అన్వేషించండి

2026 Renault Kwidలో ఏ వేరియంట్‌ కొనడం తెలివైన నిర్ణయం - ధరలు, ఫీచర్లపై అనాలసిస్‌

2026 Renault Kwid ఫేస్‌లిఫ్ట్ భారత్‌లో విడుదలైంది. Evolution & Climber అనే రెండు వేరియంట్లలో లభిస్తోంది. ధరలు, ఫీచర్లు, ఇంజిన్ వివరాలు & ఏ వేరియంట్ బెస్ట్ అనే పూర్తి విశ్లేషణ.

Variant of the 2026 Renault Kwid: భారత్‌లో అత్యంత అందుబాటు ధర హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటైన Renault Kwidకు 2026 మోడల్ ఇయర్ అప్‌డేట్ లభించింది. ఈ అప్‌డేట్‌లో భారీ మార్పులు లేకపోయినా, కొత్త డిజైన్ ఎలిమెంట్స్‌తో పాటు కంపెనీ తాజా లోగోను అందించారు. అంతేకాకుండా ధరలను కూడా తగ్గించి కొనుగోలుదారులకు మరింత ఆకర్షణీయంగా మార్చారు. అయితే కొత్త Renault Kwidలో ఏ వేరియంట్ కొనుగోలు చేస్తే మీ డబ్బుకు ఎక్కువ విలువ లభిస్తుందనేది ఇప్పుడు చూద్దాం.

2026 Renault Kwidలో ఇంజిన్ పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో 1.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ (NA) 3-సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌ను కొనసాగించారు. ఈ ఇంజిన్ 69 hp పవర్ & 92.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్‌ లేదా 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్రంట్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో వచ్చే ఈ కారు 28 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌ను కలిగి ఉంది. పనితీరు & మైలేజ్ పరంగా గత మోడల్‌తో పోలిస్తే ఎలాంటి మార్పులు లేవు.

2026 Renault Kwid ప్రస్తుతం Evolution & Climber అనే రెండు వేరియంట్లలో మాత్రమే విక్రయానికి అందుబాటులో ఉంది. Evolution మాన్యువల్‌ గేర్‌బాక్స్ ధర రూ.4.53 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా, AMT ఆప్షన్‌తో ధర రూ.4.90 లక్షలు. Climber మాన్యువల్‌ ధర రూ.5.15 లక్షలు కాగా, Climber AMT ధరను రూ.5.61 లక్షలుగా నిర్ణయించారు. పాత మోడల్‌తో పోలిస్తే వేరియంట్‌ను బట్టి రూ.10,000 నుంచి రూ.32,000 వరకు ధరలు తగ్గడం విశేషం.

ఇది కూడా చదవండి: 5-స్టార్ రేటింగ్ ఉన్నత మాత్రాన సేఫ్‌ కాదట! యూరో NCAP సంచలన రిపోర్ట్!

Evolution వేరియంట్‌లో... యూజర్లకు అవసరమైన అన్ని ప్రాథమిక ఫీచర్లను Renault అందించింది. ఇందులో LED DRLs, 14 అంగుళాల స్టీల్ వీల్స్, రిమోట్ కీ లెస్ ఎంట్రీ, ఫ్యాబ్రిక్ సీట్లు, Manual AC, 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్‌ కార్‌ప్లే & ఆండ్రాయిడ్‌ ఆటో, రెండు స్పీకర్లు, USB & AUX పోర్టులు, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ABS, EBD, బ్రేక్ అసిస్ట్, ESP, ట్రాక్షన్ కంట్రోల్, TPMS, రియర్ పార్కింగ్ సెన్సర్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

Climber వేరియంట్‌లో అదనంగా ORVM టర్న్ ఇండికేటర్లు, డ్యూయల్ టోన్ పెయింట్, ప్రత్యేక క్లాడింగ్, స్కిడ్ ప్లేట్లు, Climber బ్యాడ్జింగ్, డ్యూయల్ టోన్ క్యాబిన్, అన్ని డోర్లకు పవర్ విండోలు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఎలక్ట్రిక్ ORVMలు, రియర్ పార్సెల్ ట్రే, రివర్స్ కెమెరా, మాన్యువల్ అడ్జస్టబుల్ IRVM & సైడ్ ఎయిర్‌బ్యాగ్స్ అందుబాటులో ఉన్నాయి. దీనిలో మొత్తం ఆరు ఎయిర్‌బ్యాగ్స్ లభిస్తాయి. భద్రత పరంగా ఇది Evolution కంటే గణనీయంగా మెరుగ్గా నిలుస్తుంది.

ఇది కూడా చదవండి: షోరూమ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే కారు ప్రమాదానికి గురైతే నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు?

AMT వేరియంట్‌ను ఎంచుకునే వారికి అదనంగా హిల్‌ స్టార్ట్‌ అసిస్ట్‌ కూడా లభిస్తుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో డ్రైవింగ్ చేసే వారికి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. రోజువారీ ప్రయాణాల్లో క్లచ్ ఉపయోగించే అవసరం తగ్గిపోవడం కూడా AMT ప్రత్యేకత.

ధర 
Evolution Manual కంటే Climber Manual ధర రూ.62,000 ఎక్కువ. అయితే అదనంగా లభించే ఆరు ఎయిర్‌బ్యాగ్స్, రివర్స్ కెమెరా, పవర్ విండోలు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఎలక్ట్రిక్ ORVMలు, మెరుగైన ఇంటీరియర్ & స్పోర్టీ ఎక్స్‌టీరియర్ డిజైన్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఈ అదనపు ధర సమంజసంగా కనిపిస్తుంది.

రోజువారీ నగర ప్రయాణాలు ఎక్కువగా చేసే వారు Climber AMTని ఎంచుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సౌలభ్యం,హిల్‌ స్టార్ట్‌ అసిస్ట్‌, పూర్తి భద్రత ఫీచర్లు & ప్రీమియం లుక్ కారణంగా ఇదే 2026 Renault Kwidలో అత్యుత్తమ వేరియంట్‌గా చెప్పవచ్చు. బడ్జెట్ పరిమితంగా ఉంటే Evolution సరిపోతుంది. అయితే డబ్బుకు పూర్తి విలువ కావాలంటే Climber AMTనే అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Frequently Asked Questions

2026 Renault Kwid అప్‌డేట్‌లో ప్రధాన మార్పులు ఏమిటి?

కొత్త 2026 Renault Kwidలో కొత్త డిజైన్ ఎలిమెంట్స్, కంపెనీ తాజా లోగో అందించబడ్డాయి. ధరలు తగ్గించి కొనుగోలుదారులకు మరింత ఆకర్షణీయంగా మార్చారు.

2026 Renault Kwidలో ఇంజిన్ స్పెసిఫికేషన్లు ఏమిటి?

ఇందులో 1.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ 3-సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 69 hp పవర్ & 92.5 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది, 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్ ఆప్షన్లతో వస్తుంది.

2026 Renault Kwid ఏ వేరియంట్లలో అందుబాటులో ఉంది మరియు ధరలు ఎంత తగ్గాయి?

ఇది Evolution మరియు Climber అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. మునుపటి మోడల్‌తో పోలిస్తే వేరియంట్‌ను బట్టి ధరలు రూ.10,000 నుంచి రూ.32,000 వరకు తగ్గాయి.

2026 Renault Kwidలో ఏ వేరియంట్ అత్యుత్తమ విలువను అందిస్తుంది?

Climber AMT వేరియంట్ అత్యుత్తమ విలువను అందిస్తుంది. దీనికి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సౌలభ్యం, హిల్ స్టార్ట్ అసిస్ట్, పూర్తి భద్రత ఫీచర్లు మరియు ప్రీమియం లుక్ ఉన్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Maruti Brezza CNG కారు 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే EMI ఎంత కట్టాలి? మైలేజీ, పూర్తి వివరాలు
Maruti Brezza CNG కారు 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే EMI ఎంత కట్టాలి? మైలేజీ, పూర్తి వివరాలు
2026 Skoda Slaviaలో ఏ వేరియంట్ కొనాలి? మీ డబ్బుకు తగిన విలువ ఇచ్చేది ఇదే!
2026 Skoda Slavia.. ఈ వేరియంట్‌లోనే అసలైన వాల్యూ! ఫీచర్లు కూడా అదుర్స్!
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
అడ్వెంచర్ బైక్ Honda XR300Lను ఫైనాన్స్‌లో తీసుకుంటారా? ఈజీ EMI ఆఫర్లు రెడీగా ఉన్నాయి!
కేవలం రూ.25,000 కట్టి కొత్త Honda XR300L బైక్ సొంతం చేసుకోవచ్చు.. మీ నెలవారీ EMI ఎంతంటే?

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget