అన్వేషించండి

రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 లిమిటెడ్ ఎడిషన్ - ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 యూనిట్లే, ధర రూ.5.75 లక్షలే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 రఫ్ క్రాఫ్ట్స్ ఎడిషన్‌ను కంపెనీ ఆవిష్కరించింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉండగా, భారతదేశానికి 25 బైక్‌లు మాత్రమే కేటాయించారు.

Royal Enfield Shotgun 650 Rough Crafts edition: రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానులకు ఆ కంపెనీ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది. పాపులర్‌ షాట్‌గన్ 650కు ప్రత్యేకమైన రఫ్ క్రాఫ్ట్స్ ఎడిషన్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. ఇది సాధారణ మోడల్ కాదు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లను మాత్రమే అమ్ముతుండగా, అందులో భారతదేశానికి కేటాయించింది కేవలం 25 యూనిట్లే. దీంతో ఈ బైక్‌పై ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది. లిమిటెడ్ ఎడిషన్ బైక్‌ను సొంతం చేసుకోవాలనుకునే వారు వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని కంపెనీ సూచిస్తోంది.

ఈ ప్రత్యేక ఎడిషన్ షాట్‌గన్ 650 ధర రూ.5.75 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించారు. ప్రతి బైక్‌కు ప్రత్యేక నంబర్ ఇవ్వడం ద్వారా దీనిని కలెక్టర్ల కోసం మరింత విలువైన మోడల్‌గా రూపొందించారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ యాప్‌ లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా జులై 15 నుంచి జులై 30 మధ్యకాలంలో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు.

ఈ బైక్‌కు ప్రేరణ తైవాన్‌కు చెందిన ప్రముఖ కస్టమ్ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ రఫ్ క్రాఫ్ట్స్ రూపొందించిన 'కాలిబర్ రాయల్' కస్టమ్ బైక్. ఈ మోడల్‌ను తొలిసారిగా EICMA 2025లో ప్రదర్శించగా, అనంతరం భారతదేశంలో జరిగిన Motoverse 2025 కార్యక్రమంలో కూడా ఆవిష్కరించారు. ఇప్పుడు అదే డిజైన్ అంశాలను ఫ్యాక్టరీ నుంచే అందించే లిమిటెడ్ ఎడిషన్ రూపంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ తీసుకొచ్చింది.

ఇది కూడా చదవండి: ఆటోమేటిక్ కంటే మాన్యువల్ డ్రైవింగే బెస్ట్! ఏకాగ్రతకు, మెదడు షార్ప్‌గా పని చేయడానికి ఇదే మంచిదట!

డిజైన్ పరంగా ఈ బైక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గ్లోస్ జెట్ బ్లాక్ & మ్యాట్ స్టెల్త్ బ్లాక్ రంగుల కలయికతో పాటు చేతితో రూపొందించిన గోల్డ్ లీఫ్ స్ట్రైప్స్, గ్రే యాక్సెంట్స్, ప్రత్యేక బ్రాస్ రఫ్ క్రాఫ్ట్స్ బ్యాడ్జ్‌ను అమర్చారు. ప్రతి ఫ్యూయల్ ట్యాంక్‌పై ప్రత్యేక సీరియల్ నంబర్ ఉండటం ఈ ఎడిషన్ ప్రత్యేకత.

ఇందులో బ్లాక్ బార్ ఎండ్ మిర్రర్లు, క్విల్టెడ్ లెదర్ సీట్లు, కాంట్రాస్ట్ కట్ అల్లాయ్ వీల్స్, గోల్డ్ కలర్ ఫ్రంట్ ఫోర్క్ ట్యూబ్స్ వంటి ప్రత్యేక డిజైన్ అంశాలు కూడా ఉన్నాయి. ప్రతి బైక్‌తో పాటు కాలిబర్ రాయల్ స్కెచ్‌తో రూపొందించిన ప్రత్యేక ఆర్ట్‌వర్క్‌ను కూడా అందిస్తారు. దీనిని రఫ్ క్రాఫ్ట్స్ వ్యవస్థాపకుడు విన్స్టన్ యెహ్ స్వయంగా రూపొందించి సంతకం చేశారు.

భారత మార్కెట్‌లో ఈ 25 బైక్‌ల విక్రయం జులై 30 సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారిలో కొనుగోలు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన తొలి 25 మందికే ఈ లిమిటెడ్ ఎడిషన్ బైక్ దక్కుతుంది. అందుకే ఆసక్తి ఉన్నవాళ్లు ఆలస్యం చేయకుండా ముందుగానే నమోదు చేసుకోవడం మంచిది.

ఇది కూడా చదవండి: రూ.73,850 నుంచే హీరో విడా VX2 - ఏ వేరియంట్ కొనాలి? ఫీచర్లు, ధరల పూర్తి వివరాలు

ఇంజిన్ పరంగా మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. సాధారణ షాట్‌గన్ 650లో ఉన్న 648cc ప్యారలల్ ట్విన్, ఎయిర్/ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌నే ఇందులో కొనసాగించారు. ఈ ఇంజిన్ 47hp శక్తి & 52.3Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. పనితీరు పరంగా ఎలాంటి మార్పులు లేకపోయినా, డిజైన్ & ప్రత్యేక ఎడిషన్ అంశాల కారణంగా ఈ బైక్‌కు ప్రత్యేక గుర్తింపు లభించింది.

ప్రత్యేక డిజైన్, నంబర్డ్ ఎడిషన్ & అంతర్జాతీయ స్థాయి ప్రత్యేకత కారణంగా ఈ మోడల్ భవిష్యత్తులో అరుదైన కలెక్షన్ బైక్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌పై అస్యూర్డ్ బైబ్యాక్ స్కీమ్‌తో పాటు BaaS ఆఫర్ - నిజంగా మంచి ఆఫర్‌!
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌ కొనేవాళ్లకు బంపర్‌ ఆఫర్‌.. అస్యూర్డ్ బైబ్యాక్ స్కీమ్‌తో రీసేల్‌ చాలా ఈజీ!
2026 మహీంద్రా స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌ - పానోరమిక్ సన్‌రూఫ్‌, భారీ టచ్‌స్క్రీన్‌, 540 డిగ్రీ కెమెరా, కొత్త ఫీచర్లతో లాంచ్‌
రూ.13.69 లక్షలకే కొత్త మహీంద్రా స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌.. పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త ఎక్స్‌పీరియన్స్‌
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
Advertisement

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget