అన్వేషించండి

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి కొత్త అప్‌డేట్‌ - కొనే ముందు మీరు తెలుసుకోవాల్సిన 6 విషయాలు ఇవే!

2026 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మార్కెట్‌లోకి వచ్చింది. కొత్త ఫీచర్లు, క్లచ్ మార్పులు, వేరియంట్లు & ధరల పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.

Royal Enfield Classic 350 Price And Features: టూవీలర్‌ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్, తన పాపులర్ మోడల్ క్లాసిక్ 350ని 2026 సంవత్సరంలో మరింత నవీకరించి మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ రోడ్‌స్టర్ బైక్‌లో ఇంజిన్ పరంగా పెద్దగా మార్పులు లేకపోయినా, రైడర్ల సౌకర్యాన్ని పెంచేలా కొన్ని కీలకమైన అప్‌డేట్లను అందించింది. మీరు ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొనుగోలు చేయాలని భావిస్తుంటే, అంతకంటే ముందు తెలుసుకోవాల్సిన 6 ముఖ్యమైన విషయాలు ఇక్కడ చూద్దాం.

1. 2026 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350లో కొత్తగా వచ్చిన మార్పులేంటి?

ఈ కొత్త బైక్‌లో వచ్చిన అతి పెద్ద మార్పు అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్. ఇది క్లచ్ లీవర్ వాడకాన్ని ఈజీగా మార్చడమే కాకుండా, గేర్లు వేగంగా తగ్గించే సమయంలో బైక్ బ్యాలెన్స్ కాపాడటానికి కూడా సాయపడుతుంది. దీనితో పాటు, మొబైల్ ఛార్జింగ్ కోసం ఒక USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్ కూడా అందించారు. అయితే ఈ రెండు కొత్త ఫీచర్లు డ్యూయల్ ఛానల్ ABS వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. బేసిక్ మోడల్ అయిన రెడ్డిచ్ రెడ్ వేరియంట్ ఎలాంటి మార్పులు లేకుండా మునుపటిలాగే కొనసాగుతుంది.

2. ఇంజిన్ లో ఏమైనా మార్పులు ఉన్నాయా?

ఈ బైక్ మెకానికల్ విభాగంలో ఎలాంటి మార్పులు జరగలేదు. ఇందులో సరికొత్త 349 సీసీ, ఎయిర్/ఆయిల్ కూల్డ్, సింగిల్ సిలిండర్ జె-సిరీస్ ఇంజిన్ ఉపయోగించారు. ఇది 20.2 హెచ్‌పీ పవర్ & 27 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో వస్తుంది. బైక్ ఛాసిస్, సస్పెన్షన్ & బ్రేకింగ్ సిస్టమ్ అంతా ఇదివరకు ఉన్నట్లే ఉంటుంది.

ఇది కూడా చదవండి: వచ్చే ఏడాది నుంచే CAFE-III నిబంధనలు అమలు - కొత్త కారు కొనేవాళ్లు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన వివరాలు

3. అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్ ఏ వేరియంట్లలో లభిస్తుంది?

ఈ అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్ ఫీచర్ కేవలం డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ కలిగిన క్లాసిక్ 350 వేరియంట్లలోనే లభిస్తుంది. సింగిల్ ఛానల్ ఏబీఎస్ ఉండే రెడ్డిచ్ రెడ్ మోడల్‌కు ఈ కొత్త క్లచ్ కానీ, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ కానీ లభించవు.

4. నిలిపివేసిన కలర్ ఆప్షన్లు ఏవి?

ఈ కొత్త అప్‌డేట్‌లో భాగంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ కొన్ని కలర్ ఆప్షన్లకు స్వస్తి చెప్పింది. మద్రాస్ రెడ్ & మెడాలియన్ బ్రాంజ్ షేడ్స్ ఇకపై లభించవు.

ఇది కూడా చదవండి: పెట్రోల్ టెన్షన్‌కు చెక్, 2026లో అత్యధిక మైలేజ్ ఇచ్చే స్కూటర్లు ఇవే

5. 2026 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ధర ఎంత?

ఆరంభ వేరియంట్ రెడ్డిచ్ రెడ్ ఎక్స్-షోరూమ్ ధర చెన్నైలో రూ. 1.87 లక్షలు. కొత్త ఫీచర్లు జోడించిన డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వేరియంట్ల ఆరంభ ధర రూ. 1.95 లక్షలు (ఎక్స్-షోరూమ్, చెన్నై). హైదరాబాద్ లో ఈ బైక్ ఆన్ రోడ్ ధర సుమారుగా రూ. 2.12 లక్షల నుంచి రూ. 2.52 లక్షల వరకు ఉంటుంది.

6. కంపెనీ లైన్‌అప్‌లో దీని స్థానం ఏంటి?

ఈ తాజా మార్పుతో, క్లాసిక్ 350 కూడా మీటియోర్ 350, హంటర్ 350, గోవాన్ క్లాసిక్ 350 & గెరిల్లా 450 సరసన చేరింది. ప్రసుతం జె-ప్లాట్‌ఫామ్‌పై పనిచేసే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్లలో బుల్లెట్ 350 మాత్రమే ఇంకా ఈ కొత్త క్లచ్ ఫీచర్ లేని మోడల్‌గా ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Hero Destini 110 Classique ఎడిషన్ లాంచ్‌.. కొత్త కలర్ ఆప్షన్లు, డ్యూయల్ టోన్ స్టైలింగ్‌తో రోడ్డుపై రచ్చే!
హీరో డెస్టినీ 110 కొనేవాళ్లకు మరో స్టైలిష్‌ ఆప్షన్‌.. రూ.76,400 ధరతో క్లాసిక్ ఎడిషన్ లాంచ్
Diwali Offers: హోండా, వోక్స్‌వ్యాగన్, హ్యుందాయ్ సెడాన్లపై దీపావళి బంపర్ ఆఫర్లు.. రూ.1.25 లక్షల వరకు బెనిఫిట్స్‌
ఈ దీపావళికి హైయెస్ట్‌ ఆఫర్లు అందిస్తున్న 5 సెడాన్లు.. రూ.1.25 లక్షల వరకు ఆదా!
Best Mileage Car: అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ కార్లు, అత్యంత చౌకైనది ఏదీ..
అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ కార్లు, అత్యంత చౌకైనది ఏదీ..
Maruti Fronx కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చిన Brezza Turbo.. సిటీ ట్రాఫిక్‌లో, హైవేపై మీద ఎంత ఇచ్చిందంటే?
మారుతి బ్రెజ్జా టర్బో నిజమైన మైలేజ్ ఎంత? రియల్ వరల్డ్‌ టెస్ట్‌ ఫలితాలు ఇవిగో

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana MLC Elections: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
Andhra Pradesh Rains: ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
Punjab Assembly Elections.. ఆప్ తొలి జాబితా జాబితా విడుదల- ధురి నుంచి బరిలోకి సీఎం భగవంత్ మాన్
ఆప్ తొలి జాబితా జాబితా విడుదల- ధురి నుంచి బరిలోకి సీఎం భగవంత్ మాన్
Iam Game Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
CM Chandrababu: వాడికి సమాజంలో చోటు లేదు.. కన్నెత్తి చూడాలంటే భయపడాలి: రాప్తాడు ఘటనపై చంద్రబాబు, లోకేష్ ఫైర్
వాడికి సమాజంలో చోటు లేదు.. కన్నెత్తి చూడాలంటే భయపడాలి: రాప్తాడు ఘటనపై చంద్రబాబు, లోకేష్ ఫైర్
YS Sharmila Daughter Marriage: ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ నాకు వచ్చింది: షర్మిల సంచలన పోస్ట్
ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ నాకు వచ్చింది: షర్మిల సంచలన పోస్ట్
Hero Destini 110 Classique ఎడిషన్ లాంచ్‌.. కొత్త కలర్ ఆప్షన్లు, డ్యూయల్ టోన్ స్టైలింగ్‌తో రోడ్డుపై రచ్చే!
హీరో డెస్టినీ 110 కొనేవాళ్లకు మరో స్టైలిష్‌ ఆప్షన్‌.. రూ.76,400 ధరతో క్లాసిక్ ఎడిషన్ లాంచ్
Raptadu Crime News: రాప్తాడు జెడ్పీ స్కూల్లో దారుణం- టెన్త్ విద్యార్థినిపై రంపంతో దాడి.. తెగిన చెయ్యి, తీవ్ర గాయాలు
రాప్తాడు జెడ్పీ స్కూల్లో దారుణం- టెన్త్ విద్యార్థినిపై రంపంతో దాడి.. తెగిన చెయ్యి, తీవ్ర గాయాలు
Embed widget