అన్వేషించండి

రూ.12.99 లక్షలకే అడ్వెంచర్ SUV - ప్రీమియం ఫీచర్లతో కొత్త డస్టర్‌ ఎడిషన్‌ లాంచ్‌ చేసిన రెనాల్ట్‌

రెనాల్ట్ డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ భారత్‌లో రూ.12.99 లక్షల ప్రారంభ ధరతో విడుదలైంది. ప్రత్యేక డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ టెయిల్‌గేట్, మూడు ఇంజిన్ ఆప్షన్లతో ఈ కొత్త ఎస్‌యూవీ ఆకట్టుకుంటోంది.

Renault Duster Adventure Edition Price And Features: అడ్వెంచర్ డ్రైవింగ్‌ను ఇష్టపడే కస్టమర్ల కోసం రెనాల్ట్ కొత్త డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రత్యేక డిజైన్ అంశాలు, అదనపు ఫీచర్లు & ఆకర్షణీయమైన ధరతో వచ్చిన ఈ స్పెషల్ ఎడిషన్ ప్రారంభ ధర రూ.12.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). డస్టర్‌లో ఇప్పటికే వచ్చిన ఐకానిక్ ఎడిషన్ తర్వాత విడుదలైన రెండో స్పెషల్ ఎడిషన్ ఇదే.

కొత్త డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 

Adventure Turbo Tce 100 MT వేరియంట్ ధర రూ.12.99 లక్షలు (ఎక్స్ షోరూమ్)

Adventure Turbo Tce 160 MT ధర రూ.13.99 లక్షలు (ఎక్స్ షోరూమ్)

Adventure Turbo Tce 160 DCT వేరియంట్ ధర రూ.15.39 లక్షలు (ఎక్స్ షోరూమ్)

ఇది కూడా చదవండి: ఆటోమేటిక్ కంటే మాన్యువల్ డ్రైవింగే బెస్ట్! ఏకాగ్రతకు, మెదడు షార్ప్‌గా పని చేయడానికి ఇదే మంచిదట!

ఈ స్పెషల్ ఎడిషన్‌లో ప్రధాన ఆకర్షణ ప్రత్యేక అడ్వెంచర్ గ్రాఫిక్స్. వెనుక భాగంలో టోపోగ్రాఫికల్ కాంటూర్ లైన్స్‌తో పాటు లేహ్ ప్రాంతానికి చెందిన భౌగోళిక కోఆర్డినేట్లు 34.27 N & 77.60 E డెకల్ రూపంలో అందించారు. క్లిష్టమైన పర్వత ప్రాంతాల్లో డస్టర్‌ను పరీక్షించిన గుర్తుగా ఈ ప్రత్యేక డిజైన్‌ను రూపొందించింది కంపెనీ. ఇదే డిజైన్ థీమ్ ముందు డోర్లపై ఉన్న ప్లాక్‌లపై కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా అడ్వెంచర్ ఎడిషన్‌కు ప్రత్యేకమైన ఫ్లోర్ మ్యాట్స్ కూడా అందించారు.

ఈ ఎడిషన్‌ను Evolution ట్రిమ్ ఆధారంగా రూపొందించినప్పటికీ, అంతకంటే పై వేరియంట్‌లో కనిపించే కొన్ని ప్రీమియం ఫీచర్లను కూడా ఇందులో చేర్చారు. 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 అంగుళాల TFT డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ Android Auto & Apple CarPlay, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, పూర్తి LED లైటింగ్, 6 ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

అంతేకాకుండా.. టాప్ Techno ట్రిమ్‌లో లభించే పానోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ టెయిల్‌గేట్ & డ్యూయల్ జోన్ ఏసీ వంటి ప్రీమియం ఫీచర్లను కూడా ఈ స్పెషల్ ఎడిషన్‌లో అందించడం విశేషం. దీంతో, ధరకు మరింత విలువను అందించే వేరియంట్‌గా Adventure నిలుస్తోంది.

ఇది కూడా చదవండి: హేమ గ్యారేజ్‌లో బెంజ్ జీఎల్ఎస్ 450D... కారు ఫీచర్స్ తెలుసా? రేటు కోటిన్నర కంటే ఎక్కువ

ఇంజిన్ ఎంపికల విషయానికి వస్తే, సాధారణ డస్టర్‌లో ఉన్న మూడు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లనే అడ్వెంచర్ ఎడిషన్‌లో కూడా కొనసాగించారు. 1.0 లీటర్ మూడు సిలిండర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ 100 hp పవర్ & 160 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే అందుబాటులో ఉంటుంది.

1.3 లీటర్ నాలుగు సిలిండర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ 163 hp పవర్ & 280 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌తో 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను కస్టమర్లు ఎంచుకోవచ్చు.

తక్కువ ధరలో ప్రత్యేక డిజైన్, ప్రీమియం ఫీచర్లు & శక్తివంతమైన టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంపికలను కోరుకునే వారికి రెనాల్ట్ డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ మంచి ఎంపికగా నిలిచే అవకాశం ఉంది. ప్రత్యేకంగా లాంగ్ డ్రైవ్‌లు, అడ్వెంచర్ ట్రిప్‌లను ఇష్టపడే ఎస్‌యూవీ ప్రియులను ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Honda Elevate Facelift.. హ్యుందాయ్ క్రెటాను ఢీకొట్టే సత్తా ఉందా? ఏ SUVని కొనడం లాభదాయకం?
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ vs హ్యుందాయ్ క్రెటా.. ఫీచర్లు, భద్రతలో తేడాలేంటి? ఏది కొనడం బెటర్‌?
కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!
కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ ధర చూసి మురిసిపోకండి.. మీ జేబుకు చిల్లు పెట్టే 5 అదనపు ఖర్చులివి!
Maruti Brezza CNG కారు 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే EMI ఎంత కట్టాలి? మైలేజీ, పూర్తి వివరాలు
Maruti Brezza CNG కారు 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే EMI ఎంత కట్టాలి? మైలేజీ, పూర్తి వివరాలు
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila House Arrest: ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
Telangana Politics Personal Attacks: తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
ACB Raids Civil Supplies DM: సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Samson Storm Reply: వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!
కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ ధర చూసి మురిసిపోకండి.. మీ జేబుకు చిల్లు పెట్టే 5 అదనపు ఖర్చులివి!
Black Coffee for Weight Loss : బ్లాక్ కాఫీ తాగితే కొవ్వు తగ్గుతుందా? రోజుకు ఎన్ని కప్పులు తాగాలో తెలుసా?
బ్లాక్ కాఫీ తాగితే కొవ్వు తగ్గుతుందా? రోజుకు ఎన్ని కప్పులు తాగాలో తెలుసా?
Embed widget