అన్వేషించండి

TVS ఎన్‌టార్క్ 125 పూర్తి వివరాలు - ధర, మైలేజ్, ఫీచర్లు, వేరియంట్లు ఎలా ఉన్నాయి?

TVS ఎన్‌టార్క్ 125 కొనుగోలు చేసే ముందు ధర, మైలేజ్, ఇంజిన్, ఫీచర్లు, వేరియంట్లు వంటి కీలక వివరాలను తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం.

TVS Ntorq 125 Price And Features: మన మార్కెట్‌లో స్పోర్టీ స్కూటర్ల విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో TVS ఎన్‌టార్క్ 125 ఒకటి. ఆకర్షణీయమైన డిజైన్, శక్తిమంతమైన ఇంజిన్, ఆధునిక ఫీచర్లతో యువతను ఎక్కువగా ఆకట్టుకుంటున్న ఈ స్కూటర్.. ప్రస్తుతం ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఎన్‌టార్క్ 125 కొనుగోలు చేయాలని భావిస్తున్నవారు తప్పక తెలుసుకోవాల్సిన ఐదు ముఖ్యమైన విషయాలు ఇవే.

తెలుగు రాష్ట్రాల్లో ధర
మొదటగా ధర గురించి తెలుసుకోండి. తెలుగు రాష్ట్రాల్లో TVS ఎన్‌టార్క్ 125 ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.82,500గా ఉంది. టాప్ వేరియంట్ XT ధర రూ.1,00,650 వరకు ఉంటుంది. రేస్ ఎడిషన్ ధర రూ.87,950, సూపర్ స్క్వాడ్ ఎడిషన్ రూ.91,550, రేస్ XP రూ.93,650గా నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ స్కూటర్ ఆన్ రోడ్ ధర సుమారు రూ.96,112 నుంచి రూ.1.18 లక్షల వరకు ఉంటుంది. వేరియంట్‌ను బట్టి ధరలో మార్పు ఉంటుంది.

ఇంజిన్ 
అన్ని సాధారణ వేరియంట్లలో 124.8cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను అందిస్తున్నారు. ఇది 9.5 hp పవర్‌తో పాటు 10.6 hp టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రేస్ XP వేరియంట్‌లో మాత్రం అదే ఇంజిన్‌ను మరింత పనితీరుతో ట్యూన్ చేశారు. ఇందులో 10.2 hp పవర్ & 11.5 hp టార్క్ లభిస్తుంది. పనితీరు పరంగా ఈ వేరియంట్ 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 7.61 సెకన్లలో అందుకుంటుంది.

ఇది కూడా చదవండి: రూ.6 లక్షలకే కొత్త SUV తీసుకొస్తున్న మారుతి! టాటా పంచ్‌కి షాక్ తప్పదా?

మైలేజ్ 
ఎన్‌టార్క్ 125 బలమైన అంశాల్లో మైలేజ్ ఒకటి. రేస్ XP వేరియంట్ పరీక్షల్లో నగరంలో లీటర్‌కు 52.4 కిలోమీటర్లు, హైవేపై 56.66 కిలోమీటర్ల మైలేజ్ నమోదైంది. రేస్ XP ఇంజిన్ ఎక్కువ పనితీరుతో ట్యూన్ చేసినందున, మిగిలిన వేరియంట్లు దీనికంటే స్వల్పంగా ఎక్కువ మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది.

ఫీచర్లు
ఫీచర్ల విషయంలోనూ TVS ఎన్‌టార్క్ 125 తన సెగ్మెంట్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. అన్ని వేరియంట్లలో పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అందుబాటులో ఉంటుంది. ఇందులో స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయల్ గేజ్, ఇంజిన్ ఉష్ణోగ్రత వివరాలు & ల్యాప్ టైమర్ వంటి సమాచారం కనిపిస్తుంది. TVS SmartXonnect ద్వారా Bluetooth కనెక్టివిటీ, కాల్ అలర్ట్స్, SMS అలర్ట్స్ & టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా అందుబాటులో ఉంటాయి.

రేస్ XP వేరియంట్‌లో స్ట్రీట్ మోడ్ & రేస్ మోడ్ అనే రెండు రైడింగ్ మోడ్‌లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. టాప్ వేరియంట్ XTలో స్ప్లిట్ స్క్రీన్ డిస్‌ప్లే అందిస్తున్నారు. ఇందులో TFT స్క్రీన్‌తో పాటు నెగెటివ్ LCD డిస్‌ప్లే ఉంటుంది. వాయిస్ కమాండ్స్, WhatsApp నోటిఫికేషన్స్, Instagram నోటిఫికేషన్స్, లైవ్ క్రికెట్ స్కోర్లు వంటి ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో లభిస్తాయి.

ఇది కూడా చదవండి: 026 Renault Kwidలో ఏ వేరియంట్‌ కొనడం తెలివైన నిర్ణయం - ధరలు, ఫీచర్లపై అనాలసిస్‌

వేరియంట్లు
ఈ స్కూటర్‌లో డిస్క్ వేరియంట్ బేస్ మోడల్‌గా ఉంటుంది. రేస్ ఎడిషన్‌లో స్పోర్టీ గ్రాఫిక్స్, సూపర్ స్క్వాడ్ ఎడిషన్‌లో మార్వెల్ థీమ్ గ్రాఫిక్స్ అందిస్తారు. ఈ రెండు వేరియంట్లలో ఇంజిన్ పరంగా ఎలాంటి మార్పు ఉండదు. ఎక్కువ పనితీరు కోరుకునే వారికి రేస్ XP సరైన ఎంపికగా నిలుస్తుంది. అత్యాధునిక ఫీచర్లు, ప్రీమియం డిస్‌ప్లే, మెరుగైన కనెక్టివిటీ కోరుకునే వారికి XT వేరియంట్ అనువైనది.

మొత్తం మీద TVS ఎన్‌టార్క్ 125 స్టైలిష్ డిజైన్, మంచి పనితీరు, ఆకట్టుకునే మైలేజ్ & సెగ్మెంట్‌లో అత్యుత్తమ ఫీచర్లతో యువతకు బెస్ట్ స్పోర్టీ స్కూటర్లలో ఒకటిగా కొనసాగుతోంది. మీ బడ్జెట్ & అవసరాలను బట్టి సరైన వేరియంట్‌ను ఎంపిక చేసుకుంటే మంచి విలువ లభించే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Frequently Asked Questions

TVS ఎన్‌టార్క్ 125 ధర ఎంత?

తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.82,500. టాప్ వేరియంట్ XT ధర రూ.1,00,650 వరకు ఉంటుంది. ఆన్ రోడ్ ధర రూ.96,112 నుంచి రూ.1.18 లక్షల వరకు ఉంటుంది.

TVS ఎన్‌టార్క్ 125 ఇంజిన్ వివరాలు ఏమిటి?

సాధారణ వేరియంట్లలో 124.8cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. రేస్ XP వేరియంట్ 10.2 hp పవర్ & 11.5 hp టార్క్ అందిస్తుంది.

TVS ఎన్‌టార్క్ 125 మైలేజ్ ఎంత?

రేస్ XP వేరియంట్ నగరంలో లీటర్‌కు 52.4 కిలోమీటర్లు, హైవేపై 56.66 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. మిగిలిన వేరియంట్లు దీనికంటే స్వల్పంగా ఎక్కువ మైలేజ్ ఇవ్వవచ్చు.

TVS ఎన్‌టార్క్ 125లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?

డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, Bluetooth కనెక్టివిటీ, కాల్/SMS అలర్ట్స్, టర్న్ బై టర్న్ నావిగేషన్ వంటివి ఉన్నాయి. రేస్ XPలో రైడింగ్ మోడ్‌లు, XTలో స్ప్లిట్ స్క్రీన్ డిస్‌ప్లే లభిస్తాయి.

TVS ఎన్‌టార్క్ 125 ఎన్ని వేరియంట్లలో లభిస్తుంది?

ఇది డిస్క్, రేస్ ఎడిషన్, సూపర్ స్క్వాడ్ ఎడిషన్, రేస్ XP మరియు XT అనే ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రతి వేరియంట్‌కు ప్రత్యేక గ్రాఫిక్స్ లేదా ఫీచర్లు ఉంటాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

BYD Denza N8 EV: ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
పాత Monster కంటే Ducati Monster V2 లో ఏంటి ప్రత్యేకత? ఈ 5 హైలైట్స్‌ తెలుసుకోండి
మీరు యూత్‌ అయితే, Ducati Monster V2 గురించి ఈ 5 విషయాలు మీకు తెలుసా?
టెస్లా మోడల్ Y నిజంగానే 500km రేంజ్‌ ఇస్తుందా? రోడ్డుపైకి వస్తే గానీ అసలు సంగతి తెలీలేదు
టెస్లా మోడల్ Y కెపాసిటీ ఇంతేనా? అసలు రేంజ్ తెలిస్తే షాక్‌ అవుతారు!
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget