ఈ కారులో ఫైవ్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, ADAS లెవల్ 2 టెక్నాలజీ, 360 డిగ్రీ కెమెరా వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ దీని ప్రత్యేకత.
Hema Buys Mercedes Benz GLS 450d: హేమ గ్యారేజ్‌లో బెంజ్ జీఎల్ఎస్ 450D... కారు ఫీచర్స్ తెలుసా? రేటు కోటిన్నర కంటే ఎక్కువ
Mercedes Benz GLS 450d 4MATIC Features: మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 450డి కారును నటి హేమ కొన్నారు. ఈ కారు ఫీచర్స్ ఏమిటి? హైదరాబాద్ సిటీలో ఆన్ రోడ్ ప్రైజ్ ఎంత? అనేది తెలుసుకోండి.

- శక్తివంతమైన ఇంజన్ 6.1 సెకన్లలో 100 కి.మీ వేగం.
నటి హేమ (Actress Hema Kolla) గ్యారేజీలో కొత్త కారు చేరింది. లగ్జరీ మెర్సిడెస్ బెంజ్ కారును కొనుగోలు చేశారామె. ఆ వీడియో ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మెర్సిడెస్ బెంజ్ తీసుకు వచ్చిన హై ఎండ్ కార్ జీఎల్ఎస్ 450డి 4మాటిక్ (Mercedes Benz GLS 450d 4MATIC)ను కొన్న హేమ, కొత్త కారుకు ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వయంగా ఇంటికి డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు. అసలు, ఈ కారు రేటు ఎంత? ఫీచర్స్ ఏమిటి? హైదరాబాద్ సిటీలో ఆన్ రోడ్ ప్రైజ్ ఎంత? వంటి వివరాలు తెలుసుకోండి.
హైదరాబాద్‌లో కోటిన్నర కంటే ఎక్కువ
మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 450డి ఎక్స్ షోరూమ్ ప్రైజ్ సుమారు రూ. 1.34 కోట్లు. హైదరాబాద్ సిటీలో ఆన్ రోడ్ ప్రైజ్ (అన్ని పన్నులతో కలిపి) సుమారు రూ. 1.61 కోట్ల నుండి రూ. 1.72 కోట్ల వరకు ఉంటుంది.
రాజభవనాన్ని తలపించే ఇంటీరియర్
మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 450డి ఇంటీరియర్ రాజభవనాన్ని తలపిస్తుందని ఆ కారులో ప్రయాణించిన వ్యక్తులు, విశ్లేషకులు చెప్పే మాట. ఈ కార్డులో ఫైవ్ - జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్ రూఫ్, 12.3 అంగుళాల డిజిటల్ డిస్ ప్లే ఉన్నాయి. బ్యాక్ సీట్లలో కూర్చునే వ్యక్తుల కోసం 11.6 అంగుళాల ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌లు, అలాగే రిమూవబుల్ ఎంబక్స్ ట్యాబ్లెట్ కూడా ఉన్నాయి. సౌండ్ సిస్టమ్ విషయానికి వస్తే... ఈ కారులో 13 స్పీకర్లతో బర్మెస్టర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ అమర్చారు.
సేఫ్టీ అండ్ టెక్నాలజీలో రాజీ పడలేదు
సేఫ్టీ (భద్రత) విషయంలో మెర్సిడెస్ ఎక్కడా రాజీ పడలేదు. జీఎల్ఎస్ 450డీ కారులో అడాస్ లెవల్ 2 టెక్నాలజీ, 360 డిగ్రీ కెమెరా, రోడ్డుపై గుంతలను గుర్తించే 'ట్రాన్స్‌పరెంట్ బోనెట్' ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో 9 నుంచి 10 ఎయిర్ బ్యాగ్‌లు, అడ్వాన్స్‌డ్ బ్రేకింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఎయిర్ మాటిక్ సస్పెన్షన్ కారణంగా రోడ్డుపై గుంతలు ఉన్నా కారులో ప్రయాణికులకు అసలు ఏమాత్రం అసౌకర్యం కలగదు.
View this post on Instagram
ఆరు సెకన్లలో 100 కిలోమీటర్ల వేగానికి...!
మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 450డి కారులో 3.0 లీటర్స్, 6 సిలిండర్స్ పవర్ ఫుల్ డీజిల్ ఇంజన్ ఉంది. అది 362బీహెచ్‌పీ శక్తిని, 750 ఎన్‌ఎమ్ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. కేవలం 6.1 సెకన్లలో జీరో నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఈ కారులో '9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్' వల్ల ప్రయాణం సాఫీగా సాగుతుంది.
లగ్జరీ కార్లలో మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 450డిది స్పెషల్ ప్లేస్. విలాసవంతమైన ప్రయాణానికి ఈ కారును ఓ చిరునామాగా పేర్కొంటారు కొందరు. సాధారణంగా డీజిల్ ఇంజన్లు శబ్దం చేస్తాయనే విమర్శలు, నమ్మకాలను పటాపంచలు చేస్తూ... ఈ కారు నిశ్శబ్దంగా వెళుతుంది. పవర్ ఫుల్ ఇంజన్, లగ్జరీ కోరుకునే వారి ఛాయస్ మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 450డి.
Also Read: ఆడవాళ్లు కాళ్లను సులభంగా నేలపై ఉంచగల టూవీలర్లు - తక్కువ సీట్ హైట్ ఉన్న 10 ఎలక్ట్రిక్ స్కూటర్లు
View this post on Instagram
Frequently Asked Questions
ఈ మెర్సిడెస్ కారులోని ముఖ్యమైన ఫీచర్లు ఏమిటి?
ట్రెండింగ్ వార్తలు






















