అన్వేషించండి

ట్యూబ్‌ టైర్లా? ట్యూబ్‌లెస్‌ టైర్లా? మీ బండికి ఏవి సురక్షితం & ఏవి ఎక్కువ ఉపయోగకరం?

బైక్‌లలో ట్యూబ్‌ & ట్యూబ్‌లెస్‌ టైర్ల మధ్య తేడా ఏమిటి? ఏవి ఎక్కువ సురక్షితం, పంక్చర్ అయితే ఏవి సులభంగా రిపేర్ చేయవచ్చు, ఆఫ్‌రోడ్‌కు ఏవి అనుకూలం అనే పూర్తి వివరాలు తెలుసుకోండి.

Tubed vs Tubeless Tyres: బైక్‌లో ఇంజిన్ తర్వాత అత్యంత కీలకమైన భాగాల్లో టైర్లు ఒకటి. బైక్ ఎలా మలుపు తిరుగుతుంది, ఎంత వేగంగా బ్రేక్ వేస్తుంది, రోడ్డుపై ఎంత గ్రిప్ ఇస్తుంది అనేది టైర్లపై ఆధారపడి ఉంటుంది. అయితే టైర్లను ఎంచుకునే సమయంలో చాలామంది గ్రిప్, ట్రెడ్ ప్యాటర్న్ & బ్రాండ్‌పైనే దృష్టి పెడతారు. కానీ, గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం - ట్యూబ్‌ టైర్లా లేదా ట్యూబ్‌లెస్‌ టైర్లా అనేది. ప్రస్తుతం ఎక్కువ శాతం కొత్త బైక్‌లు ట్యూబ్‌లెస్‌ టైర్లతో వస్తున్నప్పటికీ, కొన్ని రకాల బైక్‌లకు ఇప్పటికీ ట్యూబ్‌ టైర్లే సరైన ఎంపికగా ఉంటాయి.

ట్యూబ్‌ టైర్లలో గాలి నేరుగా టైర్‌లో ఉండదు. టైర్ లోపల ప్రత్యేకంగా ఉండే రబ్బర్ ట్యూబ్‌లో గాలి నింపుతారు. అయితే.. టైర్ & వీల్ రిమ్.. ట్యూబ్‌లోని గాలిని బయటకు వెళ్లకుండా ఆపలేవు.

ట్యూబ్‌లెస్‌ టైర్లలో మాత్రం ప్రత్యేక ట్యూబ్ ఉండదు. టైర్ నేరుగా రిమ్‌కు గట్టిగా సీల్ అవుతుంది. గాలి టైర్ & రిమ్ మధ్యే నిల్వ ఉంటుంది. గాలి నింపే వాల్వ్ కూడా నేరుగా రిమ్‌కే అమర్చి ఉంటుంది.

భద్రత పరంగా చూస్తే ట్యూబ్‌లెస్‌ టైర్లు స్పష్టమైన ఆధిక్యం కలిగి ఉంటాయి. రోడ్డుపై మేకులు లేదా పదునైన వస్తువు టైర్‌లోకి చొచ్చుకెళ్లినా, అది సాధారణంగా టైర్‌లోనే ఇరుక్కుపోతుంది. దీంతో గాలి ఒక్కసారిగా బయటకు వెళ్లకుండా నెమ్మదిగా లీక్ అవుతుంది. రైడర్‌కు బైక్‌ను నియంత్రించి సురక్షితంగా ఆపే అవకాశం లభిస్తుంది.

ఇది కూడా చదవండి: Triumph 350cc రేంజ్‌పై మరో ధరల భారం - ఏ మోడల్‌కు ఎంత పెరిగిందో తెలుసా?

ట్యూబ్‌ టైర్లలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ట్యూబ్‌కు పంక్చర్ పడిన వెంటనే గాలి వేగంగా బయటకు వెళ్లిపోతుంది. దీంతో టైర్ ఒక్కసారిగా ఫ్లాట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అధిక వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు లేదా మలుపు వద్ద ఈ పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.

పంక్చర్ రిపేర్ విషయంలో కూడా ట్యూబ్‌లెస్‌ టైర్లదే పైచేయి. చిన్న పంక్చర్ అయితే బయట నుంచే పంక్చర్ రిపేర్ కిట్‌తో కొన్ని నిమిషాల్లోనే సరిచేయవచ్చు. వీల్ తొలగించాల్సిన అవసరం కూడా ఉండదు. ట్యూబ్‌ టైర్లలో మాత్రం వీల్‌ను తీసి, ట్యూబ్‌ను బయటకు తీసి పంక్చర్ వేయాల్సి ఉంటుంది. దీంతో సమయం ఎక్కువ పడుతుంది.

అధిక వేగంలో ప్రయాణించినప్పుడు ట్యూబ్‌లెస్‌ టైర్లు తక్కువ వేడెక్కుతాయి. ట్యూబ్ లేకపోవడం వల్ల లోపలి రాపిడి తగ్గి టైర్ జీవితకాలం కూడా కొంత మేర పెరుగుతుంది.

అయితే ట్యూబ్‌ టైర్లకు కూడా కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆఫ్‌రోడ్ రైడింగ్ చేసేవారికి ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. రాళ్లు, గుంతలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నప్పుడు రిమ్ వంగిపోయినా ట్యూబ్ కొంతవరకు గాలిని నిల్వ ఉంచుతుంది. అదే ట్యూబ్‌లెస్‌ టైర్‌లో రిమ్ దెబ్బతింటే గాలి పూర్తిగా బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి: ఈ ఐదు కార్లు రోజువారీ ఆఫీస్ వెళ్లేందుకు ఉత్తమమైనవి! పూర్తి వివరాలు ఇవే!

వీల్ రకం కూడా ఏ టైర్ ఉపయోగించాలో నిర్ణయిస్తుంది. సాధారణంగా అల్లాయ్ వీల్స్ ట్యూబ్‌లెస్‌ టైర్ల కోసం ప్రత్యేకంగా రూపొందిస్తారు. ఇవి గాలి బయటకు వెళ్లకుండా పూర్తిగా సీల్ అవుతాయి. అందుకే ఎక్కువ శాతం ఆధునిక బైక్‌లు ట్యూబ్‌లెస్‌ టైర్లతో వస్తున్నాయి.

స్పోక్ వీల్స్ ఉన్న క్లాసిక్ బైక్‌లు లేదా ఆఫ్‌రోడ్ బైక్‌లలో మాత్రం సాధారణంగా ట్యూబ్‌ టైర్లే ఉపయోగిస్తారు. ఎందుకంటే స్పోక్స్ అమర్చిన చోట చిన్న ఖాళీలు ఉండటం వల్ల గాలి బయటకు వెళ్లిపోతుంది. అయితే కొన్ని ప్రీమియం అడ్వెంచర్ బైక్‌లలో ప్రత్యేకంగా రూపొందించిన ట్యూబ్‌లెస్‌ స్పోక్ వీల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి ఖరీదైన సాంకేతికతతో తయారవుతాయి.

మార్కెట్లో స్పోక్ వీల్స్‌ను ట్యూబ్‌లెస్‌గా మార్చే టేప్‌లు & సీలెంట్ కిట్లు కూడా లభిస్తున్నాయి. అయితే ఇవి శాశ్వత పరిష్కారం కావు. సరిగ్గా అమర్చకపోతే గాలి లీక్ అయ్యే అవకాశం ఉంటుంది.

మీ బైక్... కంపెనీ నుంచే ట్యూబ్‌లెస్‌ టైర్లతో వస్తే వాటినే కొనసాగించడం ఉత్తమం. ఇవి రోజువారీ వినియోగానికి మరింత సురక్షితం, సౌకర్యవంతం & నిర్వహణ ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. మరోవైపు క్లాసిక్ బైక్‌లు లేదా ఆఫ్‌రోడ్ రైడింగ్ ఎక్కువగా చేసే వారు ట్యూబ్‌ టైర్లను ఎంచుకోవచ్చు. అయితే అలాంటి ప్రయాణాల్లో అదనపు ట్యూబ్ & అవసరమైన రిపేర్ పరికరాలు వెంట తీసుకెళ్లడం మంచిది.

మొత్తానికి ట్యూబ్‌ & ట్యూబ్‌లెస్‌ టైర్లకు వాటి ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. నగరాలు & హైవేలపై సాధారణ ప్రయాణాల కోసం ట్యూబ్‌లెస్‌ టైర్లు ఉత్తమ ఎంపిక కాగా, కఠినమైన ఆఫ్‌రోడ్ పరిస్థితుల్లో ట్యూబ్‌ టైర్లు ఇప్పటికీ విశ్వసనీయ పరిష్కారంగా నిలుస్తున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

2026 Skoda Slavia ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌లో భలే అప్‌డేట్స్‌.. వెనుక సీట్‌లో కూర్చున్నవాళ్లకు మంచి మసాజ్‌!
2026 Skoda Slavia ఫేస్‌లిఫ్ట్‌.. కొత్త ఫీచర్లతో అదరగొడుతున్న సెడాన్! బుకింగ్స్‌ ప్రారంభం
రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. ధర రూ.2 లక్షలు! ఆగస్టు 27న వస్తున్న R2పై భారీ అంచనాలు
Yamaha R2లో 220cc ఇంజిన్‌! - ఈ స్పోర్ట్స్‌ బైక్‌లో ఇంకా ఎలాంటి అద్భుతాలు ఉండొచ్చు?
Advertisement

వీడియోలు

Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Embed widget