అన్వేషించండి

సుజుకి ఇ-యాక్సెస్ రేటు నుంచి రేంజ్ వరకు పూర్తి వివరాలు - కొనే ముందే మీరు తెలుసుకోవాల్సిన విషయాలివి

సుజుకి ఇ-యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర, బ్యాటరీ, ఛార్జింగ్ సమయం, రియల్ వరల్డ్ రేంజ్, టాప్ స్పీడ్ సహా.. కొనుగోలు ముందు తప్పక తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు.

Suzuki e-Access Price, Range And Features: భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను క్యాష్‌ చేసుకోవడానికి, సుజుకి కూడా తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ 'ఇ-యాక్సెస్‌'ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. పెట్రోల్ యాక్సెస్ 125 పేరునే ఎలక్ట్రిక్‌ వెర్షన్‌కు కూడా ఉపయోగించినప్పటికీ, ఈ మోడల్‌ను పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేశారు. విశ్వసనీయతకు పేరుగాంచిన సుజుకి నుంచి వచ్చిన ఈ స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ముందుగా కొన్ని కీలక విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి.

తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌రోడ్‌ ధర
సుజుకి ఇ-యాక్సెస్ ప్రస్తుతం ఒక్క వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ బండి ఎక్స్ షోరూమ్ ధర రూ.1.88 లక్షలు. ఆన్‌రోడ్ ధర సుమారు రూ.2.04 లక్షలు. ఈ ధరతో ఇది దేశంలో ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి అవుతుంది. TVS iQube S & Bajaj Chetak C3501 కంటే అధిక ధర ఉండగా, Ather Rizta S కు దగ్గరగా ఉంటుంది.

ఈ స్కూటర్‌లో హబ్ మౌంటెడ్ పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్‌ను అందించారు. ఇది 3.5 కిలోవాట్ల (3.5kW) రేటెడ్ పవర్ & 6 కిలోవాట్ల (6kW) పీక్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. వెనుక చక్రానికి 90Nm టార్క్‌ను అందించే సామర్థ్యం దీనికి ఉంది. దీంతో నగర ప్రయాణాల్లో వేగవంతమైన పికప్ లభిస్తుంది.

ఇది కూడా చదవండి: నిస్సాన్ గ్రావైట్‌ కొనాలనుకుంటున్నారా? సిటీలో, హైవేపై ఈ కారు నిజమైన మైలేజ్ వివరాలు ఇవిగో!

బ్యాటరీ 
సుజుకి ఇ-యాక్సెస్‌లో 3 కిలోవాట్ అవర్ సామర్థ్యం గల LFP బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. సాధారణంగా ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లలో కనిపించే NCM బ్యాటరీలతో పోలిస్తే LFP బ్యాటరీలు ఎక్కువ జీవితకాలం & మెరుగైన థర్మల్ స్థిరత్వాన్ని అందిస్తాయి. అయితే కొంత తక్కువ రేంజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది.

సుజుకి ఈ స్కూటర్‌తో పాటు 600 వాట్ల పోర్టబుల్ ఛార్జర్‌ను అందిస్తోంది. కంపెనీ ప్రకారం, బ్యాటరీని 0 నుంచి 100%కు 6 గంటల 20 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. అయితే వాస్తవ పరీక్షల్లో సాధారణ 12A, 3-పిన్ సాకెట్‌తో కేవలం 6 గంటల్లోనే పూర్తి ఛార్జ్ అయింది. ప్రస్తుతం ఈ స్కూటర్‌కు ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం అందుబాటులో లేదు.

రేంజ్ 
సుజుకి ఇ-యాక్సెస్‌ పూర్తి ఛార్జ్‌తో 95 కి.మీ. IDC రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. అయితే రియల్ వరల్డ్ పరీక్షల్లో పవర్‌ఫుల్ రైడ్ A మోడ్‌లో 88.4 కి.మీ. వరకు ప్రయాణించింది. ఈ పరీక్షలో డిస్‌ప్లేపై కనిపించిన రేంజ్ ఇండికేటర్ కూడా చాలా ఖచ్చితంగా పనిచేసింది. ప్రారంభంలో 93 కి.మీ. అంచనా రేంజ్ చూపించిన ఈ స్కూటర్ బ్యాటరీ తగ్గేకొద్దీ సరైన సమాచారాన్ని అందించింది. ఇంకా ఎక్కువ రేంజ్ కావాలనుకునే వారికి ఈకో మోడ్ ఉపయోగకరంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: ఏథర్ రిజ్టాకు LFP బ్యాటరీ ఆప్షన్‌ - కొత్త బ్యాటరీ ప్యాక్‌లు, 900W ఛార్జర్‌తో కీలక అప్‌డేట్

వేగం
టాప్ స్పీడ్ పరంగా సుజుకి ఇ-యాక్సెస్ గంటకు 80 కి.మీ. వేగాన్ని అందుకుంటుందని కంపెనీ ప్రకటించింది. ఈ వేగాన్ని రైడ్ A & రైడ్ B మోడ్‌లలో పొందవచ్చు. ఈ రెండు మోడ్‌లలో పవర్ & థ్రాటిల్ రెస్పాన్స్ ఒకేలా ఉన్నప్పటికీ రీజెనరేటివ్ బ్రేకింగ్ స్థాయిలో మాత్రమే తేడా ఉంటుంది. రైడ్ B మోడ్‌లో రీజెన్ ప్రభావం కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఇక ఈకో మోడ్‌లో నిర్వహించిన పరీక్షల్లో గంటకు 55 కి.మీ. గరిష్ఠ వేగం నమోదైంది.

మొత్తంగా చూస్తే సుజుకి ఇ-యాక్సెస్ ప్రీమియం ధరతో వచ్చినప్పటికీ విశ్వసనీయత, మెరుగైన బ్యాటరీ టెక్నాలజీ, ఖచ్చితమైన రేంజ్ అంచనా & మంచి పనితీరుతో ఆకట్టుకుంటోంది. అయితే ఫాస్ట్ ఛార్జింగ్ లేకపోవడం, ధర ఎక్కువగా ఉండటం వంటి అంశాలను కూడా కొనుగోలు నిర్ణయం తీసుకునే ముందు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pulsar Bikes Discount Sale: యూత్ ఇష్టపడే పల్సర్ బైకులపై భారీ డిస్కౌంట్.. డౌన్‌పేమెంట్, నెలవారీ EMI వివరాలు
యూత్ ఇష్టపడే Pulsar Bikes పై భారీ డిస్కౌంట్.. డౌన్‌పేమెంట్, నెలవారీ EMI వివరాలు
Triumph Bonneville T40 vs పోటీ బైక్‌లు: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, హోండా, జావా.. ధర, ఫీచర్లలో ఏది బెటర్‌ ఆప్షన్‌?
ట్రయంఫ్ బొన్నెవిల్ T40 vs రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350, హోండా CB350C, జావా 350 - ఏది బెటర్‌?
Bonneville T40 తో పాటు ట్రయంఫ్ నుంచి 3 కొత్త బైక్‌లు.. 798cc భారీ ఇంజిన్‌తో స్ట్రీట్ ట్రిపుల్ బైక్‌
798cc ఇంజిన్‌తో కొత్త Triumph Street Triple 798 బైక్‌.. Tiger 900, Tiger 1200 బైకుల్లో రాడార్‌ టెక్నాలజీ!
350cc ఇంజిన్‌తో Triumph Bonneville T40 లాంచ్.. 5 రైడింగ్ మోడ్‌లు, క్రూయిజ్ కంట్రోల్‌తో అదుర్స్!
యూత్‌ కోసం ట్రయంఫ్ బొన్నెవిల్ T40 వచ్చేసింది.. ఈ బైక్‌లో చాలా స్పెషల్స్ గురూ!
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Hair Transplant : హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి
Shreyas Iyer Breaks Virat Kohli Record: కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ .. తొలి టీ20లో మెరుపు సెంచరీతో సరికొత్త చరిత్ర
కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ .. తొలి టీ20లో మెరుపు సెంచరీతో సరికొత్త చరిత్ర
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Embed widget