర్ల వినియోగం ఉండాలి. అంటే నెలకు రూ.4,520 నుంచి చెల్లించాల్సి ఉంటుంది. BaaS తీసుకోని వారికి కంపెనీ రూ.1.50 లక్షల వరకు ప్రత్యేక డిస్కౌంట్ కూడా అందిస్తోంది.

ఇది కూడా చదవండి: Triumph 350cc రేంజ్‌పై మరో ధరల భారం - ఏ మోడల్‌కు ఎంత పెరిగిందో తెలుసా?

భారత్‌లో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారుగా పేరొందిన Tata Tiago EV సాధారణంగా రూ.6.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అయితే BaaS స్కీమ్‌తో దీని ప్రారంభ ధర రూ.4.69 లక్షలకు తగ్గుతుంది. బ్యాటరీ కోసం కిలోమీటర్‌కు రూ.2.60 చెల్లించాలి.

MG Comet EV కొనాలనుకుంటే, Non-BaaS ధర రూ.7.63 లక్షల నుంచి స్టార్ట్‌ అవుతుంది. BaaS స్కీమ్‌ కింద ఈ కారు కొంటే ధర రూ.4.99 లక్షల నుంచే ప్రారంభమవుతుంది. ఈ స్కీమ్ ద్వారా రూ.2.64 లక్షల వరకు ప్రారంభ ఖర్చును తగ్గించుకోవచ్చు. బ్యాటరీ అద్దె కిలోమీటర్‌కు రూ.3.20గా నిర్ణయించారు. 

Tata Punch EV కూడా BaaS ఆప్షన్‌తో అందుబాటులో ఉంది. నాన్‌-బ్యాస్‌తో దీని ధర రూ.9.69 నుంచి ప్రారభమవుతుండగా, బ్యాస్‌తో ధర రూ.6.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. బ్యాటరీని ఎనిమిదేళ్ల వరకు ఫైనాన్స్ చేసుకునే అవకాశం ఉంది. సాధారణ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంటే నెలకు రూ.4,688 లేదా కిలోమీటర్‌కు సుమారు రూ.2.60 ఖర్చు అవుతుందని టాటా తెలిపింది.

ఇది కూడా చదవండి: ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న కారును కొనడం లాభదాయకమేనా? పూర్తి వివరాలు తెలుసుకోండి!

MG Windsor EVతోనే భారత్‌లో తొలిసారిగా BaaS విధానాన్ని పరిచయం చేసింది MG. ప్రస్తుతం ఈ మోడల్ ప్రారంభ ధర రూ.14.7 లక్షలు కాగా, బ్యాస్‌తో రూ.9.99 లక్షలకు వస్తుంది. 38kWh బ్యాటరీకి కిలోమీటర్‌కు రూ.3.99 & 52.9kWh బ్యాటరీకి రూ.4.50 చొప్పున చెల్లించాలి. ఈ విధానంతో గరిష్టంగా రూ.5 లక్షల వరకు ప్రారంభ ఖర్చు తగ్గుతుంది.

Hyundai Creta Electric తాజాగా BaaS స్కీమ్‌లో చేరింది. BaaSతో దీని ప్రారంభ ధర రూ.18.03 లక్షల నుంచి రూ.10.99 లక్షలకు తగ్గుతుంది. బ్యాటరీ అద్దె కిలోమీటర్‌కు రూ.3.90గా ఉంది. ఈ స్కీమ్‌తో కొనుగోలుదారులు ప్రారంభంలోనే రూ.7.04 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడళ్లలో ఇదే అత్యధిక ఆదా.

Maruti Suzuki e Vitara కూడా BaaS విధానంలో అందుబాటులో ఉంది. 49kWh బ్యాటరీకి కిలోమీటర్‌కు రూ.3.99 & 61kWh బ్యాటరీ ప్యాక్‌కు రూ.4.39 చొప్పున సబ్‌స్క్రిప్షన్ ఫీజు ఉంటుంది. BaaS స్కీమ్‌ తీసుకుంటే ఈ EV ప్రారంభ ధర 15.99 లక్షల నుంచి 10.99 లక్షలకు తగ్గుతుంది. 

దేశంలో BaaS స్కీమ్‌తో లభిస్తున్న ఏకైక ఎలక్ట్రిక్ MPVగా Kia Carens Clavis EV ప్రత్యేకత సాధించింది. BaaS లేకుండా ఈ కారు ప్రారంభ ధర రూ. 18 లక్షలు కాగా, బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుంటే రూ.12.84 లక్షలకు వస్తుంది. రెండు బ్యాటరీ ఆప్షన్లకూ (42kWh, 51.4kWh) కిలోమీటర్‌కు రూ.3.30 చొప్పున బ్యాటరీ అద్దె వసూలు చేస్తోంది. వేరియంట్‌ను బట్టి రూ.5.16 లక్షల నుంచి రూ.6.06 లక్షల వరకు ప్రారంభ ధరలో తగ్గింపు లభిస్తుంది.

MG ZS EV ధర నాన్‌-BaaS తో రూ.17.99 లక్షల నుంచి మొదవుతుంది, BaaS కింద రూ.13 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 50.3kWh బ్యాటరీ కోసం కిలోమీటర్‌కు రూ.4.50 చెల్లించాలి. ఈ స్కీమ్‌తో గరిష్టంగా రూ.5.24 లక్షల వరకు ప్రారంభ ఖర్చు తగ్గుతుంది.

Toyota Urban Cruiser Ebella కూడా BaaS స్కీమ్‌తో అందుబాటులోకి వచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 23.60 లక్షలు, బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్‌తో రూ.15.25 లక్షలకు తగ్గుతుంది. 61kWh బ్యాటరీ కోసం కిలోమీటర్‌కు రూ.4.99 చెల్లించాలి. ప్రస్తుతం ఈ జాబితాలో అత్యధిక బ్యాటరీ అద్దె ఛార్జీ ఉన్న మోడల్ ఇదే.

ఎలక్ట్రిక్ కార్ల ప్రారంభ ధరను తగ్గించి మరింత మంది వినియోగదారులను ఆకర్షించడమే BaaS స్కీమ్ ప్రధాన లక్ష్యం. రోజువారీ ప్రయాణాలు ఎక్కువగా చేసే వారికి ఈ విధానం ప్రయోజనకరంగా ఉండగా, తక్కువ వినియోగం ఉన్న వారు తమ అవసరాలను బట్టి లెక్కలు వేసుకుని నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. ధర రూ.2 లక్షలు! ఆగస్టు 27న వస్తున్న R2పై భారీ అంచనాలు
Yamaha R2లో 220cc ఇంజిన్‌! - ఈ స్పోర్ట్స్‌ బైక్‌లో ఇంకా ఎలాంటి అద్భుతాలు ఉండొచ్చు?
టాటా సియెర్రా vs కియా సెల్టోస్‌ మధ్య స్పీడ్‌ టెస్ట్‌.. ఏ కారు గెలిచింది?
Tata Sierra vs Kia Seltos - డీజిల్‌ ఆటోమేటిక్‌లో ఏ కారుకు దూకుడు ఎక్కువ?
BaaS కింద ఎలక్ట్రిక్‌ కారును కొంటే కిలోమీటర్‌కు ఎంత ఖర్చువుతుంది? భారత్‌లో BaaS EVల పూర్తి లిస్ట్ ఇదే!
బ్యాటరీ కొనే పనే లేదు.. కారు ధర ఏకంగా రూ.8.35 లక్షలు తగ్గుతుంది! BaaSతో ఈ EVలన్నీ మీ సొంతం
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Embed widget