అన్వేషించండి

కియా సైరోస్ రియల్ వరల్డ్ మైలేజ్ టెస్ట్ - మాన్యువల్‌ది పైచేయా? DCT గెలిచిందా?

కియా సైరోస్ 1.0 టర్బో పెట్రోల్ MT & DCT వేరియంట్‌ల రియల్ వరల్డ్ మైలేజ్ కంపారిజన్‌ వివరాలు ఇవి. సిటీ, హైవే, సగటు మైలేజ్, ధరలు & ఏ వేరియంట్ ఎక్కువ ఇంధన పొదుపు చేస్తుందో తెలుసుకోండి.

Kia Syros real world mileage: కియా సైరోస్, ప్రస్తుతం భారత మార్కెట్‌లో సోనెట్ & సెల్టోస్ మధ్య స్థానంలో ఉన్న కాంపాక్ట్ SUVగా మంచి గుర్తింపు పొందుతోంది. ఈ మోడల్‌లో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ & 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను 6-స్పీడ్ మాన్యువల్ (MT) లేదా 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్‌తో కొనుగోలు చేసే అవకాశం ఉంది. కంపెనీ ప్రకటించిన మైలేజ్ గణాంకాలు పేపర్‌పై కనిపిస్తున్నప్పటికీ, వాస్తవ వినియోగంలో ఏ వేరియంట్ ఎక్కువ ఇంధన పొదుపు చేస్తుందనేది చాలా మందికి ఉన్న సందేహం. తాజాగా నిర్వహించిన రియల్ వరల్డ్ పరీక్షల్లో ఆసక్తికరమైన ఫలితాలు వెల్లడయ్యాయి.

కియా సైరోస్‌లోని 998cc సామర్థ్యం గల 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ రెండు గేర్‌బాక్స్‌లలోనూ ఒకే విధమైన పనితీరును అందిస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 120hp పవర్ & 172Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండు వేరియంట్‌లలోనూ 45 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ అందుబాటులో ఉంది. తేడా కేవలం గేర్‌బాక్స్‌లో మాత్రమే ఉంటుంది. ఒకదానిలో 6-స్పీడ్ మాన్యువల్ ఉండగా, మరొకదానిలో 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అందిస్తున్నారు.

కంపెనీ ప్రకటించిన ARAI మైలేజ్ ప్రకారం మాన్యువల్ వేరియంట్ లీటర్‌కు 18.2 కి.మీ. ఇస్తుంది. DCT వేరియంట్ మైలేజ్ లీటర్‌కు 17.68 కి.మీ. ఇస్తుంది. అంటే అధికారిక గణాంకాల్లో కూడా మాన్యువల్ స్వల్ప ఆధిక్యాన్ని కనబరుస్తోంది.

ఇది కూడా చదవండి: హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?

రియల్ వరల్డ్ మైలేజ్ టెస్ట్
కార్‌ ఎక్స్‌పర్ట్‌లు వాస్తవంగా రోడ్లపై నిర్వహించిన పరీక్షల్లో కూడా మాన్యువల్ వేరియంట్‌దే పైచేయిగా తేలింది. నగర ప్రయాణాల్లో కియా సైరోస్ టర్బో MT లీటర్‌కు 9.10 కి.మీ. మైలేజ్ నమోదు చేసింది. అదే DCT వేరియంట్ లీటర్‌కు 8.30 కి.మీ. మాత్రమే ఇచ్చింది. అంటే సిటీలో మాన్యువల్ వేరియంట్‌ దాదాపు 0.81 కి.మీ ఎక్కువ మైలేజ్ అందించింది.

హైవే ప్రయాణాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. మాన్యువల్ వేరియంట్ లీటర్‌కు 12.60 కి.మీ. మైలేజ్ నమోదు చేయగా, DCT వేరియంట్ 11.50 కి.మీ. మాత్రమే ఇచ్చింది. ఇక్కడ కూడా మాన్యువల్‌కు 1.10 కి.మీ. ఆధిక్యంలో ఉంది.

సగటు మైలేజ్‌ను పరిశీలిస్తే, కియా సైరోస్ టర్బో MT లీటర్‌కు 10.85 కి.మీ. మైలేజ్ అందించింది. DCT వేరియంట్ మాత్రం 9.90 కి.మీ. మాత్రమే నమోదు చేసింది. మొత్తం మీద మాన్యువల్ వేరియంట్ దాదాపు 0.95 కి.మీ ఎక్కువ ఇంధన సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఈ తేడా దీర్ఘకాలంలో ఇంధన ఖర్చును తగ్గించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: 169 km రేంజ్‌తో వచ్చిన యమహా EC-06 ఈ-స్కూటర్‌ - పెర్ఫార్మెన్స్‌ టెస్ట్‌లో ఏం తెలిసిందంటే?

ధరలు 
కియా సైరోస్ 1.0 టర్బో MT ఎక్స్ షోరూమ్ ధర రూ.8.42 లక్షల నుంచి రూ.12.02 లక్షల వరకు ఉంది. 1.0 టర్బో DCT ధరలు రూ.11.96 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, టాప్ ఎండ్ మాన్యువల్ వేరియంట్ ధర ఎంట్రీ లెవల్ DCT వేరియంట్ కంటే కేవలం రూ.6,000 మాత్రమే ఎక్కువగా ఉంది.

ఈ మైలేజ్ పరీక్షలను సాధారణ వినియోగానికి దగ్గరగా ఉండే పరిస్థితుల్లో నిర్వహించారు. పరీక్ష ప్రారంభానికి ముందు వాహనాల ఫ్యూయల్ ట్యాంక్‌ను పూర్తిగా నింపారు. తయారీ సంస్థ సూచించిన టైర్ ప్రెజర్‌ను పాటించారు. నగరం & హైవేలో నిర్ణయించిన మార్గాల్లో ఒకే డ్రైవర్‌తో పాటు AC, ఆడియో సిస్టమ్ & అవసరమైన ఇతర ఎలక్ట్రికల్ ఫీచర్లను సాధారణ యూజర్ల మాదిరిగానే ఉపయోగించారు. పరీక్ష పూర్తయిన తర్వాత మళ్లీ ట్యాంక్‌ను పూర్తి స్థాయిలో నింపి వాస్తవ మైలేజ్‌ను లెక్కించారు.

మొత్తంగా చూస్తే, గేర్ మార్పుల్లో సౌలభ్యం & ట్రాఫిక్‌లో సులభమైన డ్రైవింగ్ కోరుకునే వారికి DCT మంచి ఎంపిక. అయితే తక్కువ ఇంధన ఖర్చు, మెరుగైన మైలేజ్ & తక్కువ ప్రారంభ ధర కోరుకునే వారికి కియా సైరోస్ 1.0 టర్బో మాన్యువల్ వేరియంట్ మరింత ప్రయోజనకరమైన ఎంపికగా కనిపిస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget