అన్వేషించండి

Benefits Of Walk After Dinner: రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?

Benefits Of Walk After Dinner: రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. అందుకే డిన్నర్ చేసిన తర్వాత పది నుంచి 20 నిమిషాలు నడవడం వల్ల మీ గట్‌హెల్త్ మెరుగుపడుతుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రాత్రి నడక జీర్ణక్రియను మెరుగుపరచి, గ్యాస్, అసిడిటీ తగ్గిస్తుంది.
  • భోజనానంతరం నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
  • గట్ ఆరోగ్యం, జీవక్రియను మెరుగుపరుస్తుంది, బెల్లీ ఫ్యాట్ తగ్గిస్తుంది.
  • పదిహేను నిమిషాల సులభ నడక ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైనది.

Benefits Of Walk After Dinner: రాత్రి వేళలో చాలా మంది తిన్న వెంటనే బెడ్‌ ఎక్కేస్తున్నారు. చేతిలో సెల్‌ఫోన్ తీసుకొని నచ్చిన వెబ్‌సిరీస్‌, సోషల్ మీడియా, రీల్స్‌ చూస్తూ కాలం గడిపేస్తున్నారు. కాసేపు అలా కాలక్షేమం చేసిన తర్వాత కనుకు తీస్తున్నారు. ఇప్పుడు చాలా మంది డైలీ రొటీన్‌గా మారింది. అయితే అలాంటి వారంతా తమ అనారోగ్యాన్ని తామే ఆహ్వానిస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెండో మెదడుగా పిలిచే గట్‌కు తీవ్రమైన ద్రోహం చేస్తున్నారని అంటున్నారు. ఇలాంటి లైఫ్‌ స్టైల్ కారణంగానే ప్రతి ముగ్గురిలో ఒకరు నేడు గ్యాస్, బ్లోటింగ్, అసిడిటీ, మలబద్ధకంతో బాధపడుతున్నారు. 

ఈ గట్‌ సమస్యకు చెక్ పెట్టే అద్భుతమైన, అత్యంత సులభమైన లైఫ్‌ హాక్‌ ఒకటి ఉంది. దీని కోసం మీరు రూపాయి ఖర్చు చేయాల్సిన పని లేదు. భారీ వర్కౌట్స్ చేయాల్సిన అవసరం లేదు. రాత్రి భోజనం ముగించిన తర్వాత పది నుంచి 15 నిమిషాలు నడిస్తే చాలు మీ గట్ హెల్త్‌ ఆరోగ్యంగా ఉంటుంది. మీ ఇంట్లోనో లేదా బయట ప్రశాంతంగా నడిస్తే చాలు. వైద్య పరిభాషలో దీనినే పోస్ట్‌ ప్రాండియల్‌ వాకింగ్‌ అంటారు. రాత్రి తిన్న తర్వాత మీరు వేసే ప్రతి అడుగు కూడా మీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. 

డిన్నర్ తర్వాత ఎందుకు మంచిది?

మనం ఆహారం తిన్న తర్వాత అది జిర్ణాశయం నుంచి చిన్న పేగులోకి వెళ్లే ప్రక్రియను వైద్య భాషలో గ్యాస్ట్రిక్ ఎంప్టియిగ్ అంటారు. మీరు తిన్న వెంటనే కూర్చున్నా, పడుకున్నా సరే ఈ ప్రక్రియ సజావుగా సాగదు. అందుకే మీరు తిన్న ఆహారం ప్రాథమిక దశలోనే ఉండిపోతుంది. దీంతో ఫుడ్ పులిసిపోతుంది. దీని కారణంగా గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. 

భోజనం చేసిన తర్వాత నడవడం వల్ల జీర్ణవ్యవస్థలోని కండరాలు చాలా యాక్టివ్ అవుతాయి. దీంతో జీర్ణనాళం కదలికలు వేగంగా జరుగుతాయి. ఫలితంగా ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. మీరు నడిచేది పది నిమిషాలే అయినా అది 30 శాతం పనిని పూర్తి చేస్తుంది. 

బ్లడ్‌ షుగర్‌ కంట్రోల్‌ 

మీరు భోజనం చేసిన తర్వాత కార్బోహైడ్రేట్‌లు గ్లూకోజ్‌గా మారి రక్తంలో కలుస్తాయి. దీంతో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది. దీన్ని నియంత్రించడానికి ప్యాంక్రియాస్‌ గ్రంథి భారీగా ఇన్సులిన్‌ను విడుదల చేయాల్సి ఉంటుంది. ఇలా కంటిన్యూగా చేయడం వల్ల దాని పని తీరు మందగిస్తుంది. దీంతో టైప్ 2 డయాబెటిస్‌కు దారి తీస్తుంది. 

అయితే మీరు నడవడంతో ప్యాంక్రియాస్ గ్రంథిపై భారం పడకుండా ఉంటుంది. మీరు తిన్న కార్బోహైడ్రేట్‌లోని గ్రూకోజ్‌ను కండరాలు తీసుకుంటాయి. వాటిని శక్తిగా మార్చుకుంటాయి. ఇది మీరు తిన్న తర్వాత నడిచినప్పుడు జరుగుతుంది. 

స్పోర్ట్స్ మెడిసిన్ జర్నల్‌లో రాసినట్టుగా మీరు భోజనం తర్వాత ఐదు నిమిషాల పాటు నడిచినా చక్కెర స్థాయి భారీగా తగ్గుతుందని  తేలింది. అలాంటిది పది నుంచి 15 నిమిషాల పాటు నడిస్తే 22 శాతం వరకు గ్లూకోజ్ లెవల్స్‌ నియంత్రించవచ్చని చెబుతున్నారు. 

అసిడిటీ, బ్లోటింగ్‌, గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్‌‌కు చెక్ 

తిన్న తర్వాత చాతీలో మంటగా ఉంటుందని చాలా మంది అంటూ ఉంటారు. లేదా పుల్లటి తేన్పులు వస్తున్నాయని చెబుతుంటారు. దీనినే యాసిడ్ రిఫ్లక్స్‌అంటారు. తిన్న వెంటనే పడుకోవడం వల్ల గ్రావిటీ లేకపోవడంతో జీర్ణాశయంలోని హైడ్రోక్లీరిక్ యాసిడ్ సులభంగా అన్నవాహిక ప్రవేశిస్తుంది. దీని వల్ల లోపలి పొరలు దెబ్బ తిని మంట పుట్టిస్తుంది. అందుకే రాత్రి వేళలో భోజనం చేసిన తర్వాత నడవడం వల్ల యాసిడ్ పైకి వచ్చే ఛాన్స్ లేదు. అంతే కాకుండా మీ లాలాజలం కిందికి వేళ్తుంది. దీంతో అన్నవాహికలోకి యాసిడ్స్ వచ్చినా వాటిని కూల్ చేస్తుంది. దీంతో ఎలాంటి మందుల అవసరం లేకుండానే కడుపు ఉబ్బరం, అసిడిటీ తగ్గుతుంది. 

నడక వల్ల గుడ్ బ్యాక్టీరియా

మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా, మానసికంగా బలంగా ఉండాలన్నా సరే గట్‌ హెల్త్ అనేది చాలా అవసరం. గట్‌ మైక్రోబయోమ్‌లో ఉండే మంచి బ్యాక్టీరియాలు మీకు మంచి చేస్తుంటాయి. మీరు రోజూ రాత్రి పూట భోజనం చేసిన తర్వాత నడవడం వల్ల ఆ గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది. లేకుంటే దీని శాతం తగ్గిపోయి మీరు అనారోగ్యం పాలవుతారు. 

రాత్రి వేళల్లో జీవక్రియ రేటు చాలా తక్కువగా ఉంటుంది. అందులో మీరు ఫుల్‌గా భోజనం చేసిన తర్వాత పడుకుంటే అది మరింత మందగిస్తుంది. దీంతో క్యాలరీలన్నీ కొవ్వుగా మారిపోతాయి. దీని వల్ల బెల్లీ ఫ్యాట్ వస్తుంది. మీరు రాత్రి తిన్న తర్వాత 15 నిమిషాలు నడవడం వల్ల మెటబాలిజం రీబూట్ అవుతుంది. దీంతో క్యాలరీలు ఖర్చు చేయడానికి సహాయపడతాయి. మంచి కొలెస్ట్రాల్ పెంచడానికి హెల్ప్ చేస్తుంది. 

రాత్రి భోజనం తర్వాత ఎంత సమయం నడవాలి?

చాలా మంది తిన్న తర్వాత త్వరగా అరిగిపోవాలనో లేకా ఇంకా మరింత ఆరోగ్యం కోసం పరుగులు తీస్తుంటారు. లేదా వర్కౌట్స్ చేస్తుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరం. మీరు ఆహారం తీసుకున్న తర్వాత రక్త ప్రసరణ వ్యవస్థ పూర్తిగా మీరు తీసుకున్న ఫుడ్‌ను జీర్ణం చేసే పనిలో ఉంటుంది. కానీ దాన్ని డైవర్ట్ చేస్తూ మీరు పరుగులు తీస్తే జీర్ణం చేసే ప్రక్రియను పక్కన పెట్టి మీకు పరుగెత్తే శక్తిని ఇచ్చే విషయంపై దృష్టి పెడతాయి. దీంతో జీర్ణక్రియ ఆగిపోతుంది. దీని వల్ల కడుపులో నొప్పి వస్తుంది. కొన్నిసార్లు వాంతులు అవుతాయి. 

అందుకే భోజనం చేసిన తర్వాత పది నుంచి ఇరవై నిమిషాలు నడిస్తే చాలు. దీనిని డైలీ మార్నింగ్ చేసే వాకింగ్‌లా కాకుండా, రిలాక్స్‌గా, పచార్లు చేసేలా నడిస్తే చాలు. భోజనం చేసిన ఐదు నుంచి 10 నిమిషాలు నడవడం మంచిది. 

రాత్రి భోజనం చేసిన తర్వాత నడవడం మీ గట్‌ హెల్త్‌కు మంచిది . అయితే పరుగెట్టడం,హెవీ వెయిట్స్‌ ఎత్తం, బ్రిస్క్ వాకింగ్ చేయడం మంచిది కాదు. 

Frequently Asked Questions

రాత్రి భోజనం తర్వాత నడవడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం ఏమిటి?

రాత్రి భోజనం తర్వాత 10-15 నిమిషాలు నడవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఇది గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి గట్ సమస్యలను తగ్గిస్తుంది.

భోజనం తర్వాత నడవడం రక్తంలో చక్కెర స్థాయిలపై ఎలా ప్రభావం చూపుతుంది?

నడవడం వల్ల కండరాలు కార్బోహైడ్రేట్లలోని గ్లూకోజ్‌ను గ్రహించి శక్తిగా మారుస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి, టైప్ 2 డయాబెటిస్‌ను నివారిస్తుంది.

రాత్రి భోజనం తర్వాత ఎంతసేపు, ఎలా నడవాలి?

భోజనం చేసిన 5 నుండి 10 నిమిషాల తర్వాత 10-20 నిమిషాలు ప్రశాంతంగా, నెమ్మదిగా నడవాలి. పరుగులు తీయడం లేదా భారీ వ్యాయామాలు చేయకూడదు.

భోజనం చేసిన వెంటనే పడుకోవడం లేదా కూర్చోవడం వల్ల కలిగే అనారోగ్యాలు ఏమిటి?

తిన్న వెంటనే పడుకోవడం లేదా కూర్చోవడం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగదు, ఆహారం పులిసిపోయి గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఇది గ్యాస్, బ్లోటింగ్, అసిడిటీకి దారితీస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Type 2 Diabetes : ఇంటి భోజనం తిన్నా కూడా టైప్ 2 డయాబెటిస్ వస్తుందా? మధుమేహానికి ఈ అలవాట్లే కారణం
ఇంటి భోజనం తిన్నా కూడా టైప్ 2 డయాబెటిస్ వస్తుందా? మధుమేహానికి ఈ అలవాట్లే కారణం
Body Pains In Winter : చలికాలంలో ఒళ్లు నొప్పులు పెరగడానికి కారణాలు ఇవే.. ఈ చిట్కాలు పాటిస్తే ఉపశమనం పొందవచ్చు
చలికాలంలో ఒళ్లు నొప్పులు పెరగడానికి కారణాలు ఇవే.. ఈ చిట్కాలు పాటిస్తే ఉపశమనం పొందవచ్చు
Fatty Liver Diet : ఫ్యాటీ లివర్ సమస్య ఉందా? కాలేయ ఆరోగ్యానికి మేలు చేసే డ్రింక్స్ ఇవే.. రోజూ తాగితే మంచిదేనా?
ఫ్యాటీ లివర్ సమస్య ఉందా? కాలేయ ఆరోగ్యానికి మేలు చేసే డ్రింక్స్ ఇవే.. రోజూ తాగితే మంచిదేనా?
Winter Health Tips for Kids : పిల్లలకు చలికాలంలో జలుబు, దగ్గు రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. పేరెంట్స్ ఫాలో అయిపోండి
పిల్లలకు చలికాలంలో జలుబు, దగ్గు రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. పేరెంట్స్ ఫాలో అయిపోండి

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Akvan Update: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
US Military Aircraft Attack: గొడ్డలితో రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానం ధ్వంసం.. ఐర్లాండ్‌ ఎయిర్‌పోర్టులో కలకలం!
గొడ్డలితో రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానం ధ్వంసం.. ఐర్లాండ్‌ ఎయిర్‌పోర్టులో కలకలం!
LeT Commander Encounter: వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
Indiramma Kutumba Jeevitha Bima: కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
FIVA Award: భారత్‌లో కార్ల విప్లవానికి నాంది పలికిన Maruti 800.. గ్లోబల్ అవార్డు అందుకున్న తొలి భారతీయ కారు!
కామన్‌మ్యాన్‌ తొలి కారు మారుతి 800 గుర్తుందిగా.. ఇప్పుడు ఈ కారుకు ప్రతిష్టాత్మక గ్లోబల్‌ అవార్డ్‌
Morne Morkel Comments: తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 
తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 
కార్తీకమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు ఆచరించాలి?
కార్తీకమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు ఆచరించాలి?
Embed widget