అన్వేషించండి

169 km రేంజ్‌తో వచ్చిన యమహా EC-06 ఈ-స్కూటర్‌ - పెర్ఫార్మెన్స్‌ టెస్ట్‌లో ఏం తెలిసిందంటే?

యమహా EC-06 ఎలక్ట్రిక్ స్కూటర్ పనితీరు పరీక్షలో యాక్సిలరేషన్‌, రోల్-ఆన్‌, బ్రేకింగ్ ఎలా ఉందో తెలుసుకోండి. 169km రేంజ్‌, 6.7kW మోటార్‌, 4kWh బ్యాటరీతో ఈ స్కూటర్ అసలు పనితీరు ఎలా ఉందో పూర్తి వివరాలు.

Yamaha EC-06 Price, Range And Features: బెంగళూరుకు చెందిన రివర్ స్టార్టప్‌తో కలిసి యమహా అభివృద్ధి చేసిన EC-06 ఎలక్ట్రిక్ స్కూటర్, ప్రీమియం కమ్యూటర్ విభాగంలోకి అడుగుపెట్టింది. 4kWh బ్యాటరీ ప్యాక్‌, 6.7kW గరిష్ట పవర్‌, 169 కి.మీ. IDC సర్టిఫైడ్ రేంజ్‌తో వచ్చిన ఈ స్కూటర్.. కాగితంపై ఆకట్టుకునే స్పెసిఫికేషన్లను అందిస్తోంది. అయితే వాస్తవంగా రోడ్డుపై దీని పనితీరు ఎలా ఉందో పరీక్షల్లో వెల్లడైంది.

యాక్సిలరేషన్
పరీక్ష సమయంలో వాతావరణం పూర్తిగా పొడిగా ఉండగా, బ్యాటరీ ఛార్జ్ 97 శాతం కంటే ఎక్కువగా ఉంది. స్కూటర్‌లో అందుబాటులో ఉన్న పవర్ మోడ్‌లో యాక్సిలరేషన్ పరీక్షలు నిర్వహించారు. ఈ మోడ్‌లో స్కూటర్ వేగంగా స్పందిస్తూ 0 నుంచి 40 కి.మీ వేగాన్ని కేవలం 3.46 సెకన్లలో చేరుకుంది. 0 నుంచి 60 కి.మీ వేగాన్ని అందుకోవడానికి 6.82 సెకన్లు పట్టగా, 0 నుంచి 80 కి.మీ వేగాన్ని 15.50 సెకన్లలో చేరుకుంది. నగర ప్రయాణాలకు అవసరమైన వేగాన్ని ఈ స్కూటర్ సులభంగా అందిస్తోందని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి.

యమహా EC-06లో ఎకో, స్టాండర్డ్ & పవర్ అనే మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. అవసరాన్ని బట్టి ఎక్కువ రేంజ్ లేదా మెరుగైన పనితీరు కోరుకునే వారికి ఈ మోడ్‌లు ఉపయోగపడతాయి. ముఖ్యంగా పవర్ మోడ్‌లో స్కూటర్ స్పందన చాలా వేగంగా ఉండగా, స్టాండర్డ్ మోడ్ కూడా నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉంది.

ఇది కూడా చదవండి: ఏథర్ రిజ్టాకు LFP బ్యాటరీ ఆప్షన్‌ - కొత్త బ్యాటరీ ప్యాక్‌లు, 900W ఛార్జర్‌తో కీలక అప్‌డేట్

ఓవర్‌టేకింగ్‌
రోల్-ఆన్ యాక్సిలరేషన్ పరీక్షల్లో కూడా EC-06 మంచి ఫలితాలు నమోదు చేసింది. 20 నుంచి 50 కి.మీ వేగాన్ని 3.31 సెకన్లలో అందుకుంది. 30 నుంచి 70 కి.మీ వేగాన్ని చేరుకోవడానికి 7.34 సెకన్లు పట్టగా, 50 నుంచి 80 కి.మీ వేగాన్ని 10.96 సెకన్లలో చేరుకుంది. ట్రాఫిక్‌లో వేగంగా ఓవర్‌టేక్ చేయాల్సిన సందర్భాల్లో స్టాండర్డ్ & పవర్ మోడ్‌లు మంచి పనితీరును అందిస్తున్నాయి. ఎకో మోడ్‌లో కూడా 50 కి.మీ వరకు సాఫీగా వేగాన్ని అందుకోవచ్చు. ఫ్లైఓవర్లు ఎక్కే సమయంలో కూడా ఈ మోడ్ ఉపయోగకరంగా ఉంటుంది.

బ్రేకింగ్ విభాగంలో కూడా EC-06 నిరాశపరచలేదు. ముందు & వెనుక భాగాల్లో డిస్క్ బ్రేక్‌లు అందించడంతో పాటు కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను అమర్చారు. 60 కి.మీ వేగం నుంచి పూర్తిగా ఆగడానికి కేవలం 22.87 మీటర్ల దూరమే పట్టింది. దీనికి తోడు రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా బలంగా పనిచేస్తుంది. ముఖ్యంగా నెమ్మదిగా సాగే ట్రాఫిక్‌లో తరచూ బ్రేక్ వేయాల్సిన అవసరాన్ని ఇది తగ్గిస్తుంది. వాహనం సాఫీగా నెమ్మదించడంతో రైడింగ్ అనుభవం మరింత మెరుగ్గా ఉంటుంది.

ఇది కూడా చదవండి: మీ డ్రైవింగ్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లే 8 స్మార్ట్ కార్ గాడ్జెట్లు - వీటిని ఒక్కసారి ట్రై చేస్తే ఇక వదిలిపెట్టరు!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 26Nm గరిష్ట టార్క్‌ను అందించే మోటార్‌ను అమర్చారు. మొత్తం బరువు 132 కిలోలు. ముందు 110/80-14 & వెనుక 120/70-14 పరిమాణంలో 14 అంగుళాల టైర్లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో 14 అంగుళాల చక్రాలు అరుదుగా కనిపిస్తాయి. ఇవి రోడ్డు స్థిరత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే డ్యూయల్ పాడ్ వర్టికల్ LED హెడ్‌లైట్ స్కూటర్‌కు ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తుంది.

ధర
యమహా EC-06 ఎక్స్ షోరూమ్ ధర హైదరాబాద్‌లో రూ.1,67,600. ఆన్ రోడ్ ధర సుమారు రూ.1.81 లక్షలు. ఈ ధరతో ఇది భారత మార్కెట్‌లో లభిస్తున్న ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా నిలుస్తోంది. అయితే శక్తివంతమైన మోటార్, ఎక్కువ రేంజ్, మెరుగైన యాక్సిలరేషన్‌, సమర్థవంతమైన బ్రేకింగ్ & ఆధునిక ఫీచర్లను కోరుకునే వినియోగదారులకు యమహా EC-06 మంచి ఎంపికగా నిలిచే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి
అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి
5 నిమిషాల్లోనే 70 శాతం ఛార్జ్.. EV Charging లో సంచలనం సృష్టిస్తున్న కొత్త టెక్నాలజీ
5 నిమిషాల్లోనే 70 శాతం ఛార్జ్.. EV Charging లో సంచలనం సృష్టిస్తున్న కొత్త టెక్నాలజీ
350cc బైక్‌ Triumph Tracker 400 రియల్‌ మైలేజ్‌ గురించి తెలుసా? లీటర్ పెట్రోల్‌తో ఎన్ని కిలోమీటర్లు తిరిగిందంటే?
Triumph Tracker 400 నిజమైన మైలేజ్ ఎంత? సిటీ ట్రాఫిక్‌లో, హైవేపై అసలు లెక్క ఇదే!
21,000 కిలోమీటర్ల ప్రయాణం.. Hyundai Alcazar పెర్ఫార్మెన్స్‌, ఫీచర్లు, కంఫర్ట్‌ ఎలా అనిపించింది?
Hyundai Alcazar లాంగ్‌ జర్నీ రిపోర్ట్‌.. 21,000 km ప్రయాణం ఎలా అనిపించింది?
Advertisement

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medaram Jatara Dates: మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
Urban Land Ceiling: యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ
సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Vijayawada News: అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి
అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి
Mobile Prepaid 30 Days: మొబైల్ రీఛార్జ్‌ల్లో భారీ మార్పులు.. ఇకపై 30 రోజుల ప్లాన్స్!
మొబైల్ రీఛార్జ్‌ల్లో భారీ మార్పులు.. ఇకపై 30 రోజుల ప్లాన్స్!
Hyderabad Metro Rail Project:హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 స్వాధీనానికి ముహూర్తం ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 స్వాధీనానికి ముహూర్తం ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం
Ward Secretariat Employees: స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Embed widget