అన్వేషించండి

వచ్చే ఏడాది నుంచే CAFE-III నిబంధనలు అమలు - కొత్త కారు కొనేవాళ్లు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన వివరాలు

CAFE-III డ్రాఫ్ట్ నిబంధనలతో పెట్రోల్, డీజిల్ కార్లకు కఠినమైన ఇంధన సామర్థ్య లక్ష్యాలు రానున్నాయి. EVలు, హైబ్రిడ్ వాహనాలకు ప్రోత్సాహకాలు కల్పించే కేంద్రం తాజా ప్రతిపాదనలు ఇవే.

CAFE III Norms Explained In Telugu: భారత ఆటోమొబైల్ రంగంలో మరో కీలక మార్పునకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రయాణికుల కార్ల కోసం కొత్త "కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ" (CAFE-III) డ్రాఫ్ట్ నిబంధనలను విడుదల చేసింది. 2027 ఏప్రిల్ 1 నుంచి 2032 మార్చి 31 వరకు అమలులో ఉండేలా ప్రతిపాదించిన ఈ నిబంధనల లక్ష్యం... దేశంలో ఇంధన వినియోగాన్ని తగ్గించడం, కాలుష్యాన్ని నియంత్రించడం & ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వంటి పరిశుభ్రమైన సాంకేతికతలను మరింత వేగంగా ప్రోత్సహించడం.

ప్రస్తుతం అమల్లో ఉన్న CAFE-II నిబంధనల స్థానంలో రానున్న CAFE-IIIలో కార్ల తయారీ సంస్థలకు కఠినమైన ఇంధన సామర్థ్య లక్ష్యాలను నిర్దేశించనున్నారు. ప్రతి కంపెనీ విక్రయించే కార్ల సగటు ఇంధన వినియోగాన్ని ఆధారంగా తీసుకుని ప్రమాణాలను నిర్ణయిస్తారు. 2028 ఆర్థిక సంవత్సరం నుంచి 2032 వరకు ఈ లక్ష్యాలను ప్రతి ఏడాది మరింత కఠినతరం చేయాలని కేంద్రం ప్రతిపాదించింది.

ఈ రూల్స్ హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లు, SUVలు & MPVలు వంటి గరిష్ఠంగా 9 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న, 3,500 కిలోల వరకు స్థూల బరువు కలిగిన ప్రయాణికుల వాహనాలకు వర్తిస్తాయి. వీటి అమలును విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ పర్యవేక్షించనుంది.

ఇది కూడా చదవండి: సుజుకి ఇ-యాక్సెస్ రేటు నుంచి రేంజ్ వరకు పూర్తి వివరాలు - కొనే ముందే మీరు తెలుసుకోవాల్సిన విషయాలివి

పెట్రోల్‌ కార్లపై CAFE III నిబంధనల ప్రభావం
CAFE III నిబంధనల వల్ల పెట్రోల్ కార్లపై ప్రభావం ఏమిటి అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. కొత్త నిబంధనలతో పెట్రోల్ కార్లను వెంటనే నిలిపేయరు లేదా నిషేధం విధించరు. అయితే తయారీ సంస్థలు మరింత ఇంధన సామర్థ్యం కలిగిన ఇంజిన్లు, ఆధునిక టెక్నాలజీలను తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. దీంతో భవిష్యత్తులో మరింత ఎక్కువ మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కార్లు మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సాంకేతికతల వల్ల కార్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

E20 లేదా అంతకంటే ఎక్కువ ఎథనాల్ మిశ్రమం కలిగిన పెట్రోల్‌తో నడిచే వాహనాలకు 8 శాతం కార్బన్ న్యూట్రాలిటీ ఫ్యాక్టర్‌ను ప్రతిపాదించారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ ఎథనాల్ వాహనాలు & ఫ్లెక్స్ ఫ్యూయల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడళ్లకు 22.3 శాతం వరకు ప్రయోజనం లభించనుంది. CNG వాహనాలకు 5 శాతం లేదా ప్రభుత్వం ప్రకటించే బయోగ్యాస్ మిశ్రమ శాతం ఆధారంగా రాయితీ ఇవ్వాలని ప్రతిపాదించారు. డీజిల్ వాహనాలకు కూడా బయోఫ్యూయల్ మిశ్రమ శాతాన్ని బట్టి ప్రయోజనాలు ఉంటాయి.

ఎలక్ట్రిక్‌ వాహనాలకు ప్రోత్సాహకాలు
ఇక.. EVలు & హైబ్రిడ్ కార్లకు ఈ నిబంధనలు పెద్ద ఊరటగా మారనున్నాయి. బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు & రేంజ్ ఎక్స్‌టెండెడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు అత్యధికంగా 3.0 సూపర్ క్రెడిట్ ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదించింది. ప్లగ్ ఇన్ హైబ్రిడ్ & ఫ్లెక్స్ ఫ్యూయల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వాహనాలకు 2.5, స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లకు 1.6 సూపర్ క్రెడిట్ లభిస్తుంది. దీంతో కంపెనీలు ఎక్కువ సంఖ్యలో EVలు & హైబ్రిడ్ వాహనాలను మార్కెట్‌లోకి తీసుకురావడానికి ప్రోత్సాహం లభిస్తుంది.

ఇది కూడా చదవండి: నిస్సాన్ గ్రావైట్‌ కొనాలనుకుంటున్నారా? సిటీలో, హైవేపై ఈ కారు నిజమైన మైలేజ్ వివరాలు ఇవిగో!

ఇంధన వినియోగాన్ని తగ్గించే టెక్నాలజీలకు కూడా ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. ఆటో స్టార్ట్-స్టాప్ సిస్టమ్, TPMS, రీజెనరేటివ్ బ్రేకింగ్, 6 స్పీడ్ లేదా అంతకంటే ఎక్కువ గేర్‌బాక్స్, LED ఎక్స్‌టీరియర్ లైటింగ్, అధిక సామర్థ్యం గల AC వ్యవస్థ, ఎలక్ట్రిక్ వాటర్ పంప్, సమర్థవంతమైన ఆల్టర్నేటర్, సోలార్ రిఫ్లెక్టివ్ పెయింట్ వంటి టెక్నాలజీలు ఉన్న వాహనాలకు అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

CAFE-IIIలో మరో కీలక మార్పు క్రెడిట్ వ్యవస్థ. నిర్ణయించిన లక్ష్యాల కంటే మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని సాధించిన కంపెనీలకు క్రెడిట్‌లు లభిస్తాయి. లక్ష్యాలను అందుకోలేని కంపెనీలు ఈ క్రెడిట్‌లను ఇతర తయారీ సంస్థల నుంచి కొనుగోలు చేయవచ్చు లేదా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ నుంచి నిర్దిష్ట ధర చెల్లించి పొందవచ్చు. దీంతో తయారీ సంస్థలకు నిబంధనలు పాటించడంలో మరింత వెసులుబాటు ఉంటుంది.

మొత్తంగా చూస్తే, CAFE-III నిబంధనలతో పెట్రోల్ లేదా డీజిల్ కార్లు మార్కెట్ నుంచి మాయమైపోవు. కానీ వాటిలో మరింత ఆధునిక ఇంధన ఆదా సాంకేతికతలు తప్పనిసరిగా చేరతాయి. మరోవైపు EVలు, హైబ్రిడ్ కార్లు & ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలకు భారీ ప్రోత్సాహం లభిస్తుంది. దీనివల్ల, భవిష్యత్తులో భారత ఆటోమొబైల్ మార్కెట్ మరింత పరిశుభ్రమైన, ఇంధనాన్ని ఆదా చేసే వాహనాల వైపు వేగంగా అడుగులు వేస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

డ్యూక్‌ నుంచి RC వరకు ధరల బాదుడు.. KTM బైక్‌ కొంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ చెల్లించాల్సిందే
మైగాడ్‌, KTM బైక్‌ కొనేవాళ్లకు షాకింగ్‌ న్యూస్‌! 7 మోడళ్ల రేట్లు అమాంతం పెరిగాయి
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
కారు నుంచి లారీ వరకు.. ఫిట్‌నెస్‌ను ఇక యంత్రాలే పరీక్షిస్తాయి! తెలంగాణలో 15 చోట్ల కొత్త వ్యవస్థ
మీ కారు ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఇక కొత్త రూట్‌లో.. మాన్యువల్‌ పరీక్షలకు చెక్‌!
నిస్సాన్ గ్రావైట్ CNG రియల్‌ మైలేజ్‌ టెస్ట్‌.. కేజీకి ఎంత దూరం వెళ్లిందంటే?
కేవలం రూ.83,000 కే CNG కిట్.. నిస్సాన్ గ్రావైట్ నిజమైన మైలేజీ ఎంతో తెలుసా?
Advertisement

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget