అన్వేషించండి

భారత్‌లో అమ్మకానికి వచ్చిన ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ బైక్‌లు ఇవిగో - ఎథనాల్ మిశ్రమంపై ఇక ఆందోళన అక్కర్లేదు!

భారత్‌లో ప్రస్తుతం అమ్మకానికి ఉన్న E85 ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ బైక్‌లు ఇవి. Hero Splendor+, HF Deluxe, Yamaha FZ Blue Flex & Suzuki Gixxer SF 250 Flex Fuel ధరలు, ఇంజిన్ వివరాలు & ప్రత్యేకతలు తెలుసుకోండి.

Flex Fuel Bikes In India: దేశంలో ఎథనాల్ మిశ్రమ ఇంధన వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం E20 ఇంధనం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో భవిష్యత్తులో మరింత అధిక ఎథనాల్ మిశ్రమాలను కూడా విస్తృతంగా ఉపయోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా వాహన తయారీ సంస్థలు కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్‌ ‍(Flex Fuel) టెక్నాలజీతో కూడిన బైక్‌లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి.

ఫ్లెక్స్ ఫ్యూయల్‌ బైక్‌ల ప్రత్యేకత ఏమిటంటే.. ఇవి E20 నుంచి E85 వరకు ఏ ఎథనాల్-పెట్రోల్ మిశ్రమాన్నైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉపయోగించుకోగలవు. ఇందుకోసం ఫ్యూయల్ సిస్టమ్, ఇంజిన్ భాగాలు & ECU కాలిబ్రేషన్‌లో ప్రత్యేక మార్పులతో వీటిని డిజైన్‌ చేశారు. ప్రస్తుతం భారత మార్కెట్లో నాలుగు E85 అనుకూల బైక్‌లు విక్రయానికి అందుబాటులో ఉన్నాయి.

Hero Splendor+ Flex Fuel

భారతదేశంలో సామాన్య ప్రజల కోసం అందుబాటులోకి వచ్చిన తొలి Flex Fuel బైక్‌లలో Hero Splendor+ Flex Fuel ఒకటి. సాధారణ స్ప్లెండర్ ప్లస్ ఆధారంగా రూపొందించిన ఈ బైక్‌లో 97.2cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది E20 నుంచి E85 వరకు ఏ మిశ్రమ ఇంధనంతోనైనా పనిచేస్తుంది. ఫ్యూయల్ సిస్టమ్ & ఇంజిన్ మేనేజ్‌మెంట్‌లో అవసరమైన మార్పులు చేశారు. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.82,710. తక్కువ బడ్జెట్‌లో ఫ్లెక్స్ ఫ్యూయల్‌ బైక్ కొనాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక.

Hero HF Deluxe Flex Fuel

Hero HF Deluxe Flex Fuel కూడా 97.2cc సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో పరిగెడుతుంది. సాంకేతికంగా ఇది స్ప్లెండర్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌తో చాలా వరకు ఒకే విధంగా ఉంటుంది. E20 నుంచి E85 వరకు అన్ని రకాల ఎథనాల్ మిశ్రమ ఇంధనాన్ని ఉపయోగించవచ్చు. ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యంత తక్కువ ధరకు లభిస్తున్న E85 అనుకూల బైక్‌లలో ఇది ఒకటి. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.72,792.

Suzuki Gixxer SF 250 Flex Fuel

కేవలం కమ్యూటర్ బైక్‌లకే కాకుండా ప్రీమియం సెగ్మెంట్‌లో కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్‌ టెక్నాలజీని తీసుకొచ్చింది సుజుకి. Gixxer SF 250 Flex Fuelలో 249cc సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ను అందించింది. ఇంజిన్ కాలిబ్రేషన్ & ఫ్యూయల్ డెలివరీ సిస్టమ్‌లో మార్పులు చేసి E85 అనుకూలంగా రూపొందించింది. ప్రస్తుతం భారత మార్కెట్లో అమ్మకానికి ఉన్న E85 బైక్‌లలో అత్యధిక సామర్థ్యం గల ఇంజిన్ కలిగిన మోడల్ ఇదే. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.2,00,896.

ఇది కూడా చదవండి: మీ గేమ్‌ను పరుగులు పెట్టించే ఆస్టన్ మార్టిన్ డ్రెడ్‌నాట్ - అక్టోబర్ 23 నుంచి కాల్ ఆఫ్ డ్యూటీలోకి!

Yamaha FZ Blue Flex

2026 జూలైలో యమహా కూడా Flex Fuel విభాగంలోకి అడుగుపెట్టింది. FZ Blue Flex పేరుతో విడుదల చేసిన ఈ బైక్ E20 నుంచి E85 వరకు అన్ని రకాల ఎథనాల్ మిశ్రమ ఇంధనంతో పనిచేస్తుంది. ఇందులో 149cc సింగిల్ సిలిండర్ Blue Core ఇంజిన్‌ను అందించారు. ఈ కొత్త బండి ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.24 లక్షలుగా నిర్ణయించారు. రోజువారీ వినియోగంతో పాటు మెరుగైన పనితీరు కోరుకునే వారికి ఇది మంచి ఎంపికగా నిలుస్తుంది.

ఫ్లెక్స్ ఫ్యూయల్‌ బైక్‌ల ప్రయోజనాలు

Flex Fuel టెక్నాలజీతో కూడిన బైక్‌ల ప్రధాన ప్రయోజనం ఇంధన ఎంపికలో స్వేచ్ఛ. E20 మాత్రమే కాకుండా E85 వరకు ఏ మిశ్రమ ఇంధనం అందుబాటులో ఉన్నా వాహనం పనితీరుపై ప్రభావం లేకుండా ఉపయోగించవచ్చు. భవిష్యత్తులో ఎథనాల్ వినియోగం పెరిగినా ప్రత్యేకంగా కొత్త వాహనం కొనాల్సిన అవసరం ఉండదు.

ఇది కూడా చదవండి: రూ.6 లక్షల లోపే మంచి ఫ్యామిలీ SUV - మన దేశంలో 8 లక్షల మంది ఎంపిక చేసుకున్న కారు

అలాగే, దేశీయంగా ఉత్పత్తి చేసే ఎథనాల్ వినియోగం పెరగడం వల్ల దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడటం తగ్గుతుంది. పర్యావరణానికి అనుకూలమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడంలో కూడా Flex Fuel వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయి.

ఎథనాల్ మిశ్రమ ఇంధనంపై తరచూ మారుతున్న నిబంధనల నేపథ్యంలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొత్త బైక్ కొనాలనుకునే వారికి Hero Splendor+ Flex Fuel, Hero HF Deluxe Flex Fuel, Yamaha FZ Blue Flex & Suzuki Gixxer SF 250 Flex Fuel వంటి మోడళ్లు మంచి ప్రత్యామ్నాయాలుగా నిలుస్తున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
డ్యూక్‌ నుంచి RC వరకు ధరల బాదుడు.. KTM బైక్‌ కొంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ చెల్లించాల్సిందే
మైగాడ్‌, KTM బైక్‌ కొనేవాళ్లకు షాకింగ్‌ న్యూస్‌! 7 మోడళ్ల రేట్లు అమాంతం పెరిగాయి
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
కారు నుంచి లారీ వరకు.. ఫిట్‌నెస్‌ను ఇక యంత్రాలే పరీక్షిస్తాయి! తెలంగాణలో 15 చోట్ల కొత్త వ్యవస్థ
మీ కారు ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఇక కొత్త రూట్‌లో.. మాన్యువల్‌ పరీక్షలకు చెక్‌!
Advertisement

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget