అన్వేషించండి

రాయల్‌ ఎన్‌ఫీల్డ్ రైడర్లకు బిగ్ అలర్ట్‌! 350సీసీ బైక్‌కు ఫ్రీగా గేర్ పొజిషన్ ఇండికేటర్‌! మీ బైక్‌కు వస్తుందో లేదో చెక్ చేయండి!

ఆగస్టు 2025 తర్వాత వచ్చిన రాయల్ ఎన్‌ఫఈల్డ్ 350సీసీ మోడ్లకు ఉచితంగా గేర్ పొజిషన్ ఇండికేటర్‌ అమర్చనున్నట్టు రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రకటించింది. మీ బైక్‌ దీనికి సరిపోతుందో లేదో చూసుకోండి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రాయల్ ఎన్‌ఫీల్డ్ 350సీసీ మోడళ్లకు ఉచిత గేర్ ఇండికేటర్ అమర్చనుంది.
  • రేర్ ఎర్త్ ఖనిజాల కొరతతో గతంలో ఈ ఫీచర్ తొలగించారు.
  • కొరత తీరడంతో క్లాసిక్, హంటర్, మీటియోర్ మోడళ్లకు వర్తిస్తుంది.
  • RE యాప్ ద్వారా అర్హత తెలుసుకొని సర్వీస్ సెంటర్‌లో అమర్చుకోవచ్చు.

రాయల్‌ ఎన్‌ఫీల్డ్ ప్రేమికులకు, బైకర్లకు ఇది నిజంగానే గుడ్ న్యూస్, 2025 ఆగస్టు తర్వాత రాయల్ ఎన్‌ఫీల్డ్ 350సీసీ మోడల్స్ కొనుగోలు చేసి ఉంటే కచ్చితంగా ఇది మీకు అవసరమైన వార్త. డిస్‌ప్లే మీటర్‌లో గేర్‌పొజిషన్ ఇండికేటర్‌ లేక ఇబ్బంది పడుతుంటే మాత్రం ఇప్పుడు మార్చుకునే వెసులుబాటు సంస్థ కల్పిస్తోంది. రేర్‌ ఎర్త్‌ మినరల్స్ సరఫరా కొరత కారణంగా అప్పట్లో నిలిపివేసిన గేర్ పొజిషన్ ఇండికేటర్ ఫీచర్స్‌ను కంపెనీ ఇప్పుడు మళ్లీ తీసుకొస్తోంది. ఆగస్టు 2025 తర్వాత డిజైన్ చేసిన ఈ ఫీచర్ లేకుండా వచ్చిన క్లాసిక్‌ 350, హంటర్ 350, మిటియోర్‌ 350, గోవాన్ క్లాసిక్‌ 350 బైక్‌లకు ఇప్పుడు ఉచితంగా  గేర్ ఇండికేటర్‌ను అమర్చనుంది. 

గేర్‌ పొజిషన్ ఇండికేటర్ ఎందుకు నిలిపివేశారు?

గత ఏడాది ద్వితీయార్థంలో రాయల్ ఎన‌ఫీల్డ్ నుంచి తమ డ్రీమ్ బైక్ డెలివరీ తీసుకున్న అనేక మంది రైడర్లు ఒక చిన్న లోపాన్ని గమనించారు. డిజిటల్ అనలాగ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ కలిగిన జే సిరీస్‌ 350సిసి బైక్‌లలో గేర్ నెంబర్‌ చూపించే గేర్ పొజిషన్ ఇండికేటర్ కనిపించ లేదు. కేవలం ఎన్ అని పడే న్యూట్రల్‌ లైట్ మాత్రమే పని చేసింది. ఇది తయారీలో లోపం కాదు. గ్లోబల్ సప్లై చైన్ సంక్షోభం. గేర్ పొజిషన్ సెన్సార్‌లలో ఉపయోగించే అత్యంత శక్తిమంతమైన మ్యాగ్నేట్స్‌ తయారీకి రేర్ ఎర్త్ మినరల్స్ అవసరం. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ ఖనిజాల సరఫరా హఠాత్తుగా నిలిచిపోవడంతో పార్ట్స్‌ కొరత ఏర్పడింది. బైక్‌ ప్రొడక్షన్ ఆపకుండా కస్టమ్ల డెలివరీలో జాప్యం జరగకూడదనే కారణంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ తాత్కాలికంగా న్యూట్రల్‌ ఇండికేటర్‌తో బైక్‌లను విక్రయించింది. అయితే పరిస్థితులు చక్కబడితే ఉచితంగా ఈ పార్ట్ అమరుస్తామని అప్పుడే చెప్పింది. 

రేర్ ఎర్త్‌ మినరల్స్ సంక్షోభం ఎలా సమసిపోయింది?

ఆటోమొబైల్‌ రంగానికి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌ వెన్నెముక లాంటిది. ఎలక్ట్రిక్ వాహనాల మోటార్లు, ఆధునిక సెన్సార్లు, ఇంజిన్ కంట్రోల్ మోడ్యూలస్‌ తయారీలో వీటి పాత్ర కీలకం. ప్రపంచవ్యాప్తంగా వీటి తవ్వకాలు, ప్రాసెసింగ్‌పై చైనా ఆధిపత్యం ఎక్కువగా ఉండటం వల్ల సరఫరాలో హెచ్చుతగ్గులు ఏర్పడ్డాయి. అయితే భారత్‌తోపాటు అమెరికా, అర్జెంటీనా, జపాన్ వంటి దేశాలు ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను ఏర్పరుచుకోవడంతోపాటు స్థానిక ఉత్పత్తిని పెంచడంతో ఈ విడి భాగాల కొరత తొలగిపోయింది. ఫలితంగా రాయల్ ఎన్‌ఫీల్డ్‌ సంస్థ మళ్లీ సెన్సార్ల ప్రొడెక్షన్ పునరుద్దరించింది. భారతీయ వినియోగదారులకు ఎలాంటి ఖర్చు లేకుండానే ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ చేపట్టింది. 

ఉచితంగా గేర్‌ ఇండికేటర్‌ ఏయే మోడళ్లకు వర్తిస్తుంది?

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ లైనప్‌లోని అన్ని బైక్‌లకు వర్తించదు. కేవలం ఆగస్టు 2025 తర్వాత తయారు యిన వాహనాలకు మాత్రమే గేర్ ఇండికేటర్‌ లేకుండా డెలివరీ అయిన వాహనలకే వర్తిస్తుంది. 
రాయల్‌ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్‌ 350, రాయల్‌ ఎన్‌ఫీల్డ్ హంటర్‌ 350, రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్‌ 350, రాయల్‌ ఎన్‌ీల్డ్ గోవాన్‌ క్లాసిక్‌ 350 మోడల్స్‌కు మాత్రమే ఇది వర్తిస్తుంది. 

మీ బైక్‌కు వర్తిస్తుందో లేదో ఎలా చెక్ చేయాలి?

కంపెనీ ప్రతి వాహనానికి ఒక ప్రత్యేకమైన వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇస్తుంది. మీ బైక్ ఈ ఉచిత అప్‌గ్రేడ్‌ కిందకు వస్తుందో లేదో తెలుసుకోవడానికి రెండు సులువైన మార్గాలు ఉన్నాయి. మీ ఫోన్‌లోని RE యాప్‌లోకి లాగిన్ అయి, మై వెహికల్‌ సెక్షన్‌లోకి వెళ్తే కంపెనీ నుంచి నోటిఫికేషన్ లేదా కంపొనెంట్ అవైలబిలిటీ అలర్ట్ కనిపిస్తుంది. మీ సమీపంలోని రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఆథరైజ్జ్‌ సర్వీస్‌ సెంటర్‌కు ఫోన్ చేసి లేదా నేరుగా మీ బైక్ ఛాసీ నెంబర్ లేదా వీఐఎన్ నెంబర్ చెబితే వాళ్లు సిస్టమ్‌లో వెరిఫై చేసి పార్ట్ స్టాక్‌ అందుబాటును బట్టి ఇన్‌స్టలేషన్ స్లాట్‌ కేటాయిస్తారు. 

రైడర్‌కు గేర్ పొజిషన్ అవసరం ఎంత?

కొందరు సీనియర్ రైడ్లు ఇంజిన్ శబ్దాన్ని బట్టి గేర్ మార్చడం అలవాటు చేసుకున్నప్పటికీ సాధారణ రోజువారీ వినియోగదారులకు, కొత్తగా బైక్ నేర్చుకున్న బిగినర్స్‌కి గేర్ ఇండికేటర్‌ అత్యంత ఉపోయగకరమైన ఫీచర్‌. పదే పదే గేర్లు మార్చాల్సి వచ్చినప్పుడు నగర ట్రాఫిక్‌లో బైక్ ఏ గేర్‌లో ఉందో మీటర్‌పై స్పష్టంగా కనిపించడం వల్ల హాఫ్‌ క్లచ్‌ వాడకం తగ్గుతుంది. సరైన వేగానికి తగ్గట్టు సరైన గేర్‌లో ప్రయాణించం వల్ల ఇంజిన్‌పై ఒత్తిడి తగ్గి ఇంధన సామర్థ్యం పెరుగుతుంది. కొత్త జే సిరీస్‌ ఇంజిన్ స్మూత్‌ గేర్ షిప్టింగ్‌ను అందిస్తాయి. గేర్ నెంబర్‌ పర్ఫెక్ట్‌గా తెలియడం వల్ల గేర్ బాక్స్ వేర్ అండ్‌ టియర్‌ సేఫ్‌గా ఉంటుంది. 

మీ బైక్ ఆగస్టు 2025లో డెలివరీ అయ్యి ఉంటే సర్వీసింగ్ టైమ్‌ వరకు ఆగకుండా వెంటనే సమీపంలోని ఆథరైజ్డ్‌ సర్వీస్ సెంట్‌కు సంప్రదించండి. 

Frequently Asked Questions

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకర్లకు శుభవార్త ఏమిటి?

ఆగస్టు 2025 తర్వాత డెలివరీ అయిన కొన్ని 350సీసీ మోడళ్లకు రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పుడు ఉచితంగా గేర్ పొజిషన్ ఇండికేటర్‌ను అమర్చుతుంది.

గేర్ పొజిషన్ ఇండికేటర్‌ను గతంలో ఎందుకు నిలిపివేశారు?

రేర్‌ ఎర్త్‌ మినరల్స్ కొరత కారణంగా గేర్ పొజిషన్ సెన్సార్‌ల తయారీకి అవసరమైన విడి భాగాలు అందుబాటులో లేవు. గ్లోబల్ సప్లై చైన్ సంక్షోభం దీనికి ప్రధాన కారణం.

ఏ రాయల్ ఎన్‌ఫీల్డ్ మోడళ్లకు ఈ ఉచిత గేర్ ఇండికేటర్ వర్తిస్తుంది?

క్లాసిక్ 350, హంటర్ 350, మిటియోర్ 350, గోవాన్ క్లాసిక్ 350 మోడళ్లకు, ఆగస్టు 2025 తర్వాత గేర్ ఇండికేటర్ లేకుండా వచ్చిన వాటికి ఇది వర్తిస్తుంది.

నా బైక్‌కు ఈ అప్‌గ్రేడ్ వర్తిస్తుందో లేదో ఎలా తెలుసుకోవాలి?

RE యాప్‌లోని 'మై వెహికల్' సెక్షన్‌లో చూడవచ్చు లేదా మీ బైక్ వీఐఎన్ నంబర్‌తో సమీపంలోని ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించండి.

గేర్ పొజిషన్ ఇండికేటర్‌ ఉండటం వల్ల ప్రయోజనం ఏమిటి?

ఇది కొత్త రైడర్లకు సహాయపడుతుంది, ట్రాఫిక్‌లో ఇంజిన్ ఒత్తిడిని తగ్గిస్తుంది, ఇంధన సామర్థ్యాన్ని పెంచుతుంది. గేర్ బాక్స్‌ను సురక్షితంగా ఉంచుతుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
కొత్త ఎలక్ట్రిక్‌ బైకులు తీసుకురాబోతున్న హీరో - డైలీ యూజ్‌ కోసం, అడ్వెంచర్ల కోసం కూడా!
హీరో ఎలక్ట్రిక్‌ బైకులు త్వరలో రాబోతున్నాయి.. డబ్బులతో రెడీగా ఉండండి
Maruti Victoris S-CNG.. రూ.1 లక్ష ఎక్కువైనా ఎందుకు కొనాలి? మైలేజీతో లెక్క మారిపోతుంది!
మారుతి విక్టోరిస్‌ S-CNG రియల్‌ వరల్డ్‌ రివ్యూ.. మైలేజీ అదిరిపోయింది, మీ డబ్బు ఆదా!
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget