మెర్సిడెస్ బెంజ్ GLS 450d కార్ రివ్యూ - స్పెషల్ ఏంటో తెలుసుకోండి
July 15, 2026
Published by: S Niharika
Image Source: Somnath Chatterjee
మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్‌లో భారీ ఎస్‌యూవీ. ఇందులో ఇప్పుడు AMG లైన్ స్పోర్టీ టచ్‌ను యాడ్ చేశారు. GLS AMG లైన్‌కు వేరే రంగు గ్రిల్, కొత్త బంపర్ డిజైన్ కూడా ఉంటాయి.
Image Source: Somnath Chatterjee
ఈ కారులో 21 అంగుళాల భారీ టైర్లు ఉన్నాయి. వాటిపై AMG అక్షరాలు మాత్రమే కనిపిస్తాయి. అబ్సిడియన్ బ్లాక్ కలర్ బాడీ ఈ కారును ప్రత్యేకంగా నిలిపింది.
Image Source: Somnath Chatterjee
మెర్సిడెస్ బెంజ్ GLS 450d కారులో కొత్త 3 స్పోక్ AMG స్టీరింగ్ వీల్ ఉంది. కొత్త పెడల్స్, AMG స్పెసిఫికేషన్ ఫ్లోర్ మ్యాట్స్ ఉన్నాయి
Image Source: Somnath Chatterjee
ఇది పెద్ద లగ్జరీ ఎస్‌యూవీ వెహికల్ కావడం వల్ల లోపల స్పేస్ ఉంది. బ్యాక్ సీట్ ప్రయాణీకుల కోసం క్లైమేట్ కంట్రోల్, స్పెషల్ స్క్రీన్ పవర్డ్ అడ్జస్ట్‌మెంట్, బ్యాక్ ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌లతో సహా మరిన్ని సౌకర్యాలు ఉన్నాయి.
Image Source: Somnath Chatterjee
GLS 450dలో 3.0 లీటర్ డీజిల్‌ను ఉపయోగిస్తుంది. ఇది 362bhp, 750Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ డీజిల్ ఇంజిన్ నిశ్శబ్దంగా, వేగంగా పని చేస్తుంది.