కారు బ్యాటరీ ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది

Image Source: pexels

సాధారణంగా కారు బ్యాటరీ 3 నుండి 4 సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే దాని లైఫ్ టైమ్ అనేది వినియోగం, మెయింటనెన్స్ పై ఆధారపడి ఉంటుంది

Published by: Shankar Dukanam

చాలా తక్కువ దూరం వరకు పదే పదే నడపడం వల్ల బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవ్వదు. దాని వల్ల దాని జీవితకాలం తగ్గుతుంది

కారు ఎక్కువ కాలం ఉపయోగించకపోతే దాని బ్యాటరీ నెమ్మదిగా డిశ్చార్జ్ అయిపోతుందని మెకానిక్స్ చెబుతారు

Image Source: pexels

అధిక వేడి, చలి రెండూ బ్యాటరీ పనితీరును ప్రభావితం చేస్తాయి. బ్యాటర్ లైఫ్ టైమ్ తగ్గించగలవు

బ్యాటరీ టెర్మినల్స్ ను శుభ్రంగా ఉంచాలి. తుప్పు లేదా మురికి పేరుకుపోతే బ్యాటరీ పనితీరు తగ్గుతుంది

కారు స్టాప్ చేసిన తరువాత హెడ్‌లైట్లు, మ్యూజిక్ సిస్టమ్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఆన్‌లో ఉంచవద్దు

Image Source: pexels

ఎప్పటికప్పుడు బ్యాటరీని చెక్ చేస్తూ ఉండాలి. దీనివల్ల బ్యాటరీలో లోపాన్ని ముందుగానే గుర్తించవచ్చు

కారు స్టార్ట్ అవ్వడంలో ఇబ్బందిగా ఉంటే హెడ్‌లైట్ ఫోకస్ తక్కువగా అనిపిస్తే లేదా బ్యాటరీ వార్నింగ్ లైట్ వెలిగితే బ్యాటరీని చెక్ చేయించాలి.

Image Source: pexels

సరైన జాగ్రత్త, క్రమం తప్పకుండా చెక్ చేసుకోవడం ద్వారా కారు బ్యాటరీ ఎక్కువ కాలం పనిచేస్తుంది

Image Source: pexels