అన్వేషించండి

మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌ 2026లో ఏం కొత్తగా మారనుంది? కొత్త ఇంజిన్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు! రేటు ఎంత ఉండొచ్చు?

కొత్త మారుతి బ్రెజ్జా 2026 మోడల్‌ ఆవిష్కరణకు సిద్ధమైంది. కొత్త డిజైన్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, Level-2 ADAS, పెద్ద టచ్‌స్క్రీన్, కొత్త ఫీచర్లు & అంచనా ధర వివరాలు తెలుసుకోండి.

Maruti Brezza Facelift 2026 Price And Features: కాంపాక్ట్ SUV మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో మారుతి సుజుకి బ్రెజ్జా ఒకటి. మిడిల్‌ క్లాస్‌ ప్రజల ఇష్టమైన కార్లలో ఇది ఒకటి. ఇప్పుడు, ఈ SUVకి పెద్ద అప్‌డేట్ ఇవ్వడానికి మారుతి సిద్ధమైంది. 2022లో రెండో తరం బ్రెజ్జాను విడుదల చేసిన మారుతి, ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఈ నెల 24న (జులైన 24, 2026‌) అధికారికంగా ఆవిష్కరించనుంది. ఇప్పటికే రూ.11,000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కొత్త బ్రెజ్జాలో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయో తెలుసుకుందాం.

ఎక్స్‌టీరియర్
కొత్త బ్రెజ్జాలో మొదటగా కనిపించే మార్పు ఎక్స్‌టీరియర్ డిజైన్‌లోనే ఉంటుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్‌లో కొత్త గ్రిల్ డిజైన్‌తో పాటు హెడ్‌ల్యాంప్‌లను కలుపుతూ సన్నని ఎరుపు రంగు స్ట్రిప్ కనిపించింది. ముందు బంపర్ దిగువ భాగంలో కూడా ఎరుపు రంగు ట్రిమ్ ఇవ్వనున్నారు. డోర్ల దిగువ భాగంలో కొత్త క్లాడింగ్ ఉండగా, టెయిల్‌గేట్‌పై ఉండే "Brezza" లోగోకు కొత్త ఫాంట్‌ను ఉపయోగించారు.

అల్లాయ్ వీల్స్‌కు కూడా కొత్త డిజైన్ రానుంది. టెస్టింగ్ సమయంలో కనిపించిన ప్రోటోటైప్‌లను బట్టి 4-స్పోక్‌ల డిజైన్ వచ్చే అవకాశం ఉంది. ఫ్రంట్ బంపర్‌ను పూర్తిగా రీడిజైన్ చేశారు. ఫాగ్ ల్యాంప్‌లను కాస్త ఎత్తులో అమర్చడంతో పాటు సిల్వర్ ట్రిమ్ & సిల్వర్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌ను అందించనున్నారు. అయితే L ఆకారంలోని DRLsతో వచ్చే LED హెడ్‌ల్యాంప్స్ & స్లిమ్ LED టెయిల్ ల్యాంప్స్‌ను యథాతథంగా కొనసాగించనున్నారు.

ఇది కూడా చదవండి: 526km రేంజ్‌, రెండు బ్యాటరీ ఆప్షన్లతో Kia Syros EV - బుకింగ్స్ ప్రారంభం, రేటు ఎంత ఉండొచ్చంటే?

ఇంటీరియర్ 
క్యాబిన్ లేఅవుట్‌లో పెద్ద మార్పులు ఉండకపోయినా కొత్త కలర్ థీమ్ & ప్రీమియం ట్రిమ్ మెటీరియల్స్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న HUDను కొనసాగించడంతో పాటు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను 9 అంగుళాల నుంచి 10.1 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్‌కు అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉంది. దీంతో వినియోగదారులకు మరింత మెరుగైన డిజిటల్ అనుభవం లభించనుంది.

సౌకర్యాల పరంగా కూడా కొత్త బ్రెజ్జా మరింత ఆకర్షణీయంగా మారనుంది. వెనుక సీట్ల హెడ్‌రెస్ట్‌లకు కొత్త కర్వ్డ్ సైడ్ బోల్స్టరింగ్ ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే పవర్డ్ డ్రైవర్ సీట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, అంబియంట్ లైటింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు జాబితాలో చేరే అవకాశముంది. భద్రత కోసం Level-2 ADAS, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్లు వంటి ఆధునిక ఫీచర్లను కూడా అందించే అవకాశం ఉందని టెస్టింగ్ సమయంలో కనిపించిన వాహనాలను బట్టి తెలుస్తోంది.

టర్బో పెట్రోల్ ఇంజిన్
పవర్‌ట్రైన్ పరంగా ఈసారి అత్యంత కీలకమైన మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ విభాగంలో టర్బో పెట్రోల్ ఇంజిన్ లేని ఏకైక SUVగా ఉన్న బ్రెజ్జాకు ఇకపై ఫ్రాంక్స్‌లో ఉన్న 1.0 లీటర్ Boosterjet టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అందించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఇంజిన్‌తో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇదే ఇంజిన్‌కు CNG ఆప్షన్‌ను కూడా మారుతి అందించే అవకాశం ఉందని సమాచారం.

ఇది కూడా చదవండి: 125cc నుండి 350cc వరకు ఏ బైక్ అత్యుత్తమ విలువ కలిగి ఉంటుంది.. లిస్ట్ చూడండి

1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో మరో ప్రయోజనం కూడా ఉంది. ప్రస్తుతం 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌పై వర్తించే 28 శాతం GSTకి బదులుగా, చిన్న ఇంజిన్ కారణంగా 18 శాతం GST పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో కొత్త బ్రెజ్జా ధరను మరింత పోటీ స్థాయిలో నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ధర 
ధరను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ప్రస్తుతం విక్రయిస్తున్న బ్రెజ్జా ఎక్స్‌షోరూమ్ ధర రూ.8.26 లక్షల నుంచి రూ.12.86 లక్షల మధ్య ఉంది. కొత్త మోడల్‌లో డిజైన్ & ఫీచర్లలో మెరుగుదలలు వచ్చినప్పటికీ చిన్న ఇంజిన్ కారణంగా ధరను ఇదే స్థాయిలో ఉంచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

కొత్త మారుతి బ్రెజ్జా విడుదలైన తర్వాత... హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, స్కోడా కైలాక్, మహీంద్రా XUV 3XO, కియా సోనెట్ & కియా సైరస్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి
అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి
5 నిమిషాల్లోనే 70 శాతం ఛార్జ్.. EV Charging లో సంచలనం సృష్టిస్తున్న కొత్త టెక్నాలజీ
5 నిమిషాల్లోనే 70 శాతం ఛార్జ్.. EV Charging లో సంచలనం సృష్టిస్తున్న కొత్త టెక్నాలజీ
350cc బైక్‌ Triumph Tracker 400 రియల్‌ మైలేజ్‌ గురించి తెలుసా? లీటర్ పెట్రోల్‌తో ఎన్ని కిలోమీటర్లు తిరిగిందంటే?
Triumph Tracker 400 నిజమైన మైలేజ్ ఎంత? సిటీ ట్రాఫిక్‌లో, హైవేపై అసలు లెక్క ఇదే!
21,000 కిలోమీటర్ల ప్రయాణం.. Hyundai Alcazar పెర్ఫార్మెన్స్‌, ఫీచర్లు, కంఫర్ట్‌ ఎలా అనిపించింది?
Hyundai Alcazar లాంగ్‌ జర్నీ రిపోర్ట్‌.. 21,000 km ప్రయాణం ఎలా అనిపించింది?
Advertisement

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ward Secretariat Employees: స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Bank Strike 2026: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు బ్యాంకుల సమ్మె.. ఏటీఎంలు, యూపీఐ పనిచేస్తాయా?
సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు బ్యాంకుల సమ్మె.. ఏటీఎంలు, యూపీఐ పనిచేస్తాయా?
Medaram Jatara Dates: మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
Urban Land Ceiling: యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ
సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Vijayawada News: అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి
అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి
Mobile Prepaid 30 Days: మొబైల్ రీఛార్జ్‌ల్లో భారీ మార్పులు.. ఇకపై 30 రోజుల ప్లాన్స్!
మొబైల్ రీఛార్జ్‌ల్లో భారీ మార్పులు.. ఇకపై 30 రోజుల ప్లాన్స్!
Embed widget