అన్వేషించండి

భారత్‌లోకి Volkswagen Tayron కొత్త వేరియంట్‌ రాక ఖరారు - తక్కువ ధరతో అదిరే ఫీచర్లు!

భారత్‌లో Volkswagen Tayron కొత్త లోయర్ స్పెక్ వేరియంట్ జులై 10న విడుదల కానుంది. R-Line కంటే తక్కువ ధరలో అదే 2.0L టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎన్నో ప్రీమియం ఫీచర్లు అందించే అవకాశం ఉంది.

Volkswagen Tayron launch: జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్‌ (Volkswagen), భారత మార్కెట్లో తన ప్రీమియం ఎస్‌యూవీ 'టైరాన్‌'కు మరింత అందుబాటు ధరలో కొత్త వేరియంట్‌ను తీసుకురావడానికి సిద్ధమైంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో పూర్తిస్థాయి ఫీచర్లతో కూడిన R-Line వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు లోయర్ స్పెక్ వేరియంట్‌ను జులై 10న అధికారికంగా విడుదల చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇటీవల విడుదల చేసిన టీజర్ వీడియోలో కొత్త మోడల్‌కు సంబంధించిన బాహ్య భాగం & ఇంటీరియర్‌కు సంబంధించిన కొన్ని కీలక వివరాలను Volkswagen వెల్లడించింది.

టీజర్ వీడియో ప్రకారం, కొత్త Tayron ముందు భాగంలో R-Line తరహాలోనే ప్రొజెక్టర్ LED హెడ్‌ల్యాంప్స్‌, వాటిని కలిపే LED లైట్ బార్‌, మధ్యలో వెలిగే Volkswagen లోగో కనిపించాయి. అయితే గ్రిల్‌ & ముందు బంపర్ డిజైన్ మాత్రం R-Line కంటే నార్మల్‌గా ఉండే అవకాశం ఉంది. స్పోర్టీ లుక్‌ను కొంత తగ్గిస్తూ మరింత విస్తృత వినియోగదారులను ఆకర్షించేలా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

వాహనం పక్క భాగంలో కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్‌ను అమర్చారు. వీటి పరిమాణాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం R-Lineలో 19 అంగుళాల అల్లాయ్ వీల్స్ అందిస్తున్నారు. అలాగే, గ్లోస్ బ్లాక్ వీల్ ఆర్చ్‌లు, రూఫ్ రైల్స్ కూడా కొత్త వేరియంట్‌లో కనిపించాయి. వెనుక భాగంలో కనెక్టెడ్ LED టెయిల్ లైట్స్‌, మధ్యలో వెలిగే Volkswagen లోగో ఆకర్షణగా నిలుస్తున్నాయి. వెనుక బంపర్ డిజైన్ కూడా R-Lineతో పోలిస్తే భిన్నంగా ఉండనుంది.

ఇది కూడా చదవండి: E20 పెట్రోల్‌తో ఒక్క వాహనం పాడైనా తీసుకురండి! నితిన్ గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్‌!

ఇంటీరియర్‌లో, R-Lineలో ఉన్న పూర్తి బ్లాక్ థీమ్‌కు బదులుగా ఈ వేరియంట్‌లో డ్యూయల్ టోన్ సీట్లను అందించారు. ఫ్రీ స్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే కొనసాగనున్నట్లు టీజర్ చూస్తే స్పష్టమైంది. బ్లూ అంబియెంట్ లైటింగ్‌, మెటల్ పెడల్స్‌, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా కనిపించాయి. అయితే R-Lineలో ఉన్న కొన్ని హైఎండ్ ఫీచర్లను ఈ వేరియంట్‌లో తొలగించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ఇంజిన్ పరంగా మాత్రం ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని సమాచారం. ప్రస్తుతం R-Lineలో ఉపయోగిస్తున్న 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను ఇందులో కూడా అందించే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 204 హెచ్‌పీ పవర్‌, 320 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్ జత కానుండగా, AWD వ్యవస్థ ద్వారా నాలుగు చక్రాలకు శక్తి అందుతుంది.

ఇది కూడా చదవండి: 1200 కిలోమీటర్ల రేంజ్‌తో అదిరిపోయే ఫీచర్స్‌తో వస్తున్న SUVలు!

ప్రస్తుతం Volkswagen Tayron R-Line ధర రూ.46.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). కొత్త లోయర్ స్పెక్ వేరియంట్ ధర దీనికంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో ప్రీమియం ఎస్‌యూవీ కొనుగోలుదారులకు Volkswagen మరింత ఆకర్షణీయమైన ఎంపికను అందించనుంది.

భారత మార్కెట్లో ఈ కొత్త Tayron వేరియంట్ విడుదలైన తర్వాత Skoda Kodiaq & Jeep Meridian వంటి ప్రీమియం ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వనుందని ఆటోమొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

స్టైలిష్‌ లుక్‌, 260km వరకు రేంజ్‌, 114kmph టాప్ స్పీడ్‌ - Avore నుంచి మూడు కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లు
స్పోర్టీ లుక్‌తో అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్‌.. సింగిల్‌ ఛార్జ్‌తో 260km రేంజ్‌, కేవలం రూ.799కే మీ సొంతం!
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Mahindra Scorpio N ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే అప్‌డేట్లు.. ఈ కొత్త ఫీచర్లు చూస్తే కొనాలనిపించాల్సిందే!
లాంచ్‌కు ముందే ఫుల్‌గా లీకైన మహీంద్ర స్కార్పియో N.. థార్‌ రాక్స్‌ తరహా ఫీచర్లతో వస్తున్న కొత్త SUV
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Fridge Water : వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Embed widget