అన్వేషించండి

526km రేంజ్‌, రెండు బ్యాటరీ ఆప్షన్లతో Kia Syros EV - బుకింగ్స్ ప్రారంభం, రేటు ఎంత ఉండొచ్చంటే?

కియా సైరోస్ EV ని అధికారికంగా ఆవిష్కరించారు. 42kWh & 51.4kWh బ్యాటరీ ఆప్షన్లు, గరిష్ఠంగా 526 కిలోమీటర్ల రేంజ్, ADAS, ప్రీమియం ఫీచర్లు, అంచనా ధరతో త్వరలోనే సేల్స్‌లోకి రానుంది.

Kia Syros EV Price, Range And Features: ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో పోటీ రోజురోజుకూ పెరుగుతున్న వేళ, కియా తన కొత్త సైరోస్ EVను అధికారికంగా ఆవిష్కరించింది. ఈ నెలాఖరులో ఈ ఎలక్ట్రిక్ SUVను మార్కెట్లో విడుదల చేయనున్న కంపెనీ, ఇప్పటికే రూ.25,000 టోకెన్ అమౌంట్‌తో బుకింగ్స్‌ ప్రారంభించింది. కొత్త సైరోస్ EVలో అత్యాధునిక ఫీచర్లు, ఎక్కువ రేంజ్ & శక్తివంతమైన పనితీరు అందించడం ద్వారా ఈ సెగ్మెంట్‌లో బలమైన పోటీ ఇవ్వాలని కియా లక్ష్యంగా పెట్టుకుంది.

కియా సైరోస్ EVలో రెండు బ్యాటరీ ఆప్షన్లు - 42kWh & 51.4kWh - ఉన్నాయి. ఇవే బ్యాటరీ ప్యాక్‌లు కియా కారెన్స్ క్లావిస్ EV & హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌లో కూడా ఉన్నాయి. అయితే సైరోస్ EV పరిమాణం తక్కువగా ఉండటంతో బ్యాటరీ సామర్థ్యాన్ని మరింత సమర్థవంతంగా వినియోగిస్తూ ఎక్కువ డ్రైవింగ్ రేంజ్‌ను అందించగలదు.

51.4kWh బ్యాటరీతో వచ్చే వేరియంట్‌ను ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 526 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ ప్రకటించింది. 42kWh బ్యాటరీతో వచ్చే వేరియంట్‌కు 443 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉందట. ఈ రేంజ్‌తో ఈ SUV తన సెగ్మెంట్‌లో అత్యుత్తమ స్థానంలో నిలుస్తుందని కియా చెబుతోంది.

ఇది కూడా చదవండి: భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఏవి? తొలి ఆరు నెలల టాప్ 15 లిస్ట్ విడుదల

పెద్ద బ్యాటరీ (51.4kWh) వేరియంట్‌లో ముందు చక్రాలకు 171hp శక్తి & 255Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్‌ను అందించారు. చిన్న బ్యాటరీ (42kWh) వేరియంట్‌లో 135hp శక్తి & 255Nm టార్క్ లభిస్తుంది. 51.4kWh వేరియంట్ కేవలం 8.1 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని కంపెనీ వెల్లడించింది. పనితీరు పరంగా టాటా నెక్సాన్ EV & మహీంద్రా XUV 3XO EV కంటే ఇది మరింత శక్తివంతంగా ఉండనుంది.

ఛార్జింగ్‌
7.4kW లేదా 11kW AC ఛార్జర్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. 7.4kW AC ఛార్జర్‌తో 42kWh బ్యాటరీని 10 శాతం నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేయడానికి సుమారు 6 గంటలు పడుతుంది. 51.4kWh బ్యాటరీకి 7 గంటల 15 నిమిషాల సమయం అవసరం. 

100kW DC ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగిస్తే పెద్ద బ్యాటరీని కేవలం 39 నిమిషాల్లో 10 శాతం నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

ఇది కూడా చదవండి: రూ.12.99 లక్షలకే అడ్వెంచర్ SUV - ప్రీమియం ఫీచర్లతో కొత్త డస్టర్‌ ఎడిషన్‌ లాంచ్‌ చేసిన రెనాల్ట్‌

కియా సైరోస్ ఎలక్ట్రిక్ SUVని HTK, HTK+, HTX, HTX+ & X-Line అనే ఐదు వేరియంట్లలో విక్రయించనున్నారు. చిన్న బ్యాటరీ ప్యాక్ మొదటి మూడు వేరియంట్లలో లభిస్తుండగా, పెద్ద బ్యాటరీ ప్యాక్.. బేస్ వేరియంట్ మినహా మిగిలిన అన్ని వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

పెట్రోల్ మోడల్‌తో పోలిస్తే EV డిజైన్‌లో పెద్దగా మార్పులు లేవు. వెనుక భాగంలో ఉండే ఫ్యూయల్ ఫిల్లర్ స్థానంలో, ముందు వైపు ఫెండర్‌పై ఛార్జింగ్ పోర్ట్‌ను ఏర్పాటు చేశారు. 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, LED లైటింగ్ సిగ్నేచర్, బంపర్ డిజైన్ & బాడీ క్లాడింగ్ కూడా దాదాపు అదే విధంగా ఉన్నాయి. మొత్తం తొమ్మిది రంగుల్లో ఈ SUV అందుబాటులోకి రానుండగా X-Line వేరియంట్‌కు ప్రత్యేక రంగులు కూడా ఉన్నాయి.

ఫీచర్లు
క్యాబిన్‌లో 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ & 5 అంగుళాల క్లైమేట్ కంట్రోల్ డిస్‌ప్లేతో కూడిన ట్రినిటీ పనోరమిక్ డిస్‌ప్లే ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. వైర్‌లెస్ Apple CarPlay, Android Auto, వైర్‌లెస్ ఛార్జింగ్, 8 స్పీకర్ల Harman Kardon ఆడియో సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, 64 కలర్ అంబియంట్ లైటింగ్, పవర్డ్ & వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, స్లైడింగ్ & రీక్లైనింగ్ వెంటిలేటెడ్ రియర్ సీట్లు, డ్యూయల్ కెమెరా డ్యాష్‌క్యామ్, 16 లీటర్ల ఫ్రంక్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

భద్రత పరంగా కూడా కియా ఎలాంటి రాజీ పడలేదు. Level 2 ADAS, 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా, ESC, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఆధునిక భద్రతా వ్యవస్థలను అందించింది. 

తెలుగు రాష్ట్రాల్లో ధర
ఈ ఎలక్ట్రిక్ SUV ఎక్స్‌షోరూమ్ ధర రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. తెలుగు రష్ట్రాల్లో అంచనా ఆన్‌రోడ్ ధర రూ.15.90 లక్షల నుంచి రూ.19.61 లక్షల మధ్య ఉండొచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Bayon vs Creta: క్రెటా కంటే బేయాన్ ధర తక్కువ.. ఏ కారులో ఫీచర్లు ఎక్కువ? కొనే ముందే ఈ తేడాలు తెలుసుకోండి!
హ్యుందాయ్ బేయాన్ vs హ్యుందాయ్ క్రెటా.. ఏది బెస్ట్ SUV?
2027 Triumph Tiger 1200 వచ్చేసింది.. ధర తెలిస్తే షాక్‌ అవుతారు! ఇందులోని రాడార్‌ టెక్నాలజీకి ఫిదా అవ్వాల్సిందే!
2027 ట్రయంఫ్‌ టైగర్‌ 1200 లాంచ్‌.. దీని లెవెలే వేరబ్బా! ఈ బైక్‌కు పెట్టే ఖర్చుతో ఒక లగ్జరీ కారు కొనొచ్చు
Hatchback Car Diwali Offers: దీపావళికి కొత్త హ్యాచ్‌బ్యాక్‌ కారు కొనాలనుకుంటున్నారా? టాటా నుంచి మారుతి వరకు లక్షల్లో డిస్కౌంట్లు!
కారు కొనడానికి ఇదే సరైన సమయం! హ్యాచ్‌బ్యాక్‌లపై దీపావళి ఆఫర్లు.. లక్షల్లో డిస్కౌంట్లు!
FASTag Pass: ఫాస్టాగ్‌ యాన్యువల్‌ పాస్‌ vs లోకల్‌ పాస్‌ vs రెగ్యులర్‌ రీఛార్జ్‌.. మీకు ఏది బెస్ట్?
హైవేపై మీ ప్రయాణానికి ఏ FASTag పాస్ ప్రయోజనం? మీ ఖర్చు తగ్గించే ఆప్షన్ ఇదే!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Kavitha Kalvakuntla: చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Comrade Kalyan Movie OTT : ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
AP Local Body Elections: ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
CM Revanth Reddy: మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడినందుకు నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
BRS హయాంలో మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడితే నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
Arnab Cyclone Effect: అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
Tirupati Janasena: టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
Embed widget